Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి బాల సాహిత్య పురస్కార గ్రహీత గంగరాజు సుశీలాదేవి | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Dec 12,2021

ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి బాల సాహిత్య పురస్కార గ్రహీత గంగరాజు సుశీలాదేవి

వ్యవసాయంలో మహిళల పాత్రకు గుర్తింపునిస్తూ నిర్వహించిన కార్యక్రమాల్లో 'వ్యవసాయ స్త్రీలు' ఒకటి. గేయాలు, 'రత్నప్రభ' కలం పేరుతో కథలు రాశారు.'చిట్టి ముత్యాలు' బాల గేయ సంపుటి. 'ఆర్ధ్ర హృదయం' కవితా సంపుటాలు సుశీలాదేవికి పేరుతెచ్చిన పుస్తకాలు. అప్పటి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి అన్ని ప్రక్రియలను ప్రోత్సహించడానికి పురస్కారాలను ప్రారంభించగా 1966లో సుశీలాదేవి బాలల గేయాలు 'చిట్టి ముత్యాలు'కు ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి 'బాల సాహిత్య పురస్కారం' లభించింది.
   అరవై, డెబ్బయ్యవ దశకాల్లో మనకు పిల్లల కార్యక్రమాలనగానే మొదటగా గుర్తు కొచ్చేది 'బాలానందం'. 'బాలా వినోదం విందాం బాలల్లారా! రారండి' అన్న పిలుపు వినగానే ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళమైనా ఉరికొచ్చి రేడియోల ముందు చెవులురిక్కించి కూర్చునేవాళ్ళం. నేటి ప్రముఖ రచయితలెందరో తొలినాటి వెలుగులను బాలనందం నుంచి అందుకున్నవాళ్ళే. ముఖ్యంగా న్యాయపతి రాఘవరావు దంపతులు, తురగా జానకీరాణి వంటి ఎందరో ఈ దిశగా గొప్ప కృషిని చేశారు. ఇదే సమయంలో నల్లగొండ ప్రాంతం నుంచి హైదరాబాద్‌ రేడియోలో వినిపించిన స్వరం గంగరాజు సుశీలాదేవి గారిది.
   'పుట్టినది మట్టిలో కలిసి గిట్టుకొరకా?/ నాకు కావలె జన్మ సార్ధక్య యశము' అంటూ గేయరూపాత్మక ఆత్మకథలో చెప్పుకున్న స్వాతంత్య్రానంతర బాల సాహితీమూర్తి గంగరాజు సుశీలాదేవి రేడియో కార్యక్రమాల రూపకర్తగా, బాలగేయకర్తగా, బాలల నాటక, కథా రచయిత్రిగా సుపరిచితులు. 1939 ఆగస్టు, 27న నేటి జనగామ జిల్లా సిద్దెంకిలో పుట్టారు. 'బొమ్మరిం టాటలాడెడి ప్రాయముననె/ అత్త వారింటిలో కాలు పెట్టవలసె' అంటూ తొమ్మిదేండ్ల ప్రాయంలోనే గంగరాజు హన్మంతరావుతో జరిగిన తన వివాహాన్ని గురించి చెప్పుకున్నారు తన ఆత్మకథలో. బాల్యంలో వివాహం జరిగినా అది సుశీలాదేవి సృజనకు ఎక్కడా ఆటంకం కాలేదు.
   'రేడియో అక్కయ్య' తురగా జానకీరాణి ప్రోత్సాహంతో 'ఆకాశవాణి'కి పాటలు రాశారు సుశీలాదేవి. ఇప్పటికీ ఆకాశవాణిలో మిక్కిలి ప్రాఛుర్యాన్ని పొందిన 'ఈ మాసపుపాట', 'ఈ పాట నేర్చుకుందాం' కార్యక్రమాల్లో వీరి లలితగేయాలు ప్రసారమయ్యాయి. గ్రామీణ వాతావరణంలో పుట్టి పురిగిన గంగరాజు సుశీలాదేవికి వ్యవసాయం గురించి, వ్యవసాయ పద్ధతుల గురించి బాగా తెలుసు. ఈ అంశాల మీద పలు రేడియో ప్రసంగాలు చేశారు. మహిళాభ్యుదయం వల్లే సమాజ పురోభివృద్ధి అని నమ్మిన వీరు మహిళలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలను రేడియోలో నిర్వహించారు. ముఖ్యంగా వ్యవసాయంలో మహిళల పాత్రకు గుర్తిం పునిస్తూ నిర్వహించిన కార్యక్రమాల్లో 'వ్యవసాయ స్త్రీలు' ఒకటి. గేయాలు, 'రత్నప్రభ' కలం పేరుతో కథలు రాశారు.'చిట్టి ముత్యాలు' బాల గేయ సంపుటి. 'ఆర్ధ్ర హృదయం' కవితా సంపుటాలు సుశీలాదేవికి పేరుతెచ్చిన పుస్తకాలు.
   అప్పటి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి అన్ని ప్రక్రియలను ప్రోత్సహించడానికి పురస్కారాలను ప్రారంభించగా 1966లో సుశీలాదేవి బాలల గేయాలు 'చిట్టి ముత్యాలు'కు ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి 'బాల సాహిత్య పురస్కారం' లభించింది. 'గంగిరెద్దు చూడరా/ఎంతో బాగుందిరా/గండోలు ఊగించే/డూ డూ బసవన్న రా!/ఇంటింటను చక్కగా/తన విద్దెను చూపునురా/దయా ధర్మ బిక్షను గొని/దీవించి పోవునురా!' అంటూ గంగిరెద్దుల ఆటను చక్కగా బాలల కళ్ళకు కట్టినట్టు గేయంలో అక్షరచిత్రాలు గీస్తారు సుశీలాదేవి. 'విద్యార్థీ వినరా! హితము తెలిసికొనరా!/విద్య ఒక్కటే నీకు తరిగిపోని ధనమురా!' అంటూ చక్కని హితబోధ చేస్తూ రాసిన వీరి బాలగేయాలు లలిత గేయాల్లా లలితంగా ఉంటాయి. అమ్మమాట లాగా, కమ్మని తెలుగు పాటలాగా భాసిస్తాయి. 'మొక్కై వంగనిదే మానై వంగునా' అన్న మాట మనకు తెలిసిందే, అందుకే ఎదిగే దశలోనే పిల్లలకు చక్కని సంస్కారం నేర్పాలన్న తపన వీరి రచనల్లో అణువనువునా కనిపిస్తుంది. అ దిశగానే 'నీ ప్రగతియే దేశానికి సుగతిరా! నీ ఉన్నత సంస్కారమె జాతి పురోగతిరా!' అంటారు. 'చిట్టి ముత్యాలు' 1964-65 మధ్య రాశారు సుశీలాదేవి. తాను 'చిట్టి చిట్టి ముత్యాలతో / కట్టిన యీ సరం / అన్నయ్యకు అంకితం' అంటూ రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవరావుకు అంకితం చేశారు.
   సరదాగా పాడుకునే గేయాలేకాదు చక్కని హేతువు కలిగిన గేయాలనూ రాశారు సుశీలాదేవి. వీటిలో 'గుడికెందుకే అమ్మా' అన్న గేయం ఆలోచింపజేసే గేయం. 'గుడికెందుకే అమ్మ గుడికెందుకే / గుడిలోని బొమ్మకూ ముడుపెందుకే' అంటూ తల్లిని ప్రశ్నిస్తాడు అబ్బాయి. ప్రశ్నించడమే కాక తనకు బడిలో ఉపాధ్యాయుడు చెప్పిన పాఠాలను మననం చేసుకుంటూ, తల్లికి వివరిస్తాడు. 'దీన మానవులలోన దేవుంటాడని/మానవుని సేవయే మాధవుని సేవయని/చదువుకున్నానమ్మ పాఠాలలోన/నిన్నే నిత్యము పూజింతునమ్మ' అంటూ రాతి బొమ్మల్లోన కాదు తల్లిలోనే దైవమున్నాడని చెబుతాడు. 'తెల్లావు దూడ/తెల్లావు దూడ/ బుల్లి మా దూడ / తెల్లావు దూడ', 'ముద్ద మందారమ్ము/ విరిసింది నేడు' వంటి లయాత్మకమైన గేయాలతో పాటు 'వనమహోత్సవం' వంటి ప్రత్యేక అంశాలపట్ల పిల్లలో చేతనను కలిగిస్తూ రచనలు చేశారు. 'మీ అమ్మ ప్రేమతో/ మిము పెంచులాగ/చిన్న మొక్కలను మీరు/పెంచుకుంటేను' ఏపుగా పెరిగి సంతోషాన్ని కలిగిస్తాయంటారు. చక్కని బాల సాహిత్యాన్ని, లలితగీతాల్ని, పిల్లలకోసం, మహిళల కోసం పలు రచనల్ని చేసిన రచయిత్రి సుశీలాదేవి.
- డా|| పత్తిపాక మోహన్‌ 9966229548

