Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఇక ఇంటి నుంచే ఉద్యోగం | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Jan 09,2022

ఇక ఇంటి నుంచే ఉద్యోగం

యువతీయువకులారా! మీ బెడ్‌ రూమే మీ ఆఫీసు కాగలదు, మీ మంచమే మీ కుర్చీగా మారగలదు, మీ కంప్యూటర్‌ డెస్కే మీ బీరువా అయిపోగలదు.మీరు సర్వ స్వతంత్రులు,మీరు పూరా పనిమంతులు,మీరు బెస్ట్‌ కమ్యూనికేటర్స్‌.ఇవాళ మీరు ఔనన్నా కాదన్నా ఇంటి నుంచే ఉద్యోగం చేయడం కళ్లముందున్న వాస్తవం. ఇంకేం సిద్ధం కండి
   "We like to give people the freedom to work where they want,safe in the knowledge that they have drive and expertise to perform excellently, whether they (are) at their desk or in their kitchen.Yours truly has never worked out of an office,and never will."
- Richard Branson
   ఉద్యోగి వేళకు ఆఫీసుకు రాకపోయినా, వచ్చి సరిగ్గా పనిచేయకపోయినా వెంటనే అక్కడి అధికారి నోటి నుంఎతీ వినిపించే హెచ్చరిక
   ''ఏం తమాషా చేస్తున్నావా! చేత కాకపోతే ఇంట్లో కూర్చో'' అని. ఆఫీసర్‌ మాటను ఎంతకీ చెవిన పెట్టకపోతే ఆ ఉద్యోగికి షోకాజ్‌, తదుపరి సెన్స్యూర్‌, ఆ తర్వాత సస్పెన్షన్‌, మితిమీరితే ఉద్యోగం నుంచి తొలగించి ఇంటికి పంపించడం జరుగుతుంది. ఇది ఇప్పటి దాకా కొనసాగిన పద్ధతి. టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచ గమనాన్ని మూలంగా మార్చేసింది.ఎంప్లారు మెంట్‌ Ê జాబ్‌ వర్క్‌లో విప్లవాత్మక విధానాలు అనుసంధానింపబడ్డాయి. కార్యాలయాల కంప్యూటరీకరణ, ఆటోమేషన్‌తో ఆయా ఉద్యోగులకు లాప్టాప్‌, టాబ్లెట్‌, స్మార్ట్‌ ఫోన్‌, పర్సనల్‌ కంప్యూటర్‌లు వైఫై సౌకర్యం కల్పించడం ద్వారా 'వర్క్‌ ఫ్రం హోం 'ఉపాధి విధానం ప్రపంచం నలుమూలలకు విస్తరించింది.వృత్తి నైపుణ్యాలున్న వాళ్లందరికీ 24/7 ప్రపంచ వ్యాప్తంగా సర్వీస్‌ సెక్టార్‌లో పనిచేసే అవకాశం ఉత్సావంతుల తలుపు తట్టింది. ఇందులో భాగంగానే ఇంటి నుంచే పనిచేసుకునే ఉపాధి వనరులు వర్క్‌ ఫోర్స్‌కు అందివచ్చాయి. విశ్వవ్యాప్తంగా ఉద్యోగుల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు వర్క్‌ ఫ్రం హోం సిస్టమ్‌లో పనిచేస్తున్నారు. మున్ముందు ఈ అవకాశాలు ఇంకా నాలుగింతలు పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో 'వర్క్‌ ఫ్రం హోం 'విధానానికి సంబంధించిన 'ఉద్యోగ లక్షణాల సిద్ధాంతం (Job Characteristics Theory) సేవల రంగాన్ని ప్రభావితం చేసింది. మెరుగైన సేవల ద్వారా వ్యక్తిగతంగా ఆకర్షణీయమైన వేతనం అందుకోవడమే కాకుండా, వర్క్‌ కల్చర్‌ ద్వారా సామాజిక సంపదను అధికమొత్తంలో ఎట్లా సృష్టించవచ్చునో కాపాడవచ్చునో యువ ఉద్యోగులు (యంగ్‌ ప్రొఫెషనల్స్‌) ఈ ఉద్యోగం లక్షణాల సిద్ధాంతం ద్వారా తెలుసుకోవచ్చు. కార్యాలయానికో, కర్మాగారానికో, వృత్తి స్థలానికో ప్రయాణించే సమయాన్ని కూడా పనిగా భావించ కూడదంటున్న"Work is something you do,not a place you go" అని అంటారు ఐ.టి నిపుణుడు స్కాట్‌ మెక్కూల్‌. ఈ సూచనను యంగ్‌ ప్రొఫెషనల్స్‌ జ్ఞాపకం పెట్టుకొని ఆఫీసు ప్రయాణాల అవసరం లేకుండానే జర్నీ టైం ను సైతం ప్రొడక్టివ్‌ టైంగా మార్చుకోడానికి వర్క్‌ ఫ్రం హోం వీలుకల్పిస్తుంది. సరళీకరణ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ సందర్భంలో ఉద్యోగ లక్షణాల సిద్ధాంతం ఇంట్లో నుంచే విధులు నిర్వహించే కార్యక్రమాన్ని మరింత సులభతరం చేస్తుంది.
