Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బాల సాహిత్య సరస్వతి డా|| బోయ జంగయ్య | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Jan 01,2022

బాల సాహిత్య సరస్వతి డా|| బోయ జంగయ్య

ఎనభయ్యవ దశకంలో ఏడెనమిది తరగతులు చదువుకున్న వాళ్ళకు బోజ రాసిన 'పావురం' పాఠం పరిచయం అంటుంది. ఇప్పటికీ అది గొప్ప కవిత. బోయ జంగయ్య బాలల కోసం చేసిన తొలి రచన 'బడిలో చెప్పని పాఠాలు'. టీచర్‌, విద్యార్థుల మధ్య సంభాష ణాత్మకంగా సాగే చక్కని కథలు ఇవి. విజ్ఞానయాత్రకు వెళ్ళిన బడిపిల్లలకు దారిలో అనేక విషయాలు, తారసపడిన అంశాలు ఈ కథల్లోని వస్తువులు. మనకు తెలుసు బడిలో ప్రణాళికా బద్ధంగా ఏర్పాటు చేసిన పీరియడ్లలో ఉపాధ్యా యులు పాఠ్య ప్రణాళికలోని అంశాలను మాత్రమే చెబుతారు. ఇతర చాలా అంశాలను 'ఆచార్యాత్‌ పాదమాదత్తే' శ్లోకంలో మాదిరిగా బయటి ప్రపంచం నుంచి నేర్చుకోవాల్సిందే. అందుకని 'స్కూల్‌ పుస్తకాలే కాకుండా విద్యార్థులు బాల సాహిత్య పుస్తకాలను చదవాల్సిన అవసరమూ వుంది.
    తెలంగాణాలో అణచివేతకు గురౌ తున్న దళితుల వెతలు, బహుజనులు, పీడితులు, స్త్రీల ఆవేదనలుకు అక్షరరూపం కల్పించిన రచయిత డా|| బోయ జంగయ్య. నాలుగున్నర దశాబ్దాలు రచయితగా, కవిగా, నవలాకారునిగా, నాటకకర్తగా, బాల సాహివేత్తగా, అనువాదకులుగా ప్రసిద్ధి చెందిన 'బోజ' ముప్పయి అయిదుకు పైగా రచనలు చేశారు. 'తెలంగాణా ప్రజల వ్యథలు తన కథలు'గా మలచిన బోజ 1 అక్టోబర్‌, 1942న నల్లగొండ జిల్లాలోని పంతంగిలో పుట్టారు. బోయ ఎల్లమ్మ, మల్లయ్యలు తల్లితండ్రులు. సామాన్య దళితకుటుంబంలో పుట్టి కవి, రచయిత, అనువాదకులుగా ఎదిగిన సాహితీమూర్తి. 'దేశం కోసం, కొత్తబాటలు, లోకం, గొర్రెలు, దేశం కోసం, దున్న, రంగులు, చీమలు, తెలంగాణ వెతలు, నడుస్తున్న చరిత్ర, వెలుతురు, పావురాలు మొదలగునవి కొన్ని వీరి ప్రసిద్ధ రచనలు.
   బోజ ముప్పయి అయిదు రచనల్లో పన్నెండు బాలల కోసం రాసిన పుస్తకాలున్నాయి. కథా సాహిత్యాన్ని, కవిత్వాన్ని ఎంత ఇష్టంగా రాసారో అంతకంటే మరింత ప్రేమగా బాలల కోసం రాసారు. అయితే బోయ జంగయ్య అనగానే గుర్తుకు వచ్చేవి ఆయన కథలు, నవలలు. అందుకు కారణం ఏ అలంకారాలు, ఆడంబరాలు లేక సాదాసీదాగా ఉండడమే. 1963లో విద్యార్థి దశలో రాసిన తొలి నాటకం 'కష్టసుఖాలు' మొదలుకుని 'అవసరం' పేరిట రాసుకున్న తన ఆత్మకథ వరకు ఆయన రచనల్లోని విలక్షణతను తెలుపుతాయి.
