Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తెలంగాణ సాయుధ పోరాట ప్రావాహికుడు సుద్దాల హనుమంతు | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Jan 09,2022

తెలంగాణ సాయుధ పోరాట ప్రావాహికుడు సుద్దాల హనుమంతు

వారసత్వంగా వస్తున్న కళను ఒడిసిపట్టుకొని వాగ్గేయకారుడిగా ఎదిగిన హనుమంతు ఉర్దూ మాధ్య మంలో తన ప్రాథమిక విద్యను అభ్యసించారు. చిన్న వయసులోనే, హైదరాబాదు రాష్ట్రంలో మరీ ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులను చూసి చలించిపోయారు.
   ప్రపంచ పటంపై కొందరు మనుషుల్లాగా జన్మిస్తారు. మరికొందరు మానవ మూర్తుల్లాగా చరిత్ర పుటల్లో నిలుస్తారు. అలాంటి చరిత సృష్టించిన వారిలో సుద్దాల హనుమంతు ఒకరు. మరణం తన చరణం అంచుల దాకా వచ్చినా, పోరాటంలో ఇతరుల రుధిరం ధరణిపై కనబడినా భయానికి పోనీ ధైర్యశాలి, కవి, హైదరాబాదు స్వాతంత్య్ర వీరుడు ప్రజా వాగ్గేయకారుడు సుద్దాల హనుమంతు.
జననం
   సుద్దాల హనుమంతు 1910వ సంవత్సరంలో నల్లగొండ జిల్లా పాలడుగు గ్రామంలో లక్ష్మీనరసమ్మ, గుర్రం బుచ్చి రామయ్యలకు జన్మించారు. అనంతరం హనుమంతు సుద్దాల అనే గ్రామంలో స్థిరపడ్డారు. అందువల్ల ఆ గ్రామం పేరుతో సుద్దాల హనుమంతుగా మారి తన ప్రతిభాపాటవాలతో తనకు, ఆ గ్రామానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చాడు.
   వారసత్వంగా వస్తున్న కళను ఒడిసిపట్టుకొని వాగ్గేయకారుడిగా ఎదిగిన హనుమంతు ఉర్దూ మాధ్య మంలో తన ప్రాథమిక విద్యను అభ్యసించారు. చిన్న వయసులోనే, హైదరాబాదు రాష్ట్రంలో మరీ ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులను చూసి చలించిపోయారు.
ఉద్యమం
   నిజాం విమోచన పోరాటం జరిగే నాటి పరిస్థితులను నిత్య సమీపంగా గమనిస్తూ ఉండడం వలన ఆ ఉద్యమ ఆకాంక్ష దాని ప్రయోజనాలను తెలుసుకున్నారు. తనకున్న ఉద్యమ అవగాహనతో ఆరంభంలో గాంధీని, ఆయన సిద్ధాంతాలను అభిమానించిన సుద్దాల మొదటి సారి భువనగిరిలో జరిగిన ఆంధ్రమహాసభలో వాలంటీరుగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో రావి నారాయణ రెడ్డి ప్రసంగం విని ఉద్రేకపూరితుడై కమ్యూనిస్టుగా మారారు. అప్పటి నుంచి ఏనాడు కూడా ఉద్యమాన్ని, ఉద్యమ సాఫల్యతను విస్మరించలేదు. చైతన్యం సన్నగిల్లిన ప్రతీచోట తన పాటతో, ఆటతో ప్రజలలో నూతన పోరాట జవసత్వాలను నింపి నిజాం రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధమయ్యారు. హనుమంతు హైదరాబాదులో ఉన్నప్పుడు అక్కడి సాంస్కృతిక కార్యక్రమాలకు ఆకర్షితుడై క్రమంగా ఆర్య సమాజం కార్యకర్తగా మారారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను మేల్కొల్పుతూ ఉన్నాడనే నెపంతో హైదరాబాదు స్వాతంత్య్రానికి ఏడాది ముందు, ఆయనపై కనిపిస్తే కాల్చివేత అనే ఆదేశాలు జారీ అయ్యాయి. 1946-48 కాలంలో తీవ్రంగా సాగిన నిజాం విముక్తి ఉద్యమంలో జెండాల ఆవిష్కరణను ఆనాడు గ్రామాలలో భారతీయ ఆత్మ గౌరవానికి ప్రతీక భావించేవారు. అలా హనుమంతు కూడా ఈ కాలంలోనే జాతీయ జెండాను, ఎర్ర జెండాను ఎగురవేసి తన ఆకాంక్షను, స్వాతంత్య్రోద్యమ ఆశయ సూచికను తెలిపారు.
సుద్దాల హనుమంతు సాహిత్య చైతన్యం
   నిజాం రాజ్యంలో గ్రామ గ్రామాన కూరుకుపోయిన వెట్టిచాకిరి వ్యవస్థకు ప్రతికూలంగా ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీలు చేసిన చైతన్యంలో భాగంగా హనుమంతు కూడా తన మాట, పాట ద్వారా వెట్టి గురించి చెప్పేవారు. వెట్టి వాళ్ళు పడే బాధ గురించి ఎంత చెప్పినా అది తీరేది కాదని ఆవేదన పడేవారు. జానపద కళారూపాలైన గొల్లసుద్దులు, బుర్రకథ, పిట్టల దొర మొదలైన ఫకీర్ల వేషాలు ధరించి వాటి ద్వారా అసమాన సామాజికతను, దౌర్జన్యపు పాలనను గురించి ప్రజలకు తెలియచేప్పేవారు. ప్రజల భూముల్ని దోచుకొని దొరలుగా చెలామణి అవుతున్న వాళ్లకు కాలం చెల్లుతుందన్న ఆశావాహ దృక్పథంతో ఉండి పోరాటం చేశారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో భూములని కోల్పోయిన రైతులకు సానుభూతిగా, వారికి మద్దతుగా తన పాటలతో వాళ్ళను సమాయత్తం పరిచేవారు. వెట్టి, అక్రమ వసూళ్ళు, బేదఖల్లు, దొరల బానిస తత్త్వాన్ని గురించి ఆయన రాయని మాట లేదు. పాడని పాట లేదు.
   అభ్యుదయ భావంతో కొనసాగుతున్నప్పటికీ భారతీయ తత్త్వాన్ని తనలో సంలీనం చేసుకొని స్వాతంత్య్రం, విముక్తిని సాధించాలన్న తప నతో పాటను తన స్నేహంగా మలుచుకున్నారు. స్వాతంత్య్రోద్యమంలో గాంధీజీ సిద్ధాంతాలను, ఆయన ఆలోచనలను గౌరవిస్తూ ఆయనపై సదభిప్రాయాన్ని పెంచుకున్నారు.
ఉద్యోగం
   తన గ్రామంలో వెట్టి వాళ్ళ దుస్థితిని చూడలేక హనుమంతు హైదరాబాదుకు వెళ్ళారు. బుద్వేల్‌లో కొంతకాలం వ్యవసాయ శాఖలో గుమాస్తాగా చేశారు. ప్రభుత్వ నిర్భంధానికి ఆదేశాలు జారీ కాగానే హనుమంతు బొంబాయి వెళ్లి రెండు సం||రాల పాటు అజ్ఞాత జీవనం గడుపుతూనే అక్కడ దర్జీగా పని చేశారు. ఆ నల్లగొండకు తర్వాత తిరిగి వచ్చి =వస్త్రఱర్‌వతీవస ఎవసఱషaశ్రీ జూతీaష్‌ఱ్‌ఱశీఅవత్ణీగా వైద్య వృత్తిలో ఉన్నారు.
రచనలు
   యదార్థ భజనమాల (పాటలు), జయధీర్‌ తిరుమలరావు సంకలన కర్తగా 'సుద్దాల హనుమంతు పాటలు'1983) విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ వారి 'సుద్దాల హనుమంతు పాటలు' (1983), వీర తెలంగాణ సాంఘిక యక్షగానం' వంటి అనేక పాటలు గల గ్రంథాల మిశ్రమం ఈ పుస్తకాలు.
   తన పాటతో, ఆటతో ఎందరినో మేల్కొల్పి వాళ్ళ జీవితాల్లో కొత్త సూర్యోదయాన్ని నింపిన సుద్దాల హనుమంతు 1982 అక్టోబర్‌ 10న కన్ను మూశారు.
- ఘనపురం సుదర్శన్‌, 9000470542

