Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బహుముఖ ప్రజ్ఞ బాల సాహిత్యోద్యమకారిని 'సునంద' టీచర్‌ | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Nov 13,2022

బహుముఖ ప్రజ్ఞ బాల సాహిత్యోద్యమకారిని 'సునంద' టీచర్‌

'చీమ ఎంతో చిన్నది / తెలివి భలే వున్నది / పొదుపులోన ఎప్పుడూ / తానే ముందున్నది' అంటూ పిల్లలకు చిన్నారి చీమల పెద్ద పనిని పరిచయం చేసిన ఈ గేయకవయిత్రి శ్రీమతి వురిమళ్ల సునంద. సునంద వృత్తిరీత్యా ఉపాధ్యాయిని, ప్రవృత్తి రీత్యా బాల వికాసకార్యకర్త. కవయిత్రి, రచయిత్రి, సాహిత్య సాంస్కృతిక సంస్థల నిర్వాహకురాలు.
             కవితలు, కథలు, పాటలు, సమీక్షలు, నానీలు, గజళ్ళు, రుబాలయీలు, బాలల కథలు, బాలల గేయాలను సునంద సృజించిన శ్రీమతి సునంద నేటి సూర్యాపేట జిల్లా (నిన్నటి నల్లగొండ) మోతె మండలం లోని సిరికొండలో పుట్టింది. తల్లితండ్రులు శ్రీమతి వురిమళ్ళ రామతారకమ్మ-శ్రీ సోమాచారి. ఉపాధ్యాయినిగా భద్రాద్రి కొత్త గూడెం జిల్లా, దమ్మపేట మండలంలోని నాగుపల్లిలో పనిచేస్తోంది.
సాహిత్య అద్యయనం, సమాజసేవలతో పాటు పిల్లల కోసం వురిమళ్ళ ఫౌండేషన్‌ ద్వారా వివిధ పోటీలు, ఉత్సవాలు నిర్వహించి తెలంగాణలో జరుగుతున్న బాల వికాసోద్యమంలో నేను సైతం అంటూ ముందు వరుసలో నడుస్తోంది. అధ్యయనంతో పాటు వృత్తిరీత్యా ఊలు, కొబ్బరి పీచు, కాగితాలవంటి వాటిని ఉపయోగించి తక్కువ ఖర్చుతో బోధనా సామగ్రి తయారు చేయడంలో సునంద దిట్ట. వివిధ సాహిత్య సాంస్కృతిక సంస్థలు నిర్వహించిన పలుపోటీల్లో పాల్గొని మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో బహుమతులు, ప్రశంసలు అందుకున్న సునంద ఉత్తమ ఉపాధ్యాయినిగా జిల్లా విద్యాధికారి మొదలు అనేక సంస్థల సత్కారాన్ని అందుకుంది. ఇవేకాక 'హరితావరణం' నిర్వహించిన 'నా పుస్తకం' రచనా పోటీలో ప్రథమ బహుమతి, 'విశ్వశాంతి సేవా సమితి' ఉత్తమ కవితా పురస్కారం, పిడుగురాళ్ళ 'రూరల్‌ డెవలప్‌ మెంట్‌ సంస్థ' నిర్వహించిన భ్రూణ హత్యల నిషేధౖ కవితల పోటీలో, 'నెల్లూరు సృజన సాహిత్య సాంస్కృతిక వేదిక' రాష్ట్ర స్థాయి కవితల పోటీలో, 'మల్లెతీగ పత్రిక', 'స్వాతి', 'సాహితీ కిరణం మాస పత్రిక' మొదలు అనేక సంస్థల పోటీలలో బహుమతులు గెలుచుకుంది. ప్రపంచ తెలుగు భాషా పాటల పోటీ, విశ్వశాంతి సేవా సమితి, ఐక్య ఉపాధ్యాయ పత్రిక రాష్ట్ర స్థాయి కవితల పోటీ, 'అమ్మ సేవా సదనం' నిర్వహించిన కవితలు, వ్యాసాల పోటీలో ప్రథమ నగదు బహుమతులు, బండారు బాలానంద సంఘం 'బాల సాహిత్య పురస్కారం' అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసిన 'తెలంగాణ వైభవం పరిచయ దీపిక'లో రచయితగా, 2015-16 విద్యా సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర పుస్తకాల రూపకల్పనలో పాల్గొంది. తెలుగు ద్వితీయ భాష బాచకాల్లోనూ రచయిత్రిగా ఉన్నారు. రెండు దజన్లకుపైగా పురస్కారాలు అందుకున్న సునంద బాల సాహిత్య వికాసంలో విశేషంగా పనిచేస్తున్నారు.