   బోయ జంగయ్య పిల్లల కోసం పన్నెండు రచనలు చేశారు. అదే స్థాయిలో వయోజనుల కోసం మూడు రచనలు కూడా చేశారు. వీరి బాల సాహిత్యంలో 'బడిలో చెప్పని పాఠాలు' 1998, 'కొత్త పాఠాలు' 1999, గుజ్జనగూళ్ళు 1999, 'ఆటలు-పాటలు' 1999, 'మాటల ఆటలు' 2002, 'చిలకల పలుకులు' 2003, 'మన నేతలు' 2004, 'టీ.వీ. ముచ్చట్లు' 2004 కథా, గేయ సంకలనాలు. పిల్లలకోసం నలుగురు ప్రముఖుల జీవిత చరిత్రలను కూడా రాశారు బోజ. అవి, 'భారతరత్న డా.అంబేద్కర్‌', 'సమతావాది బాబు జగ్జీవన్‌రామ్‌' 1987, 'దేశాధ్యక్షులు కె.ఆర్‌.నారాయణన్‌' 1998, 'గుఱ్ఱం జాషువా' 1998. కథ, కవిత్వం, నవలలు, అనువాదాలతో పాటు అదే సంఖ్యలో బాలల సాహిత్యాన్ని రాసినప్పటికీ ఆయన తన కథను, నవలను, కవిత్వాన్ని అట్టడుగు వర్గాల జీవితాల లోతులను, వారి జీవితాలు అలా ఉండడానికి గల కారణాలను, మంచి జీవితాల కోసం, గౌరవప్రదమైన బతుకుల కోసం చేయాల్సిన ప్రయత్నాలను తన రచనల్లో చూపడంవల్ల అవి ఖ్యాతిని పొందాయి.
   ఎనభయ్యవ దశకంలో ఏడెనమిది తరగతులు చదువుకున్న వాళ్ళకు బోజ రాసిన 'పావురం' పాఠం పరిచయం అంటుంది. ఇప్పటికీ అది గొప్ప కవిత. బోయ జంగయ్య బాలల కోసం చేసిన తొలి రచన 'బడిలో చెప్పని పాఠాలు'. టీచర్‌, విద్యార్థుల మధ్య సంభాష ణాత్మకంగా సాగే చక్కని కథలు ఇవి. విజ్ఞానయాత్రకు వెళ్ళిన బడిపిల్లలకు దారిలో అనేక విషయాలు, తారసపడిన అంశాలు ఈ కథల్లోని వస్తువులు. మనకు తెలుసు బడిలో ప్రణాళికా బద్ధంగా ఏర్పాటు చేసిన పీరియడ్లలో ఉపాధ్యా యులు పాఠ్య ప్రణాళికలోని అంశాలను మాత్రమే చెబుతారు. ఇతర చాలా అంశాలను 'ఆచార్యాత్‌ పాదమాదత్తే' శ్లోకంలో మాదిరిగా బయటి ప్రపంచం నుంచి నేర్చుకోవాల్సిందే. అందుకని 'స్కూల్‌ పుస్తకాలే కాకుండా విద్యార్థులు బాల సాహిత్య పుస్తకాలను చదవాల్సిన అవసరమూ వుంది. మన దేశంలో చాలా సాధారణ వియాలను శాస్త్రీయంగా మనవాళ్ళు పరిచయం చేయకుండా, దానికి దైవత్వాన్ని జోడించి భక్తి భావంతో గుడ్డిగ నమ్మిస్తూ వస్తూవున్నారు. గత కాలం వేరు, ఈ కంప్యూటర్‌ కాలం వేరు. ఇప్పటి జీవిత వేగమే వేరు, రజనింగ్‌ లేకుండా ఏ విషయాన్ని అమోదించలేని రోజులు. చంద్రుని మీద కాలుమోపడం జరిగింది. అందుకని రోజువారి జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఏమిటి? ఎందుకు? అని ఆలోచించేవే ఈ పుస్తకంలోని చిన్న కథలు
