Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
చరిత్రకెక్కని 'బాలనీతి'కారుడు జి. రాములు | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Dec 19,2021

చరిత్రకెక్కని 'బాలనీతి'కారుడు జి. రాములు

''సాహిత్యం సందేశాత్మకంగా, వ్యక్తికి, సమాజాలకు సంస్కరణాత్మకం'' గా ఉండాలన్నది రాములు అభిమంతంగా ఉండేది. 1945లో రాసిన కథ 'బ్రహ్మపత్ర భక్త సమాజం'. ఆర్య సమాజ ప్రభావంతో రాసిన పెద్దకథ 'ఆత్మఘోష'. 1952లో నవలిక 'పిచ్చి శాయన్న'. 954లో అచ్చయిన నవల 'పెరటి చెట్టు'. జి.రాములు కేవలం సంస్కరణ దృక్పథంతోనే కాక బాలల కోసం కూడా రచనలు చేశారు.
   కరీంనగర్‌ జిల్లా తొలి కథా రచయితగా డా|| మలయశ్రీ తన సిద్ధాంత గ్రంథంలో నిరూపించిన కథా రచయిత, కవి, అనువాదకులు జి.(గోపగారి) రాములు జూన్‌ 6, 1926లో నాటి నిజాం రాష్ట్రంలోని సిరిసిల్లలో చేనేత కుటుంబంలో పుట్టారు. విద్యార్థి దశలోనే అభ్యుదయ భావాలకు ఆకర్శితులై ఆర్య సమాజ కార్యకర్తగా వివిధ ఉద్యమాల్లో పాల్గొన్నారు.
   జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా.సి.నారాయణరెడ్డి తాత వీరిని లింగంపల్లికి పిలిపించి, ఇంట్లో ఉంచుకుని సి.నా.రెకు లెక్కలు బోధించేందుకు నియమించారు. ''సాహిత్యం సందేశాత్మకంగా, వ్యక్తికి, సమాజాలకు సంస్కరణాత్మకం''గా ఉండాలన్నది రాములు అభిమంతంగా ఉండేది. 1945లో రాసిన కథ 'బ్రహ్మపత్ర భక్త సమాజం'. ఆర్య సమాజ ప్రభావంతో రాసిన పెద్దకథ 'ఆత్మఘోష'. 1952లో నవలిక 'పిచ్చి శాయన్న'. 954లో అచ్చయిన నవల 'పెరటి చెట్టు'. జి.రాములు కేవలం సంస్కరణ దృక్పథంతోనే కాక బాలల కోసం కూడా రచనలు చేశారు. పిల్లలకోసం పద్యాలు, నాటికలు, గేయాలతో పాటు గాంధీసూక్తులను అనువాదం చేశారు. మహాత్మా గాంధి మరణానంతరం 1948లో గాంధీ సూక్తులను 'శ్రీ మహాత్మా గాంధీ సూక్తినిధి' పేరుతో పిల్లల కోసం అనువదించారు. ఈ సూక్తుల వెనుక ఒక కథ కూడా ఉంది. ఆనంద టి హింగోరాని గాంధీ ఆశ్రమవాసుల్లో ఒకరు. అతని భార్య మరణించినప్పుడు అతనిని ఓదార్చేందుకు రొజుకొక సూక్తిని, అభిప్రాయాన్ని రాస్తూ ఇచ్చేవారు. ఒకసారి ఆనంద భీమవరంలోని ప్రకృతి చికిత్సాలయంలో చికిత్సకోసం వెళుతూ తనకు రోజుకొక సూక్తి రాసి పంపమని కోరారు. అతని అభ్యర్ధనతో దాదాపు రెండు సంవత్సరాలపాటు అనగా, నవంబర్‌ 20, 1944 నుంచి 10 అక్టోబర్‌, 1946 వరకు గాంధీ సూక్తులను రాసి పంపారు. మీనవ జీవిత సత్యాలకు ఈ సూక్తులు ప్రతిబింబంగా ఉండేవి. వీటిని జి.రాములు తెలుగులోకి అనువాదంచేసి బాలబాలికలకు అందేలా చిన్న పాకెట్‌ పుస్తకంగా ప్రచురించారు.
   'మనము పాపాలను నిరసింప వలనేగాని పాపులను ద్వేషించగూడదు' / 'చేసిన తప్పును దిద్దుకోకుండా బ్రతికే మనిషి జీవితం నిరర్ధకము' / 'ప్రజాభిప్రాయమే యుద్ధం కంటె బలమైన ఆయుధము' / 'విజయం సాధించడం కష్టమైనంత మాత్రాన సాధనను విడువరాదు' వంటి సరళ సుందరమైన సూక్తులను జి,రాములు అనువాదం చేశారు. పిల్లలకోసం జి.రాములు చేసిన మరో రచన 'శాంతి పథము' గేయ నాటిక, ఇది 1958లో అచ్చయ్యింది. 1958లో లెబనాన్‌ సివిల్‌వార్‌, అవినీతి, యుద్ధమేఘాలు కమ్ముకుని కురుస్తున్న ఆటంబాంబుల ధాటికి ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను పరిశీలించి ఆవేదనతో చేసిన రచన యిది.
   1979 అంతర్జాతీయ బాలల సంవత్సరం కానుకగా కృత్యారంభంలో వివరించి రాసిన పుస్తకం 'బాలనీతి'. ఇది యాభై పద్యాల అర్థ శతకం'. 'జ్ఞానబోధ జేయబూని లోకమునకు / ప్రజల భాషయందు ప్రజ్ఞమీర / కవిత జెప్పినట్టి కవి, యోగి-వేమన / కర్పణముగ దీని నందజేతు' అంటూ ఆటవెలది ఛందస్సు లో పద్యాలు రాసి జాతిజనుల నోళ్ళలో జాగృతమైనిలిచిన వేమనకు ఈ కృతిని అంకితం చేశారు కవి. జి. రాములు. పిల్లలకు ఏది బోధించాలో, ఎలా బోధించాలో తెలిసిన ఉపాధ్యాయులు వీరు, భావి భారత పౌరులైన బాలలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు బాల్యంలోనే విత్తనాలు నాటాలని బలంగా నమ్మినవారు.
   'శ్రీకరమగు నాంధ్రసీమ యందున్నట్టి / బాలురిందులోని పద్యములను / చదువుకొనిన యెడల నొదపును జ్ఞానంబు/ తెలిసి నడుచుకొనుము తెలుగుబాల' అంటూ అర్థశతక ఆరంభంలోనే తన రచన వెనుకవున్న ఉద్ధేశ్యాన్ని చక్కగా వివరిస్తారు జి.రాములు.
   పిల్లలకోసం తేటమాటలు, తీయని పదాలు ప్రతి పద్యంలో గుమ్మరించారు రాములు. భావాలు ఎంత సరళంగా ఉన్నాయో పద్యాలు అంత అందంగా ఉంటాయిందులో. ఆటపాటలు, చదువుల గురించి- 'చదవదగిన వేళ చదువుచు, నాటలు/ఆడదగిన వేళ ఆడవలెను/ఆట, చదువు అవపరంబీ రెండు' ,విద్యార్థుల్లో బాల్యం నుంచి అలవడాల్సిన వినయం గురించి-'గొప్పవారితోడ కూడి పోవునపుడు / ఒకటి-రెండడుగుల నొప్పుగాను / వారికంటె వెనుక జేరి నడుచుటప్పు' అంటారు. ఇదే విధంగా మాతృభాష గురించి '... సవతి తల్లిగాదు కన్నతల్లి సాటి / మాతృభాష కటులె మరియేది సరికాదు' అని చెప్పిన జి. రాములు మరితంత వివరంగా కింది పద్యంలో చెప్పడం చూడవచ్చు. 'అన్యభాషలందు నధికమౌ వ్యామోహ/ముండి, మాతృభాష నుర్వియందు/చిన్నచూపుజూచుటెన్నగా దోషంబు' వంటివి ఇందులోని పద్యాలు.
   కథకులుగా, నవలాకారులు, నాటకకర్తగా, అనువాదకులుగా పరిచితులైన జి. రాములు పిల్లలకోసం చక్కని రచనలు చేశారు. తెలుగు బాల సాహిత్య చరిత్రలో నమోదు కాని మరో తెలంగాణా సాహితీ వేత్త జి. రాములు.
- డా|| పత్తిపాక మోహన్‌ 9966229548

