Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
షష్టిపూర్తి జరుపుకున్న బాలల కావ్య కవి తిగుళ్ల వేంకటేశ్వరశర్మ | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Jan 09,2022

షష్టిపూర్తి జరుపుకున్న బాలల కావ్య కవి తిగుళ్ల వేంకటేశ్వరశర్మ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పక్షాన బాల సాహిత్యాన్ని ప్రచురిం చాలని సంకల్పించి బాల సాహిత్యాన్ని రాయించింది. అందులో భాగంగా వీరి బాల గేయ సంపుటి వానకారు 1959లో మాడపాటి హనుమంతరావు పంతులు నేతృత్వంలోని బాల సాహిత్య రచనాలయం పక్షాన ప్రచురించబడి, నేటికీ అరవై మూడు సంవత్సరాలు. ఉమ్మడి రాష్ట్రంలో అందరికీ తెలిసినా గుర్తింపుకు నోచుకోలేదు. ఈ పుస్తకాన్ని మళ్ళీ 2017లో పిల్లలలోకం పక్షాన డా||వి.ఆర్‌. శర్మ అచ్చువేయగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రచురించిన ద్వితీయ భాష తెలుగు పుస్తకంలో వీరి గేయం చోటు చేసుకోవడం విశేషం.
   పిల్లల కోసం రాసిన ఒక గేయ సంపుటి ఇటీవల 2017లో షష్టిపూర్తి చేసుకుంది. అయితే చరిత్రలో నమోదు కాకపోవడం వల్ల ఈ విషయం ఈ తరానికి అంతగా తెలియదు. ఆ సంపుటి పేరు 'వానకారు', కర్త సాహిత్య విద్యా ప్రవీణ తిగుళ్ల వేంకటేశ్వర శర్మ. ఈయన 9-4-1931లో నేటి కామారెడ్డి జిల్లా బిక్కునూరు శ్రీ సిద్ధరామేశ్వర క్షేత్రంలో సనాతన వైదిక కుటుంబంలో పుట్టారు. సంస్కృతాంధ్రాలతో పాటు, చిత్రలేఖనం, సంగీతం, రగస్థల కళలో నిష్ణాతులు. నేను గత వారం గంగుల శాయిరెడ్డి వ్యాసంలో పేర్కొన్న 'బాల సాహిత్య రచనాలయము, హైదరాబాద్‌'తో సన్ని హిత సంబంధాలు నెరిపారు.
   1957లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పక్షాన బాల సాహిత్యాన్ని ప్రచురిం చాలని సంకల్పించి బాల సాహిత్యాన్ని రాయించింది. అందులో భాగంగా వీరి బాల గేయ సంపుటి వానకారు 1959లో మాడపాటి హనుమంతరావు పంతులు నేతృత్వంలోని బాల సాహిత్య రచనాలయం పక్షాన ప్రచురించబడి, నేటికీ అరవై మూడు సంవత్సరాలు. ఉమ్మడి రాష్ట్రంలో అందరికీ తెలిసినా గుర్తింపుకు నోచుకోలేదు. ఈ పుస్తకాన్ని మళ్ళీ 2017లో పిల్లలలోకం పక్షాన డా||వి.ఆర్‌. శర్మ అచ్చువేయగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రచురించిన ద్వితీయ భాష తెలుగు పుస్తకంలో వీరి గేయం చోటు చేసుకోవడం విశేషం.
   పిల్లల కోసం రాసినా, పెద్దల కోసం రాసినా ప్రతి రచనలో తెలంగాణ తనం వీరి గేయాల్లో అణువణువునా చూడొచ్చు. 'గుడి కిందికి దిగివచ్చిన / గోపురాలో యన్నట్లుగ / బడి ముందుగ వీధిలోన/బతుకమ్మలు గనబడినవి.... బోరగిల్లియున్న పెద్ద/ బొంగరాలో యన్నట్లుగ బ బడి ముందుగ వీధిలోన / బతుకమ్మలు గనబడినవి' అంటూ తెలంగాణ సబ్బండ సంస్కృతికి ప్రతీకయైన బతుకమ్మను బాలల కావ్యంలో పూదిచ్చి దిద్దిన కూరాడు 'వానకారు'.
   ఆరున్నర దశాబ్దాల నాటి తెలంగాణ పల్లెలు, బాలలు, వాళ్ళ ఆటలు, పాటలు, పండుగలు, పబ్బాలు ఇలా ఒక్కటని కాదు అనేక అంశాలకు అడ్డంగా నిలిస్తుందీ వానకారు. ఇంకా, వానలు కురిసి, చెరువులు, కుంటలు నిండుగా నిండి పల్లె, ఊరు, వాడ సంతోషంగా జరుపుకునే అనేక పండుగలవాతావరణాలను, శ్రామిక జీవన సౌందర్యాన్ని గురించి చక్కగా వర్ణిస్తాడు రచయిత ఈ కావ్యంలో, పదిహేడు శీర్షికల్లో వచ్చిన ఈ సంపుటిలోని గేయాలకు చిత్రాలను 'రాజు' అనే చిత్రకారుడు వేశాడు. తనను గురించి తెలియడం లేదు. దీనిని నేను కావ్యంగా పేర్కొనడానికి కారణం ఇందులోని గేయాలన్నింటిలో 'వానకారు' అనే ఏక సూత్రత ఉండడం. 'అంత చిన్నది కాదు / అంత పెద్దది కాదు / అందముగ గనిపించు / అది యొక్క యూరు' అట. ఆ వూరిలోని బాలల చాలా బుద్దిమంతులు, క్రమశిక్షణ గలవారట, అందుకే వాళ్ళు, 'చక్కగా బాలకులు / సమయానికే వచ్చి చావడిలో గూర్చుండి / చదువె కొంటారు', అంతేకాదట, 'చదువు పూర్తయినాక/ సాయంత్ర మక్కడనె' ఆడుకుంటారట. ఆ ఊరిలో గోవిందు, గోపాలు అనే పిల్లలు, వాళ్ల మిత్రులు, వారి ఆటపాటలు, సరదాలు, సందళ్లు, సంతోషాలు, చదువులు, సృజనశీలత వంటివాటితో పాటు గ్రామీణ జీవనంలో మమైకమై నిలిచిన వ్యవసాయ సంస్కృతిని బాలల నేపథ్యంగా సుందరంగా చూపిస్తారు కవి తిగుళ్ల. అంతేకాదు, పాటలతో పదాలు, సంస్కృతిని, తెలంగాణ జీవద్భాషను పరిచయం చేయాలనే సంకల్పంతో ఈ ఉపాధ్యాయకవి ఇప్పటి తరానికి తెలియని ఎన్నో పదాలను పరిచయం చేశారు. వాటిలో జంగిడి, పెబ్బె, గూనధార, జగిలి, అలుగు, మంద, చావడి, గుంట,
   జాలె, తూము, గున్నలు, చెంబు, చేగోళ్ళు, దేవడీ, గోటీలు, బాపనయ్య, పొద్దుగూక వంటివి కొన్ని.''
   బర్రెలెన్నియొ మింట / పాలిచ్చుచుండగా / పాల ధారలు చాల / జాలువారినట్లు' వానకారు ముగిస్తుండంటాడు కవి.
   పనితో పాటు చదువు, చదువుతూ పని అన్నది గ్రామీణ జీవనంలోని సాధారణాంశం. దానిని 'తల్లితండ్రులు మెచ్చుకొనగ పొలములోని పనులలోన / చిన్న చిన్న చేతులతో / చిన్నవారు తోడుపడిరి' లాంటి అందమైన అంశాలు ఇందులో అడుగడుగునా కనిపిస్తాయి. ముఖ్యంగా వ్యవసాయ సంస్కృతితో ముడిపడిన జీవితాలకు వాన రావడమే ఒక పెద్ద పండుగ. ఆ వాలవల్ల పంటలు బాగా పండి, పాడిపంటలు దండిగావుంటే ఇక పండుగలకు కొదవుండదు. అటువంటి చేగోళ్ళ పండుగను గురించి చెబుతూ 'చేగోళ్ళ పండుగే/ వచ్చింది వచ్చింది / చిన్నవారికి సెలవు/ వచ్చింది వచ్చింది. చేగోళ్ళ కడివయాలు/ గేగోళ్ళ గడియాలు/ చిన్నవారందరీ/ చేతులకు గనబడెను' అంటూ చేగోళ్ళ పండుగ గురించి చెబుతారు. తెలంగాణలోని నిన్న మొన్నటి పిల్లమైన మనకు ఈ గేయం ఆనాటి యాదిని తెస్తుంది. కేవలం ఒక్క చేగోళ్ళ పండుగ గురించే కాదు, 'పొలాల అమవాస్య', 'నాగుల పంచమి పండుగ', 'శ్రీ కృష్ణాష్టమి పండుగ', 'వినాయక చవితి పండుగ', 'బతుకమ్మ పండుగ', 'దసరా పండుగ' వంటి తెలంగాణ ప్రజలు జరుపుకునే ప్రతి పండుగను ఈ వానకారులో గేయాలుగా మలిచిన అచ్చ తెలంగాణ బాల సాహితీమూర్తి కవి తిగుళ్ల వేంకటేశ్వరశర్మ.
- డా|| పత్తిపాక మోహన్‌ 9966229548

