Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ల‌త్కోర్ సాబ్‌ | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Oct 09,2022

ల‌త్కోర్ సాబ్‌

అమ్మో నగరంలో జరిగిన బొచ్చె పార్టీ ఎన్నికల ప్రచార సభలన్నిటికీ లత్కోర్‌ వెళ్లాడు. ఆ సభల్లో ఎవరు ఎలా మాట్లాడుతారో, ఎలాటి హావభావాలు వ్యక్తం చేసారో అతను నిశితంగా పరిశీలించాడు. ఆనందరావు సలహా మేరకు రోజూ వార్తాపత్రికల్ని చదివాడు. తన స్పీచ్‌కి పనికి వస్తాయనుకున్న అంశాల్ని డైరీలో నోట్‌ చేసుకొన్నాడ. ఏదైనా ప్రాంతానికి వెళ్లేముందు అక్కడి సమస్యల గురించి తెలుసుకొనేవాడు. తన ఫక్కీలో స్పీచ్‌ తయారు చేసుకొనేవాడు. బొచ్చెపార్టీ ఎన్నికల ప్రచార సభల్లో లత్కోర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అసెంబ్లీ ఎన్నికల్లో బొచ్చెపార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఎన్నికలయ్యాయి. నాతో మీకేం పని. మా ఊరికి వెళతాను అని లత్కోర్‌ అంటే లేదు, లేదు, ఇక్కడే ఉండి ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేయవలసిందిగా ముఖ్యమంత్రి కోరారు. దాంతో లత్కోర్‌ అమ్మో నగరంలోనే ఉండి పోయాడు. అతని మాట తీరులో మార్పు వచ్చింది. ఇంతకుముందు ఎవరిని బడితే వారిని నువ్వు అనేవాడు. కాని ఇప్పుడు మీరు అంటున్నాడు.
బొచ్చెపార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదైంది. కానీ దిక్కుమాలిన రాష్ట్ర పరిస్థితిలో ఏ మాత్రం మార్పులేదు. రోడ్డు ప్రమాదంలో చింతలపాడు ఎమ్మెల్యే సీతారామారావు మరణించాడు. ఆయన వారసులెవరూ లేరు. చింతలపాడు నియోజకవర్గం ప్రతిపక్షమైన చిప్ప పార్టీకి కంచుకోట వంటిది. ఈ నియోజక వర్గం నుంచి పోటీ చేయడానికి బొచ్చెపార్టీ నాయకులెవరూ ముందుకు రాలేదు. కానీ లత్కోర్‌ ఒక్కడే ముందుకు వచ్చాడు. కొత్త వాడైనప్పటికీ బొచ్చెపార్టీ అతనికి టికెట్‌ ఇచ్చింది. ఇపుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదనుకొని లత్కోర్‌ ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసాడు. విజయం సాధించి అసెంబ్లీలోకి అడుగెట్టాడు. లత్కోర్‌ భాష మారినా వేషం మాత్రం మారలేదు.
లత్కోర్‌; మంత్రులు, ఎమ్మెల్యేల మెడ మీద తలయ్యాడు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల విమర్శలకు ప్రతివిమర్శ చెయ్యడంలో నెంబర్‌ వన్‌ అయ్యాడు. అతను చెయ్యి పెట్టే సందిస్తే కాలు పెట్టేరకం. అతని బుర్రని చూసి బొచ్చె పార్టీ అధ్యక్షుడు ఆనందరావు ముచ్చటపడ్డాడు.... పడి తన చిన్న కూతురితో అతనికి పెళ్లి చేసాడు. ఆనందరావు అల్లుడు కావడంతో అతని పలుకుబడి పెరిగింది.
పెళ్లైన ఆర్నెల్లకే మామగారి పైరవీలతో లత్కోర్‌కు మంత్రి పదవి జేబులో పడింది. మంత్రి కాగానే అతను వేషం మార్చలేదు. తన నియోజక వర్గాన్ని మరిచిపోలేదు. తనను కలవడానికి ఎవరు వచ్చినా ఆప్యాయంగా పలకరించేవాడు. కేవలం మాటలతో పంచదార చిలకల్ని పంచేవాడు. ఆరితేరిన రాజకీయ నాయకునిలా అసమ్మతి వాదులను తన వైపు తిప్పుకున్నాడు. కొద్దిపాటి రాజకీయ జీవితం అతనికి కలిసొచ్చింది.
సంతృప్తి అనే పదానికి లత్కోర్‌ డిక్షనరీలో చోటు లేదు. అతని వైకుంఠ పాళిలో నిచ్చెనలే ఉంటాయి. టార్చి పెట్టి వెతికినా మచ్చుకు ఒక్క పామైనా కనిపించదు. ప్రతి రాజకీయ నాయకుని పక్కన ఒక పీఠాధిపతో, మతగురువో, బాబానో ఉంటాడు. అతను రాజకీయ నాయకునికి వత్తాసు పలుకుతుంటాడు. లత్కోర్‌; బూటకానంద స్వాముల మధ్య సంబంధం మర్రిచెట్టులా నిలబడింది.
