Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ల‌త్కోర్ సాబ్‌ | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Nov 27,2022

ల‌త్కోర్ సాబ్‌

మహామంత్రి లత్కోర్‌కు వాస్తు మీద నమ్మకముంది. ఇల్లూ, తలుపులూ, కిటికీలూ వాస్తు ప్రకారమే ఉండాలంటాడు. వాస్తు బాగులేదంటూ ఇండ్లను మార్చాడు. ఆఖరికి వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకొన్నాడు. అంతేకాదు డైనింగ్‌ టేబుల్‌ మీద కంచమూ, గ్లాసూ వాస్తు ప్రకారమే ఉండేలా చూసుకొంటాడు.
డిగ్రీ కోర్సుల్లో వాస్తునూ, జ్యోతిష్యాన్నీ మహామంత్రి ప్రవేశపెట్టాడు. జ్యోతిష్యంలో చిలక జ్యోతిష్యమూ, కోయ జ్యోతిష్యమూ, హస్తసాముద్రికమూ, సోది వంటి సబ్జెక్ట్‌లుంటాయి. వీటిలో పరిశోధన చేసిన వారికి డాక్టరేట్‌ డిగ్రీ ఇస్తారు. జ్యోతిష్యంలో డిగ్రీ సాధించిన వారికి స్వయంగా ఉపాధి పథకం కింద రుణాలిస్తారు. చిలుక జ్యోతిష్యులకు చిలుకల్ని ఇస్తారు.
జ్యోతిష్యరత్న విద్వాన్‌ వినాయకరావును ఆస్థాన జ్యోతిష్యునిగా నియమించారు. ఆయనగారు ఒక పంచాంగాన్ని రాసారు.
బొచ్చెపార్టీ సర్కార్‌ పాలనలో రాష్ట్రం మూడు బార్లు ఆరు వైన్‌ షాపులుగా వర్థిల్లుతుంది. వొచ్చేసారి కూడా బొచ్చె సర్కారే వొస్తుంది. లత్కోరే మహామంత్రి అవుతాడు. భూమ్మీదకు భగీరథుడు గంగను తీసుకొచ్చినట్టు రాష్ట్ర రాజధానికి సముద్రాన్ని తీసుకొస్తాడు. యాగాలు చేస్తాడు. ఇండ్లకూ, ఆఫీసులకూ పచ్చరంగు వేసి రాష్ట్రాన్ని బంగారు రాష్ట్రంగా మారుస్తాడు. అమ్మో నగరంలో పడవ సర్వీసుల్ని ప్రారంభిస్తాడు. చెత్త కుప్పలతో ఆ నగరం అందాన్ని పెంచుతాడు. పాన్‌డబ్బాలు పెట్టుకోవడానికి రుణాలు ఇప్పిస్తాడు. పాన్‌ మరకలతో రోడ్లను అలంకరించమంటాడు. అసెంబ్లీ ముందు లత్కోర్‌ కాంస్య విగ్రహాన్ని పెడతాడు. బైరూపులకు పెద్ద పీట వేస్తారు. లత్కోర్‌ పురాణం చెప్పిస్తారు.
తుల : ఈ ఏడాది ఈ రాశి వారికి ఆదాయం ఆరు. వ్యయం నాలుగు రాజపూజ్యం నాలుగు. అవమానం ఆరు. శని వక్ర దృష్టి వల్ల మార్చిలో ఈ రాశివారికి పిచ్చికుక్క కరిచే ప్రమాదముంది. ఈ ప్రమాదం తప్పా లంటే రోజూ నిష్టగా కాలభైరవాష్టకం చదువు కోవాలి. వీధి కుక్కలకు బిస్కెట్లు పెట్టాలి. జూన్‌లో పోట్లాడి భార్య పుట్టింటికి పోతే తామే వండుకొని తింటారు. కూరలో కారమెక్కు వేస్తారు. పప్పులో ఉప్పు వేయడం మరిచిపోతారు. అన్నం పలుకవుతుంది. హోటల్‌లో తిందామను కుంటే అది మూసి ఉంటుంది. అరటి పండ్లు తిని నీళ్లు తాగ పడుకొంటారు.
సింహం : ఈ రాశి వారు ఆఫీసర్‌ను చూడగానే గ్రామసింహంలా తోక ఊపుతారు. ఆదాయానికి మించి ఖర్చు పెడతారు. అందిన కాడికి అప్పులు చేస్తారు. దగ్గరి దారిలో డబ్బు సంపాదించడానికి పేకాడతారు. బికారుల వుతారు. బొచ్చె పట్టుకొని అడుక్కొంటారు. మలేరియా వల్ల మంచం పడతారు. అప్పటి నుంచీ దోమలు మీద ద్వేషం పెంచుకొంటారు.
