Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎంపిక | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Dec 05,2021

ఎంపిక

అది ఓ అడవి. అడవి అన్నాక చెట్లూ, పుట్టలూ, కొండలూ కోనలూ, బావులూ, చెర్లూ, కాలువలూ మాత్రమే ఉండవు కదా. చెట్లమీద ఎగిరేవీ, పుట్టల్లో పాకేవీ కొండ గుహల్లో ఉండేవి ఉంటాయి కదా. రెండు కాళ్ళవి నాలుక్కాళ్ళవి. రెక్కలున్నవి, కోరలున్నవి, తోకలున్నవి, నీళ్ళలో ఉండేవి, నీళ్ళమీద ఈదుతూ నేలమీద పరుగెడ్తూ ఉండేవి అనేకం ఉన్నాయి.
   ఇన్ని ఉన్నాయి కాని గాండ్రించేది, గర్జించేది లేక పోవడంతో అడవి ఇది వరకులా లేదు. ఎవరి ఇష్టం వాళ్ళు తిరిగేస్తున్నారు. జాతి లక్షణాలకు వ్యతిరేకంగా ఏదేదో చేస్తున్నారు. ఓ పద్ధతి పాడూ లేకుండా ఓ నియమమూ నీతి లేకుండా గడిపేస్తున్నారు. అసలు భయం అన్నదే లేకుండా పోయింది ఏ జీవికీ.
   ఇది వరకు ఏ పొదల చాటునుంచో గ్రాండ్రింపు వినపడితే చాలు చీమలు చిటుక్కుమనేవి కాదు. కోతులు కిచకిచలాడేవి కాదు. పక్షులు రెక్కలు దాచుకునేవి. ఇంకా పెద్ద జీవాలు ఇళ్ళల్లోకి పరుగెత్తి పోయేయి. ఇప్పుడు గ్రాండించే రాజు ఏలేవాడు లేకపోవడంతో జంతు ప్రపం చంలో క్రమశిక్షణ అనే మాట అసలులేకుండా పోయింది.
   అప్పుడప్పుడు చెట్ల నీడన సేదతీరుతుండే ముసలి జంతువులు ఈ విషయమే మాట్లాడుకుంటుండేవి. ఇది వరకు గాండ్రించే రాజు హయాంలో అంతా సాఫీగా జరిగిపోయేది. అంతకు ముందు గర్జించే రాజు జూలు విదిలిస్తే అంతా సవ్యంగా జరిగిపోయేది. ఇప్పుడు గాండ్రింపు, గర్జింపూ లేక అడవంతా ఆగమాగంగా ఉంది. అరుపులు, కేకలతో చెవులు చిల్లులు పడుతు న్నాయి. రాజులేకపోతే అడవి అయితేనేం రాజ్యం అయితేనేం. కుదురుగ్గా ఉండవు అనుకునేవి.
   ఈ 'సిట్యూయేషన్‌'లో ఈ అడవికి ఎవడో ఒకడు రాజుగా వచ్చి తీరాలి అప్పుడే పెద్దలమయిన మనకు మర్యాద దక్కుతుంది. ఒంటరిగా ఉండే ఆడ జంతువులకు 'ప్రొటెక్షన్‌' చిక్కుతుంది అనేకునే వారు.
   ఒకనాటి, మిట్ట మధ్యాహ్నం ఓ కొత్త జంతువు అడవి మధ్యకు పరుగులు పెడుతూ వచ్చింది. అదలారావడం గమనించిన మిగతా జంతువులకు అదేమిటో తెలియలేదు. దాన్ని వాళ్ళు ఎప్పుడూ చూసి ఉండలేదు. అడవి మధ్యకు వచ్చాక నాలుక్కాళ్ళ మీద నిలబడి బూడిద రంగులో ఉన్న ఆ జంతువు పొట్టి తోకను పైకెత్తి గిరగిరా తిప్పసాగింది.
   గూళ్ళల్లోంచి, రాళ్ళల్లోంచి, గుహ ల్లోంచి, మట్టి పుట్టల్లోంచి ఎవరికి వాళ్ళు ఈ కొత్త శాల్తీ ఈ స్ట్రేంజర్‌ ఈ ఆగంతకుడు ఎవరా అని మౌనంగా చూస్తూ ఉంటే ఓ కోతి చెట్టు కొమ్మ మీదినించి కిందకి గెంతింది.
   కోతి గదా కోతి బుద్ధి వదలదు కదా, చెట్టుమీదినించి కిందకు గెంతిన కోతి కొత్తగా వచ్చిన జంతువు వెనుకవైపుకి వెళ్ళి దాని కాలి పిక్క మీద గీరింది. అంతే!
   ఏమైందో అర్థం కాలేదు దానికి. గాలిలో ఎగిరి దబ్బుమని నేల మీద పడింది. కళ్ళు బైర్లుకమ్మినయి. అది దేని కాలి పిక్కమీద గీరిందో అది అదాట్టున తన వెనక కాళ్ళు పైకి లేపి దాన్ని వాటితో 'ఫెడీ'మని తన్నింది. ఊహించని ఈ కిక్‌కి 'షాక్‌' అయి అది నేలను కర్చుకుంది. అదలా నేలమీద తోక ముడుచుకుని చతికిల బడ్డంతో దాని 'బ్యాక్‌కిక్‌' ఫవర్‌కు అదే తెగ మురిసిపోయి నోరు తెరిచి 'డోల్బీడిజిటల్‌' సౌండ్‌తో దిక్కులు పిక్కటిల్లేట్టు అరిచింది.
   గాండ్రిపుకీ గర్జింపుకీ భయపడ్డ జంతువులన్నీ కడుపులో దేవినట్టూ చెవుల్లో సీసం కరిగించి పోసినట్టూ ఉన్న కర్ణకఠోర ధ్వనికి అధిరిపడ్డాయి. ఆ అదిరిపాటే కొత్తగా వచ్చిన జంతువుని ఆ అడవికి రాజును చేసింది.
   అడవికి రాజు దొరికాడు కదా అని సీనియర్‌ జంతువులు సంబర పడ్డవి. కానీ క్రమంగా వాటికి తెల్సి వచ్చింది. కొత్త రాజావారికి పెద్దా చిన్నా బేధం లేదని వెనక కాళ్ళతో ఫెడీ ఫెడీ తన్నడం, నోరు బార్లా తెరిచి నోటికొచ్చిన కూతలు కుయ్యడం తప్ప మరేమీ చెయ్యదని.
   అడవిలో క్రమశిక్షణ అనేదేమీ, కొత్తగా లేదు. కానీ ఉన్నది కూడా ఊడ్చుకుపోయింది. నీతిని నిలువెత్తు గొయ్యి తీసి పాతి పెట్టింది. అవినీతి కొత్తరాజు. పాత చట్టాల కాగితాలనీ తెప్పించి అన్నీ చూస్తుండగానే నోట్లో కుక్కుకుని నమిలి మింగేసింది. తర్వాత కొత్త చట్టాలు తనే దస్తాల కొద్దీ కాగితాల మీద రాయించడం వాటిని తనే తర్వాత నమిలి మింగేయడం, అసలు నమిలి మింగేయడం కోసం చట్టాలు చేయడం మొదలు పెట్టింది. ఒకనాటి అర్థరాత్రి పూట అడవి మధ్య గాండ్రింపు వినిపివచింది. జంతు వులన్నీ పాత రాజు వచ్చాడని సంతో షపడ్డవి. కొత్తగా వచ్చిన రాజు బానపొట్ట నిండా మింగిన చట్టాలతో ఎటో పారిపోయింది,
   ఓండ్రకీ గాండ్రింపుకీ తేడా తెల్సుకోవలసిన అవసరం ఉంది. జంతువులకైనా మనుషులకైనా!!
- చింతపట్ల సుదర్శన్‌, 92998092912