అది స్విచ్‌; బల్బులాంటిది
స్విచ్‌ లేకపోతే బల్బు వెలగదు
బల్బు లేకపోతే స్విచ్‌ ఉన్నా లాభం లేదు
అది నిప్పు నీరు లాంటిది
లత్కోర్‌కు నిప్పులాంటి సమస్యలెదురైతే
బూటకానంద స్వాముల వారు ప్రవచనాలనే
నీళ్లు జల్లి జెనాలను జోకొడతారు.
కర్మ సిద్ధాంతాన్ని ప్రబోధిస్తారు.
ఎ.సి. కుటీరంలో పట్టు పాన్పుపై పవళిస్తారు.
స్వామి వారి సలహాతో సింహగిరి పుణ్యక్షేత్రంలో లత్కోర్‌ లోక కళ్యాణ యాగం మొదలుపెట్టాడు. అది లోక కళ్యాణ యాగం పేర ఉన్నత పదవీప్రాప్తి యోగ యాగం!
సింహగిరిలో లత్కోర్‌ ఉన్నత పదవీ ప్రాప్తి యాగం అనే లోక కళ్యాణ యాగం మొదలుపెట్టగానే రాష్ట్ర రాజధానిలో అల్లర్లు మొదలయ్యాయి. పోలీసులు లాఠీ చార్జీలు; భాష్ప వాయు ప్రయోగాల ప్రభావం లేదు... కనిపిస్తే వినిపిస్తాం సెక్షన్‌ కింద కవుల్ని రంగంలోకి దింపారు. దాంతో అల్లర్లు తగ్గినట్లే తగ్గి ఎక్కువయ్యాయి. మొదటిసారిగా రాష్ట్ర రాజధానిలో కర్ఫ్యూ పెట్టేరు.
'మోకేకా ఫాయిదా ఉఠానా ఆద్మీకా ఫర్జ్‌హై' నిజాన్ని ఒంటబట్టించుకున్న అసమ్మతి వర్గం; అధినాయక వర్గాన్ని కలిసింది. దానికి తోడు లత్కోర్‌ మామగారు చక్రం తిప్పారు. రాజకీయ బేరం పెట్టారు. లత్కోర్‌ ఉన్నల పదవీ ప్రాప్తి యోగ యాగం ముగిసింది. అగ్నిదేవుని అజీర్తి తగ్గింది. దేనివల్లో ఖచ్చితంగా చెప్పలేం కానీ దిక్కు మాలిన రాష్ట్ర మహామంత్రి పదవి రారా ప్రియా సుందరా అంటూ లత్కోర్‌ను వరించింది. రాష్ట్ర రాజధానిలో అల్లర్లు తగ్గాయి.
లిలిలి
తెల్లవారు జాము ఐదుగంటల ప్రాంతం.
'అల్లారసూలుల్లా' మసీదు నుంచి అజా
'ఎందుకయ్యా ఉంచినావు బందిఖానాలో' గుడి నుంచి రామదాసు కీర్తన
'మిల్క్‌ బూత్‌ల వద్దా; ఛారు బండీల వద్దా జెనాలు
రోడ్డు మీద అప్పుడో ఆటో ఇప్పుడో బైక్‌
కసరత్తులతో కళ్లు తెరిచిన జిమ్‌లు..
మార్నింగ్‌ వాక్‌లూ, జాగింగ్‌లూ; పక్షుల కిలకిలలూ; అప్పుడప్పుడూ కోకిల కూతలూ; రోడ్డు ఊడుస్తున్న సఫాయి వాళ్ల చీపుళ్ల చప్పుళ్లూ..
వీటి మధ్య మహామంత్రి లత్కోర్‌ నిద్రలేచాడు.
'చిన్నప్పటి అలవాటు చితిలోనే పోతుందంటారు. మహా మంత్రి అయినప్పటికీ తెల్లవారుజామునే లేచే అలవాటు లత్కోర్‌కు పోలేదు.
ఆ సమయంలో అతని బుర్రలో కొత్త కొత్త పథకాలు పుడతాయి. అలా పుట్టిన పథకాలను బొచ్చె ప్రభుత్వం పెంచి పెద్ద చేస్తుంది. తెల్లవారు జామునే లేచే అలవాటుతో పాటు పడుకోబోయే ముందు కథలు చదివే అలవాటు లత్కోర్‌కు ఉంది.
క్రితం రాత్రి చదివిన కథలో ధర్మగంట ప్రస్తావన వచ్చింది. రాజుగారి కోట ముందు ధర్మగంట వేలాడదీసే వాళ్లు. కష్టాలొచ్చిన వాళ్లు ఆ గంట కొట్టేవాళ్లు. గంట చప్పుడు విన్న రాజు కోట నుంచి బయటకు వచ్చేవాడు. గంట కొట్టిన వాళ్ల సమస్యలేమిటో తెలుసుకోవడమే కాకుండా వాటిని పరిష్కరించేవాడు.
తన ఇంటి ముందు కూడా ధర్మగంట వేలాడదీస్తే బాగుంటుందని మహామంత్రి అనుకున్నాడు. అలా చేస్తే ఎవడు పడితే వాడొచ్చి గంట కొడతాడు. తనకు తలనొప్పి తెచ్చి పెడతాడు. ఏం చేస్తే బాగుంటుందని కళ్లు మూసుకుని అతను కొద్దిసేపు ఆలోచించాడు. ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసుకొన్న వారికే క్యూ పద్ధతిలో ధర్మగంట కొట్టే అవకాశముంటుందని ఇటు దినపత్రికల్లోనూ; అటు టీ.వీ. ఛానల్స్‌లోనూ ఏకబిగిన వారం రోజుల పాటు హోరెత్తించారు. నెలలో మొదటి, చివరి ఆదివారాల్లో ధర్మగంట కొట్టడానికి అవకాశమిచ్చారు.
తరువాయి వచ్చేవారం...