మేషం : ఈ రాశి వారికి ఈ ఏడాది కలిసొస్తుంది. పట్టుకున్నదల్లా బంగారమవుతుంది. పెళ్లాం చనిపోతే మళ్లీ పెండ్లి చేసుకొంటారు. మీ రెండో పెండ్లాం పక్కింటి కుర్రాడితో లేచిపోతుంది. జీవితం మీద విరక్తి చెంది సన్యాసవుతారు. కాశీకెళతారు. ప్రవచనాలు వింటూ కాలం గడుపుతారు. గంగలో మునిగి కాలం చేస్తారు. బతికున్నప్పుడే మీ తద్దినం మీరే పెట్టుకొంటారు.
వృషభం : వీరు ఎద్దులా పని చేస్తారు. ఏ పని లేకపోతే పిల్లి బుర్ర గొరుకుతారు. కుక్కతోక వంకర తియ్యడానికి ప్రయత్నిస్తారు. అప్పడాలు, వడియాల వ్యాపారంలోకి దిగుతారు. మీ గుమ్మడి వడియాలకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంటుంది. ఉల్లిగడ్డల పొట్టుతో ఉల్లిరేకులనే స్వీటు తయారు చేస్తారు. చేమ దుంపలతో చేగోడీలూ, కాకరకాయలతో బజ్జీలూ, ఆనపకాయలతో హల్వా చేసి అమ్ముతారు. పాకశాస్త్ర ప్రవీణ అనే బిరుదు మీకొస్తుంది.
మకరం : ఈ రాశి వారికి ఈ ఏడాదిలో ఆదాయం ఎనిమిది వ్యయం కూడా ఎనిమిదే. రాజప్యూజం మూడు, అవమానం రెండు. వీరి పూర్వీకులకు బిచ్చగాళ్లు. వీరి ఇండ్లల్లో రకరకాల బొచ్చెలుంటాయి. బొచ్చె పార్టీ కార్యకర్తలకు బిచ్చమెత్తడంలో వీరు శిక్షణిస్తారు. బిచ్చమెత్తడంపై పరిశోధక గ్రంథం ప్రచురిస్తారు. ఆ పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డు వస్తుంది. లక్ష రూపాయలతో బొచ్చె సర్కార్‌ సన్మానిస్తుంది. కంచర గాడిదపై ఊరేగిస్తుంది.
కన్య : ఈ ఏడాది ఈ రాశి వారి ఆదాయం ఆరు. వ్యయం ఎనిమిది. గుర్రప్పందాలు ఆడి బికారులవుతారు. మందుకొడతారు. యాక్సిడెంట్‌ అవడంతో వీరికి వాహన యోగం పడుతుంది. ఆస్పత్రి పాలవుతారు. అక్కడ నర్సుతో ప్రేమలో పడతారు. పిల్లల్ని కంటారు. ఒక పిల్లాణ్ని దత్తత ఇచ్చి ధనికులవుతారు. సినిమాలు తీస్తారు. అవి ప్లాప్‌ కావడంతో రోడ్డున పడతారు.
కుంభం : ఈ రాశి వారు ఈ ఏడాది మొదటి ఆర్నెల్లలో కష్టాల పాలవుతారు. తగిలిన చోటే మళ్ళీ మళ్ళీ దెబ్బ తగులుతుంది. కొబ్బరి కాయల వ్యాపారం చేసి నష్టపోతారు. అప్పులెగ్గొడ్తారు. ఎవరికీ కనిపించకుండా దేశాలు పట్టిపోతారు. దొంగతనాలు చేసి జైల్లో పడతారు. జైలు నుంచి తప్పించుకోబోయి దొరికి పోతారు. పోలీసులతో తన్నులు తింటారు. జూన్‌లో జైలు నుంచి విడుదలవుతారు. కూలీ నాలీ చేసుకొని బతుకుతారు.
మిథునం : వీరు ఈ ఏడాది అందరితో అకారణంగా పోట్లాడుతారు. కొట్లాడి పెళ్లాం పుట్టింటికి పోతుంది. అక్కడే ఓ పిల్లాడికి జన్మనిస్తుంది. వాణ్ని హాస్టల్‌లో ఉంచి చదివిస్తారు. పెద్దయ్యాక వాడు ఇంజనీరవుతాడు. పై చదువులకు అమెరికా వెళతాడు. చదువయ్యాక ఉద్యోగం సంపాదించి అక్కడే సెటిల్‌ అవుతాడు. మిమ్మల్ని వృద్ధాశ్రమంలో ఉంచుతాడు. అక్కడే మీరు హరీమంటారు.
