Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ల‌త్కోర్ సాబ్‌ | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Oct 15,2022

ల‌త్కోర్ సాబ్‌

ఆ నెలలో అది మొదటి ఆదివారం. రాజధానిలోని వినూత్నవీధికి చెందిన జనం అందరికన్నా ముందు ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసుకొన్నారు. దాంతో ముందుగా ధర్మగంట కొట్టే అవకాశం వారికొచ్చింది.
మహామంత్రి దర్శన భాగ్యం దొరికింది.
''ఇంతకీ మీ సమస్య ఏమిటి?''
''మా వాడకట్టుల పెద్ద గుంత బడ్డది'' వినూత్న వీధి జెనమన్నారు.
''గుంట బడితే మీ కార్పొరేటర్‌ లేదా ఎమ్మెల్యే దగ్గరకెళ్లకుండా నా దగ్గరకెందుకొచ్చారు'' అంటూ లత్కోర్‌ విసుక్కొన్నాడు.
''గాల్ల తాన్కి బోయినా ఫాయిద లేకుంట బోయింది''
''గంట వల్ల మీకొచ్చిన కష్టమేమిటి?''
''ఒక్కటా రొండా శాన కష్టాలున్నయి. గుంతల గిన ఎవలన్న బడితే గాల్ల కాలన్న, చెయ్యన్న ఇర్గుతున్నది. గుంత జెయ్యబట్కె మోటరు సైకిల్లు, స్కూటీలు కరాబైతున్నయి. గంతేగాదు, గంతల నీల్లు జమైనయి. గా నీల్లల్ల పిల్ల పాపలతోని దోమలు సుకంగ బత్కుతున్నయి. గవ్వి కుట్టెబట్కె మాకు రోగాలొస్తున్నయి. ఎట్లన్న జేసి గా గుంతను పూడిపియ్యుండ్రి''
'గుంటలో ఎవరైనా పడి కాలు విరగడంతో ఏం చేస్తున్నారు? డాక్టరు దగ్గరకెళ్లి కట్టు కట్టించుకొంటున్నారు. కట్టు కట్టినందుకు డాక్టర్‌కు ఫీజు ఇస్తున్నరు. మీరు ఫీజు ఇవ్వడంతో డాక్టర్లు బతుకుతున్నారు. మోటార్‌ బైక్‌లు స్కూటర్లు గంటలో పడి పాడైతే మీరు ఏం చేస్తారు. మెకానిక్‌ల దగ్గరకెళ్లి బాగు చేయించుకొంటున్నారు. బాగు చేసినందుకు వారు ఛార్జి చేసినన్ని రూపాయలిస్తున్నారు. మీరు ఛార్జీలివ్వడంతో మెకానిక్‌లు బతుకుతున్నారు. గుంట ఉన్నప్పుడు దానిలో నీరు చేరడం, ఆ నీటిలో పిల్లాపాపలతో దోమలుండటం సహజం. అవి కుట్టడంతో రోగాలొస్తే మీరు డాక్టర్లకు చూబెట్టుకొంటున్నారు. వారు రాసిన మందుల్ని మెడికల్‌ షాపులో కొంటున్నారు. మందులమ్ముడుపోవడంతో మెడికల్‌ షాపు వాళ్లు మూడు విందులు, ఆరు చిందులుగా దర్జాగా బతుకుతున్నారు.
గుంతను పూడ్చి ఇంతమంది పొట్టగొట్టమంటారా? దానాలల్లో రక్తదానం గొప్పది. దోమెంత? దాని పానమెంత? అది పావుబొట్టు రక్తం తాగితే మీకొచ్చిన నష్టమేంది! ఇక ముందు అసలు సమస్యలేమైనా ఉంటే నా దగ్గరకు రండి. ఇప్పుడిక వెళ్లండి'' అని లత్కోర్‌ అన్నాడు.
దిక్కుమాలిన రాష్ట్రంలో 'సిటీ బస్సురాకడ - కరెండు పోకడ' ఎవ్వలికి అకర్కి దేవునిగ్గూడ ఎర్కలేదు. కరెంటు కోతల మూలంగా ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోయేవి. వ్యవసాయబావుల దగ్గర మోటర్లు కాలిపోయేవి. చిన్న తరహా పరిశ్రమలు జ్వరంతో మూల్గేవి.
ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసుకొన్న కుటుంబరావు ధర్మగంట కొట్టి మహామంత్రి ముందు నిలబడ్డాడు.
''మీకొచ్చిన కష్టమేంది?''
