Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్ర‌కృతి గురువుకు ప్ర‌త్య‌క్ష శిష్యు‌డు పొట్ల‌ప‌ల్లి రామారావు | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Nov 28,2021

ప్ర‌కృతి గురువుకు ప్ర‌త్య‌క్ష శిష్యు‌డు పొట్ల‌ప‌ల్లి రామారావు

పుట్టుకతో ఆస్థిపాస్తులలో ఉన్నతులు. చదువుకో వాలన్న జిజ్ఞాసతో బడికెళ్తే బడి పంతులు బయటికి పొమ్మన్నారు. అయినా నిరుత్సాహపడలేదు. నిరాశ చెందలేదు. ప్రకతిని మించిన గురువెక్కడున్నాడనుకొని అశేషమైన శక్తిని కలిగిన ప్రకతినే తన గురువుగా భావించుకొని స్వశక్తితో అనేక గ్రంథాలు చదివి ఆకర్షింపబడ్డారు. ప్రకతినే గురువుగా మార్చుకొని ప్రజల కోసం, ప్రజా ఉద్యమాల చైతన్యం కోసం పరితపించి స్వాతంత్య్రోద్యమంలో అడుగుపెట్టి సత్యాగ్రహం చేసి నూనుగు మీసాల వయసులో గడీల గోడల నుంచి వచ్చి జైలు గోడల మధ్య స్వరాజ్యం కోసం నిర్భంధించబడ్డారు. అనవరతం ఏదో చెప్పాలని, ప్రజా సంక్షేమాన్ని, స్వాతంత్య్రాన్ని కోరిన ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తే రామారావు.
జననం : గొప్ప దేశభక్తులు, జాతీయవాది, అభ్యుదయ కవి, స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన వీరుడు అయిన రామారావు, పొట్లపల్లి శ్రీనివాసరావు, చెల్లమ్మ దంపతులకు వరంగల్‌ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామంలో 1917 లో జన్మించారు.
విద్యాభ్యాసం : భూస్వాముల కుటుంబంలో పుట్టిన రామారావు వీధిబడిలోనే ఏడవ తరగతి వరకు చదువు సాగించారు. పదమూడేండ్ల వయసులో ఉన్నప్పుడే వివా హమాడిన ఇతను పై చదువుల కోసమని పట్టణానికి వెళ్ళినా ఆర్ధిక కారణాల దష్ట్యా ప్రారంభంలోనే తన చదువుకు స్వస్తి పలకవలసి వచ్చింది. ఏ గురువు దగ్గర ఎక్కువ కాలం చదువు నేర్చుకోలేక పోయినా తన స్వంత అభిలాషతో, స్వయం కషితో వేలాది పుస్తకాలు చదివి లోకాన్ని తనదైన కోణంలో నుంచి అర్థం చేసుకున్నారు. అప్పటి నుంచి తన చుట్టూతా ఉన్న సాంఘిక సమస్యల గురించి తనను తాను ప్రశ్నించుకొని, ఆ సాంఘిక సమస్యలకు కారణమైన ప్రభుత్వంపై తన రచనావేశాన్ని ఝలిపించారు. హైదరాబాదు సంస్థానం పలు భాషల సంగమం కావడంతో అవసరం రీత్యా అయినా, ఆసక్తితోనైనా ఉర్దూ, ఇంగ్లీషు, హిందీ భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. బాల్యంలో ఉన్నప్పుడు ఏదో కారణం చేత బడికి వెళ్లనందుకు రికార్డు నుంచి పేరు తీసివేయబడడంతో మరుసటి రోజు బడి నుంచి బయటికి గెంటి వేయబడ్డారు.
ఉద్యమం: 1938 సంవత్సరంలో నిజాం ప్రభుత్వం స్టేట్‌ కాంగ్రెసుపై నిషేధం విధించినపుడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సత్యాగ్రహం చేసి అరెస్టయి జైలులో నిర్భంధించబడ్డారు. వరంగల్లులో సత్యాగ్రహం జరిపిన వ్యక్తులలో మొదటి వరుసలో ఉన్న వ్యక్తి ఇతను. తాను పోరాటం చేస్తున్న క్రమంలోనే కవిత్వం రాసి దాని ద్వారా ప్రజలకు ఉద్యమ మార్గం చూపి వారికి దారి దీపంగా మారారు. స్థానిక భూస్వాములపై, నిజాం ప్రభుత్వంపై ఆవేశంతో ప్రజల మెదళ్ళలో ఆవేశాత్మక విత్తనాలు వెదజల్లారు. జాతీయోద్యమంలో భాగంగా వందేమాతర ఉద్యమంలో పాల్గొని అరెస్టయి 22 సం||రాల వయసులో 2-11-1938 నుంచి 10-4-1939 వరకు వరంగల్‌ కేంద్ర కారాగారంలో జైలు జీవితాన్ని అనుభవించారు. మహాత్మాగాంధీ ఆశయాలతో ముందుకు సాగుతూ జాతీయవాదిగా నిజాం వ్యతిరేక పోరాటంలో కాళోజీ నారాయణరావు సహచరునిగా పోరాడారు. ఈ క్రమంలోనే కాళోజి రామేశ్వరరావుతో సన్నిహి తంగా మెలగడం వలన ఈయన దష్టి అంతా సజనాత్మకత వైపు మళ్ళింది. వట్టికోట ఆళ్వారుస్వామి, రావి నారాయణ రెడ్డి, స్వామీ రామానంద తీర్థ లతో జాతీయోద్యమంలో పాల్గొన్నారు.
రచనలు : ఆత్మవేదన, ఈ ఆత్మవేదన రచనకు కాళోజి నారాయణరావు ముందుమాట రాశారు. చుక్కలు(1965), మెరుపులు, మా ఊరు, అక్షర దీప్తి(1993), సర్‌ బారాహి (నాయకత్వం వహించడం), న్యాయం, పాద ధూళి, పగ(నాటికలు), జైలు కథలు (1945), సైనికుని జాబులు లేఖలు(1947), ముల్లా కథలు, ఆచార్యుల వారి కథలు రాశారు. తన రచనలో నిజాం కాలం నాటి భూస్వాముల ఆగడాలను, ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఆడించిన వెట్టి చాకిరి బానిస కత్యాలను, నిజాం రజాకార్ల రాక్షసాలను, ప్రజలలో ఉండవలసిన ఐక్యమత్యాన్ని గురించి తెలిపారు. 1994 సం||లో వీరి సజనను గుర్తించిన తెలుగు విశ్వవిద్యాలయం వారు సజనాత్మక సాహిత్య పురస్కారం అందచేశారు. పొట్లపల్లి రామారావుకు సాహిత్య సభలన్నా, సన్మాన, సత్కారాలన్నా ఇష్టం ఉండేది కాదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక భారత ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులకు అందించే భూమిని, పెన్షన్‌ను పొందకుండా తిరస్కరించారు. ఈ విధంగా ప్రజల శ్రేయస్సును కోరి, భారత, హైదరాబాదు స్వాతంత్య్రం కొరకు ఉద్యమంలో పాల్గొంటూనే ప్రజా చైతన్యాత్మక సాహిత్యం రాసి ప్రజలను ఉద్యమంలో మమేకం చేసిన పొట్లపల్లి రామారావు లివర్‌ క్యాన్సర్‌ కారణంగా 2001లో సెప్టెంబర్‌10న హైదరాబాదులో కన్నుమూసారు.
- ఘనపురం సుదర్శన్‌,
9000470542