మీనం : ఈ రాశి వారికి ఈ ఏడాదిలో ఆదాయం నాలుగు. వ్యయం ఐదు. రాజపూజ్యం మూడు. అవమానం నాలుగు. వీరు ఆఫీసులో పులిలా ఉంటారు. ఇంట్లో పిల్లిలా ఉంటారు. వీరికి జుట్టు రాలి బట్టతల వొస్తుంది. పెరట్లోని కొబ్బరి చెట్టు మీద నుంచి ఓ కొబ్బరి కాలి రాలి బట్టతల మీద పడుతుంది. తల పగిలి స్పృహ తప్పుతారు. పిచ్చెక్కుతుంది. దాంతో వీరిని పిచ్చాస్పత్రిలో చేరుస్తారు. పిచ్చి కుదిరి రోకలి తల చుట్టుకొంటారు. రోకలి తలచుట్టుకొన్న మనిషి రోడ్డున పడ్డాడు అని వీరి మీద సినిమా తీస్తారు. ఈ సినిమాకు అవార్డు కూడా వస్తుంది.
వృశ్చికం : ఈ ఏడాదిలో ఈ రాశివారికి ఆదాయం ఆరు. వ్యయం కూడా ఆరే. మార్చిలో వీరికి స్థిరాస్థి లభిస్తుంది. పక్కింటివాళ్లు బదిలీ మీద వెళ్లిపోతూ రుబ్బురోలు ఇచ్చిపోతారు. బాత్రూమ్‌లో జారి పడటంతో చెయ్యి విరుగుతుంది. కొత్తూరుకెళ్లి కట్టు కట్టించుకొంటారు. చెంచాతో అన్నం తింటారు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోబోతుంటే దీపం చేజారి ఇల్లంటుకొంటుంది. మీ బట్టలు కాలి బూడిదవడంతో గోచీ పెట్టుకొని తిరుగుతారు. గోచేశ్వర్‌గా పేరు పొందుతారు.
కర్కాటకం : ఈ రాశి వారికి ఈ ఏడు ఆర్నెల్లు కష్టాలుంటే ఆర్నెల్లు సుఖాలుంటాయి. వీరికి నీటి గండముంది. గండం తప్పాలంటే నెల రోజుల పాటు వరుణ జపం చెయ్యాలి. చెంబులో తుంగభద్ర నీళ్లను తీసుకెళ్లి గంగా నదిలో కలపాలి. కష్ణా, గోదావరి నీళ్ళను నెత్తి మీద జల్లుకోవాలి. రోజూ తెల్లవారుజామునే లేచి తలస్నానం చెయ్యాలి. పది మందికి మినరల్‌ వాటర్‌ బాటిళ్లు పంచాలి. వీరు నాటకాల్లో వేషం కడతారు. సినిమా ఛాన్స్‌ల కోసం ప్రయత్నిస్తారు. ఎవరూ చదవని ఆత్మకథ రాస్తారు.
ధనస్సు : ఈ ఏడాది ఈ రాశి వారికి ఆదాయం రెండు. వ్యయం నాలుగు. రాజ పూజ్యం సున్నా. అవమానం ఆరు. ఎండా, వానల్లాగా వీరికి కష్టసుఖాలొ స్తాయి. కష్టాలొచ్చినప్పుడు కుంగి పోతారు. గుడికెళ్లి పూజలు చేస్తారు. సుఖాలొచ్చినప్పుడు పొంగిపోతారు. క్లబ్‌కెళతారు. మందుకొట్టి కారు నడుపుతూ యాక్సిండెంట్‌ చేస్తారు. వీరి మీద కేసు వేస్తారు. ఆ కేసు ఆర్నెల్ల పాటు నడుస్తుంది. వాళ్లనూ వీళ్లనూ పట్టుకొని ఎలాగో కేసు నుంచి బయటపడతారు.
లిలిలిలిలిలి
ఆది ప్రభుత్వ గోదాము
అందులో బియ్యం బస్తాలు
ఆ బస్తాల్లో ముక్క బియ్యం
ఆ గోదాములో ఎలుకలు
అందులో అవి స్వేచ్ఛగా తిరుగుతుంటాయి.
ఆ రోజు ఎలకలన్నీ సమావేశమయ్యాయి. పెద్ద ఎలుకలూ, చిట్టెలుకలూ, చుంచెలకలూ, పందికొక్కులూ ఆ సభకొచ్చాయి.
వినాయకుని వాహనమైన మూషికరాజం ఆ సమావేశానికి అధ్యక్షత వహిస్తుంది.
'ఆ ఎలకలా నేను లావుగా ఎన్నడవుతాను?' అని ఒక చిట్టెలుక తల్లినడిగింది.
'మహామంత్రిలా ఏదిబడితే అది తింటే లావైతావు' అని తల్లి ఎలక అంది.
'ఆయనంతలా తింటాడా?'
'అవును తినడం వల్ల ఆయన బొర్ర పెరిగింది. ఆయాస పడుతూ నడుస్తాడు. పదవిలో ఆయనుండగానే పదిరాళ్లు వెనకేసుకోవడానికే ప్రయత్నిస్తున్నాడు'
'వెనక కాకుండా కడుపులో వేసుకొంటున్నాడేమో?'
తల్లి ఎలక నవ్వింది. తోకతో చిట్టెలకను ఆప్యాయంగా నిమిరింది.
వెనకేసుకొంటే ఎవరి కంటనైనా పడే ప్రమాదమున్నది. స్విస్‌ బ్యాంక్‌లో దాచుకొంటే ఎవరి కంటా బడదు. ఇక నోరు మూసుకొని మూషిక రాజ్యం మాటలు విను.'
