Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ల‌త్కోర్ సాబ్‌ | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Nov 13,2022

ల‌త్కోర్ సాబ్‌

దిక్కుమాలిన రాష్ట్రంలో అది చీకటూరు. దానికాపేరు రావడానికి కారణముంది. చాలా కాలం వరకూ ఆ ఊళ్లో కరెంటు లేదు. ఈ మధ్యనే కరెంటొచ్చింది.
కరెంటు వొచ్చినందుకు ఆ ఊరోల్లు సంబరాలు జరుపుకున్నారు.
ట్రాన్స్‌ఫార్మర్‌కు పూజలు చేసారు.
దాని ముందు యాట కోసారు.
కరెంటు స్తంభాలకు పసుబొట్లు పెట్టారు.
మామిడాకులు కట్టారు.
లైటు బుగ్గలకు నమస్కరించారు.
బిర్యాని వండుకొని తిన్నారు.
కానీ వారి సంబరమూ, సంతోషమూ మూడోరోజుకి మిగల్లేదు. 'కొత్త మురిపెం కోత ఎరగదన్నట్టు' రెండు రోజుల పాటు ఇరవై నాలుగ్గంటలూ కరెంటు, మూడో రోజు నుంచే కరెంటు కోతలు మొదలయ్యాయి.
ఆ ఊరు బహురూపులకు మశూర్‌. వారు రోజుకో వేషం కట్టేవారు. వారానికో బాగోతం ఆడేవారు. బాగోతాలాడటమే ఆ ఊరి బహురూపుల ప్రత్యేకత. ఒకానొక రోజున ఒక చోట కూర్చుని వారు బాతాఖానీ పెట్టారు.
''మనం రోజుకో వేషం కడుతున్నాం.''
''వారానికో బాగోతమాడుతున్నాం''
''మన వేషాలన్నిటినీ ఊరోల్లు చేసేసారు''
''మన బాగోతాలనూ చూసేసారు''
''కట్టిన వేషాల్నే కడుతుంటే''
''ఆడిన బాగోతాల్నే ఆడుతుంటే''
''ఎంతటి ఊరోల్లైనా''
''ఎంతకని చూస్తారు''
''వారికి విసుగు పుడుతుంది''
''విసుగు పుడితే''
''మన వేషాల్ని చూడ్డం మానేస్తారు''
''మన బాగోతాలకు బైబై చెప్పేస్తారు''
''మరిప్పుడెలా?''
''ఎలా ఏమిటి మనం కొత్త వేషాలెయ్యాలి''
''కొత్త బాగోతాలాడాలి''
''ఇప్పటికిప్పుడు కొత్త వేషాలెలా కట్టగలం''
''కొత్త బాగోతాలెలా ఆడగలం''
''కొత్త వేషాలూ కట్టగలం, కొత్త బాగోతాలూ ఆడగలం''
''అదెలా''
''నెల రోజుల క్రితం నేను రాజధానికి వెళ్లాను. నిన్నే తిరిగొచ్చాను.''
''దానికీ దీనికీ సంబంధమేమిటి?''
''నన్ను పూర్తిగా చెప్పనీయకుండా మధ్యలో అడ్డుకుంటావెందుకు? రాజధానిలో నేను కొత్త బాగోతం చూసాను''
''ఏం బాగోతం''
''అసెంబ్లీ బాగోతం''
''నువ్వొక్కడివే చూస్తేలాభమేమిటి? మేమెవ్వరమూ చూడలేదు కదా''
''నేను నేర్పుతాను''
''ఎన్ని రోజుల్లో నేర్పుతావు''
''వారం రోజుల్లో''
''అసెంబ్లీ బాగోతాన్ని నేర్చుకొని ఒక రోజు ఆడేస్తాం''
''అది పాతబడి పోతుంది. అప్పుడెలా?''
''దాన్ని ఏకబిగిన నెలరోజుపాటు ఆడోచ్చు. ఎన్ని రోజులాడినా అది కొత్తగానే ఉంటుంది''