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కూలుతున్న కుటుంబాలు
బొమ్మలరామారంలో కొత్తరాతిబొమ్మల తావు
వేగు చుక్కల వెలుగు తార ఇరివెంటి కృష్ణమూర్తి
అమ్మకు ఓ బహుమతి
ఒట్టు... నీ మీద ఒట్టు
కూతురుగా పుట్టి కొడుకుగా భాద్యతలు నెరవేర్చిన ఆర్తి కథ ఆమా
నేడే... మేడే...
'చింతల'పాలెంలో శిథిల త్రికూటాలయం, అపూర్వ శిల్పాలు
తల లేని తోక!
అసమానతలు లేని సమాజాన్ని కాంక్షించిన నవల 'అవతలి గుడిసె'
మంచి జీవితానికి భరోసా
పర్యావరణ రక్షణే ధరిత్రీ రక్షణ
స్త్రీల రక్తం పీల్చేసి, జీవితాంతం పీక్కుతింటూన్న రాకాసి గద్ద వంటిల్లు ''ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌''
తరతరాల చికిత్స విధానం... కైరాలి ఆయుర్వేద విధానం
మూడు దశాబ్దాల చట్టసభల సభ్యుడు, స్వాతంత్య్ర సమరయోధుడు చెన్నమనేని రాజేశ్వరరావు
బాలల సినీ గీతకారుడు డా. సి.నారాయణ రెడ్డి
రిజర్వేషన్లు సామాజిక న్యాయం కోసం
విగ్రహం
తీరిక లేని ప్రధాని, సాహిత్య పిపాసి పి.వి.
తెలుగు ధ్వనిలో బహు లయలు
ప్రేక్షక హృదయాలలో శాశ్వత ముద్ర వేసిన పాకీజా
అపశతుల కోయిల ?!
ఉపాధ్యాయ, ఉప్పు సత్యాగ్రహి స్వామి రామానంద తీర్థ
పంజాబీ పల్లెటూరి స్త్రీ జీవన సమస్యలను చిత్రించిన ''గేలో''
బైపొలార్‌ రెండు పరస్పర వ్యతిరేక లక్షణాలు
నాటక రంగానికి జేజేలు
జానపద బాలల కవి పాలడుగు నాగయ్య
ఇంటికో దీపం!!
భారతీయ సినిమా తొలితరం నటి దేవికా రాణి
''నాది దు:ఖం వీడని దేశం''

