Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తొలితరం సినీ నటి దుర్గాఖోటే | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Jan 09,2022

తొలితరం సినీ నటి దుర్గాఖోటే

దుర్గా సామాజిక నిషేధాన్ని బద్దలు కొట్టి, తన పిల్లలను పోషించుకోవడానికి, సినిమాలో పనిచేయడానికి అంగీకరించింది. ఆ సమయంలో సినిమా పరిశ్రమలో పనిచేసే మహిళలకు గౌరవం ఉండేది కాదు. స్త్రీల పాత్రను పురుషులు పోషించేవారు. అలాంటి కాలంలో దుర్గా ఖోటే సినిమాల్లోకి ప్రవేశించింది. దీంతో ఆమె తన కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్న, వాటన్నింటినీ అధిగమించి హిందీ, మరాఠీ భాషల్లో హీరోయిన్‌గా వెలుగొంది, ప్రముఖ నటిగా తనదైన ముద్ర వేసుకుంది.
      గౌరవప్రదమైన కుటుంబాల నుంచి వచ్చిన మొదటి మహిళ, భారతీయ సినిమా తొలితరం సినీ నటి దుర్గాఖోటే. రెండు వందలకు పైగా చిత్రాలతో పాటు, అనేక థియేటర్‌ ప్రొడక్షన్స్‌లలో నటించింది. బాలీవుడ్‌లో ప్రసిద్ధి చెందిన నటిగా గుర్తింపు పొందిన దుర్గా ఖోటే మూకీ చిత్రాలలో తన నటన ప్రస్థానం మొదలు పెట్టి, టాకీ చిత్రాల వరకు వైవిద్యమైన పాత్రలను పోషించింది. టెలివిజన్‌లో రంగంలో సైతం తనదైన ముద్ర వేసి, షార్ట్‌ ఫిల్మ్‌లు, యాడ్‌ ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీలు, టెలీ సిరీస్‌ లను నిర్మించిన దర్శక, నిర్మాత దుర్గా ఖోటే తల్లి పాత్రలు పోషించిన మొదటి పది మంది నటీమణులలో ఆమె స్థానం పొందారు. 1968లో భారత ప్రభుత్వంచే 'పద్మశ్రీ' పురస్కారంతో పాటు, 1983లో భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఆమె చేసిన కృషికి గాను కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన 'దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు' ఇచ్చి సత్కరించింది. 2000 సంవత్సరంలో, ఇండియా టుడే వెలువరించిన సహస్రాబ్ది సంచికలో 100 మంది ప్రముఖ వ్యక్తుల జాబితాలో దుర్గాఖోటే కు స్థానం లభించింది.
   మహారాష్ట్రలోని బొంబాయిలో దుర్గా ఖోటే సాంప్రదాయ, ఉమ్మడి కుటుంబంలో 1905వ సంవత్సరం జనవరి 14వ తేదీన జన్మించింది. కొంకణి భాషలో మాట్లాడే ఇంటిలో పాండురంగ్‌ శ్యాంరావ్‌ లాడ్‌, మంజుల బాయి దంపతులకు జన్మించిన దుర్గా ఖోటే పేరు మొదట్లో విటా లాడ్‌, నటిగా కెరీర్‌ ప్రారంభించిన తర్వాత స్క్రీన్‌ పై తన పేరును దుర్గా ఖోటేగా మార్చుకున్నారు. ఆమె కేథడ్రల్‌ హైస్కూల్‌లో ఉన్నత పాఠశాలను పూర్తి చేసిన తరువాత ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్‌ కోసం సెయింట్‌ జేవియర్స్‌ కాలేజీలో చేరింది. కాలేజీలో చదువుతున్న 'విటా లాడ్‌' యుక్తవయస్సులోనే, ''ఖోటే'' కుటుంబానికి చెందిన 'విశ్వనాథ్‌ ఖోటే'ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత వారికి హరీన్‌, బకుల్‌ అనే ఇద్దరు కుమారులు జన్మించారు. అయితే దుర్గా 26వ ఏటా భర్త విశ్వనాథ్‌ ఆకస్మిక మరణంతో ఇద్దరు కుమారులను పోషించే బాద్యత వితంతువు తల్లి అయిన ఆమెపై పడింది. అందుకే దుర్గా సామాజిక నిషేధాన్ని బద్దలు కొట్టి, తన పిల్లలను పోషించుకోవడానికి, సినిమాలో పనిచేయడానికి అంగీకరించింది. ఆ సమయంలో సినిమా పరిశ్రమలో పనిచేసే మహిళలకు గౌరవం ఉండేది కాదు. స్త్రీల పాత్రను పురుషులు పోషించేవారు. అలాంటి కాలంలో దుర్గా ఖోటే సినిమాల్లోకి ప్రవేశించింది. దీంతో ఆమె తన కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్న, వాటన్నింటినీ అధిగమించి హిందీ, మరాఠీ భాషల్లో హీరోయిన్‌గా వెలుగొంది, ప్రముఖ నటిగా తనదైన ముద్ర వేసుకుంది.
