Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
'ఊహలకే..ఊపిరి' పోసిన కవి హరనాథ్‌ | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Nov 13,2022

'ఊహలకే..ఊపిరి' పోసిన కవి హరనాథ్‌

           'నిరంతరం ఆమె ధ్యాసే, నిత్యం ఆమె ఊసే, ఆమెతోనే జీవితం, ఆమె లేనిదే బతుకు వ్యర్థం' ఇది నేటి యువతరం భావోద్వేగం. వాస్తవమే ప్రేమంటే ఒక ఆరాధన, హృదయంలోని ఆవేదన, అదొక ఆత్మ సంఘర్షణ. కానీ ప్రేమించినప్పుడు ఉండే సంతోషం, విడిపోయినప్పుడు ద్వేషంగా మారుతోంది. అది ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అనుభావాన్ని ఇస్తుంది. ప్రేమ విఫలమైనప్పుడు వచ్చే నిరాశ నిస్పృహలకు జీవితాలను చేజార్చుకోకుండా, వారిని చైతన్యపరచడానికే కవి హరనాథ్‌ తన కవితా సంపుటి ద్వారా ఊహలకు ఊపిరి పోశాడు. ప్రేమ, వైఫల్యాల మధ్య చిక్కుకున్న యువతరం పెడదోవ పట్టకుండా, హింసా ప్రవృత్తిని విడనాడి క్షమాగుణం కలిగి ఉండాలని ఈ పుస్తకం ద్వారా చేసిన ప్రయత్నం అభినందనీయం.
ఈ సంపుటికి కవి, సాహితీవేత్త సుధామ ముందుమాట రాశారు. కవిని వలపుటూహల శిల్పిగా పోల్చాడు. హరనాథ్‌ ఈ పుస్తకంలో 92 కవితలు పొందుపరిచాడు. దీనికి సహకరించిన అర్థాంగి ప్రేమలతకు, కుటుంబ సభ్యులకు తన ప్రేమను అక్షర రూపంలో కురిపించాడు. బహుశా హరనాథ్‌ రాసిన ఈ సంపుటిలో పాలుపంచుకున్న తన ప్రియురాలు, భార్య 'ప్రేమ'లతను కూడా ప్రశంసించాల్సిందే. ఎందుకంటే ఆమె పేరు 'ప్రేమ'లతను కవితల్లో అక్షరీకరించాడు. ఇక పుస్తకాన్ని సమీక్షిస్తే కవి ఆత్మ సంఘర్షణయే ఈ 'ఊహలకు ఊపిరొస్తే'. స్నేహం, అభిమానం, అప్యాయత, అనురాగం ఒక కడవలో పోసి రంగరిస్తే వచ్చే 'ప్రేమ' అమృతాన్ని హరనాథ్‌ తన కలంతో మరింత మృదువుగా చిలికించాడు.
'మధురమే కదా స్నేహం
ఎదలు పొంగగా,సుధలు కురియగా
ప్రణవనాద గానమై, ప్రణయ హృదయ కుసుమమై
అద్భుతమైన స్నేహ మాధుర్యం
స్నేహానికే ప్రతిరూపం' అన్నారు (13వ పేజీ కవితలో).
స్నేహానికి ఉన్న మాధుర్యాన్ని ప్రణవనాద గానంగా అభివర్ణించాడు.
'ఈ రోజు స్వేచ్ఛా స్వాతంత్య్ర దినం
నా శ్వాసతో శ్వాసయై, నా అక్షరంలో అక్షరమై
నా సాహితీ గవాక్షానికి దారులు ఏర్పర్చిందెవరో తెలుసా?
నా మనసు పొరల్లో భావ కవితా ప్రేమాగ్ని
జ్వాలలు రగిలించింది ఎవరో తెలుసా?
నా గుండెలపై అనునిత్యం సవారి చేస్తూ నను నవ్విస్తూ
లాలిస్తున్నదెవరో తెలుసా?
నా కవిత్వ దాహాన్ని తీరుస్తూ ప్రతిక్షణం, ప్రతి నిమిషం, ప్రతి శుభోదయం
నా హృదిన మల్లెల సుమ కవితా సౌరభాల్ని చల్లుతున్నదెవరో తెలుసా?' అంటూ (32) హరనాథ్‌ తన ఊహా ప్రపంచంలో విహరిస్తూ, తన కవితలకు ఊపిరి పోస్తున్నది ఎవరిని 'చెప్పరా' అంటూ ప్రశ్నించాడు. రెండు హృదయాల మధ్య జనించే అనురాగమే ప్రేమ అని అది ఎక్కడ పుట్టి, ఎక్కడ ఆగుతుందో తెలియదని, అలాంటప్పుడు విద్వేషాలు వీడి మమకారాన్ని పంచుకుంటూ ముందుకెళ్లాలని యువతరాన్ని కోరుతాడు.
'ప్రేమించే మనసు లేనిదే ఆకర్షించే అందమెందుకు?
హృదయ సౌందర్యం లేని బాహ్య సౌందర్యమేల
ఓ ధీరుడా మగధీరుడా
తరుణితత్త్వమెరిగి పెంచుకో స్నేహాన్ని, పంచుకో ప్రేమను
పుటుక్కున తెంచుకుపోయే అబల నుంచి జాగ్రత్త పడు'
అని (87వపేజీ) బీకేర్‌ కవితలో తన హృదయ స్పందనను కొద్దిగా ఘాటెక్కించాడు.స్వచ్ఛమైన ప్రేమను గుర్తించాలని, స్నేహమా, ప్రేమనా తెలుసుకోవాలని, కరుణలేని కఠిన మనసుల పట్ల జాగ్త్రతగా ఉండాలని హితువు పలికారు.
నా చెలి చిరునవ్వు, తపన, చిన్న కోరిక, మనసున్న నారాణి, హృదయ మంజరి, కనుపా పను నేనై, హృదయ నేత్రి,నే మెచ్చిన చెలి, ఆ పూల వనంలో, ఊహాసుందరి, ఏమని వర్ణించను, ఎవరివో నీవెవరివో, నెచ్చెలి లాంటి కవితల్లో కవి చక్కని సరళమైన భాష,అర్థం చేసుకునే విధంగా తన ఊహా లోకాన్ని విపులికరించాడు. తన ఆవేదన, ఆలోచనంతా దారి తప్పుతున్న యువతరాన్ని చక్కదిద్దడమే. ఈ పుస్తకాన్ని అభినందిస్తూ సమాజంలో జరుగుతున్న పరిణామాలపై హరనాథ్‌ మరిన్ని కవితలు రాయాలని ఆశిద్దాం.!
ఊహలకే ఊపిరొస్తే..
రచయిత : కె.హరనాథ్‌
పేజీలు : 92, వెల : రూ.140/-
ప్రతులకు : కె. హరనాథ్‌, ధర్మపురి కాలనీ, లింగోజిగూడ, సరూర్‌నగర్‌, హైదరాబాద్‌.
ఫోన్‌ : 9703542598

