Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బాల సాహితీ వికాసంలో సిద్ధిపేట పూదోట 'పెందోట' | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Jan 08,2023

బాల సాహితీ వికాసంలో సిద్ధిపేట పూదోట 'పెందోట'

           సిద్ధిపేట కేంద్రంగా ఇవ్వాళ్ళ తెలంగాణలో బాల సాహిత్య వికాసం విరివిగా జరుగుతోంది. విద్వత్కవి శ్రీమాన్‌ వేముగంటి వారు మొదలుకుని బుడిబుడి అడుగుల శ్రీజ వరకు ఈ వికాసోద్యమం సాగుతోంది. బాల సాహిత్యానికి పెట్టని కోట సిద్ధిపేట అన్నది నిజం. బాల సాహిత్య రచన, వికాసంతోపాటు విలక్షణ కార్యక్రమాల నిర్వహణ, తోటి బాల సాహితీవేత్తలను సముచిత రీతిలో సత్కరించే సహృదయత వెరిసి బాల సాహితీవేత్త పెందోట వెంకటేశ్వర్లు.
           పెందోట వెంకటేశ్వర్లు నేటి సిద్ధిపేట జిల్లా బద్దిపడగలో 11 నవంబర్‌, 1965న పుట్టారు. అనసూయ, ఆనందయాచారి వీరి అమ్మా నాన్నలు. బాల్యం, విద్యాభాస్యం బద్ధిపడగలో సాగగా, ఉన్నత విద్య సిద్ధిపేటలో, ఎం.ఏ తెలుగు కాకతీయ విశ్వ విద్యాలయం నుంచి, టీచర్‌ ట్రైనింగ్‌ శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి పూర్తిచేశారు. పద్యం, గేయం, వచన కవిత, కథ, సాహిత్య విమర్శతో పాటు బాల సాహిత్య పరామర్శ పెందోట సాహిత్య సృజనలో ఉన్నాయి. నలబై ఒక్క రచనలు చేసిన పెందోట బాల సాహిత్యాన్ని ఎంతగా రాశారో అంతే ఇతర ప్రక్రియలు రూపాల్లోనూ రాశి పోశారు. 2010 నుంచి నేటి వరకు పదకొండ వచన కవితా సంపుటాలు తెచ్చారు, అవి, 'ఆశల పరువళ్ళు, మానవ కెటాలు, కవితా ప్రభంజనం, పాలపిట్ట పదాలు, అడుగుజాడలు, మధుర ఫలాలు, రామాయణ పాత్రల విశిష్టత, మూడు ముళ్ళు, తెలంగాణ వైభవం. విజ్ఞాన పుష్పాలు, చేదబావి మొదలైనవి. పద్యంలో పెందోటది చేయి తిరిగిన కలం, 'వేంకటేశ శతకం, వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, విశ్వబాల శతకం, సిద్ధిపేట శతకం, విజయాలతోట శతకం, జయగణేశ శతకం, బద్దిపడగ శతకం' వీరి రచనల్లో ఉన్నాయి.
బాలసాహిత్య రచనలోనూ పెందటది పెద్ద భాగస్వామ్యం, బంగారం పని చేసే నేపథ్యం నుండి వచ్చిన కవి కథా, బాలలకు బంగారమసోంటి పుస్తకాలను కానుకలుగా అందించాడాయన. వాటిలో కథా సంపుటాలు, విమర్శ, గేయాలతో పాటు ఇతర రూపాల్లో రాసిన రచనలు ఉన్నాయి. 'చిలుక స్నేహం, విచిత్ర స్నేహం, విచిత్ర స్నేహం, చీమ-ఉడత కథా సంపుటాలు. భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర, కొమురం భీమ్‌ జీవిత చరిత్ర బాలల కోసం పెందోట వెంకటేశర్లు రాసిన జీవిత కథలు. 'బాల సాహిత్య వైశిష్ట్యం' ఈయన రాసిన బాల సాహిత్య, బాలసాహితీవేత్తల పరిచయాల విశేష వ్యాసాల సంపుటి. ఇంకా 'చిన్న బాలశిక్ష', 'సూక్తుల తోరణం' వంటివి వీరి రచనలు.