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కూలుతున్న కుటుంబాలు
బొమ్మలరామారంలో కొత్తరాతిబొమ్మల తావు
వేగు చుక్కల వెలుగు తార ఇరివెంటి కృష్ణమూర్తి
అమ్మకు ఓ బహుమతి
ఒట్టు... నీ మీద ఒట్టు
కూతురుగా పుట్టి కొడుకుగా భాద్యతలు నెరవేర్చిన ఆర్తి కథ ఆమా
నేడే... మేడే...
'చింతల'పాలెంలో శిథిల త్రికూటాలయం, అపూర్వ శిల్పాలు
తల లేని తోక!
అసమానతలు లేని సమాజాన్ని కాంక్షించిన నవల 'అవతలి గుడిసె'
మంచి జీవితానికి భరోసా
పర్యావరణ రక్షణే ధరిత్రీ రక్షణ
స్త్రీల రక్తం పీల్చేసి, జీవితాంతం పీక్కుతింటూన్న రాకాసి గద్ద వంటిల్లు ''ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌''
తరతరాల చికిత్స విధానం... కైరాలి ఆయుర్వేద విధానం
మూడు దశాబ్దాల చట్టసభల సభ్యుడు, స్వాతంత్య్ర సమరయోధుడు చెన్నమనేని రాజేశ్వరరావు
బాలల సినీ గీతకారుడు డా. సి.నారాయణ రెడ్డి
రిజర్వేషన్లు సామాజిక న్యాయం కోసం
విగ్రహం
తీరిక లేని ప్రధాని, సాహిత్య పిపాసి పి.వి.
తెలుగు ధ్వనిలో బహు లయలు
ప్రేక్షక హృదయాలలో శాశ్వత ముద్ర వేసిన పాకీజా
అపశతుల కోయిల ?!
ఉపాధ్యాయ, ఉప్పు సత్యాగ్రహి స్వామి రామానంద తీర్థ
పంజాబీ పల్లెటూరి స్త్రీ జీవన సమస్యలను చిత్రించిన ''గేలో''
బైపొలార్‌ రెండు పరస్పర వ్యతిరేక లక్షణాలు
నాటక రంగానికి జేజేలు
జానపద బాలల కవి పాలడుగు నాగయ్య
ఇంటికో దీపం!!
భారతీయ సినిమా తొలితరం నటి దేవికా రాణి
''నాది దు:ఖం వీడని దేశం''

