Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ల‌త్కోర్ సాబ్‌ | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Oct 23,2022

ల‌త్కోర్ సాబ్‌

          ఆ రోజు అంట్లపురంలో పాకుడుబండ సినిమా చూబెడుతున్నారు. మున్సిపల్‌ మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే దానిలో నటిస్తున్నాడు. వారు నటిస్తున్నారు అనడం కంటేవారు జీవిస్తున్నారంటేనే నయం. వారి జీవితమే ఒక నటన. నటనే జీవితం. సాధారణంగా నటులు రంగు పూసుకొని నటిస్తారు. కానీ వీరికి ఎలాంటి మేకప్‌ అవసరం లేదు. వీరి నటన సహజంగా ఉంటుంది. ప్రేక్షకులతో ఈలలేయిస్తుంది. చప్పట్లు కొట్టిస్తుంది.
మున్సిపల్‌ మంత్రి సీన్‌ పండిస్తున్నాడు. ఆ సమయంలో....
ఎంపీ పిలవని పేరంటంటా వచ్చాడు.
ఒళ్లు తెలియని కల్లు తాగిన కోతిలా వచ్చాడు.
తిట్లనూ, శాపనార్థాలనూ మోసుకొచ్చాడు.
అతనంతలా ఆవేశపడటానికి కారణం లేకపోలేదు. సినిమా టైటిల్స్‌లో ఆయనగారి పేరు లేదు.
''పాకుడు బండలో నేను నటించాను. టైటిల్స్‌లో నా పేరెందుకు లేదు'' అని మున్సిపల్‌ మంత్రిని ఎంపీ అడిగాడు.
''మీరు నటించిన సీన్లను సినిమా నుంచి తీసేసాం''
''ఎందుకు తీసారు''
''మీకు చెప్పాల్సిన అవసరం లేదు''
''నాక్కాక పోయినా జెనంకు చెప్పండి''
''జెనాలకు చెప్పాలా? చెప్పొద్దా అనేది మా ఇష్టం. మధ్యలో మీరెవరు?''
''నీ కళ్లు నెత్తికెక్కాయి''
''నీ తోలు మందమైంది''
''నువ్వు గూండావు''
''నువ్వు రౌడీవి''
''నువ్వు కుక్కవు''
''నువ్వు పందివి''
మంత్రీ, ఎంపీ మాట్లాడుతూ అనుకొన్నారు. తనివి తీరక పోవడంతో ఒకరిచొక్కా ఒకరు చింపుకొన్నారు. పరస్పరం జుత్తు పీక్కొన్నారు. అంతటితో ఆగకుండా తన్నుకొన్నారు. ఎంతటి నాయకులైనా వెనుకటి గుణం మానరు కదా! కొందరు కలుగజేసుకొని వారిని విడిపించారు.
సినిమా మధ్యలోనే ఆగిపోయింది.
''సగం సిన్మనే సూబెట్టిండ్రు. కడ్మ సగం యాడ సూబెడ్తరు'' అని ఒకడు పక్కనున్న వాడిని అడిగాడు.
''పక్క ఊర్లె లేకుంటె అసెంబ్లీల'' అని వాడు చెప్పాడు.
పాకుడుబండ సినిమా విడుదలై యాభై రోజులయ్యింది. చింతలూరులో అర్థశత దినోత్సవాన్ని జరపాలని స్థానిక నాయకులు నిర్ణయించారు. దానికి వారు లత్కోర్‌ను పిలిచారు. ఆయనగారికి ఎవరైనా రమ్మంటే చాలు. అదే పది వేలు.
చింతలూరు ఆ రోజు పెళ్లివారు ఇల్లులా సందడిగా ఉంది.
పెళ్లికూతురులా ముస్తాబైంది.