అమ్మో నగరం వెళ్లొచ్చిన బహురూపి తక్కిన వారికి అసెంబ్లీ బాగోతం నేర్పాడు. ఎలా వేషం కట్టాలో ఓసారి వేషం కట్టి చూపించాడు. ఎలాగ డైలాగులు చెప్పాలో ఒకటికి రెండుసార్లు చెప్పించాడు.
చీకటూరులో ఎప్పుడు కరెంటు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. 'వానరాకడ చెప్పొచ్చు, ప్రాణం పోకడా చెప్పొచ్చు. కరెంటు రాకడనూ, కరెంటు పోకడనూ చెప్పలేం. అందువల్ల దినం పూటే అసెంబ్లీ బాగోతమాడితే బాగుంటుందని బహురూపులు అనుకొన్నారు.
''ఇవాళ సాయంత్రం నాలుగ్గంటలకు ఊరి నడుమనున్న మర్రిచెట్టు కింద అసెంబ్లీ బాగోతమాడుతున్నాం. అందరూ తప్పకుండా రావాల హో'' అంటూ డప్పుకొడుతూ బహురూపి ఒకడు ఊరంతా చాటించాడు.
ఇదేదో కొత్త బాగోతమున్నట్లుంది.. తప్పకుండా చూడాలనుకొన్నారు ఊరోల్లు.
మర్రిచెట్టు కింద బల్ల పీటలతోని స్టేజ్‌ ఏర్పాటు చేసారు. అది దీర్ఘచతురస్రాకారంలో ఉంది. దాని మధ్యలో ఒక కుర్చీ వేసారు. దాని కుడివైపు కొన్ని కుర్చీలు వేసారు. ఆ కుర్చీల్లో మహామంత్రితో పాటు మంత్రుల వేషాలు కట్టిన బహురూపులు కూర్చున్నారు. ఎడమ వైపు వేసిన కుర్చీల్లో ప్రతిపక్ష సభ్యుల వేషాలు కట్టిన బహురూపులున్నారు. బాగోతాల్లో ఎప్పుడూ లత్కోర్‌ వేషం కట్టే పెద్దయ్య మహామంత్రి వేషం కట్టాడు. మధ్య కుర్చీలో స్పీకర్‌ వేషంలో బహురూపి కూర్చున్నాడు.
ఊరోల్లు ఈత చాపలూ, గొంగళ్లూ తెచ్చుకొన్నారు. బాగోతం చూడ్డానికి వాటిపై కూర్చున్నారు.
''ఇప్పుడు చిప్ప పార్టీ సభ్యుడు అడిగే ప్రశ్నలకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి జవాబు చెప్తాడు'' అని స్పీకర్‌ అన్నాడు.
ఎడమవైపు కూర్చున్న ప్రతిపక్ష సభ్యుడు లేచి నిలుచున్నాడు. అలాగే కుడివైపునున్న రోడ్లు, భవనాల శాఖ మంత్రి కుర్చీ నుంచి లేచాడు.
''రోడ్ల మీద గుంతలున్నట్లు మీకు తెలియదా?''
''తెలుసు''
''తెలిసి కూడా మీరెందుకు మంచిరోడ్లు వెయ్యడం లేదు''
''వాటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి''
''మంచి రోడ్ల వల్ల ప్రమాదాలా?''
''అవును''
''అదెలా?''
''రోడ్లు బాగుంటే కార్లనూ, బస్సులనూ, లారీలనూ, ఆటోలనూ, బైక్‌లనూ స్పీడ్‌గా నడుపుతారు. దాంతో ప్రమాదాలు జరుగుతాయి. రోడ్డు ప్రమాదాల్లో కొందరు చనిపోవచ్చు. కొందరి కాళ్లూ, చేతులూ విరగొచ్చు. వాహనాలు పాడుకావొచ్చు''
''గుంతల రోడ్లుంటే ప్రమాదాలు జరగవా?''
''జరగవు. అసల్‌ జరగవు''
