Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
క్రమ'శిక్ష'ణ గల 'హాస్టల్‌ లైఫ్‌' | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Jan 22,2023

క్రమ'శిక్ష'ణ గల 'హాస్టల్‌ లైఫ్‌'

           ''న రత్నం అన్విష్యతి మృగ్యతే హితత్‌'' ఈ శ్లోకం మహాకవి కాళిదాసుని కుమార సంభవ కావ్యంలో, శివపార్వతుల సంభాషణ లోనిది.'' ఎక్కడైనా రత్నం వెతుకుతుందా, వెతకబడుతుంది'' అని దాని అర్థం. అటువంటి వెతుకబడే రత్నాల వంటి విద్యార్థులను తవ్వి తీయాలనే సదాశయంతో ఏర్పడ్డవే గురుకుల విద్యాలయాలు. గురుకులాల్లో చదివిన ప్రతి విద్యార్థికి ఈ శ్లోకం బాగా గుర్తు,ఎందుకంటే గురుకులాల లోగోలో ఈ శ్లోకం నినాదంగా ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, 80వ దశకంలో ప్రారంభమైన ఈ పాఠశాలల్లో 6 తరగతి నుంచి 10వ తరగతి, ఆపైన ఇంటర్‌ విద్యను కూడా అందించడం మొదలు పెట్టాయి. హాస్టల్‌తో అనుసంధానమైన ఈ స్కూళ్ళని సాధారణంగా జనావాసాలకి దూరంగానూ, అటవీ ప్రాంతం ఉండే విశాలమైన ఆవరణలో ఉండేట్లుగా నిర్మించారు. ముఖ్యంగా బాలుర కొరకు నిర్మించిన హాస్టల్లు. స్కూలూ, హాస్టలూ ఒకే ప్రాంగణంలో ఉండడం, కో- ఎడ్యుకేషన్‌ లేకపోవడం, వీటి ప్రత్యేకత. ఒక్కో గురుకులంలో 500 నుంచి 600 మంది వరకు విద్యార్థులు హాస్టల్లో ఉంటూ చదువుతారు. ఈ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులందరూ విధిగా వారికి కేటాయించిన క్వార్టర్స్‌లోనే ఉంటూ (ప్రిన్సిపాల్‌తో సహా) విద్యలో విద్యార్థులను ''రాటు'' తేలేలా, వారికి ''శిక్ష''ణ ఇస్తూ కంకణబద్ధులై శ్రమిస్తుంటారు. అలాంటి ఒక గురుకులంలో చదివిన పూర్వ విద్యార్థి స్వానుభావాలతో రాసిన ఆత్మకథాత్మక నవల ''హాస్టల్‌ లైఫ్‌''. రచయిత తలారి మోహన్‌.
               పర్స్‌స్పెక్టివ్స్‌ పబ్లికేషన్స్‌ ప్రచురుణ కర్తలు. మోహన్‌ అనే దళిత విద్యార్థి గురుకుల పాఠశాలలో 8వ తరగతిలో చేరి పదవ తరగతి వరకు (1999-2002 వరకు) చదివి, పాఠశాలను విడిచిపెట్టే వరకు జరిగిన సంఘటనలు ఈ నవలకు వస్తువు. ఆరుగొలను అనే ఊళ్లో తను చదివిన గురుకుల పాఠశాల అనుభవాలను కల్పన లేకుండా నవలలో ప్రకటించాడు. గురుకుల జీవితాన్ని పొల్లు పోకుండా మనకు కళ్ళకు కట్టే రచన ఇది. 17 శీర్షికలుగా విభజింపబడిన ఈ నవలలో ప్రతి శీర్షికలో గురుకులాల్లోని ఒక్కో దయనీయ కోణాన్ని ఎండగడుతూ తాను అనుభవించిన వ్యథాభరిత జీవితాన్ని చిత్రించాడు రచయిత. ఈ నవలలో కథానాయకుడు మోహన్‌ అనే దళిత విద్యార్థి. అతని తండ్రి విద్యుత్‌ శాఖలో లైన్మెన్‌గా పని చేస్తే వచ్చే ఐదారు వందల రూపాయల సంపాదనతో కుటుంబం గడవడం కష్టమైపోయి, అతని అక్కను ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియట్‌ చదివించవలసి రావడం ఆర్థిక కారణాలతో, వెరసి మోహన్ను హాస్టల్లో ఉంచి చదివించాలని నిర్ణయానికి