Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మారేరోజులు మారని రాజులు | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Nov 14,2021

మారేరోజులు మారని రాజులు

అన్నా తమ్ముడూ అనుబంధాలు జెండాలు రంగులూ నినాదాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. కొందరు తిక్క మనుషులు రాజులవుతారు. కొందరు రాజులయ్యాక తిక్క మనుషులవుతారు. అబద్ధవర్మలు, అసత్యవర్మలూ అప్పటిలాగే ఇప్పుడూ ఉన్నారు. తిమ్మరాజులూ, తిక్క రాజులూ లేక పోలేదు.
    రాజులన్నాక తిక్క అనేది ఒక లక్షణం ఉండటం అసహజమేమీ కాదు. నాకు తిక్కవుంది కానీ దానికో లెక్క ఉంది అనే రాజులు లేకపోలేదు. అయితే తిక్కకు లెక్కే ఉండదు. తిక్కతిక్కే రాజురాజే!
    ఇలాగే లెక్కలేని తిక్క ఉన్న రాజు అబద్ధ వర్మ. ఈయన వంశపారంపరపర్యంగా రాజైనవాడేం కాదు. ఒకానొక రాజ్యంలో రాజు లెక్కలేనంత తిక్క కారణంగా జనాన్ని కాల్చుకోకుండానే తింటుండ డంతో జనం ఊరుకోలేక ఎదురుతిరిగారు. అలాగే ఎదురు తిరిగిన వాళ్ళంతా కల్సి తిక్క రాజును చావగొట్టి చెవులు మూయకుండానే రాజ్యం పొలిమెరలు దాటించారు.
    రాజులేని రాజ్యం ఉండనే ఉండదు కదా. తిరగబడ్డ వాళ్ళల్లో ఒకరు అందరికంటే ముందు పరుగు పరుగున వెళ్ళి రాజుసింహాసనం మీద కూచుని ఇది నా సీటు. దీని మీద జేబురుమాలు కలర్‌ కండువా వేసింది నేనే కనుక నేనే రాజుని అని ప్రకటించుకున్నాడు.
    ఇలాగే సెల్ఫీ తీసుకున్నాక తిక్కరాజే అబద్ధవర్మ. అయితే అబద్ధ వర్మతో పాటు సింహాసనం దరి దాపుల్లోకి చేరుకున్నావారు మేం ఎక్కడ కూచోవాలి అని అరిచిగీపెట్టారు. అబద్ధవర్మతో పాటు సింహాసనానికి బాగా దగ్గరగా వచ్చిన అసత్యవర్మ తను కూడా రాజుగారి సింహాసనం మీద కూచుంటానని మొండికేశాడు.
    అబద్ధవర్మ అది అసంబద్ధమన్నాడు ఒక సీటు మీద ఇద్దరు కూర్చోవడం కుదరదని అసత్యవర్మను సముదాయించాడు. నా సింహాసనం ప్రక్కనే నీకూ ఓ సీటు ఏర్పాటు చేయస్తానన్నాడు. ఏడ్చే మొగానికి తుడిచే తుండుగుడ్డ అనుకున్న ఆ సత్యవర్మ సింహాసనం కుడివైపు సీటు కావాలని పట్టు బట్టాడు. అబద్ధ వర్మ అందుకు ఎగిరి గంతేసి అసత్యవర్మను కావలించుకుని మనిద్దరం అన్నదమ్ములం. మనది అన్నదమ్ముల అనుబంధం అన్నాడు.
    తన తిక్కకు ఓ లెక్క వుండని, కబుర్లతో కాలక్షేపం చేస్తూ అరచేతిలో లేని వైకుంఠాన్ని ఉందని బుకాయిస్తూ రాజ్యం ఏలసాగాడు అబద్ధవర్మ. అయితే తను కుడి ప్రక్కన సీటులో కూచున్న అసత్యవర్మ ఏనాడైనా తన కొంప ముంచేస్తాడన్న అనుమానం అబద్ధవర్మను పీడించసాగింది. తనను సింహాసనం మీది నుంచి కిందికి తోసేసి అసత్యవర్మ రాజయినట్టు పీడకలలు కూడా వచ్చినయి. ఈ ఆత్మక్షోభ భరించలేక అసత్య వర్మ సీటును, కుడివైపు నుంచి ఎడమకు మార్చాడు. ఇది కొంత 'సేఫ్‌'గా ఉంటుందనుకున్నాడు కాని కలలు రావడం ఆగలేదు.
    ఇక నాడు అబద్ధవర్మ దర్చారుకువచ్చే టప్పటికి అసత్యవర్మ సింహాసనం మీద కూచుని ఉన్నట్టనిపించి అబద్ధవర్మ గుండె గుభిల్లుమంది. 'సోదరా ఇది తగునా నేను లేకుండా చూసి సింహాససం ఎక్కితివా? అనడిగాగు. లేదన్నయ్య సింహాసనం కుషన్‌ మెత్తగా ఉన్నదీ లేనిదీ చూశాను అంతే నాలుగు కాళ్ళూ సనిగ్గా ఉన్నదీ లేనిదీ పరిశీలించాను. అంతే అన్నాడు అసత్యవర్మ.
    అబద్ధవర్మ తిక్క హద్దులు దాటి పోయింది. లాభం లేదు. తమ్ములుంగారు సింహాసనం కింద గ్యాసుపొయ్యి మంట పెట్టేట్టుగా ఉన్నారు అనుకున్నాడు. కుడీ వద్దు ఎడమా రద్దు . ఇక్కడెక్కడా వీరిని కూర్చోనివ్వద్దు అనుకున్నాడు. రాజు తల్చుకుంటే కేసులకు కొదవలేదు కదా!
    అసత్యవర్మ మీద దుమ్మూ ధూళీ చెత్తా చెదారమూ చల్లాడు. ఉన్నవీ లేనివీ కల్పించి పో పొమ్మని పొగ పెట్టాడు. అబద్ధ వర్మ ఆగడాలకు అడ్డుకట్టు పడే రోజు వస్తుందని శాపనార్థాలు పెడుతూ అసత్యవర్మ కోట దాటాడు.
    కోట దాటిన అసత్యవర్మ అడవికి వెళ్ళి ముక్కు మూసుకుని ఒంటి కాలు మీద తపస్సు చెయ్యడు కదా! జనం ఉన్నారు కదా! జనం ఎప్పుడు ఎవరి వెంట వుంటారో ఎవరికి జై కొడతారో ఎవరికెరుక. అసత్యవర్మ కుడివైపు కుర్చీ ఎడమవైపు సీటూ ఎలాగు కూచున్నవే కనుక ఏకంగ సింహాసనం వైపు రాకూడదనేం లేదు కదా!
   అన్నా తమ్ముడూ అనుబంధాలు జెండాలు రంగులూ నినాదాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. కొందరు తిక్క మనుషులు రాజులవుతారు. కొందరు రాజులయ్యాక తిక్క మనుషులవుతారు. అబద్ధవర్మలు, అసత్యవర్మలూ అప్పటిలాగే ఇప్పుడూ ఉన్నారు. తిమ్మరాజులూ, తిక్క రాజులూ లేక పోలేదు.
- చింతపట్ల సుదర్శన్‌, 9299809212