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కూలుతున్న కుటుంబాలు
బొమ్మలరామారంలో కొత్తరాతిబొమ్మల తావు
వేగు చుక్కల వెలుగు తార ఇరివెంటి కృష్ణమూర్తి
అమ్మకు ఓ బహుమతి
ఒట్టు... నీ మీద ఒట్టు
కూతురుగా పుట్టి కొడుకుగా భాద్యతలు నెరవేర్చిన ఆర్తి కథ ఆమా
నేడే... మేడే...
'చింతల'పాలెంలో శిథిల త్రికూటాలయం, అపూర్వ శిల్పాలు
తల లేని తోక!
అసమానతలు లేని సమాజాన్ని కాంక్షించిన నవల 'అవతలి గుడిసె'
మంచి జీవితానికి భరోసా
పర్యావరణ రక్షణే ధరిత్రీ రక్షణ
స్త్రీల రక్తం పీల్చేసి, జీవితాంతం పీక్కుతింటూన్న రాకాసి గద్ద వంటిల్లు ''ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌''
తరతరాల చికిత్స విధానం... కైరాలి ఆయుర్వేద విధానం
మూడు దశాబ్దాల చట్టసభల సభ్యుడు, స్వాతంత్య్ర సమరయోధుడు చెన్నమనేని రాజేశ్వరరావు
బాలల సినీ గీతకారుడు డా. సి.నారాయణ రెడ్డి
రిజర్వేషన్లు సామాజిక న్యాయం కోసం
విగ్రహం
తీరిక లేని ప్రధాని, సాహిత్య పిపాసి పి.వి.
తెలుగు ధ్వనిలో బహు లయలు
ప్రేక్షక హృదయాలలో శాశ్వత ముద్ర వేసిన పాకీజా
అపశతుల కోయిల ?!
ఉపాధ్యాయ, ఉప్పు సత్యాగ్రహి స్వామి రామానంద తీర్థ
పంజాబీ పల్లెటూరి స్త్రీ జీవన సమస్యలను చిత్రించిన ''గేలో''
బైపొలార్‌ రెండు పరస్పర వ్యతిరేక లక్షణాలు
నాటక రంగానికి జేజేలు
జానపద బాలల కవి పాలడుగు నాగయ్య
ఇంటికో దీపం!!
భారతీయ సినిమా తొలితరం నటి దేవికా రాణి
''నాది దు:ఖం వీడని దేశం''