రావడంతో, గురుకుల ప్రవేశ పరీక్ష రాసి, పాఠశాల ప్రవేశం పొందుతాడు. ఈ భూమికనంతా ''కూలి సాలక కూటి కోసం'' అనే శీర్షికలో నేపథ్యంగా మలిచి, పాఠశాలలో చేరిన తరువాత అక్కడ సౌకర్యాల లేమినీ, ''అన్నం అమ్మిరాజు'' అనే మిత్రుని సావాసం, సాహచర్యం లభించిన వైనం చెబుతూ, అక్కడి పాఠశాల భవనాన్ని రచయిత వర్ణిస్తూ ''1983లో కట్టిన బిల్డింగ్‌ కదా మొత్తం నాచు, బూజు, పట్టి పచ్చగా ఉంది, రోడ్డు మీద ఉన్న ఎర్రమట్టంతా మెట్లు, దారి, గదుల నిండా పరుచుకుంది, 8వ తరగతి వాళ్ళు ఉండే గది వెతుక్కొని, లోపలికి పోయి సూస్తే వరసగా ట్రంకు పెట్లు గోడకి చేర్చి ఉన్నాయి'' అనే వాక్యాలు గురు కుల విద్యార్థి మనోవీధిలో ఆ వాతావరణమూ, భవనాలూ ఒక్కసారిగా మెదులుతాయి. గురుకులాల్లో భోజనం ఎంత అధ్వానంగా, నిర్లక్ష్యంగా, వండివారుస్తారో చెబుతూ ''రెండొందల గుడ్లేసి తేరగా దొరికిన ఉల్లిపాయల్ని ఎగాదిగా కోసి కలిపి మంటెడతారు అదే కూర'' అని వ్యంగంగా చెబుతాడు, కానీ దాని వెనుక విషాదం అంతా ఇంతా కాదు. అన్నంలో రోజూ వచ్చే పురుగులు, బొద్దింకల బాధ సరేసరి. రుచిపచీ లేని ఉప్మా తినడంలోని అసౌకర్యాన్ని ఎలా అధిగమించాడు గురుకుల విద్యార్థి అంటూ రంగూ, రుచీ, వాసనా లేని ''హాస్టల్‌ ఉప్మా'' తినేప్పుడు, ''పచ్చడో, పందారో జురుగ్గా కలుపుకొని ఉప్మా రుసి తెలిసే లోపు మింగేత్తారు'' గురుకుల విద్యార్థులు.
అక్కడ వండే వంటలు తినడం ఎంత సాహసమో ఈ ఒక్క వాక్యంతో తెలిసిపోతుంది. ఈ వాక్యాలన్నీ ప్రత్యక్షంగా అనుభవించి రాసినవి కావడంతో, ఇలాంటి ఒక దుర్భర జీవితాన్ని అనుభవించిన వ్యక్తి ఈ విషయాలను హృదయ గతం చేసుకోగలడు. క్రమ''శిక్ష''ణ అనే శీర్షికలో 500మంది విద్యార్థుల అవసరాలకూ, ఒకే ఒక్క చాలీచాలని వాటర్‌ ట్యాంక్‌ వల్ల స్నానాలు చేయడానికి విద్యార్థులుపడే అవస్థలు, బహిర్భూమికి వెళ్లడానికి తెల్లవారు జామున పొలాల్లోకి మగ్గుల్లో నీళ్లు పట్టుకుని వెళ్లాల్సి రావడం, అన్ని వందల మందికి లెట్రిన్‌ సదుపాయం లేకపోవడం విద్యార్థుల దయనీయ స్థితిని కళ్ళకు కడుతుంది. ఇవేమీ తమకు పట్టవు అన్నట్టు వాచ్‌మెన్‌ దగ్గర నుంచి మాస్టార్ల వరకు బెత్తాలతో పిల్లల లేలేత చేతులపై తమ క్రౌర్యాన్ని ప్రదర్శించే నిర్దాక్షిణ్య పోకడలు హృదయాన్ని ఆర్ద్రతతో నింపేస్తాయి. ఈ బాధలన్నీ పడలేక కష్టాల నుంచి ఎస్కేప్‌ అయ్యి బాల కార్మికులుగా మారడం, అసలు చదువంటేనే భయపడే స్థాయికి రావడం, నేపథ్యంగా ''ది ఫస్ట్‌ ఎస్కేప్‌'' శీర్షికలో చర్చకు వస్తుంది. స్కూల్‌ విద్యార్థులతో పాటు ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు కూడా ఒకే ప్రాంగణంలో ఉండడం వల్ల పెద్ద తరగతి విద్యార్థులు చిన్న తరగతి విద్యార్థులపై జరిపే అత్యాచారాలను వాటి పర్యవసానాలనూ, అలాంటి ఒక సంఘటనకు బలైపోయిన తన స్నేహితుని కథ తెలియజేస్తూ బాధిత విద్యార్థి పట్ల