తాజా వార్తలు

07:01 PM

పాట‌తో మిమ్మ‌ల్ని ప్ర‌శ్నిస్తున్నందుకు కేసులు పెట్టి అణ‌చివేస్తారా?: రేవంత్ రెడ్డి

06:52 PM

తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం

06:43 PM

జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ

06:23 PM

వాళ్లతో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పొత్తులు ఉండ‌వు: కేఏ పాల్

06:02 PM

ఒప్పో ఎలివేట్ ప్రోగ్రామ్ 2వ ఎడిషన్ కోసం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపిన ఒప్పో

05:59 PM

లండ‌న్‌లో రాహుల్ గాంధీ..

05:44 PM

హైదరాబాద్ కు ప్రధాని మోడీ.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

05:42 PM

ఏపీలో విషాదం..రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్‌ మృతి..

05:26 PM

పద చూస్కుందాం కమల్ 'విక్రమ్' తెలుగు ట్రైలర్..

05:06 PM

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..

04:50 PM

జాతీయ స్థాయి ప‌ర్య‌ట‌న నిమిత్తం ఢిల్లీ బ‌య‌ల్దేరిన సీఎం కేసీఆర్

04:29 PM

పదోతరగతి పరీక్షలు..విద్యార్థుల‌కు ఆర్టీసీ గుడ్ న్యూస్

03:46 PM

అలాంటి గుడివాడను క్యాసినోవాడగా కొడాలి నాని మార్చాడు : దివ్యవాణి

03:24 PM

జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్యే ఆజంఖాన్‌

03:04 PM

దిశ ఎన్‌కౌంటర్‌‌పై సుప్రీంలో ముగిసిన విచారణ..ఎన్ కౌంటర్ బూటకం

02:40 PM

పోలీసు ఉద్యోగార్థుల‌కు కేసీఆర్ గుడ్ న్యూస్

02:26 PM

లారీని ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్.. 9 మంది సజీవ దహనం

02:23 PM

గుంటూరు జీజీహెచ్లో సీపీఐ ఆందోళన

01:56 PM

ప్రముఖ నటుడు కెప్టెన్‌ చలపతి చౌదరి కన్నుమూత

01:45 PM

పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన..

01:33 PM

369 పోస్టులతో యూపీఎస్సీ సీడీఎస్‌ నోటిఫికేషన్‌..

01:18 PM

కారులో డ్రైవర్ మృతదేహం..వైసీపీ ఎమ్మెల్సీ వివరణ

01:16 PM

ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ ఫస్ట్ లుక్.. ఊర మాస్‌లుక్‌లో ఎన్టీఆర్

12:53 PM

రైలు పట్టాలపై యువకుని మృతదేహం

12:51 PM

ఏపీ ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు

12:24 PM

విశాఖలో 40 కిలోల గంజాయి స్వాధీనం

12:17 PM

బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కాల్

11:36 AM

నిఖత్ జరీన్ కు ప్రధాని మోడీ, ఆనంద్ మహీంద్రా అభినందనలు

11:26 AM

మెట్టుగూడ వద్ద పవన్ కు ఘన స్వాగతం

10:58 AM

హెల్మెట్ విసిరి, బ్యాట్ ను విరగ్గొట్టిన మ్యాథ్యూ వేడ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.