Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Dec 25,2022

తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ

              ఒకరు ఒక రంగంలో ప్రతిభావంతులై నిలవడం, ఆ రంగంలో అంచులు ముట్టడం చూస్తాం. మరి కొందరు వివిధ రంగాల్లో తమదైన ఆసక్తితో వెలగడమేగాక అన్నింటిని సమానంగా చేపట్టి రాణిస్తారు. ఈ కోవలోనే మనకు రచయిత్రి, కవయిత్రి, విమర్శకురాలు, బాల సాహితీవేత్తగా డాక్టర్‌ అమరవాది నీరజ కనిపిస్తుంది. 31 జులై 1966 న వరంగల్‌లో పుట్టిన నీరజ ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. అమ్మానాన్నలు హైమవతి, డాక్టర్‌ ఎ.సి.ఎమ్‌.ఎల్‌. ప్రసాద్‌. బాల్యమంత హైదరాబాద్‌ నగర కేంద్ర గ్రంథాలయం సమీపంలోని చిక్కడపల్లిలో గడపడం వల్ల అక్కడి పుస్తకాలతో సాన్నిహిత్యం ఒకవైపు, ఒళ్ళో కూర్చోబెట్టుకుని అమ్మ చెప్పిన కథలు మరోవైపు బాల్యం నుండే నీరజలో సాహిత్యం పట్ల ఆసక్తిని కలిగించాయి. తొలికథ విద్యార్థినిగా ఉన్న ఆంధ్ర మహిళా సభ కళాశాల సంచికలో అచ్చయ్యింది.
               బాల సాహిత్యాన్ని ఎంత నిబద్ధతతో రాస్తుందో అదే విధంగా విమర్శను, ఇతర సాహిత్య ప్రక్రియలను చేపట్టి సఫలం అయ్యింది అమరవాది నీరజ. కవిత్వం, గేయాలు, కథలు, వ్యాసాలు, నాటికలు రాసి మెప్పించిన హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ., ఎం.ఫిల్‌., పిహెచ్‌.డి చేశారు. నీరజ ఆధునిక సాహిత్యంతో పాటు సంప్రదాయ సాహిత్యాన్ని అధ్యయనం చేసిన నీరజ పొన్నెగంటి తెలగన అచ్చతెలుగు కృతి 'యయాతి చరిత్రలో తత్సమ, తద్భవాలు' అంశంపై ఎం.ఫిల్‌ పరిశోధన చేసింది. తరువాత హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోనే 'ప్రతిభ-ఇమాజి నేషన్‌, తులనాత్మక పరిశీలన' అంశంపై సాధికారిక పిహెచ్‌.డి పరిశోధన చేసింది.
చందాల కేశవదాపు, బాపు రమణలతో పాటు చలం, శ్రీశ్రీలకు నేను శిష్యురాలిని అని గర్వంగా చెప్పుకునే విస్తృత చదువరి అమరవాది నీరజ. తన చిన్నారి కూతురుకు అనేక సంఘటనలను కథలుగా బాల్యం నుండి వినిపిస్తూ వచ్చిన నీరజ ఇప్పుడు వేలాది మంది బాలబాలికల కోసం రాస్తోంది. బాలల విద్య విషయంలో ప్రపంచమంతా అంగీకరిచి ఆచరిస్తున్న విధానం మాంటిసోరి. నీరజ ఆసక్తితో 'మాంటిసోరి ట్రైనింగ్‌' పూర్తిచేశారు. తాను అమెరికాలో నివాసమున్న కాలంలో అక్కడి తెలుగు పిల్లలు, ఇతరులకు మాంటిసోరి ఫిలాసఫీ నేపథ్యంగా కథలు చెప్పి, తరువాత బాలల కోసం పుస్తక రూపంలో తెచ్చింది. బి.