సానుభూతి కాక, హేళన ఉపాధ్యాయుల నుంచే ఎదుర్కోవడం వంటి చిత్రవధను హృద్యంగా ఆవిష్కరించారు. వారమంతా హాస్టల్‌ తిండి తిని, ఆదివారం రోజు అమ్మానాన్నలు తెచ్చే ఇంటి భోజనం కోసం ఎదురుచూడ్డం, ఆరోజు అమ్మ ఒళ్ళో తలపెట్టి ఈపి, పేళ్లు తీయించుకోవడం, ఇలాంటి అనుభవాలన్నీ గురుకుల విద్యార్థికి కాక మరి ఎవరికి తెలుస్తాయి. తల్లి ముందే బిడ్డను దండించడం వలన తల్లి పడే బాధ చెప్తూ ''మీరు కొట్టి సంపేత్తానికి కనలేదు సార్‌ గారు మా బిడ్డల్ని, మా గచ్చంతరం బాగోక ఇక్కడ వదిలేశాం'' అంట నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఈ వాక్యాలు గురుకుల వ్యధాభరిత జీవితాన్ని చూసిన గురుకుల విద్యార్థి తప్ప రాయలేనివి. పదో తరగతి పరీక్షల్లో గుమస్తా కూతురికి ''సాయం'' చేయమని మోహన్‌ని అభ్యర్థించే మాస్టార్ల ''నీతి'' మరొక కోణం. ఇన్ని కష్టాలు, కడగళ్ళ, మధ్యనా అక్కడక్కడ మంచి బాసన్నయ్యలు (స్టూడెంట్‌ లీడర్లు), స్వరాజ్యం,గౌతమి మేడం, ప్రిన్సిపాల్‌, వంటి చలువ పందిళ్ళ వంటి వ్యక్తులూ, తారసపడతారు. గురుకులాల్లో చదివిన ప్రతి ఒక్కరూ ''ఇది మా కథే'' అనే అనుభూతిని ఈ నవల కలిగిస్తుందని నిశ్చితాభిప్రాయం కలుగుతుంది.ఎందుకంటే ఈ నవలలో పేర్కొన్న ప్రతి వ్యక్తీ, సంఘటనలు, సమస్యలు, సంఘర్షణలు అన్నీ గురుకులాల్లో నిత్యం జరిగేవే, జరుగుతున్నవే. ఒకటీ, అరా పత్రికల్లో వచ్చేవి చాలా తక్కువ,కంటికి కనిపించని రాయబడని జీవన విధ్వంసం ఎంతో ఉందీ రచనలో.గోదావరి జిల్లాల యాసతో సంభాషణలూ, అవసరమైన చోట్ల శిష్ట వ్యావహరిక వ్యాఖ్యాన కథనంతో రచన హాయిగా చదివించే శైలిలో సాగుతుంది నవల. పది పూర్తయి ఇంటర్లో చేరడానికి ప్రైవేటు కాలేజీకి కథానాయకుడు చేరడంతో నవల ముగుస్తుంది. 8లో చేరడానికి సైకిల్‌ మీద వచ్చినప్పుడు ఏ గతుకుల రోడ్డు ఉందో, మళ్లీ వెళ్లేటప్పుడు అదే గతుకుల రోడ్డు మీద వెళ్తాడు మోహన్‌. ఆ గతుకుల గుంతల రోడ్డు మారని వ్యవస్థకూ, ప్రభుత్వ నిర్లక్ష్యానికీ, ప్రతీక.
''వెలిసిపోయిన కార్పెట్లు, ట్రంకు పెట్టెలు, సబ్బు వాసనల జంతికలు, కారప్పొళ్ళు, పచ్చళ్ళు, టిఫిన్లుగా చలామణి అయ్యే ఉడికీ ఉడకని ఉప్మాలు, తలనూనె కాళ్లు చేతులకు రాసుకోవడం, నీళ్లులేని వాటర్‌ టాంకు, అమ్మా నాన్నల కోసం దిగులు పడిన రోజులూ, హాస్టల్‌ మిత్రులు, పాకురు పట్టిన పురాతన హాస్టల్‌ బిల్డింగులు, కారణాలు తెలుసుకోకుండా కొట్టడమే క్రమశిక్షణ అని భావించే అనాగరిక అధ్యాపకులు, అన్నీ ఒక్కసారిగా కళ్ళముందు కదలాడుతాయి, నవల చదివాక.
''అసౌకర్యాల, అవమానాల హాస్టల్‌ పద్మవ్యూహంలో చిక్కుకున్న దళిత అభిమన్యుడు'' ఎలా బయటపడ్డాడో ఈ గురుకుల భారతం వివరిస్తుంది. తిండికీ, గుడ్డకీ లేక గురుకులాల్లో చేరిన దళిత విద్యార్థులనుభవించిన బాధాతప్త జీవితాల విషాదచిత్రమే ఈ నవల.
- సూరపల్లి జయప్రకాశ్‌ నారాయణ
  8977197335