   ఉద్యోగ లక్షణాల సిద్ధాంతం (జీజు) ప్రధానంగా ఉద్యోగి ఐదు సామర్ధ్యాలు 1.నైపుణ్య వైవిధ్యం (Skill Variety) 2.పని గుర్తింపు (Task Identity) 3.పని ప్రాముఖ్యత (Task Significance) 4.స్వయం ప్రతిపత్తి (Autonomy) 5.ప్రతిపుష్టి (Feed Back)లను గమనంలో ఉంచుకొని రూపొందించబడింది. ప్రత్యక్ష కార్యాలయ ఉద్యోగ నిర్వహణలో సహజంగా తలెత్తే అనుపస్థితి, ఆలస్యం, అశ్రద్ధ, కాలయాపన, వాయిదా, సహోద్యోగుల మధ్య ఈర్ష్యా ద్వేషాలతో కూడిన అవాంఛితపోటీ వంటి అవలక్షణాలకు తావులేకుండా సంస్థలు తమకు కావలసిన ఇతోధిక సేవలను ఉద్యోగుల నుంచి పొందడానికి వీలుగా 'ఇంటి నుంచే ఉద్యోగం (WFH) చేసే విధానాన్ని అనుమతించి అనుసరిస్తున్నాయి.
   దూరభారం, పని వేళలు, మేనేజ్‌మెంట్‌ మేనియా, అన్న పానీయాలు, పౌర ఒత్తిడి ఇత్యాది సమస్యలకు దూరంగా స్వేచ్ఛగా సృజనాత్మకంగా ఎవరి పని వాళ్లు సామర్థ్యం మేరకు సంతృప్తిగా చేసుకోవడానికి 'వర్క్‌ ఫ్రంమ్‌ హోం' ఉద్యోగం విధానం తమకు కలిసి వచ్చిన గొప్ప అవకాశంగా ఈ తరం యువత భావిస్తోంది. వ్యక్తిత్వ వికాస విద్యలో 2020 'వ్యక్తి మెరుగుదల యుగం (Age of Improving ourselves) ఆరంభ సంవత్సరంగా ప్రకటించబడిన నేపథ్యంలో యువత తమ మెంటల్‌ హెల్త్‌ , ఫిజికల్‌ ఫిట్‌ నెస్‌ను కాపాడుకుంటూ,సెల్ఫ్‌ కేర్‌ తీసుకుంటూ, సామాజిక సంబంధాలను ధృఢ పరచుకుంటూ, వృత్తి-ప్రవృత్తి రంగాల్లో రాణించడానికి వర్క్‌ ఫ్రం హోం సంప్రదాయం ఉద్యోగం కంటే సౌకర్యవంతమైందని కార్పొరేట్‌ సెక్టార్‌ కూడి అంగీకరిస్తుంది.ఇప్పటి వరకు అమలులో ఉన్న Office From wrok లోగల  Rat Race నుంచి సమర్ధవంతులు బయటపడి ఉత్సాహంగా సమృద్ధికరంగా మారేందుకు ప్రోత్సాహకాలు అందుతు న్నాయి. ప్రముఖ వాస్తుశిల్పి గౌతమ్‌ భాటియా చెపుతున్నట్టు "Once large
companies realised that profits and
company morals when employees didn't need to be present at all,work rom home not only made sense but introduced to level of useful lethargy that was missing in the presence of an intimidating boss." అనే అభిప్రాయంతో కొత్తతరం ఏకీభవిస్తాను.అధికారులు కల్పించే భయభ్రాంతులేవీ లేకుండగా శీజూవఅ శీటళషవ ద్వారా జరిగే కార్యకలాపలన్నిటినీ ష్ట్రశీఎవ శీటళషవ నడపగలగడం ఉద్యోరంగంలో వచ్చిన పరిణామంగా పారిశ్రామిక వేత్తలు సైతం గుర్తించారు.
   ఇంటి నుంచి పనిచేయడాన్నే 'టెలీకమ్మ్యూటింగ్‌, టెలీవర్క్‌, మొబైల్‌వర్క్‌, రిమోట్‌ వర్క్‌, ఫ్లెక్జిబిల్‌ వర్క్‌' అని కూడా అంటారు.ఈ పదాల రూపకర్త జాక్‌ నిల్లేస్‌. కాలిఫోర్నియాకు చెందిన ఈయన మంచి రాకెట్‌ శాస్త్రవేత్త.1973 ప్రాంతంలో టెలివర్కర్‌ పరిభాషను వాడుకలోకి తెచ్చిన జాక్‌ నిల్లేస్‌ను 'ఫాదర్‌ ఆఫ్‌ టెలీవర్కింగ్‌గా పిలుస్తారు. ఈయన ఈ రంగాన్ని సంపద్వంతం చేయడానికి JALA international సంస్థను స్థాపించారు. టెలీవర్కింగ్‌పై'Managing Tele working',Making Telecommuting మొదలైన రచనలు చేశారు.పని పునః కల్పనకు సంబంధించి 1960ల ప్రాంతం నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రణాళికలు, శిక్షణా కార్యక్రమాలు మొదలైనప్పటికి1975లో ఇల్లినాయిస్‌కు చెందిన మేనేజ్మెంట్‌ రంగ నిపుణులు గ్రెగ్‌ ఆర్‌.ఓల్ధామ్‌, జె.రిచర్డ్‌ హాక్మెన్‌లు సంయుక్తంగా రూపొందించిన' ఉద్యోగ లక్షణాల సిద్ధాంతం 'బహుళంగా వ్యాప్తిలోకి వచ్చింది. సరళతరమైన పని విధానం ద్వారా సర్వోత్కృష్టమైన ఉత్పాదకతే లక్ష్యంగా ఉద్యోగ లక్షణాల సిద్ధాంతం వృత్తిదారులకూ ఉద్యోగ సమాజాలకూ ఎంతగానో ఉపకరిస్తుంది. అర్థవంతమైన పని అనుభవం, బాధ్యతాయుతమైన పని అనుభవం,ఫలదాయకమైన పనిజ్ఞానం అనే త్రిముఖ మానసిక శాస్త్రవ్యూహాన్ని అనుసరించి వృత్తి ఉద్యోగాల నిర్వహణలో ప్రభావితాంశాలైన ప్రేరణ (Motivation), సంతృప్తి (Satisfaction) పనితీరు (Performance) అనుపస్థితిత్వం (Absenteeism) మరియు వార్షికాదాయం (Turnover) అనే ఐదింటిని సానుకూలంగా మలుచుకోడాన్ని ఉద్యోగ లక్షణాల సిద్ధాంతం వివరిస్తుంది. ఇందుకు ఓల్ధామ్‌ & హాక్మన్‌లు రాసిన గ్రంథం యువతకు వర్క్‌ ఫ్రం హోం గురించి ఎన్నో మెళకువలు చెపుతుంది.