బాల గేయాల రచనలోనూ పెందోట తనదైన ముద్రను వేశారు. ఇప్పటికి పది గేయ సంపుటాలు అచ్చయ్యాయి, మరో నాలుగు సిద్ధంగాఆ న్నాయి. 'వెన్నెల చినుకులు, ప్రభాత కిరణాలు, ఆట-పాట, విజయ పథం, అమృతధారలు, ఇంద్ర ధనస్సు, బాల చైతన్యం, సృజన చెలిమి, చక్కర గోలీలు, బాల సూర్యులు' వీరి గేయ సంపుటాలు. పేందోట బాల సాహితీ వేత్తలు, వికాసకారులు ఎవ్వరూ చేయని ఒక గొప్పపని తన ప్రతి పుస్తకంలో చేస్తాడు, అది తన ప్రతి రచనల సంపుటిలో తన బడిలో, లేదా ఊరిలోని కొందరు బడి పిల్లల రచనలు అచ్చువేయడం. ఇది సాదారణమైన విషయం ఏమీ కాదు. గొప్ప సంస్కృతికి, సహృదయతకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ స్ఫూÛర్తితో ఎందరో బాలల రచయితలు, కవులుగా తమ రచనలు చేస్తున్నారు.
బాల వికాసకారునిగా పిల్లల కోసం పలు సృజనాత్మక రచనా కార్యశాలలు నిర్వహించిన పెందోట బాలల రచనల సంకలనాలు అచ్చువేశారు సంపాదకులుగా. వాలిలో ప్రధానమైనవి, 'చిట్టి కలాలు, చిన్ని గళాలు', 'మర్కూక్‌ మాణిక్యాలు' కథా మందారాలు'. తన చేసిన పనులకు ఉత్తమ సాహితీవేత్త పురస్కారం, దాశరథి పురస్కారం, గురజాడ ఫౌండూషన్‌, కృషి కవిత వారి సాహిత్య పురస్కారం, హరితహార సాహిత్య పురస్కారం, మెదక్‌ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం వంటివి అందుకున్నారు.
'ముసిరె ముసిరె మబ్బులు ముసిరె' అంటూ వానను, వాన మబ్బులను వర్ణించిన పెందోట పిల్లల కోసం సరళసుదరంగా గేయాలు కూరుస్తారు. 'విద్యార్థీ మేలుకో/ కాలాన్నే పట్టుకో' అంటూ హితం పలుకుతాడు. తాను ఉపాధ్యాయుడు కదా, పిల్లల కోసం ఆ గురువుల గురించి చక్కని గేయం రాశారు. 'గురువుల సన్నిధి/ విజ్ఞానాల పెన్నిధి / ఆచరణే గొప్పది / విజయాలకు పునాది' అంటారు. 'పిల్లలం బడి పిల్లలం / ఆటలాడే వారలం / అల్లని చేసే వారలం... / మేం పుస్తకాలనే చదివేస్తాం / పరీక్షలల్లో నెగ్గేస్తాం' అంటూనే'.. భావి గురువుల మవుతాం' అంటూ ఎంతో చక్కగా ఆశాభావాన్ని వ్యక్తం చేయిస్తారు. పిల్లల కోసం వందలాది గేయాలు, పొడుపు కథలు, పాటలు, వ్యాసాలు, నాటికలు, కథలు రాసిన పెందోట పిల్లల కోసం రాసే వారికి పేందోట బాల సాహిత్య పురస్కారంతో పాటు మరి కొఇ్న పురస్కారాలిచ్చి గౌరవిస్తారు. సిద్ధిపేట బాలల పూదోటకు అభినందనలు.