''ఎందుకు జరగవు''
''రోడ్ల మీద గుంతలుంటే వాహనాలను మెల్లగా, జాగ్రత్తగా నడుపుతారు. దాంతో ఎలాంటి ప్రమాదాలు జరగవు. బస్సులో కూర్చుంటే ఉయ్యాల్లో కూర్చున్నట్లు ఉంటుంది. ఉయ్యాలో జంపాలో అని పాడుకొంటూ ఎంచక్కా జెనం బస్సుల్లో తిరగొచ్చు. కడుపుతో ఉన్న స్త్రీలు బస్సుల్లో వెళితే కాన్పు తేలిక!'' అని రోడ్ల భవనాల శాఖ మంత్రి అన్నాడు.
''మీరీ మధ్య జంతర్‌ మంతర్‌ రాష్ట్రం వెళ్లారా?''
''వెళ్లాను''
''ఆ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రిని కలిసారా?''
''కలిసాను''
''మీరిద్దరూ మూడో అంతస్తులోని కిటికీ దగ్గర కూర్చున్నారా?''
''కూర్చున్నాం''
''ఆ రాష్ట్ర మంత్రి దూరంగా ఉన్న వంతెన చూబెడితే మీరు చూసారా?''
''కిటికీలోంచి చూసాను''
''వంతెన చూబెట్టి అతను ఫిఫ్టీ పర్సెంట్‌ అన్నాడట గదా''
''అతనేమన్నాడో నాకు గుర్తులేదు''
''ఆ తరువాత జంతర్‌ మంతర్‌ రోడ్ల భవనాల శాఖ మంత్రి మన రాష్ట్రానికి వచ్చాడా?''
''వచ్చాడు''
''అతనికి మీ ఇంట్లో విందు ఇచ్చారా?''
''ఇచ్చా''
''విందు తరువాత నాలుగో అంతస్తులోని కిటికీ దగ్గర కూర్చుని మాట్లాడుకొన్నారా?''
''మాట్లాడుకొన్నాం''
''కొద్దిదూరంలో పెద్ద భవనముంది. చూడండని మీరు అన్నారట గదా''
''అనలేదు''
''ఆ రాష్ట్ర మంత్రి కిటికీలోంచి చూసి అక్కడ ఏ భవనమూ కనిపించడం లేదంటే హండ్రెడ్‌ పర్సెంట్‌ అని మీరనలేదా?''
''అస్సల్‌ అనలేదు. కట్టుకథలతో మా మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తే బాగుండదు. పచ్చకామెర్ల రోగి కత మీది''
''ఇప్పుడు సద్ది బువ్వ పార్టీ సభ్యుడు అడిగే ప్రశ్నలకు ఆరోగ్య శాఖ మంత్రి జవాబు చెబుతాడు'' అని స్పీకర్‌ అన్నాడు.
''వాతావరణ కాలుష్యం వల్ల జెనాలకు రోగాలొస్తున్నాయి''
''గాలి బాగోలేదని కార్కానలను బందు బెట్టమంటవా? బస్సులు, లారీలు, మోటర్లు, మోటర్‌ సైకిల్లను తిర్గకుంట జెయ్యుమంటవా? నీల్లు బాగలేవని చెర్లలల్ల బట్టలు ఉత్కొద్దంటవా? బర్లను కడుగొద్దంటవా? సప్పుడు ఎక్వైందని ఎవ్వి సప్పుడు జెయ్యకుంట ఉండాలంటవా? పెయ్యి అన్నంక రోగమొస్తది. రోగమొస్తె ఇలాజ్‌ కోసం సర్కార్‌ దవకానుకు బోవాలె''
''ప్రభుత్వాసుపత్రుల్లో మందులెక్కడున్నాయి?''
''మందుల్లేకుంటే ఏమాయె పెగ్గు మందుగొడ్తె అన్ని రోగాలు పోతయి''
''నా నియోజక వర్గంలో ఎక్కడ బడితే అక్కడ పందులు కనిపిస్తున్నయి. పందుల్లేకుండా చెయ్యడానికి మీరేం చేస్తున్నారు?''