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కూలుతున్న కుటుంబాలు
బొమ్మలరామారంలో కొత్తరాతిబొమ్మల తావు
వేగు చుక్కల వెలుగు తార ఇరివెంటి కృష్ణమూర్తి
అమ్మకు ఓ బహుమతి
ఒట్టు... నీ మీద ఒట్టు
కూతురుగా పుట్టి కొడుకుగా భాద్యతలు నెరవేర్చిన ఆర్తి కథ ఆమా
నేడే... మేడే...
'చింతల'పాలెంలో శిథిల త్రికూటాలయం, అపూర్వ శిల్పాలు
తల లేని తోక!
అసమానతలు లేని సమాజాన్ని కాంక్షించిన నవల 'అవతలి గుడిసె'
మంచి జీవితానికి భరోసా
పర్యావరణ రక్షణే ధరిత్రీ రక్షణ
స్త్రీల రక్తం పీల్చేసి, జీవితాంతం పీక్కుతింటూన్న రాకాసి గద్ద వంటిల్లు ''ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌''
తరతరాల చికిత్స విధానం... కైరాలి ఆయుర్వేద విధానం
మూడు దశాబ్దాల చట్టసభల సభ్యుడు, స్వాతంత్య్ర సమరయోధుడు చెన్నమనేని రాజేశ్వరరావు
బాలల సినీ గీతకారుడు డా. సి.నారాయణ రెడ్డి
రిజర్వేషన్లు సామాజిక న్యాయం కోసం
విగ్రహం
తీరిక లేని ప్రధాని, సాహిత్య పిపాసి పి.వి.
తెలుగు ధ్వనిలో బహు లయలు
ప్రేక్షక హృదయాలలో శాశ్వత ముద్ర వేసిన పాకీజా
అపశతుల కోయిల ?!
ఉపాధ్యాయ, ఉప్పు సత్యాగ్రహి స్వామి రామానంద తీర్థ
పంజాబీ పల్లెటూరి స్త్రీ జీవన సమస్యలను చిత్రించిన ''గేలో''
బైపొలార్‌ రెండు పరస్పర వ్యతిరేక లక్షణాలు
నాటక రంగానికి జేజేలు
జానపద బాలల కవి పాలడుగు నాగయ్య
ఇంటికో దీపం!!
భారతీయ సినిమా తొలితరం నటి దేవికా రాణి
''నాది దు:ఖం వీడని దేశం''