కుదరక, కుదరక మా అమ్మాయి పెండ్లి కుదిరింది. మ్యారేజ్‌ హాలు బుక్‌ చేసాను. క్యాటరింగ్‌కు ఇచ్చాను. శుభలేఖలు అచ్చు వేయించి నలుగురికీ పంచాను. చుట్టాలింటికి స్వయంగా వెళ్లి మా అమ్మాయి పెండ్లికి రమ్మని చెప్పాను. సన్నాయి మేళం మోగుతుండగా పూలజడతో మా అమ్మాయి పెండ్లి పీటల మీద కూర్చుంది.
పురోహితుడు మంత్రం చదువుతుండగా మాంగల్యం కట్టేందుకు పీటల మీద నుంచి లేచి పెండ్లికొడుకు నిలుచున్నాడు. వెనుక నిలుచున్న అమ్మాయి పెండ్లి కూతురి పూలజడ ఎత్తి పట్టుకొంది. పెండ్లి కొడుకు మాంగల్యం కట్టబోయాడు. సరిగ్గా అప్పుడే కరెంటు పోయింది.
పెండ్లి కొడుకు మాంగల్యం కట్టేసాడు. మాంగల్య ధారణ తరువాత కరెంటొచ్చింది. చూస్తే కొంపమునిగింది. పెండ్లి కూతురు పూలజడ ఎత్తిపట్టుకున్న అమ్మాయి మెడలో మాంగల్యముంది''
''జరిగిందేదో జరిగిపోయింది. విచారించకండి. పెండ్లి ఖర్చులు భరించి మా ప్రభుత్వమే ధూమ్‌ధామ్‌గా మీ అమ్మాయి పెండ్లి చేయిస్తుంది'' అని లత్కోర్‌ హామీ ఇచ్చాడు.
కేవలం హామీకే కృతజ్ఞతా భారంతో వంగిపోతూ కుటుంబరావు వెళ్లిపోయాడు.
రాజధాని అమ్మో నగరాన్ని ఆనుకుని అధ్వాన్నపు పల్లె ఉంది. ధర్మగంట మోగింది. మోగించింది ఆ పల్లె జనమే.
''మీ సమస్య ఏమిటి?'' మహామంత్రి అడిగాడు.
''మా ఊల్లె ఎవ్వలు సస్తలేరు''
''మీ ఊర్లో సంజీవిని గాని ఉందా?''
''లేదు. మా ఊరోల్లు పక్క ఊరికి బోయి సస్తున్నరు''
''పక్క ఊరికి బోయి చావడమెందుకు?''
''మా ఊల్లె బొందలగడ్డ లేదు''
''ఎందుకు లేదు''
''ఆర్నెల్ల కింద దాంక మా ఊల్లె బొందలగడ్డ ఉండె. గని ఒక లీడర్‌ గా దాన్ని కబ్జ జేసి బంగ్ల గట్టిండు''
''ఏ పార్టీ లీడర్‌''
''మీ పార్టీ లీడరే''
''నెల రోజుల్లో మళ్లీ స్మశానంతో మీ ఊరు కళకళ్లాడేలా చూస్తాను''
''దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. పదవిలో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి' ఇదే లత్కోర్‌ సిద్ధాంతం. దీని మీద ఎవరెంత రాద్ధాంతం చేసినా పత్రికలు పనిగట్టుకొని చాటింపు వేసినా డోంట్‌కేర్‌. తొలుత ఫైలు మీద ''నాట్‌ అప్రూవ్‌డ్‌'' అని రాసి సంతకం చేసేవాడు. ముడుపులు ముట్టేక ''నాట్‌''కు ''ఇ'' చేర్చి ''నోట్‌ అప్రూవ్‌డ్‌'' అని రాసేవాడు.
వినీత్‌ అనే అతను ధర్మగంట కొట్టి మహామంత్రి దగ్గరకు వెళ్లాడు.
''నీకొచ్చిన కష్టమేమిటి?''
''నాకు ఐదేండ్ల కొడ్కున్నడు. గాడు రూపాయి బిల్ల మింగిండు''
''రూపాయి బిళ్ల మింగితే వాడ్ని ఆస్పత్రికి తీసుకొని వెళ్లకుండా నా దగ్గరకెందుకొచ్చావు'' అని లత్కోర్‌ అడిగాడు.
''మా పోరన్ని సర్కార్‌ దవాకానకు దీస్కబోయిన. మా పోరడు రూపాయి బిల్ల మింగిండని డాక్టర్‌కు జెప్పిన. గాయిన నగుకుంట ఏమన్నడంటె...''
''ఏమన్నాడో జెల్ది చెప్పు''
''గిప్పటి సందే రూపాయిలు మింగుతుండంటే రేపొద్దుగాల తప్పకుంట మహామంత్రి అయితడని అన్నడు'' అని వినీత్‌ చెప్పగానే-