ఎడ్‌ చదివి విద్యా మనస్తత్వ్త శాస్రం అధ్యయనం కూడా చేసింది. అవన్నీ తన రచనలకు మూల భూమికగా పరుచుకుని బాలల కోసం చక్కని కథల కానుకలను అందించింది. బాలగోకులం 'బాలనేస్తం', 'అంగలకుదుటి సుందరాచారి జాతీయ పురస్కారం', 'మంచిపల్లి సత్యవతి కథా బహుమతి', సహాయ ఫౌండేషన్‌ లక్ష్మీదేవి అవార్డు వంటివి నీరజకు లభించిన పురస్కారాలు.
పిల్లల కోసం నీరజ చెప్పిన కథలు 'తేనె చినుకులు'గా పిల్లలకు అందాయి. ఈ తేనె చినుకులన్నీ బాలల మనస్తత్వానికి, ఆలోచనలకు, హాయిగా చదువుకునేందుకు రాసిన కథలు. నీతికన్నా బాలలకు ఆనందాన్నివ్వడమే బాల సాహిత్య ప్రధాన లక్ష్యమని నమ్మిన వాళ్ళలో నీరజ ఒకరు. అందుకే ఆమె కథలు ఆ కోవలోనే నడుస్తాయి. బాల సాహితీవేత్తగా పిల్లలకు నీరజ అందించిన రెండవ కానుక 'చిరుకానుక'. ఇందులోని కథలన్నీ అచ్చంగా బాలలకు కానుకలే. ఈ పుస్తకాన్ని 2014లో అంతర్జాతీయ బాలికల సంవత్సరం సందర్భంగా తీసుకు వచ్చారు రచయిత్రి. ఇదే సంవత్సరం మలాలాకు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పనిచేస్తున్న కైలస్‌ సత్యార్థిలకు నోబెల్‌ శాంతి బహుమతి కూడా లభించింది. వీటన్నిటి సందర్భంగా బాలలకు 'అక్షరాభ్యాస కానుక' తన చిరుకానుక అని చెప్పిన నీరజ బాలలకు కథా సాహిత్యాన్ని అందుబాటులో ఉంచితు భాష నేర్చుకుంటారని నమ్ముతుంది. ఒక రకంగా ఈ సృజన కార్యం భాషా సేవే అంటారామె. తన కథలో వివిధ అంశాలను పిల్లలకు పరిచయం చేయడం నీరజకు తెలిసిన విద్య. ఒక కథలో వేరుశెనగలు, చిక్కుడుగింజలు ఉదాహరణగా భూమి లోపల పండే శనగలు, పైన పండే చిక్కుడు పోషకాల విషయంలో ఒకటే అని తెలిపితే, మరో కథలో బయటి పని, ఇంట్లో చేసే పని సమానమే అంటారు. ముఖ్యంగా వైకల్యం ఉన్నవారిని ఎలా చూడాలో చెబుతూ స్పీచ్‌థెరపీ విధానాన్ని పరిచయం చేస్తూ ఒక కథ రాసింది నీరజ. అంతేకాకా ఆన్‌లైన్‌ మోసాల నుండి డ్రగ్‌ మాఫఙయా వరకు అన్నింటిని పిల్లలకు తెలిసే విధంగా చెబుతుంది నీరజ. కథే కాదు బాల గేయాల రచనల లోనూ నీరజది అందెవేసినచేయి. 'అమ్మ జోలపాటల రాగాలు మాకోసమే/ ...తాత పోగోట్టుకున్న బాల్యం నేనే' అంటూ రాసిన నీరజ బాలలను ఒక గేయంలో 'జ్ఞానసూర్యులు' అంటుంది. పలు ప్రక్రియల్లో రచనలు చేసినా బాలల కోసం కథ, గేయం, నాటిక రాసిన నీరజ త్వరలో 'ఏడు రంగుల జండా'ను బాల కథల కానుకగా అందించనుంది. బాలల భవిత బంగారు మయం కావాలని నిరంతరం తపించే ఆశావాది డా. నీరజ అమరవాది.