''నారాయణమూర్తి అవుతారాలల్ల వరాహావతారం గుడ్క ఉన్నది. వరాహం అంటె ఏంది? పంది. పంది అంటె ఏంది? దేవుడు. దేవున్ని లేకుంట జేసుడు నాకు శాతగాదు. నీకు శాతగాదు. గీ దునియల ఎవ్వలికి శాతగాదు''
''పందుల వల్ల మెదడు వాపు రోగం వస్తున్నది''
''నీ నియోజకవర్గంల జెనాలకు దిమార్‌లు యాడున్నయి? దిమార్‌లు లేనోల్లకు మెదడు వాపు రోగం యాడికల్లొస్తది''
''నా నియోజకవర్గం జెనాలకు మెదళ్లు లేవంటవా? నీకు మెదడు లేదు''
''నీకు దిమాక్‌ లేదు. నీకు దిమాక్‌ లేకుండ బట్కె దిమాక్‌లు లేని నీ నియోజకవర్గం జెనాలు నిన్ను గెలిపిచ్చిండ్రు''
''నా నియోజకవర్గం జెనాలకు మెదడు లేదంటావా? నీ నియోజకవర్గం జెనాలకే మెదడు లేదు''
''నా జెనంకు దిమాక్‌ లేదంటావా? నీకు దిమాక్‌ లేదు. మీ నాయినకు దిమాక్‌ లేదు. మీ తాతకు దిమాక్‌ లేదు.''
''బావా! నన్నేమైనా అంటే ఊరుకొంటాను. మా నాన్నకూ, తాతకూ మెదళ్లు లేవంటే ఊరుకోను''
''ఊకోకుంటే ఏం జేస్తవు? అంట. బరాబర్‌ అంట. ఎక్వతక్వ మాట్లాడితె మల్లమల్ల అంట. ఏం బీక్తవుర సాలే!''
''రోజూ తాగొచ్చి మా అక్కను గొడ్తున్నవట''
''నా పెండ్లాంను కొడ్త. సంపుత. అడ్గెతంద్కు నడ్మల నువ్వెవలివి?''
''నీ బావమరిదిని''
''బామ్మర్దివైతె బామ్మర్ది తీర్గుండు. ఎక్వతక్వ నక్రాల్‌ జెయ్యకు''
''బావమరిది లాగే ఉన్నాను. ఉన్నాను గనుకనే మా అక్కను కొడితే బాగుండదంటున్నాను''
''కొడ్త. ఏం బీక్తవు?''
''ఏం బీకను. పోలీస్‌ స్టేషన్‌ వెళతాను''
''అమీన్‌ కచేర్కి బోతివా అంటె మీ అక్కనె ఇంట్లకెల్లి ఎల్లగొడ్త.''
''ఎలా వెళ్లగొడ్తావో చూస్తాను''
''సూడు. మంచిగ సూడు''
''ఊర్లో పెద్ద మనుషులు లేరనుకుంటున్నావా?''
''ఉంటె నాకేంది?''
''నీకు సిగ్గూ శరమూ లేవు''
''బాడ్కావ్‌! నాకు సిగ్గు శరం లేదంటావా? నీ కాల్లు చేతులిర్గగొడ్త. ఎవ్వడు అడ్డమొస్తడో సూస్త''
నిజానికి రోడ్లు భవనాల శాఖ మంత్రి వేషం కట్టిన బహురూపి, ప్రతిపక్ష సభ్యుని వేషం కట్టిన బహురూపి బావబావమరుదులు.
వాళ్లు అసెంబ్లీ బాగోతం ఆడుతున్నామనే సంగతి మరిచిపోయి కొట్లాటకు దిగారు.
''బాగోతం చూడ్డానికొచ్చాం. మీ సొంత బాగోతం చూడ్డానికి రాలేదు'' అని జెనాల్లోంచి ఒకడు అరిచాడు.
దాంతో వారు స్పృహలోకి వచ్చారు.
''మీ ప్రశ్నలూ, జవాబులూ ఆపి మీ సీట్లలో కూర్చొండి'' అని స్పీకర్‌ అన్నాడు.
వారు తమ తమ కుర్చీల్లో కూర్చున్నారు.
తరువాయి వచ్చేవారం...