- డా|| పత్తిపాక మోహన్‌, 9966229548

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బహుభాషా జాతీయస్థాయి కవి సమ్మేళనంలో నెల్లుట్ల సునీతకు ఘనసత్కారం
ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం...
బాల సాహిత్యాన్ని కవితా చిత్రాలతో సుసంపన్నం చేస్తున్న గృహలక్ష్మి 'ఎడ్ల లక్ష్మి'
కదిలే బొమ్మల కథ
సాదత్‌ హసన్‌ మంటు కథల సంపుటి - అనార్కలి..
సిద్ధిపేట బాల సాహితీవేత్త, వికాస కార్యకర్త ఉండ్రాల రాజేశం
జీవితానుభవాల సమాహారం 'రాల్లకుచ్చె'
నోరు మంచిది అయితే ఊరు మంచిది అయితది
అరుదైన వ్యక్తిత్వమున్న ఓ స్త్రీ కథ ''పుదు వసంతం''
కథకుల కరదీపిక
నీలి గోరింట...
ఆధునిక పంచతంత్రం
ఊరి సామెత
బాల సాహిత్యంలోనూ ఘనాపాటి రేగులపాటి కిషన్‌రావు
శారీరక అవసరాలు, నీతి సూత్రాల మధ్య నలిగిపోతున్న ఆధునిక స్త్రీ కథ నాతి చరామి
సకలకళా వల్లభి సారంగి
బాలల భక్తి సాహిత్య పరిశోధకుడు డా. గౌరవరాజు సతీష్‌కుమార్‌
మా అవ్వగారి కొడవలి అయితే...
గజదొంగ గంగన్న
పిల్లల 'చిట్టి కథ'ల ఆసామి 'తిరుమల వెంకటస్వామి'
అరవై ఏళ్ళనాటి రంగనాయకమ్మ నవల కృష్ణవేణిపై పునర్విమర్శ
ఇటెటు రమ్మంటే ఇల్లంత నాదే అన్నడట
స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'
బహిరంగ ప్రకటన
అక్కెర ఉన్నంతసేపు ఆదినారాయణ....
మార్పు ఎజెండాగా ఖాజామైనద్దీన్‌ చల్లారని నిప్పు రవ్వలు
గడియ పురుసత్‌ లేదు.. గవ్వ రాకడ లేదు
క్రమ'శిక్ష'ణ గల 'హాస్టల్‌ లైఫ్‌'
ల‌త్కోర్ సాబ్‌

తాజా వార్తలు

11:19 AM

ఖమ్మం జిల్లా పర్యటనకు బయల్దేరిన సీఎం కేసీఆర్

10:59 AM

సీఈఓ సుందర్ పిచాయ్‌కు గూగుల్ ఉద్యోగులు బహిరంగ లేఖ

10:53 AM

కరీంనగర్ లో తండ్రిని చంపిన కుమారుడు..

10:52 AM

సినీ ప్రముఖుల సమక్షంలోఎన్టీఆర్ 30వ చిత్రం ప్రారంభం..

10:50 AM

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌..ఓటేసిన జగన్‌

09:37 AM

సిట్ ముందు హాజరుకానున్న రేవంత్..

09:19 AM

బస్సును ఢీకొన్న కారు..ఇద్దరు దుర్మరణం

08:57 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

08:52 AM

ఫేక్ న్యూస్ సమాజానికి చాలా ప్రమాదకరమైనవి : జస్టిస్ డీవై చంద్రచూడ్

08:42 AM

దేశంలో గృహ హింస కేసులు..రెండో స్థానంలో తెలంగాణ

08:23 AM

భర్తపై క్షుద్ర పూజలు చేయించిన భార్య..

08:05 AM

టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ముగ్గురికి గ్రూప్‌-1లో 120కి పైగా మార్కులు

08:42 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

07:50 AM

మొదటి రోజే కలెక్షన్లతో రికార్డు సృష్టించిన 'దాస్ కా ధమ్కీ' ..!

07:36 AM

ఆరేళ్ల తర్వాత మాజీ భార్యను చంపిన భర్త..

08:42 AM

విషాదం..విశాఖలో భవనం కూలి ముగ్గురు మృతి

07:31 AM

వర్ష ప్రభావిత ప్రాంతాలకు నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన

07:18 AM

కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్..వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసిన తండ్రి

09:52 PM

రేపు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

09:39 PM

ఢిల్లీ వాయు కాలుష్య నివారణకు రూ.9వేల కోట్లు..

09:27 PM

మూడో వన్డే.. ఆరో వికెట్ కొల్పోయిన భారత్

08:48 PM

లండన్‌లోని భారత దౌత్యకార్యాలయం వద్ద భద్రత పెంపు

08:21 PM

రేపు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన..

08:00 PM

కేటీఆర్‌,బండి సంజయ్‌ల ట్వీట్టర్ యుద్దం..

07:48 PM

ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం..

07:39 PM

కోవిడ్ సన్నద్ధతపై ప్రధాని కీలక సమీక్ష..

07:00 PM

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు..

06:28 PM

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

06:25 PM

ప్రభుత్వ సీఎస్ కు చంద్రబాబు లేఖ..

06:23 PM

తీన్మార్ మల్లన్నకు 14రోజుల రిమాండ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.