- నమిలికొండ అజయ్‌కుమార్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'
బహిరంగ ప్రకటన
అక్కెర ఉన్నంతసేపు ఆదినారాయణ....
మార్పు ఎజెండాగా ఖాజామైనద్దీన్‌ చల్లారని నిప్పు రవ్వలు
గడియ పురుసత్‌ లేదు.. గవ్వ రాకడ లేదు
క్రమ'శిక్ష'ణ గల 'హాస్టల్‌ లైఫ్‌'
ల‌త్కోర్ సాబ్‌
బాల సాహితీస్ఫూర్తి 'డాక్టర్‌ కపిలవాయి లింగమూర్తి'
విలక్షణ కథల సమాహారం నిరుడు కురిసిన వెన్నెల
ల‌త్కోర్ సాబ్‌
తెలుగు పిల్లలకు 'వచ్చేవచ్చే రైలుబండి' పాటనిచ్చిన గంగదేవు యాదయ్య
ల‌త్కోర్ సాబ్
బాల సాహితీ వికాసంలో సిద్ధిపేట పూదోట 'పెందోట'
రేపటి కథకులకు 'కాలిబాటలు' వేసిన డా|| స్వామి
బాలల కథల ఊడలమర్రి 'రామకృష్ణ పైడిమర్రి'
ఎలుకా క్షేమమా...
గుండె సొద బొమ్మ కట్టిన కథలు
శిథిల వసంతంలో తెలుగు గజళ్ళు గానించిన బిక్కి కృష్ణ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
ల‌త్కోర్ సాబ్
ఊరితో అనుబంధాలకు అద్దం 'మైదాకు వసంతం'
సూర్యచంద్రులు!
బాలల నాటికల సృష్ట 'దుప్పల్లి శ్రీరాములు'
ల‌త్కోర్ సాబ్‌
మౌన పాఠాలు చెప్పే జ్యోతిర్మయి కథలు
ల‌త్కోర్ సాబ్‌
ఓ జర్నలిస్ట్‌ స్ట్రింగ్‌ ఆపరేషన్‌ 'కమల'
గిరిజన పిల్లల ఆత్మబంధువు 'సమ్మెట ఉమాదేవి'