చెత్తాచెదారమూ లేకుండా తారు రోడ్లు తళతళా మెరుస్తున్నాయి.
చౌరస్తాల్లో బొచ్చెపార్టీ జండాలు రెపరెపలాడుతున్నాయి.
ఊరంతా బొచ్చె గుర్తుతో ఉన్న కాగితపు తోరణాలు తళతళల్లాడుతున్నాయి. వాస్తు ప్రకారం ఓ వేదిక. దాని మీద మైక్‌. నాలుగైదు కుర్చీలు. వేదిక ముందే వేలాది ప్లాస్టిక్‌ కుర్చీలు. ఆ కుర్చీల్లో ఆడా మగా.
రోడ్డు రెండు వైపులా నిలుచున్న బడిపిల్లలు జేజేలు పలుకుతుండగా, ఎక్కడి ట్రాఫిక్‌ అక్కడే నిలుచుండగా, ఫైలెట్‌ కారు సైరన్‌ మోగిస్తుండగా మందీ మార్బలం తోడు రాగా మహామంత్రి లత్కోర్‌ వచ్చాడు.
''మహామంత్రిని వేదికనలందరించవలసిందిగా కోరుతున్నాం'' అని బొచ్చెపార్టీ స్థానిక నాయకుడు మైకు ద్వారా పిలవగానే- చిరునవ్వుతో, కట్టె తుపాకీతో, చెంచాల జిందాబాద్‌లతో లత్కోర్‌ వేదికనెక్కాడు.
''అమ్మలారా! అయ్యలారా! అక్కలారా! అన్నలారా! అందరికీ పదివేల దండాలు. నేను మీ వాణ్ణి. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. రూపాయికి కిలో బియ్యమిస్తున్నాం'' అంటూ లత్కోర్‌ ఇంకేమో చెప్పబోతుంటే అడ్డుపడి-
''నూనె, పప్పులు, కూరగాయల ధరలు మొగులు మీద గూసున్నయి. గసుంటప్పుడు మీరు రూపాయికి కిలో బియ్యమిస్తే లాభమేమున్నది'' అని ఒక ముస్లామె అడిగింది.
''మీరేం విచారించకండి. ఆకాశం మీది ధరలను దించడానికి కొంతమందిని రాకెట్లతో పంపాను. వాళ్లు తాళ్లతో కట్టిపడేసి వాట్ని కిందికి లాక్కొని వస్తారు'' అని లత్కోర్‌ అన్నాడు.
''మా ఊరికి రోడ్డు లేదు. రెణ్నెల్ల క్రితం నెలలు నిండిన మా అమ్మాయిని జిల్లా ఆస్పత్రికి తీసుకొని వెళ్లలేక పోయాం. కాన్పు కష్టం కావడంతో పిల్లాడిని కని మా అమ్మాయి చనిపోయింది. మా ఊరికి రోడ్డెప్పుడు వేయిస్తారు'' అని నడి వయస్కుడు అడిగాడు.
''ఇప్పుడవన్నీ ఎందుకు? ఈ సమావేశమయ్యాక ఏమైనా ఉండే నాతో చెబుదువు గాని''
''అప్పుడు మాట్లాడడానికి మీరెక్కడుంటారు?''
సభను చెడగొట్టడానికి ప్రతిపక్షాలు వీణ్ని పంపించి ఉంటాయి అనుకొని బొచ్చెపార్టీ స్థానిక నాయకుడు పోలీసులకు సైగ చేశాడు. పోలీసులు కాస్తా ఆ నడివయస్కుణ్ని ఈడ్చుకెళ్లారు.
ముక్కిపోయిన బియ్యమే రూపాయికి కిలో బియ్యం. అది పురుగుల మయం. ఆ బియ్యాన్ని పశువులే తినడం లేదు. జెనాలు ఎక్కడ నుంచి తింటారు? అసెంబ్లీలో ఈ ప్రశ్నను ప్రతిపక్ష సభ్యులు ఎన్నో సార్లు అడిగారు.