- తెలిదేవ‌ర భానుమూర్తి
  99591 50491

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'
బహిరంగ ప్రకటన
అక్కెర ఉన్నంతసేపు ఆదినారాయణ....
మార్పు ఎజెండాగా ఖాజామైనద్దీన్‌ చల్లారని నిప్పు రవ్వలు
గడియ పురుసత్‌ లేదు.. గవ్వ రాకడ లేదు
క్రమ'శిక్ష'ణ గల 'హాస్టల్‌ లైఫ్‌'
ల‌త్కోర్ సాబ్‌
బాల సాహితీస్ఫూర్తి 'డాక్టర్‌ కపిలవాయి లింగమూర్తి'
విలక్షణ కథల సమాహారం నిరుడు కురిసిన వెన్నెల
ల‌త్కోర్ సాబ్‌
తెలుగు పిల్లలకు 'వచ్చేవచ్చే రైలుబండి' పాటనిచ్చిన గంగదేవు యాదయ్య
ల‌త్కోర్ సాబ్
బాల సాహితీ వికాసంలో సిద్ధిపేట పూదోట 'పెందోట'
రేపటి కథకులకు 'కాలిబాటలు' వేసిన డా|| స్వామి
బాలల కథల ఊడలమర్రి 'రామకృష్ణ పైడిమర్రి'
ఎలుకా క్షేమమా...
గుండె సొద బొమ్మ కట్టిన కథలు
శిథిల వసంతంలో తెలుగు గజళ్ళు గానించిన బిక్కి కృష్ణ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
ల‌త్కోర్ సాబ్
ఊరితో అనుబంధాలకు అద్దం 'మైదాకు వసంతం'
సూర్యచంద్రులు!
బాలల నాటికల సృష్ట 'దుప్పల్లి శ్రీరాములు'
ల‌త్కోర్ సాబ్‌
మౌన పాఠాలు చెప్పే జ్యోతిర్మయి కథలు
ల‌త్కోర్ సాబ్‌
ఓ జర్నలిస్ట్‌ స్ట్రింగ్‌ ఆపరేషన్‌ 'కమల'
గిరిజన పిల్లల ఆత్మబంధువు 'సమ్మెట ఉమాదేవి'