   మెట్రిక్యులేషన్‌ ఆపై విద్యార్హతలు కలిగి అభివృద్ధి నైపుణ్యాలుగా పేర్కొన బడిన 'నైపుణ్యం 'Work Redesign' (Skill),ప్రమాణం (Scale), వేగం (Speed)లను అంది పుచ్చుకున్న యువతీయువకు లెవరైనా తమ ఇంటి నుండే ఉద్యోగం చేసుకోవచ్చు. ముఖ్యంగా మెడికల్‌ Ê హెల్త్‌, కంప్యూటర్‌ & ఐటి, కస్టమర్‌ సర్వీసెస్‌, ఎడ్యుకేషన్‌ & ట్రైనింగ్‌, సేల్స్‌, ఎకౌంటింగ్‌ Ê ఫైనాన్స్‌ రంగాలు వర్క్‌ ఫ్రం హోం ఉద్యోగావకాశాలను విరివిగా కల్పిస్తున్నాయి. వీటిల్లో డేటా ఎంట్రీ, డాక్యుమెంటేషన్‌, ప్రూఫ్‌ రీడింగ్‌, టైపింగ్‌, పెయిడ్‌ సర్వే, లోగో డిజైనింగ్‌, గ్రాఫిక్‌ డిజైనింగ్‌, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌, స్ప్రెడ్‌ షీట్‌ ఎంట్రీ, లాంగ్వేజ్‌ ట్రాన్స్‌ లేషన్‌,ఆన్‌ లైన్‌ అడ్వర్టైజ్‌ మెంట్‌, వర్డ్‌ ప్రెస్‌ డెవలపర్‌, కాంటెంట్‌ డెవలెపర్‌, కస్టమర్‌ సర్వీస్‌ రిప్రజెంటేషన్‌, రిక్రూటర్‌, కాల్‌ సెంటర్‌ అసోసియేట్స్‌, లేబరర్‌, సప్లయర్‌,ఆన్‌ లైన్‌ టీచింగ్‌ Ê మెంటరింగ్‌, కాపీ స్ట్రేటజిస్ట్‌, లోన్‌ ప్రొవైడర్‌, పేమెంట్స్‌ Ê కలెక్షన్స్‌ మేనేజర్‌, ఈవెంట్‌ మేనేజర్‌, టూర్‌ గైడ్‌ తదితర ఉద్యోగాల ద్వారా అభిరుచి చొరవలను బట్టి రోజుకు యాభై నుంచి వంద డాలర్లు అంటే మూడు నుంచి ఏడువేల రూపాయలు వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. తాము నివసించే హోమ్‌ టౌన్‌ మొదలు దేశ విదేశాలకు చెందిన కంపెనీలలో అభ్యర్థులు గంటలు,రోజులు, వారాలు, నెలల లెక్కన ప్యాకేజీల్లో పని చేయవచ్చు. గ్లోబల్‌ కంపెనీలైన VipLid, TTEC, DELL, Hopper, Kelly Services, Intuit,United Health Group, Aenta, Kplan, Board Path Health Care Services ,WSI, K12, BCD travel, Hartford,Appen,Meeshow,LionBridge, Amazon,Syker,Human,Liveops,GitLab,Invitae,Hi bu,Thermofisher,CACI international లాంటి వందకు పైచిలుకు సంస్థలు యువతకు విస్తృతమైన ఉపాధివనరులను కల్పిస్తున్నాయి.కుటంబంతో ఉంటూ, ఇంటిఖర్చులను పొదుపు చేసుకొని, ప్రయాణం, ట్రాఫిక్‌ సమస్యకు దూరంగా, సౌకర్యవంతంగా ఉత్పాదకతా సామర్థ్యానికి పదునుపెడుతూ,స్వచ్ఛగా ,ముఖ్యంగా వొత్తిడి కి దూరంగా పనిచేసే వ్యవస్థగా ప్యాషన్‌తో క్రియేటివ్‌ టచ్‌ తో పనిచేసే యంగ్‌ ప్రొఫెషనల్స్‌ కోసం 'వర్క్‌ ఫ్రం హోం' వినూత్న ద్వారాలను తెరచివుంచింది. మన దేశంలోని ముంబై, ఢిల్లీ,కలకత్తా, హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరు, అహ్మదాబాద్‌,జైపూర్‌,పూణే, విశాఖపట్నం, సూరత్‌ వంటి ముఖ్య మహానగరాల్లో మునుపెన్నడూ లేనివిధంగా వర్క్‌ ఫ్రం హోం కు ఉద్యోగులు మొగ్గుచూపుతున్నారు.
   'జెడ్‌' తరం యువతీయువకులారా! మీ బెడ్‌ రూమే మీ ఆఫీసు కాగలదు, మీ మంచమే మీ కుర్చీగా మారగలదు, మీ కంప్యూటర్‌ డెస్కే మీ బీరువా అయిపోగలదు.మీరు సర్వ స్వతంత్రులు,మీరు పూరా పనిమంతులు,మీరు బెస్ట్‌ కమ్యూనికేటర్స్‌.ఇవాళ మీరు ఔనన్నా కాదన్నా ఇంటి నుంచే ఉద్యోగం చేయడం కళ్లముందున్న వాస్తవం.ఇంకేం సిద్ధం కండి
-డా|| బెల్లి యాదయ్య, 98483 92690