హాస్టల్‌ లైఫ్‌ (ఉచిత నిర్బంధ విద్య)
రచయిత : తలారి మోహన్‌
పేజీలు : 136, వెల : రూ.150/-,
ప్రతులకు : పర్‌ స్పెక్టివ్స్‌, సామాజిక శాస్త్రం / సాహిత్యం,
ఫ్లాట్‌ నెం. 305, హిమశివ అపార్ట్‌మెంట్స్‌,
బాగ్‌ అంబర్‌పేట, హైదరాబాద్‌ - 013
సెల్‌ : 8332934548

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కెనడాలో అంబరాన్ని అంటిన డుర్హం తెలుగు క్లబ్ ఉగాది వేడుకలు
కథల పోటీకి ఆహ్వానం
31న 'ఊహలకే ఊపిరొస్తే' ఆవిష్కరణ
కవితలకు ఆహ్వానం
వేమూరి బలరామ్‌ 'స్వాతి చినుకులు' గ్రంథానికి పురస్కారం
తెలుగు బాల సాహిత్యానికి వెలుగుల కవన సిరి 'డాక్టర్‌ సిరి'
బహుభాషా జాతీయస్థాయి కవి సమ్మేళనంలో నెల్లుట్ల సునీతకు ఘనసత్కారం
ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం...
బాల సాహిత్యాన్ని కవితా చిత్రాలతో సుసంపన్నం చేస్తున్న గృహలక్ష్మి 'ఎడ్ల లక్ష్మి'
కదిలే బొమ్మల కథ
సాదత్‌ హసన్‌ మంటు కథల సంపుటి - అనార్కలి..
సిద్ధిపేట బాల సాహితీవేత్త, వికాస కార్యకర్త ఉండ్రాల రాజేశం
జీవితానుభవాల సమాహారం 'రాల్లకుచ్చె'
నోరు మంచిది అయితే ఊరు మంచిది అయితది
అరుదైన వ్యక్తిత్వమున్న ఓ స్త్రీ కథ ''పుదు వసంతం''
కథకుల కరదీపిక
నీలి గోరింట...
ఆధునిక పంచతంత్రం
ఊరి సామెత
బాల సాహిత్యంలోనూ ఘనాపాటి రేగులపాటి కిషన్‌రావు
శారీరక అవసరాలు, నీతి సూత్రాల మధ్య నలిగిపోతున్న ఆధునిక స్త్రీ కథ నాతి చరామి
సకలకళా వల్లభి సారంగి
బాలల భక్తి సాహిత్య పరిశోధకుడు డా. గౌరవరాజు సతీష్‌కుమార్‌
మా అవ్వగారి కొడవలి అయితే...
గజదొంగ గంగన్న
పిల్లల 'చిట్టి కథ'ల ఆసామి 'తిరుమల వెంకటస్వామి'
అరవై ఏళ్ళనాటి రంగనాయకమ్మ నవల కృష్ణవేణిపై పునర్విమర్శ
ఇటెటు రమ్మంటే ఇల్లంత నాదే అన్నడట
స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'