   '... పిల్లలకు ఊహలుంటాయి. అవి రూపుదాల్చాలని ఆలోచిస్తారు. వాళ్ళకూ కోరికలుంటాయి. అవి తీరాలని చూస్తుంటారు. అలాంటి ప్రదర్శనలే ఆటలు' అంటారు బోజ. 'ఆడుదాం/పాడుదాం/ఆనందంగా/ఎగురుదాం' అంటూ 'ఆటలు ఆడి/పాటలు పాడి/ ఆరోగ్యాన్ని/ పెంచుకుందాం' అని పిల్లలకు బోధిస్తాడీ తాతయ్య. ఇలాంటివే అనేక చిట్టిపొట్టి మేలిమి గేయాలు రాశారు బోజ. 'పొదుపు' గేయంలో- 'చినుకు చినుకు/ వాన-వాగు/పైస పైస/ రూపాయి/ చీమలవలె/ తేనెటీగలవలె/ ఇంతో అంతో/ కూడపెడితే/ ఒక్కొక్కటి/ వందై-వేయే/ ఆపదకు/ ఆదుకొనును' అంటారు. వీరి గేయాలు విజ్ఞానం, వినోదాలతో పాటు పిల్లలకు పదసంపదను పెంచుతాయి. 'వరద' గేయం అచ్చంగా వరదలాగానే బిరబిరా కదులుతుంది. 'వానొచ్చె/ వరదొచ్చె/ చెర్లోకి/ నీళ్లచ్చె/ అలలచ్చె/ అలుగొచ్చె/ చెర్లోని/ చేపలెచ్చె/ పట్టుకొచ్చి/ అమ్మకిస్తే/ వంటచేసి/ వడ్దించె'. సరళ సుందరంగా, సహజ బంధురంగా ఉంటాయి బోజ గేయాలు. అందుకు పై గేయాలు నిర్శనం. బోజ పిల్లల కోసం రాసిన ప్రతి పలుకు 'చిలుక పలుకులు' అనడం అతిశయోక్తి కాదు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కూలుతున్న కుటుంబాలు
బొమ్మలరామారంలో కొత్తరాతిబొమ్మల తావు
వేగు చుక్కల వెలుగు తార ఇరివెంటి కృష్ణమూర్తి
అమ్మకు ఓ బహుమతి
ఒట్టు... నీ మీద ఒట్టు
కూతురుగా పుట్టి కొడుకుగా భాద్యతలు నెరవేర్చిన ఆర్తి కథ ఆమా
నేడే... మేడే...
'చింతల'పాలెంలో శిథిల త్రికూటాలయం, అపూర్వ శిల్పాలు
తల లేని తోక!
అసమానతలు లేని సమాజాన్ని కాంక్షించిన నవల 'అవతలి గుడిసె'
మంచి జీవితానికి భరోసా
పర్యావరణ రక్షణే ధరిత్రీ రక్షణ
స్త్రీల రక్తం పీల్చేసి, జీవితాంతం పీక్కుతింటూన్న రాకాసి గద్ద వంటిల్లు ''ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌''
తరతరాల చికిత్స విధానం... కైరాలి ఆయుర్వేద విధానం
మూడు దశాబ్దాల చట్టసభల సభ్యుడు, స్వాతంత్య్ర సమరయోధుడు చెన్నమనేని రాజేశ్వరరావు
బాలల సినీ గీతకారుడు డా. సి.నారాయణ రెడ్డి
రిజర్వేషన్లు సామాజిక న్యాయం కోసం
విగ్రహం
తీరిక లేని ప్రధాని, సాహిత్య పిపాసి పి.వి.
తెలుగు ధ్వనిలో బహు లయలు
ప్రేక్షక హృదయాలలో శాశ్వత ముద్ర వేసిన పాకీజా
అపశతుల కోయిల ?!
ఉపాధ్యాయ, ఉప్పు సత్యాగ్రహి స్వామి రామానంద తీర్థ
పంజాబీ పల్లెటూరి స్త్రీ జీవన సమస్యలను చిత్రించిన ''గేలో''
బైపొలార్‌ రెండు పరస్పర వ్యతిరేక లక్షణాలు
నాటక రంగానికి జేజేలు
జానపద బాలల కవి పాలడుగు నాగయ్య
ఇంటికో దీపం!!
భారతీయ సినిమా తొలితరం నటి దేవికా రాణి
''నాది దు:ఖం వీడని దేశం''