   దుర్గా ఖోటే 1931 లో ప్రభాత్‌ ఫిల్మ్‌ కంపెనీ నిర్మించిన 'ఫరేబీ జల్‌' చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. అయితే దుర్గా నటించిన ఈ తొలి చిత్రం బాక్సాఫీస్‌ వద్ద విజయం సాదించలేకపోయింది. ఈ చిత్ర సంస్థ 1932 లో నిర్మించిన 'మాయా మచింద్ర' చిత్రంలోదుర్గ కథానాయికగా నటించింది. ఈ సినిమా హిందీ, మరాఠీ భాషల్లో విడుదలైంది. 1932లో ఫాల్కే చిత్రానికి ద్విభాషా రీమేక్‌ అయిన 'అయోధ్యేచ రాజా'లో ప్రముఖ దర్శకుడు వి. శాంతారామ్‌ భారతదేశపు మొదటి చిత్రంలో సాలుంకే పోషించిన 'క్వీన్‌ తారామతి' పాత్రకు దుర్గా ఖోటేను ఎంపిక చేశారు. మరాఠీలో నిర్మించిన ఈ మొదటి టాకీ చిత్రం పెద్ద హిట్‌ సాదించడంతో, దుర్గా ఖోటే హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొంది, ప్రేక్షకుల, విమర్శకుల నుంచి గొప్ప ప్రశంసలను అందుకుంది. దుర్గా ఖోటే ప్రభాత్‌ ఫిల్మ్‌ కంపెనీ నిర్మించిన సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు పొందినప్పటికీ, నెలవారీ జీతం ఒప్పందంతో పని చేయకుండా, ఫ్రీలాన్స్గా పనిచేసి భారతదేశపు మొదటి ఫ్రీలాన్స్‌ కళాకారిణి అయింది. ఆ తర్వాత దుర్గా ఖోటే కు ''న్యూ థియేటర్స్‌, ఈస్ట్‌ ఇండియా ఫిల్మ్‌ కంపెనీ, ప్రకాష్‌ పిక్చర్స్‌'' వంటి నిర్మాణ సంస్థలలో నటించే అవకాశం వచ్చింది. ఆ రోజుల్లో చాలా మంది నటీమణులకు దుర్గ స్ఫూర్తి. ముఖ్యంగా తనూజ తల్లి శోభన సమర్త్‌ ఆమెకు వీరాభిమాని.
