Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బాలల బంధువు బి.ఎన్‌.శాస్త్రి | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Dec 05,2021

బాలల బంధువు బి.ఎన్‌.శాస్త్రి

గ్రామంలోని సబ్బండ వర్ణాలపట్ల, గ్రామ జీవితం, కళలు, కళారూపాలపట్ల ప్రేమ, అవగాహన వుంది. వాటిని తన తరువాతి తరం వారికి వారసత్వంగా అందించాలనుకున్న కవి అవసరంలేకున్నా పిల్లలు ఆటలు ఆడుకుని ఇంటికి వెళ్ళే సమయంలో మన కళలు, కళారాపాలును పరిచయం చేస్తారు. అందులో భాగంగా 'బహురూపు'ల వేషగాళ్ళను పరిచయం చేస్తారు. మన తుపాకీ రాముని గురించి చెబుతారు. తుపాకిరాముని గప్పాలు ఎలా ఉంటాయో, పిల్లలకు తెలుపుతారు. చరిత్ర రచనలాగే నిబద్ధతతో బాలల కోసం చక్కని రచన చేసిన బాల సాహితీమూర్తి... నిత్య చైతన్య స్పూర్తి బి.ఎన్‌. శాస్త్రి.
   'చరిత్ర రచనలోనూ తెలంగాణాకు దగా'' అంటూ ఆవేదన చెందిన బి.ఎన్‌.శాస్త్రి 10 డిసెంబర్‌, 1932న నల్లగొండజిల్లా తుమ్మల గూడెంలో పుట్టారు. ఒక్క చేతిమీదుగా వేలాది పుటలను రాసిపోసిన డాక్టరేటు లేని పరిశోధకులు. ఉమ్మడి రాష్ట్రంలోని దాదాపు నాలుగువేల గ్రామాలు పర్య టించి, వందలాది శాసనాలు, తాళ పత్రాలను సేకరించిన శాస్త్రి త్రిపురాం తకానికి చెందిన 105 శాసనాలు, ముఖలింగానికి చెందిన 147 శాసనాలను పరిష్కరించి ప్రచురించారు. 75కు పైగా గ్రంథాలను రచించిన శాస్త్రిగారు విష్ణుకుండినుల చరిత్ర ద్వారా తెలంగాణా చరిత్రకు మరో అయిదు వందల సంవత్సరాల ఆయుష్షును పోసారు.
   బి.ఎన్‌.శాస్త్రి తొలినాళ్ళ నుంచి సృజనశీలి. 1954 రచనకు శ్రీకారం చుట్టి రెండు నాటికలు, తొమ్మిది నవలలు రాసారు. తెలంగాణ వైతాళికుడు పులిజాల రంగారావుగారి జీవిత చరిత్ర రాసారు. ఆంధ్రదేశ చరిత్ర మూడు సంపుటాలు, భారతదేశ చరిత్ర 21 సంపుటాలు శాస్త్రిగారి చేతుల్లో రూపుదిద్దుకున్నాయి. రచయితగా ఎన్నో విలువైన రచనలు చేసిన బి.ఎన్‌.శాస్త్రి కూడా తొలితరం సాహితీవేత్తలలాగే నవలలు, నాటికలతో పాటు తమవంతు బాధ్యతగా పిల్లల కోసం 'పాపాయి పతకం' అనే బాలల గేయ కావ్యం రాశారు.
   ఆనాటి హైదరాబాద్‌ బాలల రచనాలయం నిర్వహించిన కార్యశాలలో పాల్గొని రచనలు చేసినవారిలో వీరొకరు. 1960లోనే పిల్లల కోసం రచనలు చేసిన బి.ఎన్‌.శాస్త్రి పేరు కూడా బాల సాహిత్య చరిత్రలో నమోదుకాలేదు. వీరి ఈ 'పాపాయి పతకం' చక్కని గేయ కథా కావ్యం. బాల్యాన్ని, బాల్యంలోని స్నేహాన్ని, మాధుర్యాన్ని వివరించడమే కాక ఆటలు, పాటలు, పిల్లలు, వాళ్ళ మనస్తత్వాల్ని అందంగా చిత్రించిన గేయకథా కావ్యమిది. పిల్లలు ఎక్కడైనా పిల్లలే! బాల్యం ఎక్కడైనా ఒకే విధంగా ఉంటుంది. దాని ఆనందం, ఆశలు, ఆలోచనలు, కోరికలు ఒకేలా ఉంటాయి. ఇది ఇద్దరు అన్నాచెల్లెళ్ళ కథ. ఆనందు, అతని చెల్లెలు పాపాయి ఇందులోని ప్రధాన పాత్రలు. చిన్నారి పాపాయి అంటే ఇంటిల్లిపాదికే కాక ఆనందు మిత్రులకు కూడా ముద్దే. అటువంటి పాపాయికి ఎంతో ప్రేమతో అమ్మానాన్నలు బంగారు గొలుసును, దానికి ఒక పతకాన్ని చేయించి మెడలో వేస్తారు. ఒకనాడు ఆటలాడుకునేప్పుడు అది ఎక్కడో జారి పడిపోతుంది, ఆ తరువాత జరిగిన సంఘటనలు, పరిణామాలను ఇందులో కథగా మలిచారు కవి. నిరంతర పరిశోధన, శాసనాల పరిష్కారం వంటి విషయాల్లో తలమునకలైవుండే శాస్త్రి పిల్లలకోసం రాయడం గొప్ప విషయం. అందులోనూ అలతిఅలతి పదాలతో బాలల స్థాయికి ఎదిగి గేయాన్ని చెప్పడం వారి పరిణతికి నిదర్శనం. గేయకథ ఆరంభంలోని ఎత్తుగడే గేయంపట్ల వారికిగల సాధికారతను తెలుపుతుంది.
   'అనగనగా ఒక ఊరు/ ఆ వూరిలోన/ ఆనందు అనియేటి/ అబ్బాయి కలడు' అంటూ నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు, మేనత్తలు పిల్లలకు ఏడు చేపలకథ చెప్పినట్టు చెప్పే ఆకర్షణీయమైన పద్దతి కనిపిస్తుంది. ఇది చతురస్రగ గతిలో సాగిన గేయకథ. పాడడానికి అనువుగా సాగుతుంది. గేయానికి ప్రాణం లయ. ఆ లయ ఈ గేయకథలో చక్కగా సాగడమేకాక ఆసక్తిని కూడా కలిగిస్తుంది. 'ఓ పాప మా పాప/ఓ చిన్ని పాప/ ఆడుకోబోదాము/అందరితో మనము', 'భయమేల చెల్లిరో!/బాబాయి లేడా! అమ్మ మననేమన్న/అతనడ్డు రాడా!' వంటివి పిల్లలను, వాళ్ళ మనస్తత్త్వాన్ని అతి దగ్గరగా చూసినవాళ్ళు మాత్రమే రాయగలరు.
   ఉమ్మడి కుటుంబపు ప్రేమలు, ఒక తరం నుంచి మరోతరానికి వారసత్వంగా వస్తున్న ఆప్యాయతా, అనురాగాలు, విలువలు బాల్యం నుంచే ఎలా అలవడుతాయనేది కవి ఎంత చక్కగా చెప్పారో చూడవచ్చు. పాపాయికి ఆనందు మిత్రుల్లో కొందరు నచ్చకున్నా పక్కన రాంబాబు, గోపాలు, వాసంతి, కమల, గోపాలకృష్ణ, శాంతమ్మ, విమల, కాంతమ్మ, పాల రామన్న, బుజ్జాయి అందరు కలిసి ఆడుకుంటారు. ఆటముగిసినాక వెళ్ళి వాగులో దూకుతారు. ఇసుకలో ఆడుగూ, పాడుతూ ఉంటారు. ఈ సందర్భంలో కవి బాలలు చేసే చేష్టలను ఎంతో అద్భుతంగా వర్ణిస్తారు. 'ఇండ్లెన్నో కట్టారు/ఇంపుగా వారు/బావులు త్రవ్వారు/బాట లేశారు/కాల్వలు తవ్వారు/కట్ట లేశారు/చెట్లను నాటారు / గట్లు పోశారు' అంటారు. నల్లగొండ జిల్లాలోని పల్లెటూరులో పుట్టిపెరిగిన కవి శాస్త్రి. తన గ్రామంలోని సబ్బండ వర్ణాలపట్ల, గ్రామ జీవితం, కళలు, కళారూపాలపట్ల ప్రేమ, అవగాహన వుంది. వాటిని తన తరువాతి తరం వారికి వారసత్వంగా అందించాలనుకున్న కవి అవసరంలేకున్నా పిల్లలు ఆటలు ఆడుకుని ఇంటికి వెళ్ళే సమయంలో మన కళలు, కళారాపాలును పరిచయం చేస్తారు. అందులో భాగంగా 'బహురూపు'ల వేషగాళ్ళను పరిచయం చేస్తారు. మన తుపాకీ రాముని గురించి చెబుతారు. తుపాకిరాముని గప్పాలు ఎలా ఉంటాయో, పిల్లలకు తెలుపుతారు. చరిత్ర రచనలాగే నిబద్ధతతో బాలల కోసం చక్కని రచన చేసిన బాల సాహితీమూర్తి... నిత్య చైతన్య స్పూర్తి బి.ఎన్‌. శాస్త్రి.
- డా|| పత్తిపాక మోహన్‌ 9966229548