తాజా వార్తలు

08:22 PM

ఐపీఎల్ : రెండో వికెట్ కోల్పోయిన చెన్నై

08:03 PM

ఆరుగురు ఎస్సైలకు బదిలీలు

07:58 PM

ఢిల్లీ చేరిన సీఎం కేసీఆర్‌..

07:57 PM

రాహుల్ భ‌ట్ హ‌త్య అత్యంత దుర‌దృష్ట‌క‌రం : ఎల్జీ మ‌నోజ్ సిన్హా

07:01 PM

పాట‌తో మిమ్మ‌ల్ని ప్ర‌శ్నిస్తున్నందుకు కేసులు పెట్టి అణ‌చివేస్తారా?: రేవంత్ రెడ్డి

06:52 PM

తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం

06:43 PM

జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ

06:23 PM

వాళ్లతో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పొత్తులు ఉండ‌వు: కేఏ పాల్

06:02 PM

ఒప్పో ఎలివేట్ ప్రోగ్రామ్ 2వ ఎడిషన్ కోసం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపిన ఒప్పో

05:59 PM

లండ‌న్‌లో రాహుల్ గాంధీ..

05:44 PM

హైదరాబాద్ కు ప్రధాని మోడీ.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

05:42 PM

ఏపీలో విషాదం..రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్‌ మృతి..

05:26 PM

పద చూస్కుందాం కమల్ 'విక్రమ్' తెలుగు ట్రైలర్..

05:06 PM

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..

04:50 PM

జాతీయ స్థాయి ప‌ర్య‌ట‌న నిమిత్తం ఢిల్లీ బ‌య‌ల్దేరిన సీఎం కేసీఆర్

04:29 PM

పదోతరగతి పరీక్షలు..విద్యార్థుల‌కు ఆర్టీసీ గుడ్ న్యూస్

03:46 PM

అలాంటి గుడివాడను క్యాసినోవాడగా కొడాలి నాని మార్చాడు : దివ్యవాణి

03:24 PM

జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్యే ఆజంఖాన్‌

03:04 PM

దిశ ఎన్‌కౌంటర్‌‌పై సుప్రీంలో ముగిసిన విచారణ..ఎన్ కౌంటర్ బూటకం

02:40 PM

పోలీసు ఉద్యోగార్థుల‌కు కేసీఆర్ గుడ్ న్యూస్

02:26 PM

లారీని ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్.. 9 మంది సజీవ దహనం

02:23 PM

గుంటూరు జీజీహెచ్లో సీపీఐ ఆందోళన

01:56 PM

ప్రముఖ నటుడు కెప్టెన్‌ చలపతి చౌదరి కన్నుమూత

01:45 PM

పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన..

01:33 PM

369 పోస్టులతో యూపీఎస్సీ సీడీఎస్‌ నోటిఫికేషన్‌..

01:18 PM

కారులో డ్రైవర్ మృతదేహం..వైసీపీ ఎమ్మెల్సీ వివరణ

01:16 PM

ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ ఫస్ట్ లుక్.. ఊర మాస్‌లుక్‌లో ఎన్టీఆర్

12:53 PM

రైలు పట్టాలపై యువకుని మృతదేహం

12:51 PM

ఏపీ ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు

12:24 PM

విశాఖలో 40 కిలోల గంజాయి స్వాధీనం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.