''నాకు పని ఉంది'' అంటూ మహామంత్రి ఆ రోజు ధర్మగంట కార్యక్రమానికి గంట కొట్టాడు.
                               ***********
తెల్లవారుజాము లత్కోర్‌ ఆలోచనల్లో పాకుడు బండ అనే సినిమా కథ కూడా పురుడు పోసుకుంది. ఈ మధ్యనే దిక్కుమాలిన రాష్ట్రంలో ఈ సినిమా విడుదలైంది.. ఇది అలాంటి ఇలాంటి సినిమా కాదు. దీనికో ప్రత్యేకత ఉంది. ఊరూరుకీ ఈ సినిమా కథ మారుతూ ఉంటుంది. నటులు మారుతుంటారు. సీన్లూ, లొకేషన్లూ, పాటలూ మారుతుంటాయి. ప్రేక్షకులూ మారుతుంటారు. డైలాగులూ మారుతుంటాయి. అప్పుడప్పుడూ ఈ సినిమా ఫైటింగులుంటాయి.
ఏదైనా సినిమా చూడాలంటే టికెట్‌ తీసుకోవాలి. పాకుడుబండ సినిమా చూడ్డానికి టికెట్‌ అవసరం లేదు. ఈ సినిమా చూడ్డానికి వచ్చే జెనాలకు బిర్యానీ పొట్లంతో పాటు మందుబాటిల్‌ ఇస్తారు. ధర్మగంట కార్యక్రమంలో మహామంత్రి దగ్గరకు జెనం వెళితే పాకుడు బండతో మహామంత్రిగానీ, మంత్రులుగానీ, ఎమ్మెల్యేలుగానీ జెనం దగ్గరకు వెళతారు. సినిమాకు ముందు రేషన్‌ కార్డులూ, ఇళ్లూ కావలసిన వారి నుంచి దరఖాస్తులు తీసుకొంటారు. సినిమా అయ్యాక వాటిని చెత్తబుట్టలో వేస్తారు. మహామంత్రి నటించే సినిమాకు లారీల్లో జెనాలని తీసుకొస్తారు.
ఆ రోజు చీకటి పల్లెలో పాకుడు బండ సినిమా విడుదలైంది. ఆ సినిమాలో లత్కోరే కథానాయకుడు. అతని డైలాగులకు జెనం చప్పట్లు కొట్టలేదు. ఆ ఊళ్లోని ఎక్స్‌ట్రా నటులు ఎంత చెప్పినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా వారు వినలేదు.
సినిమా అయి పోయింది. కానీ సినిమా చివర్లో శుభం కార్డు పడలేదు.
మహామంత్రి చిన్నబోయాడు. చింతలో మునిగాడు
స్క్రిప్ట్‌ రైటర్‌ను చెడామడా తిట్టాడు.
కెమేరా మన్‌పై కన్నెర్ర చేసాడు.
లొకేషనూ, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్కూ బాగు లేవన్నాడు.
సినిమా ఫ్లాపయినందుకు దిగాలు పడ్డాడు. దిగులు చెందాడు. లత్కోర్‌కు హోంమంత్రి సన్నిహితుడు.
''నేను డైలాగులు చెబుతుంటే జెనం చప్పట్లు కొట్టాలి. చప్పట్ల కోసం మనమేం చేస్తే బాగుంటుందంటావు'' అని హోంమంత్రి నడిగాడు.
''మన సినిమాను మురిక్కాలవ పక్కన చూబెట్టాలి. అలా చూబెడితే మీరు డైలాగులలు చెబుతుంటే జెనాలు చప్పట్లు కొడ్తారు'' అని హోంమంత్రి సలహా ఇచ్చాడు.
''అదెలా?''
''మురిక్కాలవ పక్కన దోమలుంటాయి. వాటిని చంపడానికి జెనాలు చప్పట్లు కొడతారు''
''ఇక ముందు అలానే చేద్దాం''
''మీరీ సంగతి విన్నారా?''
''ఏ సంగతి?''
''బి.సి. వర్కార్‌ రెండు నిమిషాల పాటు తాజ్‌మహల్‌ను మాయం చేసాడట''
''అదేమంత పెద్ద విషయం''
''అలా అంటారేమిటి?''
''బి.సి.వర్కార్‌ కన్నా మన సర్కారే గొప్పది''
''అదెలా?''
''బి.సి. వర్కార్‌ మాయం చేసిన తాజ్‌మహల్‌ రెండు నిమిషాల తరువాత కనబడింది. మన బొచ్చె సర్కార్‌ మాయం చేసిన సాల్విన్‌ కంపెనీ ఇప్పటికీ కనిపించడం లేదు'' అని మహామంత్రి అన్నాడు.
తరువాయి వచ్చేవారం...