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కూలుతున్న కుటుంబాలు
బొమ్మలరామారంలో కొత్తరాతిబొమ్మల తావు
వేగు చుక్కల వెలుగు తార ఇరివెంటి కృష్ణమూర్తి
అమ్మకు ఓ బహుమతి
ఒట్టు... నీ మీద ఒట్టు
కూతురుగా పుట్టి కొడుకుగా భాద్యతలు నెరవేర్చిన ఆర్తి కథ ఆమా
నేడే... మేడే...
'చింతల'పాలెంలో శిథిల త్రికూటాలయం, అపూర్వ శిల్పాలు
తల లేని తోక!
అసమానతలు లేని సమాజాన్ని కాంక్షించిన నవల 'అవతలి గుడిసె'
మంచి జీవితానికి భరోసా
పర్యావరణ రక్షణే ధరిత్రీ రక్షణ
స్త్రీల రక్తం పీల్చేసి, జీవితాంతం పీక్కుతింటూన్న రాకాసి గద్ద వంటిల్లు ''ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌''
తరతరాల చికిత్స విధానం... కైరాలి ఆయుర్వేద విధానం
మూడు దశాబ్దాల చట్టసభల సభ్యుడు, స్వాతంత్య్ర సమరయోధుడు చెన్నమనేని రాజేశ్వరరావు
బాలల సినీ గీతకారుడు డా. సి.నారాయణ రెడ్డి
రిజర్వేషన్లు సామాజిక న్యాయం కోసం
విగ్రహం
తీరిక లేని ప్రధాని, సాహిత్య పిపాసి పి.వి.
తెలుగు ధ్వనిలో బహు లయలు
ప్రేక్షక హృదయాలలో శాశ్వత ముద్ర వేసిన పాకీజా
అపశతుల కోయిల ?!
ఉపాధ్యాయ, ఉప్పు సత్యాగ్రహి స్వామి రామానంద తీర్థ
పంజాబీ పల్లెటూరి స్త్రీ జీవన సమస్యలను చిత్రించిన ''గేలో''
బైపొలార్‌ రెండు పరస్పర వ్యతిరేక లక్షణాలు
నాటక రంగానికి జేజేలు
జానపద బాలల కవి పాలడుగు నాగయ్య
ఇంటికో దీపం!!
భారతీయ సినిమా తొలితరం నటి దేవికా రాణి
''నాది దు:ఖం వీడని దేశం''