- డా|| పత్తిపాక మోహన్‌, 9966229548

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బహుభాషా జాతీయస్థాయి కవి సమ్మేళనంలో నెల్లుట్ల సునీతకు ఘనసత్కారం
ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం...
బాల సాహిత్యాన్ని కవితా చిత్రాలతో సుసంపన్నం చేస్తున్న గృహలక్ష్మి 'ఎడ్ల లక్ష్మి'
కదిలే బొమ్మల కథ
సాదత్‌ హసన్‌ మంటు కథల సంపుటి - అనార్కలి..
సిద్ధిపేట బాల సాహితీవేత్త, వికాస కార్యకర్త ఉండ్రాల రాజేశం
జీవితానుభవాల సమాహారం 'రాల్లకుచ్చె'
నోరు మంచిది అయితే ఊరు మంచిది అయితది
అరుదైన వ్యక్తిత్వమున్న ఓ స్త్రీ కథ ''పుదు వసంతం''
కథకుల కరదీపిక
నీలి గోరింట...
ఆధునిక పంచతంత్రం
ఊరి సామెత
బాల సాహిత్యంలోనూ ఘనాపాటి రేగులపాటి కిషన్‌రావు
శారీరక అవసరాలు, నీతి సూత్రాల మధ్య నలిగిపోతున్న ఆధునిక స్త్రీ కథ నాతి చరామి
సకలకళా వల్లభి సారంగి
బాలల భక్తి సాహిత్య పరిశోధకుడు డా. గౌరవరాజు సతీష్‌కుమార్‌
మా అవ్వగారి కొడవలి అయితే...
గజదొంగ గంగన్న
పిల్లల 'చిట్టి కథ'ల ఆసామి 'తిరుమల వెంకటస్వామి'
అరవై ఏళ్ళనాటి రంగనాయకమ్మ నవల కృష్ణవేణిపై పునర్విమర్శ
ఇటెటు రమ్మంటే ఇల్లంత నాదే అన్నడట
స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'
బహిరంగ ప్రకటన
అక్కెర ఉన్నంతసేపు ఆదినారాయణ....
మార్పు ఎజెండాగా ఖాజామైనద్దీన్‌ చల్లారని నిప్పు రవ్వలు
గడియ పురుసత్‌ లేదు.. గవ్వ రాకడ లేదు
క్రమ'శిక్ష'ణ గల 'హాస్టల్‌ లైఫ్‌'
ల‌త్కోర్ సాబ్‌

తాజా వార్తలు

09:37 AM

సిట్ ముందు హాజరుకానున్న రేవంత్..

09:19 AM

బస్సును ఢీకొన్న కారు..ఇద్దరు దుర్మరణం

08:57 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

08:52 AM

ఫేక్ న్యూస్ సమాజానికి చాలా ప్రమాదకరమైనవి : జస్టిస్ డీవై చంద్రచూడ్

08:42 AM

దేశంలో గృహ హింస కేసులు..రెండో స్థానంలో తెలంగాణ

08:23 AM

భర్తపై క్షుద్ర పూజలు చేయించిన భార్య..

08:05 AM

టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ముగ్గురికి గ్రూప్‌-1లో 120కి పైగా మార్కులు

08:42 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

07:50 AM

మొదటి రోజే కలెక్షన్లతో రికార్డు సృష్టించిన 'దాస్ కా ధమ్కీ' ..!

07:36 AM

ఆరేళ్ల తర్వాత మాజీ భార్యను చంపిన భర్త..

08:42 AM

విషాదం..విశాఖలో భవనం కూలి ముగ్గురు మృతి

07:31 AM

వర్ష ప్రభావిత ప్రాంతాలకు నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన

07:18 AM

కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్..వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసిన తండ్రి

09:52 PM

రేపు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

09:39 PM

ఢిల్లీ వాయు కాలుష్య నివారణకు రూ.9వేల కోట్లు..

09:27 PM

మూడో వన్డే.. ఆరో వికెట్ కొల్పోయిన భారత్

08:48 PM

లండన్‌లోని భారత దౌత్యకార్యాలయం వద్ద భద్రత పెంపు

08:21 PM

రేపు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన..

08:00 PM

కేటీఆర్‌,బండి సంజయ్‌ల ట్వీట్టర్ యుద్దం..

07:48 PM

ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం..

07:39 PM

కోవిడ్ సన్నద్ధతపై ప్రధాని కీలక సమీక్ష..

07:00 PM

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు..

06:28 PM

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

06:25 PM

ప్రభుత్వ సీఎస్ కు చంద్రబాబు లేఖ..

06:23 PM

తీన్మార్ మల్లన్నకు 14రోజుల రిమాండ్

06:19 PM

ఢిల్లీలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు..

06:03 PM

మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఆలౌట్‌..

05:49 PM

అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం పట్టివేత..

05:29 PM

మహిళల బాక్సింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్.. భారత్‌కు కాంస్యం

05:20 PM

దక్షిణ మధ్య రైల్వే గ్రూప్‌-డి ఫలితాలు విడుదల..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.