తాజా వార్తలు

06:23 PM

వాళ్లతో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పొత్తులు ఉండ‌వు: కేఏ పాల్

06:02 PM

ఒప్పో ఎలివేట్ ప్రోగ్రామ్ 2వ ఎడిషన్ కోసం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపిన ఒప్పో

05:59 PM

లండ‌న్‌లో రాహుల్ గాంధీ..

05:44 PM

హైదరాబాద్ కు ప్రధాని మోడీ.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

05:42 PM

ఏపీలో విషాదం..రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్‌ మృతి..

05:26 PM

పద చూస్కుందాం కమల్ 'విక్రమ్' తెలుగు ట్రైలర్..

05:06 PM

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..

04:50 PM

జాతీయ స్థాయి ప‌ర్య‌ట‌న నిమిత్తం ఢిల్లీ బ‌య‌ల్దేరిన సీఎం కేసీఆర్

04:29 PM

రేప‌టి నుండి పదోతరగతి పరీక్షలు..విద్యార్థుల‌కు ఆర్టీసీ గుడ్ న్యూస్

03:46 PM

అలాంటి గుడివాడను క్యాసినోవాడగా కొడాలి నాని మార్చాడు : దివ్యవాణి

03:24 PM

జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్యే ఆజంఖాన్‌

03:04 PM

దిశ ఎన్‌కౌంటర్‌‌పై సుప్రీంలో ముగిసిన విచారణ..ఎన్ కౌంటర్ బూటకం

02:40 PM

పోలీసు ఉద్యోగార్థుల‌కు కేసీఆర్ గుడ్ న్యూస్

02:26 PM

లారీని ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్.. 9 మంది సజీవ దహనం

02:23 PM

గుంటూరు జీజీహెచ్లో సీపీఐ ఆందోళన

01:56 PM

ప్రముఖ నటుడు కెప్టెన్‌ చలపతి చౌదరి కన్నుమూత

01:45 PM

పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన..

01:33 PM

369 పోస్టులతో యూపీఎస్సీ సీడీఎస్‌ నోటిఫికేషన్‌..

01:18 PM

కారులో డ్రైవర్ మృతదేహం..వైసీపీ ఎమ్మెల్సీ వివరణ

01:16 PM

ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ ఫస్ట్ లుక్.. ఊర మాస్‌లుక్‌లో ఎన్టీఆర్

12:53 PM

రైలు పట్టాలపై యువకుని మృతదేహం

12:51 PM

ఏపీ ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు

12:24 PM

విశాఖలో 40 కిలోల గంజాయి స్వాధీనం

12:17 PM

బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కాల్

11:36 AM

నిఖత్ జరీన్ కు ప్రధాని మోడీ, ఆనంద్ మహీంద్రా అభినందనలు

11:26 AM

మెట్టుగూడ వద్ద పవన్ కు ఘన స్వాగతం

10:58 AM

హెల్మెట్ విసిరి, బ్యాట్ ను విరగ్గొట్టిన మ్యాథ్యూ వేడ్

10:49 AM

నిజామాబాద్‌లో చెట్టును ఢీకొట్టిన కారు: వ్యక్తి మృతి

10:48 AM

అందుకే ఈ మ్యాచ్‌లో బాగా ఆడ‌గ‌లిగాను: విరాట్ కోహ్లీ

10:37 AM

నేటితో ముగియ‌నున్న‌ పోలీస్ ఉద్యోగాల‌ దర‌ఖా‌స్తు ప్ర‌క్రియ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.