తాజా వార్తలు

06:52 PM

తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం

06:43 PM

జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ

06:23 PM

వాళ్లతో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పొత్తులు ఉండ‌వు: కేఏ పాల్

06:02 PM

ఒప్పో ఎలివేట్ ప్రోగ్రామ్ 2వ ఎడిషన్ కోసం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపిన ఒప్పో

05:59 PM

లండ‌న్‌లో రాహుల్ గాంధీ..

05:44 PM

హైదరాబాద్ కు ప్రధాని మోడీ.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

05:42 PM

ఏపీలో విషాదం..రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్‌ మృతి..

05:26 PM

పద చూస్కుందాం కమల్ 'విక్రమ్' తెలుగు ట్రైలర్..

05:06 PM

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..

04:50 PM

జాతీయ స్థాయి ప‌ర్య‌ట‌న నిమిత్తం ఢిల్లీ బ‌య‌ల్దేరిన సీఎం కేసీఆర్

04:29 PM

పదోతరగతి పరీక్షలు..విద్యార్థుల‌కు ఆర్టీసీ గుడ్ న్యూస్

03:46 PM

అలాంటి గుడివాడను క్యాసినోవాడగా కొడాలి నాని మార్చాడు : దివ్యవాణి

03:24 PM

జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్యే ఆజంఖాన్‌

03:04 PM

దిశ ఎన్‌కౌంటర్‌‌పై సుప్రీంలో ముగిసిన విచారణ..ఎన్ కౌంటర్ బూటకం

02:40 PM

పోలీసు ఉద్యోగార్థుల‌కు కేసీఆర్ గుడ్ న్యూస్

02:26 PM

లారీని ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్.. 9 మంది సజీవ దహనం

02:23 PM

గుంటూరు జీజీహెచ్లో సీపీఐ ఆందోళన

01:56 PM

ప్రముఖ నటుడు కెప్టెన్‌ చలపతి చౌదరి కన్నుమూత

01:45 PM

పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన..

01:33 PM

369 పోస్టులతో యూపీఎస్సీ సీడీఎస్‌ నోటిఫికేషన్‌..

01:18 PM

కారులో డ్రైవర్ మృతదేహం..వైసీపీ ఎమ్మెల్సీ వివరణ

01:16 PM

ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ ఫస్ట్ లుక్.. ఊర మాస్‌లుక్‌లో ఎన్టీఆర్

12:53 PM

రైలు పట్టాలపై యువకుని మృతదేహం

12:51 PM

ఏపీ ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు

12:24 PM

విశాఖలో 40 కిలోల గంజాయి స్వాధీనం

12:17 PM

బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కాల్

11:36 AM

నిఖత్ జరీన్ కు ప్రధాని మోడీ, ఆనంద్ మహీంద్రా అభినందనలు

11:26 AM

మెట్టుగూడ వద్ద పవన్ కు ఘన స్వాగతం

10:58 AM

హెల్మెట్ విసిరి, బ్యాట్ ను విరగ్గొట్టిన మ్యాథ్యూ వేడ్

10:49 AM

నిజామాబాద్‌లో చెట్టును ఢీకొట్టిన కారు: వ్యక్తి మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.