'మహామంత్రి లత్కోర్‌ పాలనలో మీరు సుఖంగా ఉన్నారా?' అని మూషిక రాజం అడిగింది.
'గోదాములోని బియ్యం ముక్కిపోయాకే, పురుగులు పట్టాకే రేషన్‌ దుకాణాలకు పంపుతారు. రూపాయికి కిలో లెక్కన జెనాలకు అమ్ముతారు. మంచి బియ్యం మా పాలబడుతున్నది. ఆ బియ్యం తినడం వల్ల పిల్లాజెల్లలతో హాయిగా, ఆనందంగా నవ్వుతూ తుళ్లుతూ బతుకుతున్నాం' అని ఒక ఎలక చెప్పింది.
'భేష్‌ భేష్‌ లత్కోర్‌ మహామంత్రి తింటాడు తింటాడంటున్నారు. ఎలా తింటాడు'
'ఆయన తినే తరీకలగుంటది'
'వామ్మో కొంపలు ముంచడమంటే ఇదేనేమో'
'కొంపల్ని కాదు, రాష్ట్రాన్ని'
'కేవలం మహామంత్రేనా? మంత్రులు కూడానా?'
'ఆ! మంత్రులు కూడా. ఒక మంత్రి వేసిన రోడ్డునే మళ్ళీ మళ్ళీ వేయిస్తుంటాడు.'
ఎలక ఇంకేమో చెప్పబోతుంటే పెళ్లాం పెట్టింటికెళుతుంటే అడ్డుకొన్న మొగుడిలా మూషిక రాజం అడ్డొచ్చి-
'ఒక సారి వేయించిన రోడ్డును మళ్ళీ మళ్ళీ వేయించడమెందుకు?' అని అడిగింది.
'ఒకసారి వేయించిన రోడ్డు మూణ్ణెల్లకే అడ్రస్‌ లేకుండా పోతున్నది'
'చిత్రంగా ఉందే'
'ఇంకొక మంత్రి ఈ మధ్య నకిలీనోట్ల కుంభకోణంలో పట్టుబడ్డాడు. అతణ్ణి సౌరాష్ట్ర పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు.'
'ఇదేమటని ఎవరూ మహామంత్రి లత్కోర్‌ను అడగలేదా?'
'ఎందుకడగలేదు. అడిగారు.'
'అడిగితే ఏమన్నాడు?'
'మా మంత్రి అమాయకుడు. అతణ్ని సౌరాష్ట్ర పోలీసులు అరెస్ట్‌ చెయ్యలేదు. ఆ రాష్ట్రంలోని జైళ్లు ఎలా ఉంటాయో చూసి రమ్మని నేనే పంపాను. అక్కడి జైళ్ళను చూసి రావడానికి అతనికి కొన్ని నెలలు పట్టొచ్చని అన్నాడు'
'అబ్బో ఆయనగారి ముత్యాల మూట. బంగారు గొలుసు పేట చిరురాకులు తిని కోకిల పాడే సుమధుర పాట'
'ఈ మూషిక రాజం తన జ్ఞానాన్ని ఒలకబోస్తున్నాడు' అని ఎలకలు మనసులో అనుకొన్నాయి.
సందట్లో సడేమయా ఆవారా ఎలక ఆడ ఎలకలకు లైట్‌కొట్టే పని లో పడింది. ఒక ఆడ ఎలకను ముద్దు పెట్టుకోబోతే అది దూరంగా జరిగింది.
'మర్యాదగా ముద్దుపెట్టుకోనిస్తావా? లేక నిన్ను కిడ్నాప్‌ చెయ్యమంటావా?'
'నేను అందరిలాంటి దాన్ని కాను. నాకు బరాటా వచ్చు. తోకతో కొట్టానంటే చచ్చూరుకొంటావు'
ఎలాగైనా మరో వయ్యారి ఎలకను బుట్టలో వేసుకోవాలని ఆవారా ఎలక అనుకొంది. మరో ఎలక సుందరి పక్కన చేరింది.
'దగ్గరకు రాకు' అని ఎలక సుందరి అన్నది.
'ఎందుకు రావొద్దు?'
'నీకు ఎయిడ్స్‌ అట కదా'
'ఎవరు చెప్పారు?'
'ఒకరేమిటి అందరూ అనుకొంటున్నారు'
'పిచ్చిదానా రోజుకో అప్సరసతో తిరిగే ఇంద్రునికి ఎయిడ్స్‌ వచ్చిందా?' ఆయనకే రానప్పుడు నాకెలా వస్తుంది'
'కథలు చెప్పకు'
'కథలు చెప్పడానికి నేనేమైనా మంత్రినా?'
'దగ్గరికి రావొద్దంటే వినవెందుకు? పెద్దగా అరుస్తాను. నలుగురూ వచ్చి నిన్ను తంతారు'
'ఈ గోదాము వాస్తు బాగులేదో, నేను లేచిన వేళ బాగులేదో కాని ఇవాళ ఒక్క ఎలకా బుట్టలో పడలేదు' అని ఆవారా ఎలక అనుకొన్నది.
-తెలిదేవ‌ర భానుమూర్తి
 99591 50491
తరువాయి వచ్చేవారం....