పాకుడు బండ సినిమా సందర్భంగా రూపాయికి కిలో బియ్యం ఇవేనంటూ జెనాలకు సన్నబియ్యం ఇచ్చారు. మంచుతెరతో లత్కోర్‌ కళ్లు కప్పారు. సన్నబియ్యాన్ని చూసి లత్కోర్‌ మురిసిపోయాడు.
''ఇప్పుడే రూపాయికి కిలో బియ్యంతో వండిన అన్నాన్ని మీ అందరితో కలిసి తింటాను'' అని అన్నాడు.
ఆయన గారి మాటలు విన్న వంటవాడు కంగారు పడ్డాడు. అంతకు ముందు స్థానిక బొచ్చె నాయకుల సూచనతో సన్నబియ్యంతోనే అన్నం వండాడు. మళ్లీ రూపాయికి కిలో బియ్యంతో అందరికీ వండి వడ్డించడం
సాధ్యంకాక వాడు లత్కోర్‌ కు మాత్రమే సరిపోయేలా రూపాయికి కిలో బియ్యంతో అన్నం వండాడు.
అందరూ సన్న బియ్యంతో వండిన అన్నాన్ని తిన్నారు. కానీ లత్కోర్‌ మాత్రమే రూపాయికి కిలో బియ్యం తో వం డిన అన్నాన్ని ఇటు మింగ లేక అటు కక్కలేక గింజుకున్నాడు. అది చూసిన స్థానిక బొచ్చె నాయకులు వంట వాణ్ని పిలిచారు.
''ఏంరా! తోలు మందమైందా? నీకు మేమే ఏం జెప్పినం. నువ్వు ఏం జేసినవ్‌?'' అని అడిగాడు.
''నేనేం జేసిన''
''రూపాయికి కిలో బియ్యం తోని అన్నమెందుకు వండినవ్‌? వండి ఊకో కుంట మహా మంత్రికి ఎందుకు బెట్టినవ్‌?''
''రూపాయికి కిలో బియ్యంతోని వండిన అన్నంను అందరితోని కల్సి తింట అని మహామంత్రి అంటె గాయిన మాట ఎందుగ్గావాలని గా బియ్యంతోనే అన్నం వండిన. గా అన్నంనే గాయినకు బెట్టిన. గిండ్ల నా తప్పేముంది?'' అని వంటవాడు అడిగాడు.
ఏం చెప్పాలో ఎర్కలేక స్థానిక బొచ్చె పార్టీ నాయకులు ఎడ్డి మొకమేస్కున్నారు.
మహామంత్రిది మూడు కోతుల సిద్ధాంతం. నోరు మూసుకున్న కోతి ఎప్పుడూ నిజాలు మాట్లాడొద్దని అంటుంది. కళ్లు మూసుకొన్న కోతి నిజాలు, చూడొద్దని అంటుంది. చెవులు మూసుకున్న కోతి నిజాలు వినొద్దని అంటుంది. మహామంత్రి లత్కోర్‌ ఒక్కొక్కప్పుడు ఒక్కో కోతిలా ప్రవర్తిస్తాడు. ఇంతవరకూ ఇకేసారి మూడు కోతుల్లా అతను ప్రవర్తించలేదు. ఇక ముందు అవసరమైతే ఇకే దఫా మూడు కోతుల్లా అతను ప్రవర్తిస్తాడేమో! రాజకీయాల్లో ఎప్పుడేమైనా జరగొచ్చు.
లిలిలి
అది కైలాసం. ఏ భక్తునికో వరమివ్వడానికి శంకరుడు ఎక్కడికో వెళ్లాడు. వెండికొండపై ప్రమథగణ సమేతంగా పార్వతి ఒక్కతే ఉంది. గర్భిణిలా అడుగులో అడుగేస్తూ వినాయకుడామె దగ్గరకొచ్చాడు. గణపతి అందరికి దేవుడయినా పార్వతికి మాత్రం పసిబిడ్డడే.
''ఏం నాయనా! ఆకలేస్తున్నదా? కుడుములేమైనా పెట్టమంటావా?'' అని పార్వతి అడిగింది.