తాజా వార్తలు

07:01 PM

పాట‌తో మిమ్మ‌ల్ని ప్ర‌శ్నిస్తున్నందుకు కేసులు పెట్టి అణ‌చివేస్తారా?: రేవంత్ రెడ్డి

06:52 PM

తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం

06:43 PM

జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ

06:23 PM

వాళ్లతో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పొత్తులు ఉండ‌వు: కేఏ పాల్

06:02 PM

ఒప్పో ఎలివేట్ ప్రోగ్రామ్ 2వ ఎడిషన్ కోసం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపిన ఒప్పో

05:59 PM

లండ‌న్‌లో రాహుల్ గాంధీ..

05:44 PM

హైదరాబాద్ కు ప్రధాని మోడీ.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

05:42 PM

ఏపీలో విషాదం..రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్‌ మృతి..

05:26 PM

పద చూస్కుందాం కమల్ 'విక్రమ్' తెలుగు ట్రైలర్..

05:06 PM

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..

04:50 PM

జాతీయ స్థాయి ప‌ర్య‌ట‌న నిమిత్తం ఢిల్లీ బ‌య‌ల్దేరిన సీఎం కేసీఆర్

04:29 PM

పదోతరగతి పరీక్షలు..విద్యార్థుల‌కు ఆర్టీసీ గుడ్ న్యూస్

03:46 PM

అలాంటి గుడివాడను క్యాసినోవాడగా కొడాలి నాని మార్చాడు : దివ్యవాణి

03:24 PM

జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్యే ఆజంఖాన్‌

03:04 PM

దిశ ఎన్‌కౌంటర్‌‌పై సుప్రీంలో ముగిసిన విచారణ..ఎన్ కౌంటర్ బూటకం

02:40 PM

పోలీసు ఉద్యోగార్థుల‌కు కేసీఆర్ గుడ్ న్యూస్

02:26 PM

లారీని ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్.. 9 మంది సజీవ దహనం

02:23 PM

గుంటూరు జీజీహెచ్లో సీపీఐ ఆందోళన

01:56 PM

ప్రముఖ నటుడు కెప్టెన్‌ చలపతి చౌదరి కన్నుమూత

01:45 PM

పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన..

01:33 PM

369 పోస్టులతో యూపీఎస్సీ సీడీఎస్‌ నోటిఫికేషన్‌..

01:18 PM

కారులో డ్రైవర్ మృతదేహం..వైసీపీ ఎమ్మెల్సీ వివరణ

01:16 PM

ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ ఫస్ట్ లుక్.. ఊర మాస్‌లుక్‌లో ఎన్టీఆర్

12:53 PM

రైలు పట్టాలపై యువకుని మృతదేహం

12:51 PM

ఏపీ ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు

12:24 PM

విశాఖలో 40 కిలోల గంజాయి స్వాధీనం

12:17 PM

బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కాల్

11:36 AM

నిఖత్ జరీన్ కు ప్రధాని మోడీ, ఆనంద్ మహీంద్రా అభినందనలు

11:26 AM

మెట్టుగూడ వద్ద పవన్ కు ఘన స్వాగతం

10:58 AM

హెల్మెట్ విసిరి, బ్యాట్ ను విరగ్గొట్టిన మ్యాథ్యూ వేడ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.