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'
బహిరంగ ప్రకటన
అక్కెర ఉన్నంతసేపు ఆదినారాయణ....
మార్పు ఎజెండాగా ఖాజామైనద్దీన్‌ చల్లారని నిప్పు రవ్వలు
గడియ పురుసత్‌ లేదు.. గవ్వ రాకడ లేదు
క్రమ'శిక్ష'ణ గల 'హాస్టల్‌ లైఫ్‌'
ల‌త్కోర్ సాబ్‌
బాల సాహితీస్ఫూర్తి 'డాక్టర్‌ కపిలవాయి లింగమూర్తి'
విలక్షణ కథల సమాహారం నిరుడు కురిసిన వెన్నెల
ల‌త్కోర్ సాబ్‌
తెలుగు పిల్లలకు 'వచ్చేవచ్చే రైలుబండి' పాటనిచ్చిన గంగదేవు యాదయ్య
ల‌త్కోర్ సాబ్
బాల సాహితీ వికాసంలో సిద్ధిపేట పూదోట 'పెందోట'
రేపటి కథకులకు 'కాలిబాటలు' వేసిన డా|| స్వామి
బాలల కథల ఊడలమర్రి 'రామకృష్ణ పైడిమర్రి'
ఎలుకా క్షేమమా...
గుండె సొద బొమ్మ కట్టిన కథలు
శిథిల వసంతంలో తెలుగు గజళ్ళు గానించిన బిక్కి కృష్ణ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
ల‌త్కోర్ సాబ్
ఊరితో అనుబంధాలకు అద్దం 'మైదాకు వసంతం'
సూర్యచంద్రులు!
బాలల నాటికల సృష్ట 'దుప్పల్లి శ్రీరాములు'
ల‌త్కోర్ సాబ్‌
మౌన పాఠాలు చెప్పే జ్యోతిర్మయి కథలు
ల‌త్కోర్ సాబ్‌
ఓ జర్నలిస్ట్‌ స్ట్రింగ్‌ ఆపరేషన్‌ 'కమల'
గిరిజన పిల్లల ఆత్మబంధువు 'సమ్మెట ఉమాదేవి'