'వరిమళ్ళ వసంతం', 'మెలకువ చిగురించిన వేళ' సునంద కవితా సంపుటాలు. 'బహు'మతులు'కథల సంపుటి' వీరి ఇతర రచనలు. 'ఆసీఫా కోసం' కవితా సంకలనానికి సంపాదకత్వం వహించారు. బాల సాహిత్యంలో సునంద వెలువరించిన పుస్తకాలు 'వెన్నెల బాల' బాల గేయాల సంపుటి, 'బాలలకో బహుమతి' పేర ద్విత్వ, సంయుక్తాక్షరాలు లేకుండా రాసిన కథా సంపుటి ప్రధానంగా పేర్కొనవచ్చు. ఇవేకాక బాల వికాస కార్యక్రమాల్లో భాగంగా బాలబాలికలు రాసిన పలు కవితా, కథా సంపుటాలకు సునంద సంపాదకత్వం వహించి, ప్రచురించారు. వాటిలో 'చిరు ఆశల హరివిల్లు', 'ఆళ్ళపాడు అంకురాలు' బాలల కవితా సంకలనాలు, 'పూల సింగిడి', 'కలకోట కథా సుమాలు' మరియు జాతీయ స్థాయి బహుమతి పొందిన బాలల కథల సంకలనాన్ని 'తీరొక్కపూలు' పేరుతో స్వీయ సంపాదకత్వంలో ప్రచురించారు. నాలుగు సంవత్సరాలుగా వురిమళ్ల ఫౌండేషన్‌ ద్వారా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారి కథలు కవితల సంకలనం కూడా ఈ సంస్థ నుండి సునంద ప్రకటించింది.
బాలల కోసం దిత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు లేని కథలను రాసిన సునంద తెలుగు పిల్లల కోసం చక్కని బాల గేయాలు ఎన్నో కూర్చి వారికి కానుకగా అందించారు. 'చిన్నారి పొన్నారి బాలలం / మిలమిల మెరిసే తారకలం / తొలకరి చినుకుల జల్లులం / పలుకుల పంచదార చిలకలం' అని గానం చేసిన సునంద పిల్లలు 'కల్లలూ కపటాలకు బహుదూరం / మమతానురాగాల నిలయం' అంటారు. ఇంకా చిన్నిచిన్ని బాలలు చిరునవ్వు దీపాలు అని వర్ణించిన ఈ పంతులమ్మ, అమ్మ, 'పసిబాలలు భగవంతుని రూపాలు/ ప్రేమిస్తే నవ్వుల వరాలిచ్చే దేవతలు' అని రాస్తారు. నిజం కదూ! పైన చెప్పినట్టు సునంద ఉపాధ్యాయిని, నిరంతరం పిల్లలతో గడిపే అవకాశం, అదృష్టం ఆమెది. అందుకేనేమో, 'చదువు విలువ తెలుసుకో చిన్నారి / విలువ తెలిసి ఎదగాలి చిన్నోడా' అని చదువు గురించి, 'బాపూజీ బాలల తాతా / గాంధీజీ మన పెద్దల నేత' అంటారు. ఇంకా గాంధీని గురించి గొప్పగా చెబుతూ 'పేదల చూసిన మన తాత / కొల్లాయి గట్టిన మహానేత' అంటూ గాంధీ కొల్లాయి తత్త్వాన్ని పిల్లలకు సులభంగా చెప్పారు. కథ, కవిత, గేయం, వ్యాసం వంటి అనేక రూపాల్లో బాలల కోసం చక్కని సాహిత్యాన్ని అందిస్తున్న వురిమళ్ళ సునందక్కకు జయహో!