తాజా వార్తలు

06:29 PM

మాంసం తీసుకరాలేదని భార్య గొంతుకోసిన భర్త

06:28 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో మరో పేలుడు..ఆరుగురు మృతి

06:02 PM

జిహెచ్ఎంసి చెత్త వాహనం కింద పడి చిన్నారి మృతి..

05:59 PM

విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్

05:24 PM

నిన్న కాంగ్రెస్‌లో చేరి..నేడు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డీఎస్

05:14 PM

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఫస్ట్‌ లుక్ పోస్టర్

05:10 PM

టిక్ టాక్‌ను బ్యాన్ చేసిన ఫ్రాన్స్ ప్ర‌భుత్వం..

04:39 PM

ఏప్రిల్ 1 నుంచి దివ్య దర్శన టోకెన్లు..

04:28 PM

యడియూరప్ప ఇంటి వద్ద.. భారీ నిరసన, రాళ్ల దాడి

03:28 PM

రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' టైటిల్ టీజర్..

03:00 PM

వరంగల్ లో రచ్చకెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు..

02:38 PM

ఈరోజు రాహుల్ గాంధీకి జరిగింది..రేపు మరొకరికి జరగవచ్చు : నారాయణ

02:29 PM

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నాగబాబు అసహనం..

02:13 PM

15 ఏండ్ల వయస్సులోనే హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయించుకున్నా : శిఖర్‌ ధావన్

01:50 PM

కవిత పిటిషన్‌పై సుప్రీం మూడు వారాల వాయిదా..

01:21 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు వాయిదా..

01:06 PM

సావర్కర్‌పై రాహుల్ చేసిన వాఖ్యలపై.. మండిపడిన ఉద్ధవ్ ఠాక్రే

12:47 PM

వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

12:26 PM

పోలవరం ముంపుపై సుప్రీంకు కేంద్రం లేఖ..

12:12 PM

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌కు రెండో స్థానం..

11:52 AM

ఇజ్రాయిల్‌లో ర‌క్ష‌ణ మంత్రి తొల‌గింపు.. భారీ నిర‌స‌లు

11:20 AM

రెండో రోజు కొనసాగనున్న సిట్‌ విచారణ..

11:06 AM

పమ్రుఖ హాస్యనటుడు ఇన్నోసెంట్ కన్నుమూత..

10:48 AM

గురుద్వారాలో కాల్పులు.. ఇద్దరికి తీవ్రగాయాలు

10:44 AM

టీఎస్‌ఆర్టీసీ ఏసీ స్లీపర్‌ బస్సులు ప్రారంభం..

09:59 AM

భారత్, నేపాల్ విమానాలు తప్పిన పెను ప్రమాదం..

09:41 AM

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

09:26 AM

హైదరాబాద్ పర్యటనకు ప్రధాని..

09:14 AM

సికింద్రాబాద్‌–తిరుపతి మధ్య మరో వందేభారత్‌ రైలు..

09:02 AM

రెండు క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.