'కుడుములొద్దు. గిడుములొద్దు. ఆకల్లేదమ్మా''
''మరేం కావాలి''
''ఒకసారి అమ్మో నగరానికి వెళ్లొస్తానమ్మా''
''అక్కడికెళ్లొద్దురా నాన్నా''
''ఎందుకెళ్లొద్దమ్మా!''
''వానలు పడితే ఆ నగరంలోని రోడ్లన్నీ చెరువులైతాయి. వాటి మీద నుంచి వెళ్లడానికి పడవైనా ఉండాలి. ఈతైనా రావాలి''
''గంగాదేవి నాకు చిన్నమ్మే కదా! ఆమెతో వచ్చిన కష్టమేమిటి?''
''గంగతో కాదురా కన్నా! రోడ్లన్నీ నీళ్లతో నిండిపోతే ఎక్కడేమున్నాయో తెలియకుండా పోతుంది''
''అది నిజమేననుకో''
''అమ్మో నగరం వీధుల్లో పిచ్చి కుక్కలుంటాయి''
''అవేం చేస్తాయి. ఒక వేళ పిచ్చి కుక్క కరిస్తే సర్కారు దవాఖానాకు వెళతాను''
''వెళతావెళతావు. నువ్వెళ్లినా అక్కడ మందులుండొద్దూ''
''మందులెందుకుండవమ్మా!''
''ఉండవంతే''
''మరి కుక్క కాటుకు ఏదైనా మందిస్తున్నారా?''
''కుక్క కాటుకు చెప్పు దెబ్బే మందంటూ కుక్క కరిచిన చోట చెప్పుతో కొడుతున్నారు''
''ఇవాళ వినాయక చవితి. అమ్మో నగరానికి వెళితే మహామంత్రి కుడుములూ, ఉండ్రాళ్లూ నైవేధ్యంగా నాకు పెడతాడు''
''గుర్తుందా. రెండేళ్ల క్రితం మహా మంత్రి పెట్టిన ఉండ్రాళ్లు తింటే నీ రెండు దంతాల్లోని ఒక దంతం ఊడిపోయింది. అప్పటి నుంచే నువ్వు ఏకదంతుడవయ్యావు''
''వీధి వీధినా పందిళ్లు వేస్తారు. వాటి కింద నా బొమ్మలు పెట్టి పూజలు చేస్తారు''
''వొద్దు వొద్దన్నా వినకుండా కిందటేడూ అమ్మో నగరానికి వెళ్లావు. వెళ్లిన గంట సేపటికే మాయమయ్యావు. ఆ రోజంతా నువ్వు కనిపించలేదు.''
''కనబడుట లేదు. పేరు గణపతి. వయసు పదేళ్లు. పొట్టిగా, లావుగా ఉంటాడు. చిన్న కళ్లు. పెద్ద బొజ్జ. తొండముంటుంది. వినాయకుని బొమ్మలుండే ప్రాంతంలో ఉండొచ్చని భావిస్తున్నాము. ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమానముంటుంది'' అని పేపర్లో ప్రకటనలిచ్చాం. ఆఖరికి మూత తెరిచిన మ్యాన్‌హోల్‌లో నువ్వు పడ్డట్లు తెలిసింది.''
''ఇప్పుడు జాగ్రత్తగా ఉంటానమ్మా!''
''వెళ్లకుండా ఉండవన్నమాట''
''ఈ ఒక్కసారికి వెళ్లనీయమ్మా!''
''సరే జాగ్రత్తగా వెళ్లిరా నాయనా!'' అని పార్వతి అన్నది.
వినాయకుడు అమ్మో నగరానికొచ్చాడు. వీధివీధినా రకరకాలుగా ఉన్న తన బొమ్మలు చూస్తూ తిరుగుతున్నాడు. అతణ్ని చూసి బైరూపులోడని జెనాలు అనుకొన్నారు. కుక్కలు వెంటపడితే అతను రాళ్లతో కొట్టాడు. భౌ భౌ మంటూ అవి పారిపోయాయి.
తరువాయి వచ్చేవారం...