- తెలిదేవ‌ర భానుమూర్తి
  99591 50491

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'
బహిరంగ ప్రకటన
అక్కెర ఉన్నంతసేపు ఆదినారాయణ....
మార్పు ఎజెండాగా ఖాజామైనద్దీన్‌ చల్లారని నిప్పు రవ్వలు
గడియ పురుసత్‌ లేదు.. గవ్వ రాకడ లేదు
క్రమ'శిక్ష'ణ గల 'హాస్టల్‌ లైఫ్‌'
ల‌త్కోర్ సాబ్‌
బాల సాహితీస్ఫూర్తి 'డాక్టర్‌ కపిలవాయి లింగమూర్తి'
విలక్షణ కథల సమాహారం నిరుడు కురిసిన వెన్నెల
ల‌త్కోర్ సాబ్‌
తెలుగు పిల్లలకు 'వచ్చేవచ్చే రైలుబండి' పాటనిచ్చిన గంగదేవు యాదయ్య
ల‌త్కోర్ సాబ్
బాల సాహితీ వికాసంలో సిద్ధిపేట పూదోట 'పెందోట'
రేపటి కథకులకు 'కాలిబాటలు' వేసిన డా|| స్వామి
బాలల కథల ఊడలమర్రి 'రామకృష్ణ పైడిమర్రి'
ఎలుకా క్షేమమా...
గుండె సొద బొమ్మ కట్టిన కథలు
శిథిల వసంతంలో తెలుగు గజళ్ళు గానించిన బిక్కి కృష్ణ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
ల‌త్కోర్ సాబ్
ఊరితో అనుబంధాలకు అద్దం 'మైదాకు వసంతం'
సూర్యచంద్రులు!
బాలల నాటికల సృష్ట 'దుప్పల్లి శ్రీరాములు'
ల‌త్కోర్ సాబ్‌
మౌన పాఠాలు చెప్పే జ్యోతిర్మయి కథలు
ల‌త్కోర్ సాబ్‌
ఓ జర్నలిస్ట్‌ స్ట్రింగ్‌ ఆపరేషన్‌ 'కమల'
గిరిజన పిల్లల ఆత్మబంధువు 'సమ్మెట ఉమాదేవి'

తాజా వార్తలు

11:39 AM

భూప్రళయంలో 15వేలు దాటిన మరణాలు..

11:07 AM

డిస్నీలో ఏడు వేల మంది ఉద్యోగుల తొలగింపు..

10:43 AM

బడ్జెట్‌ లైవ్‌ టెలికాస్ట్.. యూనిర్సిటీలకు ప్రభుత్వం ఆదేశం

10:38 AM

ఆయిల్‌ ట్యాంకర్‌లో దిగి ఏడుగురి మృతి..

09:49 AM

తొలి టెస్టులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్‌ బౌలింగ్‌

09:39 AM

రోడ్డుప్రమాదంలో చిరుత మృతి..

09:25 AM

నేడు హైదరాబాద్‌ సీబీఐ కోర్టు వివేకా హత్య కేసు నిందితులు..

08:59 AM

నేటినుంచి శాసనసభలో బడ్జెట్‌ పద్దులపై చర్చ..

08:45 AM

అనాథ యువతిపై వాలంటీర్ లైంగికదాడి..

08:13 AM

నగరంలో ఇంకో 10 రోజులపాటు తప్పని ట్రాఫిక్‌ కష్టాలు..

08:00 AM

తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఏసీ కోచ్‌లో చెలరేగిన మంటలు

07:47 AM

ఎంసెట్ సిలబస్‌పై రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీల‌క సూచ‌న‌..

07:24 AM

సరోగసీపై న్యాయస్థానానికి కేంద్రం వివ‌ర‌ణ‌..

07:01 AM

తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లకు పదోన్నతులు..

06:31 AM

నేటి నుంచి విజయవాడలో పుస్తక మహోత్సవం..

06:19 AM

భార్య మృతదేహాన్ని భుజాన మోసుకెళ్లిన భర్త

09:55 PM

దేశంలోనే ‘ఎలక్ట్రిఫైడ్‌’ స్టేట్‌గా తెలంగాణ : కేటీఆర్

09:42 PM

పోలీస్‌ కస్టడీలో గత ఐదేళ్లలో 669 మంది మృతి : కేంద్ర హోం శాఖ

09:20 PM

అదానీని ప్రధానినే రక్షిస్తున్నాడు : రాహుల్‌ గాంధీ

08:56 PM

దేశంలో తొలిసారి తల్లిదండ్రులైన.. ట్రాన్స్‌జెండర్ జంట

08:24 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై సీఎస్‌కు లేఖ రాసిన సీబీఐ..

08:05 PM

జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీయాలి..

06:55 PM

తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం..

06:21 PM

బీజేపీ ప్ర‌భుత్వం ఎందులో సక్సెస్ అంటే : మంత్రి హ‌రీశ్‌రావు

06:06 PM

ఏపీ క్యా‌బినెట్‌ పలు కీలక నిర్ణయాలు

05:45 PM

ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయొద్దు : స్పీకర్‌ ఓం బిర్లా

05:33 PM

హైదరాబాద్‌ లో ట్రాపిక్ ఇబ్బందులు..

04:53 PM

కొండగట్టుకు నిధులు మంజూరు చేసిన సీఎంకి రుణపడి ఉంటాం..

04:19 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్.. లాభాల్లో సూచీలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.