-  తెలిదేవ‌ర భానుమూర్తి
   99591 50491

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'
బహిరంగ ప్రకటన
అక్కెర ఉన్నంతసేపు ఆదినారాయణ....
మార్పు ఎజెండాగా ఖాజామైనద్దీన్‌ చల్లారని నిప్పు రవ్వలు
గడియ పురుసత్‌ లేదు.. గవ్వ రాకడ లేదు
క్రమ'శిక్ష'ణ గల 'హాస్టల్‌ లైఫ్‌'
ల‌త్కోర్ సాబ్‌
బాల సాహితీస్ఫూర్తి 'డాక్టర్‌ కపిలవాయి లింగమూర్తి'
విలక్షణ కథల సమాహారం నిరుడు కురిసిన వెన్నెల
ల‌త్కోర్ సాబ్‌
తెలుగు పిల్లలకు 'వచ్చేవచ్చే రైలుబండి' పాటనిచ్చిన గంగదేవు యాదయ్య
ల‌త్కోర్ సాబ్
బాల సాహితీ వికాసంలో సిద్ధిపేట పూదోట 'పెందోట'
రేపటి కథకులకు 'కాలిబాటలు' వేసిన డా|| స్వామి
బాలల కథల ఊడలమర్రి 'రామకృష్ణ పైడిమర్రి'
ఎలుకా క్షేమమా...
గుండె సొద బొమ్మ కట్టిన కథలు
శిథిల వసంతంలో తెలుగు గజళ్ళు గానించిన బిక్కి కృష్ణ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
ల‌త్కోర్ సాబ్
ఊరితో అనుబంధాలకు అద్దం 'మైదాకు వసంతం'
సూర్యచంద్రులు!
బాలల నాటికల సృష్ట 'దుప్పల్లి శ్రీరాములు'
ల‌త్కోర్ సాబ్‌
మౌన పాఠాలు చెప్పే జ్యోతిర్మయి కథలు
ల‌త్కోర్ సాబ్‌
ఓ జర్నలిస్ట్‌ స్ట్రింగ్‌ ఆపరేషన్‌ 'కమల'
గిరిజన పిల్లల ఆత్మబంధువు 'సమ్మెట ఉమాదేవి'

తాజా వార్తలు

09:55 PM

మేకప్‌ రూంలో పేలుడు.. విషమంగా నటి ఆరోగ్యం

09:44 PM

భ‌ద్రాద్రి రాములోరి హుండీ ఆదాయం రూ. 2.20 కోట్లు

09:18 PM

అచ్చేదిన్ కాదు.. మధ్యతరగతి కుటుంబాలు సచ్చెదిన్

09:07 PM

టీడీపీ, వైసీపీతో కలిసే ప్రసక్తే లేదు: సోము వీర్రాజు

08:41 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

08:35 PM

5న రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం..

08:10 PM

గడ్కరీ, ఫడ్నవీస్ సొంతగడ్డలో బీజేపీకి ఎదురు దెబ్బ..

08:02 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

07:48 PM

హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు..

07:43 PM

అదానీ సంక్షోభం..సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలి

07:34 PM

ట్రాన్స్ఫార్మర్ నుంచి చెలరేగిన మంటలు.. రూ.37 లక్షల నష్టం

07:20 PM

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..

07:11 PM

బాలుడిని లైంగికంగా వేధిస్తున్న మహిళ..

07:02 PM

నెల్లూరు రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారు: సజ్జల

06:35 PM

తొలిసారి కోకా-కోలా ఎడిషన్ ఫోన్లు

06:22 PM

భారీగా పెరిగిన బంగారం ధర..

06:11 PM

చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..

05:57 PM

మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై కాల్పులు..జిల్లా ఎస్పీ వివరణ

05:47 PM

వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌ ప్రకటన..

05:39 PM

కొత్త సచివాలయం ప్రారంభోత్సవంపై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్

05:28 PM

థమ్సప్ అనుకుని పురుగుల మందు తాగిన విద్యార్ధినిలు..

05:12 PM

బీఆర్ఎస్ తోనే దేశానికి వెలుగు: మంత్రి జగదీశ్ రెడ్డి

05:04 PM

మమతా బెనర్జీపై విశ్వభారతి యూనివర్సిటీ విమర్శలు

04:57 PM

కెమెరామెన్‌ దేవరాజ్‌కు చిరంజీవి రూ.5 లక్షలు ఆర్థికసాయం

04:54 PM

ఐఈడీ పేలుడు..ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి గాయాలు

04:39 PM

సీఎం కేసీఆర్‌కు బూట్లు పంపి పాదయాత్రకు రావాలని షర్మిల సవాల్‌

04:27 PM

మిశ్రమంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

04:09 PM

నాన్న తర్వాత నాకు అంతటి వ్యక్తి కేసీఆరే : కుమారస్వామి

07:20 PM

కేరళలో విషాదం..కారులో మంటలు చెలరేగి దంపతులు సజీవ దహనం

04:07 PM

జులై 1న గ్రూప్‌-4 పరీక్ష..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.