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కూలుతున్న కుటుంబాలు
బొమ్మలరామారంలో కొత్తరాతిబొమ్మల తావు
వేగు చుక్కల వెలుగు తార ఇరివెంటి కృష్ణమూర్తి
అమ్మకు ఓ బహుమతి
ఒట్టు... నీ మీద ఒట్టు
కూతురుగా పుట్టి కొడుకుగా భాద్యతలు నెరవేర్చిన ఆర్తి కథ ఆమా
నేడే... మేడే...
'చింతల'పాలెంలో శిథిల త్రికూటాలయం, అపూర్వ శిల్పాలు
తల లేని తోక!
అసమానతలు లేని సమాజాన్ని కాంక్షించిన నవల 'అవతలి గుడిసె'
మంచి జీవితానికి భరోసా
పర్యావరణ రక్షణే ధరిత్రీ రక్షణ
స్త్రీల రక్తం పీల్చేసి, జీవితాంతం పీక్కుతింటూన్న రాకాసి గద్ద వంటిల్లు ''ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌''
తరతరాల చికిత్స విధానం... కైరాలి ఆయుర్వేద విధానం
మూడు దశాబ్దాల చట్టసభల సభ్యుడు, స్వాతంత్య్ర సమరయోధుడు చెన్నమనేని రాజేశ్వరరావు
బాలల సినీ గీతకారుడు డా. సి.నారాయణ రెడ్డి
రిజర్వేషన్లు సామాజిక న్యాయం కోసం
విగ్రహం
తీరిక లేని ప్రధాని, సాహిత్య పిపాసి పి.వి.
తెలుగు ధ్వనిలో బహు లయలు
ప్రేక్షక హృదయాలలో శాశ్వత ముద్ర వేసిన పాకీజా
అపశతుల కోయిల ?!
ఉపాధ్యాయ, ఉప్పు సత్యాగ్రహి స్వామి రామానంద తీర్థ
పంజాబీ పల్లెటూరి స్త్రీ జీవన సమస్యలను చిత్రించిన ''గేలో''
బైపొలార్‌ రెండు పరస్పర వ్యతిరేక లక్షణాలు
నాటక రంగానికి జేజేలు
జానపద బాలల కవి పాలడుగు నాగయ్య
ఇంటికో దీపం!!
భారతీయ సినిమా తొలితరం నటి దేవికా రాణి
''నాది దు:ఖం వీడని దేశం''