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కూలుతున్న కుటుంబాలు
బొమ్మలరామారంలో కొత్తరాతిబొమ్మల తావు
వేగు చుక్కల వెలుగు తార ఇరివెంటి కృష్ణమూర్తి
అమ్మకు ఓ బహుమతి
ఒట్టు... నీ మీద ఒట్టు
కూతురుగా పుట్టి కొడుకుగా భాద్యతలు నెరవేర్చిన ఆర్తి కథ ఆమా
నేడే... మేడే...
'చింతల'పాలెంలో శిథిల త్రికూటాలయం, అపూర్వ శిల్పాలు
తల లేని తోక!
అసమానతలు లేని సమాజాన్ని కాంక్షించిన నవల 'అవతలి గుడిసె'
మంచి జీవితానికి భరోసా
పర్యావరణ రక్షణే ధరిత్రీ రక్షణ
స్త్రీల రక్తం పీల్చేసి, జీవితాంతం పీక్కుతింటూన్న రాకాసి గద్ద వంటిల్లు ''ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌''
తరతరాల చికిత్స విధానం... కైరాలి ఆయుర్వేద విధానం
మూడు దశాబ్దాల చట్టసభల సభ్యుడు, స్వాతంత్య్ర సమరయోధుడు చెన్నమనేని రాజేశ్వరరావు
బాలల సినీ గీతకారుడు డా. సి.నారాయణ రెడ్డి
రిజర్వేషన్లు సామాజిక న్యాయం కోసం
విగ్రహం
తీరిక లేని ప్రధాని, సాహిత్య పిపాసి పి.వి.
తెలుగు ధ్వనిలో బహు లయలు
ప్రేక్షక హృదయాలలో శాశ్వత ముద్ర వేసిన పాకీజా
అపశతుల కోయిల ?!
ఉపాధ్యాయ, ఉప్పు సత్యాగ్రహి స్వామి రామానంద తీర్థ
పంజాబీ పల్లెటూరి స్త్రీ జీవన సమస్యలను చిత్రించిన ''గేలో''
బైపొలార్‌ రెండు పరస్పర వ్యతిరేక లక్షణాలు
నాటక రంగానికి జేజేలు
జానపద బాలల కవి పాలడుగు నాగయ్య
ఇంటికో దీపం!!
భారతీయ సినిమా తొలితరం నటి దేవికా రాణి
''నాది దు:ఖం వీడని దేశం''