తాజా వార్తలు

07:01 PM

పాట‌తో మిమ్మ‌ల్ని ప్ర‌శ్నిస్తున్నందుకు కేసులు పెట్టి అణ‌చివేస్తారా?: రేవంత్ రెడ్డి

06:52 PM

తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం

06:43 PM

జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ

06:23 PM

వాళ్లతో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పొత్తులు ఉండ‌వు: కేఏ పాల్

06:02 PM

ఒప్పో ఎలివేట్ ప్రోగ్రామ్ 2వ ఎడిషన్ కోసం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపిన ఒప్పో

05:59 PM

లండ‌న్‌లో రాహుల్ గాంధీ..

05:44 PM

హైదరాబాద్ కు ప్రధాని మోడీ.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

05:42 PM

ఏపీలో విషాదం..రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్‌ మృతి..

05:26 PM

పద చూస్కుందాం కమల్ 'విక్రమ్' తెలుగు ట్రైలర్..

05:06 PM

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..

04:50 PM

జాతీయ స్థాయి ప‌ర్య‌ట‌న నిమిత్తం ఢిల్లీ బ‌య‌ల్దేరిన సీఎం కేసీఆర్

04:29 PM

పదోతరగతి పరీక్షలు..విద్యార్థుల‌కు ఆర్టీసీ గుడ్ న్యూస్

03:46 PM

అలాంటి గుడివాడను క్యాసినోవాడగా కొడాలి నాని మార్చాడు : దివ్యవాణి

03:24 PM

జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్యే ఆజంఖాన్‌

03:04 PM

దిశ ఎన్‌కౌంటర్‌‌పై సుప్రీంలో ముగిసిన విచారణ..ఎన్ కౌంటర్ బూటకం

02:40 PM

పోలీసు ఉద్యోగార్థుల‌కు కేసీఆర్ గుడ్ న్యూస్

02:26 PM

లారీని ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్.. 9 మంది సజీవ దహనం

02:23 PM

గుంటూరు జీజీహెచ్లో సీపీఐ ఆందోళన

01:56 PM

ప్రముఖ నటుడు కెప్టెన్‌ చలపతి చౌదరి కన్నుమూత

01:45 PM

పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన..

01:33 PM

369 పోస్టులతో యూపీఎస్సీ సీడీఎస్‌ నోటిఫికేషన్‌..

01:18 PM

కారులో డ్రైవర్ మృతదేహం..వైసీపీ ఎమ్మెల్సీ వివరణ

01:16 PM

ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ ఫస్ట్ లుక్.. ఊర మాస్‌లుక్‌లో ఎన్టీఆర్

12:53 PM

రైలు పట్టాలపై యువకుని మృతదేహం

12:51 PM

ఏపీ ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు

12:24 PM

విశాఖలో 40 కిలోల గంజాయి స్వాధీనం

12:17 PM

బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కాల్

11:36 AM

నిఖత్ జరీన్ కు ప్రధాని మోడీ, ఆనంద్ మహీంద్రా అభినందనలు

11:26 AM

మెట్టుగూడ వద్ద పవన్ కు ఘన స్వాగతం

10:58 AM

హెల్మెట్ విసిరి, బ్యాట్ ను విరగ్గొట్టిన మ్యాథ్యూ వేడ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.