తాజా వార్తలు

03:13 PM

ఇన్‌ఫెక్షన్‌కు కారణమైన.. ఐ డ్రాప్స్‌ తయారీపై సస్పెన్షన్‌

02:57 PM

ప్రముఖ సినీ గాయని మృతి..

02:27 PM

పాకిస్థాన్‌లో వికీపిడియా సర్వీసులు బ్లాక్..

02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

10:26 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

09:48 AM

ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం..

12:12 PM

హైదరాబాద్‌ లో మరో భారీ అగ్ని ప్రమాదం..

09:16 AM

మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్

09:03 AM

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

08:51 AM

బోల్తాపడిన డీసీఎం.. ఇద్దరు మృతి

08:50 AM

మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుంది : మంత్రి ఇంద్రకరణ్

08:27 AM

తిరుమలలో భక్తుల రద్దీ..

09:33 AM

మణిపూర్‌లో 4.0 తీవ్రతతో భూకంపం..

07:57 AM

‘గడపగడపకు’ కార్యక్రమంలో స్థానికుడిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే..!

07:50 AM

విజయ్, లోకేశ్‌ కనగరాజ్‌ 'లియో'.. టైటిల్‌ ప్రోమో అదిరింది

07:22 AM

అఫ్రిది కుమార్తెతో ఘనంగా షాహిన్ అఫ్రిది వివాహం..

07:14 AM

బస్సు దిగి పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్..

07:07 AM

మనం ఫ్రెండ్స్ కాదు..బ్రదర్స్ అంతకన్నా కాదు..'అమిగోస్' ట్రైలర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.