తాజా వార్తలు

08:03 PM

ఆరుగురు ఎస్సైలకు బదిలీలు

07:58 PM

ఢిల్లీ చేరిన సీఎం కేసీఆర్‌..

07:57 PM

రాహుల్ భ‌ట్ హ‌త్య అత్యంత దుర‌దృష్ట‌క‌రం : ఎల్జీ మ‌నోజ్ సిన్హా

07:01 PM

పాట‌తో మిమ్మ‌ల్ని ప్ర‌శ్నిస్తున్నందుకు కేసులు పెట్టి అణ‌చివేస్తారా?: రేవంత్ రెడ్డి

06:52 PM

తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం

06:43 PM

జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ

06:23 PM

వాళ్లతో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పొత్తులు ఉండ‌వు: కేఏ పాల్

06:02 PM

ఒప్పో ఎలివేట్ ప్రోగ్రామ్ 2వ ఎడిషన్ కోసం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపిన ఒప్పో

05:59 PM

లండ‌న్‌లో రాహుల్ గాంధీ..

05:44 PM

హైదరాబాద్ కు ప్రధాని మోడీ.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

05:42 PM

ఏపీలో విషాదం..రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్‌ మృతి..

05:26 PM

పద చూస్కుందాం కమల్ 'విక్రమ్' తెలుగు ట్రైలర్..

05:06 PM

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..

04:50 PM

జాతీయ స్థాయి ప‌ర్య‌ట‌న నిమిత్తం ఢిల్లీ బ‌య‌ల్దేరిన సీఎం కేసీఆర్

04:29 PM

పదోతరగతి పరీక్షలు..విద్యార్థుల‌కు ఆర్టీసీ గుడ్ న్యూస్

03:46 PM

అలాంటి గుడివాడను క్యాసినోవాడగా కొడాలి నాని మార్చాడు : దివ్యవాణి

03:24 PM

జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్యే ఆజంఖాన్‌

03:04 PM

దిశ ఎన్‌కౌంటర్‌‌పై సుప్రీంలో ముగిసిన విచారణ..ఎన్ కౌంటర్ బూటకం

02:40 PM

పోలీసు ఉద్యోగార్థుల‌కు కేసీఆర్ గుడ్ న్యూస్

02:26 PM

లారీని ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్.. 9 మంది సజీవ దహనం

02:23 PM

గుంటూరు జీజీహెచ్లో సీపీఐ ఆందోళన

01:56 PM

ప్రముఖ నటుడు కెప్టెన్‌ చలపతి చౌదరి కన్నుమూత

01:45 PM

పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన..

01:33 PM

369 పోస్టులతో యూపీఎస్సీ సీడీఎస్‌ నోటిఫికేషన్‌..

01:18 PM

కారులో డ్రైవర్ మృతదేహం..వైసీపీ ఎమ్మెల్సీ వివరణ

01:16 PM

ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ ఫస్ట్ లుక్.. ఊర మాస్‌లుక్‌లో ఎన్టీఆర్

12:53 PM

రైలు పట్టాలపై యువకుని మృతదేహం

12:51 PM

ఏపీ ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు

12:24 PM

విశాఖలో 40 కిలోల గంజాయి స్వాధీనం

12:17 PM

బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కాల్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.