- తెలిదేవ‌ర భానుమూర్తి
  99591 50491

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'
బహిరంగ ప్రకటన
అక్కెర ఉన్నంతసేపు ఆదినారాయణ....
మార్పు ఎజెండాగా ఖాజామైనద్దీన్‌ చల్లారని నిప్పు రవ్వలు
గడియ పురుసత్‌ లేదు.. గవ్వ రాకడ లేదు
క్రమ'శిక్ష'ణ గల 'హాస్టల్‌ లైఫ్‌'
ల‌త్కోర్ సాబ్‌
బాల సాహితీస్ఫూర్తి 'డాక్టర్‌ కపిలవాయి లింగమూర్తి'
విలక్షణ కథల సమాహారం నిరుడు కురిసిన వెన్నెల
ల‌త్కోర్ సాబ్‌
తెలుగు పిల్లలకు 'వచ్చేవచ్చే రైలుబండి' పాటనిచ్చిన గంగదేవు యాదయ్య
ల‌త్కోర్ సాబ్
బాల సాహితీ వికాసంలో సిద్ధిపేట పూదోట 'పెందోట'
రేపటి కథకులకు 'కాలిబాటలు' వేసిన డా|| స్వామి
బాలల కథల ఊడలమర్రి 'రామకృష్ణ పైడిమర్రి'
ఎలుకా క్షేమమా...
గుండె సొద బొమ్మ కట్టిన కథలు
శిథిల వసంతంలో తెలుగు గజళ్ళు గానించిన బిక్కి కృష్ణ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
ల‌త్కోర్ సాబ్
ఊరితో అనుబంధాలకు అద్దం 'మైదాకు వసంతం'
సూర్యచంద్రులు!
బాలల నాటికల సృష్ట 'దుప్పల్లి శ్రీరాములు'
ల‌త్కోర్ సాబ్‌
మౌన పాఠాలు చెప్పే జ్యోతిర్మయి కథలు
ల‌త్కోర్ సాబ్‌
ఓ జర్నలిస్ట్‌ స్ట్రింగ్‌ ఆపరేషన్‌ 'కమల'
గిరిజన పిల్లల ఆత్మబంధువు 'సమ్మెట ఉమాదేవి'

తాజా వార్తలు

02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

10:26 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

09:48 AM

ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం..

12:12 PM

హైదరాబాద్‌ లో మరో భారీ అగ్ని ప్రమాదం..

09:16 AM

మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్

09:03 AM

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

08:51 AM

బోల్తాపడిన డీసీఎం.. ఇద్దరు మృతి

08:50 AM

మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుంది : మంత్రి ఇంద్రకరణ్

08:27 AM

తిరుమలలో భక్తుల రద్దీ..

09:33 AM

మణిపూర్‌లో 4.0 తీవ్రతతో భూకంపం..

07:57 AM

‘గడపగడపకు’ కార్యక్రమంలో స్థానికుడిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే..!

07:50 AM

విజయ్, లోకేశ్‌ కనగరాజ్‌ 'లియో'.. టైటిల్‌ ప్రోమో అదిరింది

07:22 AM

అఫ్రిది కుమార్తెతో ఘనంగా షాహిన్ అఫ్రిది వివాహం..

07:14 AM

బస్సు దిగి పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్..

07:07 AM

మనం ఫ్రెండ్స్ కాదు..బ్రదర్స్ అంతకన్నా కాదు..'అమిగోస్' ట్రైలర్

07:04 AM

పాట్నా వెళ్లేందుకు ఫ్లైటెక్కి ఉదయ్‌పూర్‌లో దిగాడు..

06:58 AM

హైదరాబాద్‌ వాహనదారులకు అలర్ట్‌..

10:07 PM

ఐఆర్‌సీటీసీలో టికెట్ల జారీ మరింత వేగవంతం : అశ్వినీ వైష్ణవ్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.