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కూలుతున్న కుటుంబాలు
బొమ్మలరామారంలో కొత్తరాతిబొమ్మల తావు
వేగు చుక్కల వెలుగు తార ఇరివెంటి కృష్ణమూర్తి
అమ్మకు ఓ బహుమతి
ఒట్టు... నీ మీద ఒట్టు
కూతురుగా పుట్టి కొడుకుగా భాద్యతలు నెరవేర్చిన ఆర్తి కథ ఆమా
నేడే... మేడే...
'చింతల'పాలెంలో శిథిల త్రికూటాలయం, అపూర్వ శిల్పాలు
తల లేని తోక!
అసమానతలు లేని సమాజాన్ని కాంక్షించిన నవల 'అవతలి గుడిసె'
మంచి జీవితానికి భరోసా
పర్యావరణ రక్షణే ధరిత్రీ రక్షణ
స్త్రీల రక్తం పీల్చేసి, జీవితాంతం పీక్కుతింటూన్న రాకాసి గద్ద వంటిల్లు ''ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌''
తరతరాల చికిత్స విధానం... కైరాలి ఆయుర్వేద విధానం
మూడు దశాబ్దాల చట్టసభల సభ్యుడు, స్వాతంత్య్ర సమరయోధుడు చెన్నమనేని రాజేశ్వరరావు
బాలల సినీ గీతకారుడు డా. సి.నారాయణ రెడ్డి
రిజర్వేషన్లు సామాజిక న్యాయం కోసం
విగ్రహం
తీరిక లేని ప్రధాని, సాహిత్య పిపాసి పి.వి.
తెలుగు ధ్వనిలో బహు లయలు
ప్రేక్షక హృదయాలలో శాశ్వత ముద్ర వేసిన పాకీజా
అపశతుల కోయిల ?!
ఉపాధ్యాయ, ఉప్పు సత్యాగ్రహి స్వామి రామానంద తీర్థ
పంజాబీ పల్లెటూరి స్త్రీ జీవన సమస్యలను చిత్రించిన ''గేలో''
బైపొలార్‌ రెండు పరస్పర వ్యతిరేక లక్షణాలు
నాటక రంగానికి జేజేలు
జానపద బాలల కవి పాలడుగు నాగయ్య
ఇంటికో దీపం!!
భారతీయ సినిమా తొలితరం నటి దేవికా రాణి
''నాది దు:ఖం వీడని దేశం''