తాజా వార్తలు

12:18 PM

తుర్కియేలో చలికి తట్టుకోలేక ఏంచేస్తున్నారంటే ...

12:16 PM

సింగ‌రేణి కోసం ఉద్య‌మానికి శ్రీకారం చుడుతాం: కేటీఆర్

12:07 PM

తొలి టెస్టు.. ఆస్ట్రేలియా 76/2

11:59 AM

అవును.. లోపాలున్నాయి: తుర్కియే అధ్యక్షులు ఎర్డోగాన్‌

11:56 AM

నలుగురు చిన్నారుల సజీవ దహనం..

11:39 AM

భూప్రళయంలో 15వేలు దాటిన మరణాలు..

11:07 AM

డిస్నీలో ఏడు వేల మంది ఉద్యోగుల తొలగింపు..

10:43 AM

బడ్జెట్‌ లైవ్‌ టెలికాస్ట్.. యూనిర్సిటీలకు ప్రభుత్వం ఆదేశం

10:38 AM

ఆయిల్‌ ట్యాంకర్‌లో దిగి ఏడుగురి మృతి..

09:49 AM

తొలి టెస్టులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్‌ బౌలింగ్‌

09:39 AM

రోడ్డుప్రమాదంలో చిరుత మృతి..

09:25 AM

నేడు హైదరాబాద్‌ సీబీఐ కోర్టు వివేకా హత్య కేసు నిందితులు..

08:59 AM

నేటినుంచి శాసనసభలో బడ్జెట్‌ పద్దులపై చర్చ..

08:45 AM

అనాథ యువతిపై వాలంటీర్ లైంగికదాడి..

08:13 AM

నగరంలో ఇంకో 10 రోజులపాటు తప్పని ట్రాఫిక్‌ కష్టాలు..

08:00 AM

తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఏసీ కోచ్‌లో చెలరేగిన మంటలు

07:47 AM

ఎంసెట్ సిలబస్‌పై రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీల‌క సూచ‌న‌..

07:24 AM

సరోగసీపై న్యాయస్థానానికి కేంద్రం వివ‌ర‌ణ‌..

07:01 AM

తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లకు పదోన్నతులు..

06:31 AM

నేటి నుంచి విజయవాడలో పుస్తక మహోత్సవం..

06:19 AM

భార్య మృతదేహాన్ని భుజాన మోసుకెళ్లిన భర్త

09:55 PM

దేశంలోనే ‘ఎలక్ట్రిఫైడ్‌’ స్టేట్‌గా తెలంగాణ : కేటీఆర్

09:42 PM

పోలీస్‌ కస్టడీలో గత ఐదేళ్లలో 669 మంది మృతి : కేంద్ర హోం శాఖ

09:20 PM

అదానీని ప్రధానినే రక్షిస్తున్నాడు : రాహుల్‌ గాంధీ

08:56 PM

దేశంలో తొలిసారి తల్లిదండ్రులైన.. ట్రాన్స్‌జెండర్ జంట

08:24 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై సీఎస్‌కు లేఖ రాసిన సీబీఐ..

08:05 PM

జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీయాలి..

06:55 PM

తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం..

06:21 PM

బీజేపీ ప్ర‌భుత్వం ఎందులో సక్సెస్ అంటే : మంత్రి హ‌రీశ్‌రావు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.