   దుర్గా ఖోటే 1933లో సైరంధ్రి, 1936లో ఆమె 'అమర్‌ జ్యోతి'లో సౌదామిని పాత్ర పోషించింది, ఇది ఆమె మరపురాని పాత్రలలో ఒకటి. 1943లో 'మహాత్మా విదుర్‌' సినిమాల్లో నటించింది. ఆమె పోషించిన పాత్రలు చాలా వరకు రాచరికపు వ్యక్తిత్వాన్ని పోలి ఉండేవి. 1937లో దుర్గా 'సాథి' అనే చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించి మన దేశపు తొలి మహిళా చిత్రనిర్మాతగా ఎదిగారు. 40వ దశకంలో దుర్గా ఖోటే 'చర్నోన్‌ కి దాసి' (1941), 'భారత్‌ మిలాప్‌ (1942) చిత్రాలలో నటించి వరుసగా రెండు సంవత్సరాలు 'బెంగాలీ ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌' నుంచి ఉత్తమ నటి అవార్డును అందుకుంది. 1945లో 'వీర్‌ కునాల్‌' తరవాత వరుస చిత్రాలలో విజయ వంతమైన ప్రధాన పాత్రలు పోషించిన దుర్గా ఖోటే నెమ్మదిగా క్యారెక్టర్‌ రోల్స్‌లోకి ప్రవేశించింది. 1960లో కె ఆసిఫ్‌ నిర్మించిన 'మొఘల్‌-ఎ-ఆజం' చిత్రంలో తన భర్త పట్ల కర్తవ్యం, కొడుకు పట్ల ప్రేమ మధ్య నలిగిపోతున్న అక్బర్‌ చక్రవర్తి భార్య జోధాబాయి పాత్రలో నటించిన దుర్గా ఖోటేకు మంచి గుర్తింపు వచ్చింది. 1963లో దుర్గా మర్చంట్‌ ఐవరీ తొలి చిత్రం 'ది హౌజ్‌హోల్డర్‌' నటించింది, ఇందులోను ఆమె తల్లి పాత్రను పోషించింది. ఈ చిత్రంలో శశి కపూర్‌, లీలా నాయుడు ప్రధాన పాత్రలు పోషించారు. 1973 లో 'బాబీ' చిత్రంలో హీరోయిన్‌ అమ్మమ్మ పాత్ర, ఈ సినిమా విడుదలైన తర్వాత కొత్త తరం ప్రేక్షకులు దుర్గా ఖోటేను డింపుల్‌ కపాడియా అమ్మమ్మ అని పిలిచేవారు. 1973లోనే 'అభిమాన్‌'లో హీరో అత్త పాత్రలను పోషించింది. 1974లో 'బిదాయి' చిత్రంలో తల్లి పాత్రలో ఆమె మరపురాని నటనకు ఫిలింఫేర్‌ ఉత్తమ సహాయ నటి అవార్డును అందుకుంది.1980లో రిషి కపూర్‌ తల్లిగా 'కర్జ్‌'లో చిర స్మరణీయమైన పాత్ర పోషించింది. చిత్రనిర్మాత హృషికేష్‌ ముఖర్జీకి ఇష్టమైన నటిగా తన అనేక చిత్రాలలో ఆమెను నటింప చేశాడు. దుర్గా ఖోటే బల్రాజ్‌ సాహ్ని, పృథ్వీరాజ్‌ కపూర్‌, కె. ఏ. అబ్బాస్‌ వంటి ప్రముఖులతో కలిసి పనిచేసింది.1980ల నాటికి, సినిమాలపై దృష్టి సారించలేక, ఆమె క్రమంగా షార్ట్‌ ఫిల్మ్‌లు, యాడ్‌ ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీల నిర్మాణంపై దృష్టి సారించింది. దూరదర్శన్‌ కోసం 'వాగ్లే కి దునియా' టెలివిజన్‌ సిరీస్‌లను నిర్మించిన దుర్గా ఖోటే నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించింది. దాదాపు 50 ఏళ్లు చిత్ర పరిశ్రమలో కొనసాగిన దుర్గా ఖోటే ''సీత, జీవన నాటకం, ఇంక్విలాబ్‌, ప్రతిభ, అధూరి, కహానీ, గీతా, భారత్‌ మిలాప్‌, మహాత్మా విధుర్‌, దిల్‌ కి బాత్‌, హమ్‌ ఏక్‌ హై, జీత్‌, నిషనా, బెకసూర్‌, హైదరాబాద్‌ కి నజ్నీన్‌, మీర్జా గాలీబ్‌ , దో బారు, సంఘర్ష్‌, ఖిలోనా, బింగారి, కర్జ్‌, అగ్నిరేఖ, కాలా సోనా'',1983 లో చివరి చిత్రం 'దౌలత్‌ కె దుస్మాన్‌' మొదలైన 200 సినిమాల్లో నటించి ప్రశంసలు అందుకున్న ఈ లెజెండరీ నటి 86 సంవత్సరాల వయసులో సెప్టెంబర్‌ 22, 1991న ముంబైలో కన్నుమూసింది. దుర్గా ఖోటే తన ఆత్మకథను మరాఠీలో రాయగా, అది ఆంగ్లంలో 'ఐ, దుర్గా ఖోటే'గా అనువదించబడింది.