తాజా వార్తలు

07:58 PM

ఢిల్లీ చేరిన సీఎం కేసీఆర్‌..

07:57 PM

రాహుల్ భ‌ట్ హ‌త్య అత్యంత దుర‌దృష్ట‌క‌రం : ఎల్జీ మ‌నోజ్ సిన్హా

07:01 PM

పాట‌తో మిమ్మ‌ల్ని ప్ర‌శ్నిస్తున్నందుకు కేసులు పెట్టి అణ‌చివేస్తారా?: రేవంత్ రెడ్డి

06:52 PM

తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం

06:43 PM

జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ

06:23 PM

వాళ్లతో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పొత్తులు ఉండ‌వు: కేఏ పాల్

06:02 PM

ఒప్పో ఎలివేట్ ప్రోగ్రామ్ 2వ ఎడిషన్ కోసం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపిన ఒప్పో

05:59 PM

లండ‌న్‌లో రాహుల్ గాంధీ..

05:44 PM

హైదరాబాద్ కు ప్రధాని మోడీ.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

05:42 PM

ఏపీలో విషాదం..రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్‌ మృతి..

05:26 PM

పద చూస్కుందాం కమల్ 'విక్రమ్' తెలుగు ట్రైలర్..

05:06 PM

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..

04:50 PM

జాతీయ స్థాయి ప‌ర్య‌ట‌న నిమిత్తం ఢిల్లీ బ‌య‌ల్దేరిన సీఎం కేసీఆర్

04:29 PM

పదోతరగతి పరీక్షలు..విద్యార్థుల‌కు ఆర్టీసీ గుడ్ న్యూస్

03:46 PM

అలాంటి గుడివాడను క్యాసినోవాడగా కొడాలి నాని మార్చాడు : దివ్యవాణి

03:24 PM

జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్యే ఆజంఖాన్‌

03:04 PM

దిశ ఎన్‌కౌంటర్‌‌పై సుప్రీంలో ముగిసిన విచారణ..ఎన్ కౌంటర్ బూటకం

02:40 PM

పోలీసు ఉద్యోగార్థుల‌కు కేసీఆర్ గుడ్ న్యూస్

02:26 PM

లారీని ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్.. 9 మంది సజీవ దహనం

02:23 PM

గుంటూరు జీజీహెచ్లో సీపీఐ ఆందోళన

01:56 PM

ప్రముఖ నటుడు కెప్టెన్‌ చలపతి చౌదరి కన్నుమూత

01:45 PM

పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన..

01:33 PM

369 పోస్టులతో యూపీఎస్సీ సీడీఎస్‌ నోటిఫికేషన్‌..

01:18 PM

కారులో డ్రైవర్ మృతదేహం..వైసీపీ ఎమ్మెల్సీ వివరణ

01:16 PM

ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ ఫస్ట్ లుక్.. ఊర మాస్‌లుక్‌లో ఎన్టీఆర్

12:53 PM

రైలు పట్టాలపై యువకుని మృతదేహం

12:51 PM

ఏపీ ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు

12:24 PM

విశాఖలో 40 కిలోల గంజాయి స్వాధీనం

12:17 PM

బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కాల్

11:36 AM

నిఖత్ జరీన్ కు ప్రధాని మోడీ, ఆనంద్ మహీంద్రా అభినందనలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.