- డా|| పత్తిపాక మోహన్‌, 9966229548

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'
బహిరంగ ప్రకటన
అక్కెర ఉన్నంతసేపు ఆదినారాయణ....
మార్పు ఎజెండాగా ఖాజామైనద్దీన్‌ చల్లారని నిప్పు రవ్వలు
గడియ పురుసత్‌ లేదు.. గవ్వ రాకడ లేదు
క్రమ'శిక్ష'ణ గల 'హాస్టల్‌ లైఫ్‌'
ల‌త్కోర్ సాబ్‌
బాల సాహితీస్ఫూర్తి 'డాక్టర్‌ కపిలవాయి లింగమూర్తి'
విలక్షణ కథల సమాహారం నిరుడు కురిసిన వెన్నెల
ల‌త్కోర్ సాబ్‌
తెలుగు పిల్లలకు 'వచ్చేవచ్చే రైలుబండి' పాటనిచ్చిన గంగదేవు యాదయ్య
ల‌త్కోర్ సాబ్
బాల సాహితీ వికాసంలో సిద్ధిపేట పూదోట 'పెందోట'
రేపటి కథకులకు 'కాలిబాటలు' వేసిన డా|| స్వామి
బాలల కథల ఊడలమర్రి 'రామకృష్ణ పైడిమర్రి'
ఎలుకా క్షేమమా...
గుండె సొద బొమ్మ కట్టిన కథలు
శిథిల వసంతంలో తెలుగు గజళ్ళు గానించిన బిక్కి కృష్ణ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
ల‌త్కోర్ సాబ్
ఊరితో అనుబంధాలకు అద్దం 'మైదాకు వసంతం'
సూర్యచంద్రులు!
బాలల నాటికల సృష్ట 'దుప్పల్లి శ్రీరాములు'
ల‌త్కోర్ సాబ్‌
మౌన పాఠాలు చెప్పే జ్యోతిర్మయి కథలు
ల‌త్కోర్ సాబ్‌
ఓ జర్నలిస్ట్‌ స్ట్రింగ్‌ ఆపరేషన్‌ 'కమల'
గిరిజన పిల్లల ఆత్మబంధువు 'సమ్మెట ఉమాదేవి'

తాజా వార్తలు

09:55 PM

మేకప్‌ రూంలో పేలుడు.. విషమంగా నటి ఆరోగ్యం

09:44 PM

భ‌ద్రాద్రి రాములోరి హుండీ ఆదాయం రూ. 2.20 కోట్లు

09:18 PM

అచ్చేదిన్ కాదు.. మధ్యతరగతి కుటుంబాలు సచ్చెదిన్

09:07 PM

టీడీపీ, వైసీపీతో కలిసే ప్రసక్తే లేదు: సోము వీర్రాజు

08:41 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

08:35 PM

5న రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం..

08:10 PM

గడ్కరీ, ఫడ్నవీస్ సొంతగడ్డలో బీజేపీకి ఎదురు దెబ్బ..

08:02 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

07:48 PM

హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు..

07:43 PM

అదానీ సంక్షోభం..సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలి

07:34 PM

ట్రాన్స్ఫార్మర్ నుంచి చెలరేగిన మంటలు.. రూ.37 లక్షల నష్టం

07:20 PM

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..

07:11 PM

బాలుడిని లైంగికంగా వేధిస్తున్న మహిళ..

07:02 PM

నెల్లూరు రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారు: సజ్జల

06:35 PM

తొలిసారి కోకా-కోలా ఎడిషన్ ఫోన్లు

06:22 PM

భారీగా పెరిగిన బంగారం ధర..

06:11 PM

చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..

05:57 PM

మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై కాల్పులు..జిల్లా ఎస్పీ వివరణ

05:47 PM

వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌ ప్రకటన..

05:39 PM

కొత్త సచివాలయం ప్రారంభోత్సవంపై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్

05:28 PM

థమ్సప్ అనుకుని పురుగుల మందు తాగిన విద్యార్ధినిలు..

05:12 PM

బీఆర్ఎస్ తోనే దేశానికి వెలుగు: మంత్రి జగదీశ్ రెడ్డి

05:04 PM

మమతా బెనర్జీపై విశ్వభారతి యూనివర్సిటీ విమర్శలు

04:57 PM

కెమెరామెన్‌ దేవరాజ్‌కు చిరంజీవి రూ.5 లక్షలు ఆర్థికసాయం

04:54 PM

ఐఈడీ పేలుడు..ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి గాయాలు

04:39 PM

సీఎం కేసీఆర్‌కు బూట్లు పంపి పాదయాత్రకు రావాలని షర్మిల సవాల్‌

04:27 PM

మిశ్రమంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

04:09 PM

నాన్న తర్వాత నాకు అంతటి వ్యక్తి కేసీఆరే : కుమారస్వామి

07:20 PM

కేరళలో విషాదం..కారులో మంటలు చెలరేగి దంపతులు సజీవ దహనం

04:07 PM

జులై 1న గ్రూప్‌-4 పరీక్ష..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.