తాజా వార్తలు

11:59 AM

అవును.. లోపాలున్నాయి: తుర్కియే అధ్యక్షులు ఎర్డోగాన్‌

11:56 AM

నలుగురు చిన్నారుల సజీవ దహనం..

11:39 AM

భూప్రళయంలో 15వేలు దాటిన మరణాలు..

11:07 AM

డిస్నీలో ఏడు వేల మంది ఉద్యోగుల తొలగింపు..

10:43 AM

బడ్జెట్‌ లైవ్‌ టెలికాస్ట్.. యూనిర్సిటీలకు ప్రభుత్వం ఆదేశం

10:38 AM

ఆయిల్‌ ట్యాంకర్‌లో దిగి ఏడుగురి మృతి..

09:49 AM

తొలి టెస్టులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్‌ బౌలింగ్‌

09:39 AM

రోడ్డుప్రమాదంలో చిరుత మృతి..

09:25 AM

నేడు హైదరాబాద్‌ సీబీఐ కోర్టు వివేకా హత్య కేసు నిందితులు..

08:59 AM

నేటినుంచి శాసనసభలో బడ్జెట్‌ పద్దులపై చర్చ..

08:45 AM

అనాథ యువతిపై వాలంటీర్ లైంగికదాడి..

08:13 AM

నగరంలో ఇంకో 10 రోజులపాటు తప్పని ట్రాఫిక్‌ కష్టాలు..

08:00 AM

తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఏసీ కోచ్‌లో చెలరేగిన మంటలు

07:47 AM

ఎంసెట్ సిలబస్‌పై రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీల‌క సూచ‌న‌..

07:24 AM

సరోగసీపై న్యాయస్థానానికి కేంద్రం వివ‌ర‌ణ‌..

07:01 AM

తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లకు పదోన్నతులు..

06:31 AM

నేటి నుంచి విజయవాడలో పుస్తక మహోత్సవం..

06:19 AM

భార్య మృతదేహాన్ని భుజాన మోసుకెళ్లిన భర్త

09:55 PM

దేశంలోనే ‘ఎలక్ట్రిఫైడ్‌’ స్టేట్‌గా తెలంగాణ : కేటీఆర్

09:42 PM

పోలీస్‌ కస్టడీలో గత ఐదేళ్లలో 669 మంది మృతి : కేంద్ర హోం శాఖ

09:20 PM

అదానీని ప్రధానినే రక్షిస్తున్నాడు : రాహుల్‌ గాంధీ

08:56 PM

దేశంలో తొలిసారి తల్లిదండ్రులైన.. ట్రాన్స్‌జెండర్ జంట

08:24 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై సీఎస్‌కు లేఖ రాసిన సీబీఐ..

08:05 PM

జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీయాలి..

06:55 PM

తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం..

06:21 PM

బీజేపీ ప్ర‌భుత్వం ఎందులో సక్సెస్ అంటే : మంత్రి హ‌రీశ్‌రావు

06:06 PM

ఏపీ క్యా‌బినెట్‌ పలు కీలక నిర్ణయాలు

05:45 PM

ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయొద్దు : స్పీకర్‌ ఓం బిర్లా

05:33 PM

హైదరాబాద్‌ లో ట్రాపిక్ ఇబ్బందులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.