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కూలుతున్న కుటుంబాలు
బొమ్మలరామారంలో కొత్తరాతిబొమ్మల తావు
వేగు చుక్కల వెలుగు తార ఇరివెంటి కృష్ణమూర్తి
అమ్మకు ఓ బహుమతి
ఒట్టు... నీ మీద ఒట్టు
కూతురుగా పుట్టి కొడుకుగా భాద్యతలు నెరవేర్చిన ఆర్తి కథ ఆమా
నేడే... మేడే...
'చింతల'పాలెంలో శిథిల త్రికూటాలయం, అపూర్వ శిల్పాలు
తల లేని తోక!
అసమానతలు లేని సమాజాన్ని కాంక్షించిన నవల 'అవతలి గుడిసె'
మంచి జీవితానికి భరోసా
పర్యావరణ రక్షణే ధరిత్రీ రక్షణ
స్త్రీల రక్తం పీల్చేసి, జీవితాంతం పీక్కుతింటూన్న రాకాసి గద్ద వంటిల్లు ''ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌''
తరతరాల చికిత్స విధానం... కైరాలి ఆయుర్వేద విధానం
మూడు దశాబ్దాల చట్టసభల సభ్యుడు, స్వాతంత్య్ర సమరయోధుడు చెన్నమనేని రాజేశ్వరరావు
బాలల సినీ గీతకారుడు డా. సి.నారాయణ రెడ్డి
రిజర్వేషన్లు సామాజిక న్యాయం కోసం
విగ్రహం
తీరిక లేని ప్రధాని, సాహిత్య పిపాసి పి.వి.
తెలుగు ధ్వనిలో బహు లయలు
ప్రేక్షక హృదయాలలో శాశ్వత ముద్ర వేసిన పాకీజా
అపశతుల కోయిల ?!
ఉపాధ్యాయ, ఉప్పు సత్యాగ్రహి స్వామి రామానంద తీర్థ
పంజాబీ పల్లెటూరి స్త్రీ జీవన సమస్యలను చిత్రించిన ''గేలో''
బైపొలార్‌ రెండు పరస్పర వ్యతిరేక లక్షణాలు
నాటక రంగానికి జేజేలు
జానపద బాలల కవి పాలడుగు నాగయ్య
ఇంటికో దీపం!!
భారతీయ సినిమా తొలితరం నటి దేవికా రాణి
''నాది దు:ఖం వీడని దేశం''