తాజా వార్తలు

09:37 PM

ఐపీఎల్ : ముంబైకి భారీ టార్గెట్ నిర్ధేశించిన హైదరాబాద్

09:23 PM

త‌న ఇంటిలో సీబీఐ సోదాల‌పై స్పందించిన చిదంబ‌రం

09:02 PM

మందకృష్ణకు కేఏ పాల్ బంపర్ ఆఫర్

08:31 PM

తెలంగాణలో కొత్తగా 38 కరోనా కేసులు

07:53 PM

ఐపీఎల్ : తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్..

07:50 PM

రాజ్యసభకు..ఏపీ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి

07:34 PM

బాల‌కృష్ణ ఇంటి వైపు దూసుకెళ్లిన యువతి కారు..!

07:18 PM

ఐపీఎల్ : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై

06:52 PM

సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లేఖ

06:26 PM

ముస్లింలకు ఆటంకం కలగకుండా శివలింగం ప్రాంతాన్ని రక్షించాలి : సుప్రీంకోర్టు

06:12 PM

హైద‌రాబాద్‌లో అగ్ని ప్రమాదం

06:07 PM

చిదంబరంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఎంపీ విజ‌యసాయిరెడ్డి

06:06 PM

100 కోట్ల షేర్ మార్కును టచ్ చేసిన 'సర్కారువారి పాట'

06:01 PM

నేరేడ్మెట్ చౌరస్తాలో అమిత్ షా దిష్టిబొమ్మ దహనం

05:46 PM

వచ్చే నెల 3 నుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు

05:27 PM

నా భార్యకు కనీసం చీర ఆరేయడం కూడా రాదు..భర్త సూసైడ్ నోట్

05:24 PM

వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

05:17 PM

హైప‌ర్ సోనిక్ మిస్సైల్‌ను ప్ర‌యోగించిన అమెరికా

05:06 PM

ఢిల్లీలో ట్విన్ టవర్ కూల్చివేతకు గడువు పొడిగింపు

05:00 PM

కరోనా కారణంగా చిన్నారుల్లో కాలేయ వ్యాధి..!

04:53 PM

గోటబయ రాజపక్సపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

04:49 PM

అఫ్జల్గంజ్ పరిధిలో అక్రమ వసూళ్ల దందా

04:48 PM

గోధుమ‌ల ఎగుమ‌తిపై ఉన్న నిషేధాజ్ఞ‌ల‌ను స‌డ‌లింపు

04:39 PM

రూ. 40 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్

04:32 PM

నాకు నచ్చిన సీఎంలు ఎన్టీఆర్, కేసీఆర్ : మంత్రి ఎర్రబెల్లి

04:31 PM

ఏపీ కోటాలో 4 రాజ్య‌స‌భ సీట్ల కోసం ఐదుగురి అభ్య‌ర్థిత్వాల ప‌రిశీల‌న‌..

04:21 PM

కారు ఢీకొని యువకుడు మృతి

03:57 PM

సిద్దిపేట జిల్లాలో డెన్మార్క్ శాస్త్రవేత్తల బృందం పర్యటన..

03:57 PM

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

03:52 PM

కోడ‌లికి మామ లైంగిక వేధింపులు..క‌ర్ర‌తో దాడి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.