తాజా వార్తలు

06:43 PM

జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ

06:23 PM

వాళ్లతో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పొత్తులు ఉండ‌వు: కేఏ పాల్

06:02 PM

ఒప్పో ఎలివేట్ ప్రోగ్రామ్ 2వ ఎడిషన్ కోసం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపిన ఒప్పో

05:59 PM

లండ‌న్‌లో రాహుల్ గాంధీ..

05:44 PM

హైదరాబాద్ కు ప్రధాని మోడీ.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

05:42 PM

ఏపీలో విషాదం..రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్‌ మృతి..

05:26 PM

పద చూస్కుందాం కమల్ 'విక్రమ్' తెలుగు ట్రైలర్..

05:06 PM

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..

04:50 PM

జాతీయ స్థాయి ప‌ర్య‌ట‌న నిమిత్తం ఢిల్లీ బ‌య‌ల్దేరిన సీఎం కేసీఆర్

04:29 PM

రేప‌టి నుండి పదోతరగతి పరీక్షలు..విద్యార్థుల‌కు ఆర్టీసీ గుడ్ న్యూస్

03:46 PM

అలాంటి గుడివాడను క్యాసినోవాడగా కొడాలి నాని మార్చాడు : దివ్యవాణి

03:24 PM

జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్యే ఆజంఖాన్‌

03:04 PM

దిశ ఎన్‌కౌంటర్‌‌పై సుప్రీంలో ముగిసిన విచారణ..ఎన్ కౌంటర్ బూటకం

02:40 PM

పోలీసు ఉద్యోగార్థుల‌కు కేసీఆర్ గుడ్ న్యూస్

02:26 PM

లారీని ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్.. 9 మంది సజీవ దహనం

02:23 PM

గుంటూరు జీజీహెచ్లో సీపీఐ ఆందోళన

01:56 PM

ప్రముఖ నటుడు కెప్టెన్‌ చలపతి చౌదరి కన్నుమూత

01:45 PM

పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన..

01:33 PM

369 పోస్టులతో యూపీఎస్సీ సీడీఎస్‌ నోటిఫికేషన్‌..

01:18 PM

కారులో డ్రైవర్ మృతదేహం..వైసీపీ ఎమ్మెల్సీ వివరణ

01:16 PM

ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ ఫస్ట్ లుక్.. ఊర మాస్‌లుక్‌లో ఎన్టీఆర్

12:53 PM

రైలు పట్టాలపై యువకుని మృతదేహం

12:51 PM

ఏపీ ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు

12:24 PM

విశాఖలో 40 కిలోల గంజాయి స్వాధీనం

12:17 PM

బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కాల్

11:36 AM

నిఖత్ జరీన్ కు ప్రధాని మోడీ, ఆనంద్ మహీంద్రా అభినందనలు

11:26 AM

మెట్టుగూడ వద్ద పవన్ కు ఘన స్వాగతం

10:58 AM

హెల్మెట్ విసిరి, బ్యాట్ ను విరగ్గొట్టిన మ్యాథ్యూ వేడ్

10:49 AM

నిజామాబాద్‌లో చెట్టును ఢీకొట్టిన కారు: వ్యక్తి మృతి

10:48 AM

అందుకే ఈ మ్యాచ్‌లో బాగా ఆడ‌గ‌లిగాను: విరాట్ కోహ్లీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.