   దుర్గా ఖోటే సినిమాలే కాకుండా, మరాఠీ థియేటర్‌లో చురుకైన పాత్ర పోషించడంతోపాటు, ఇండియన్‌ పీపుల్స్‌ థియే టర్‌ అసోసియేషన్‌లో చేరి, ప్రధాన పాత్ర వహించింది. దుర్గా ఇండియన్‌ పీపుల్స్‌ థియేటర్‌ అసోసియేషన్‌, రచయితలు, మేధావుల వామపక్ష భావాల సమావేశాలలో తరచుగా పాల్గొనేది. అలాగే ఇండియన్‌ పీపుల్స్‌ థియేటర్‌ రూపొందించిన నాటకాలలో నటించడంతోపాటు, స్వాతంత్య్రానంతర కాలంలో ముంబై మరాఠీ సాహిత్య సంఘం కోసం భారతదేశ సాంస్కృతిక జీవితంలో ముఖ్యమైన పాత్రలను పోషించింది. దుర్గా వి.వి.శిర్వాడ్కర్‌ రాజ్‌ముకుత్‌, ది రాయల్‌ క్రౌన్‌, మక్‌బెత్‌ మరాఠీ వెర్షన్‌లో నటించింది, ఇందులో ఆమె లేడీ మక్‌బెత్‌ పాత్రలో నటించింది.
   దుర్గా ఖోటే 'బాబీ' విజయం తర్వాత, దుర్గా 'బిదాయి'లో తల్లి పాత్రను పోషించింది, దీనికి ఫిలింఫేర్‌ ఉత్తమ సహాయ నటి అవార్డును అందుకుంది. హృషికేశ్‌ ముఖర్జీ 'అభిమాన్‌'లో అమితాబ్‌ బచ్చన్‌కి అత్తగా కూడా నటించింది. అంతకుముందు, దుర్గా కె. ఆసిఫ్‌ రూపొందించిన 'మొఘల్‌-ఎ-ఆజం'లో జోధాబాయి పాత్రను పోషించింది. జోధాబాయి పాత్ర ప్రేక్షకులలో బాగా ప్రాచుర్యం పొందింది. బొద్దుగా, అబ్బురపరిచే వైవిధ్యభరితమైన చిత్రాల తార అయిన దుర్గా ఖోటే తన కెరీర్‌ ప్రారంభ దశలో అనేక హిందీ సినిమాల్లో రాణి పాత్రలు పోషించింది. ఆ తర్వాత ఫ్యామిలీ డ్రామాల్లో క్యారెక్టర్‌ రోల్స్‌కు మారింది.
   ఆమె చలనచిత్ర జీవితం సక్సెస్‌తో దూసుకెళ్తున్న సమయంలో దుర్గా పురుషులతో సమానమైన గుర్తింపు ఉండే మహిళల పాత్రను పోషించింది. తరచుగా రాణులు, యోధుల యువరాణులు, సాయుధ దుస్తులు ధరించిన పాత్రలు చేయడంతో దర్శకులు ఆమెకు తగ్గ పాత్రలు కల్పించి అవకాశం ఇవచ్చేవారు. 1935లో ఆమె కొలాÛపూర్‌లో షూటింగ్‌ జరుగుతున్న సమయంలో, సింహాలు పాల్గొన్న సన్నివేశం జరగుతుంది. అయితే సింహాలకు శిక్షణ ఇచ్చినప్పటికీ, వాటిలో ఒకటి అదుపు తప్పి, 'మారుతీ రావు' అనే నటుడిపైకి దూసుకెళ్లి, అతని భుజం మీద దూకడం ప్రారంభించింది. ఖోటే సింహాన్ని పట్టుకోవడానికి ధైర్యం చేసి, దాని జూలు పట్టుకుని, శిక్షకుడు వచ్చే వరకు దానిని గట్టిగా పట్టుకుని లాగడంతో, ఆమె ముంజేయికి గాయాలయ్యాయి, కానీ యూనిట్‌ మొత్తం ఆమె ధైర్య,సాహసాలు చూసి విస్మయం చెందారట.
(జనవరి 14 న దుర్గా ఖోటే 116 వ జయంతి సందర్భంగా)
-పొన్నం రవిచంద్ర, 9440077499

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కూలుతున్న కుటుంబాలు
బొమ్మలరామారంలో కొత్తరాతిబొమ్మల తావు
వేగు చుక్కల వెలుగు తార ఇరివెంటి కృష్ణమూర్తి
అమ్మకు ఓ బహుమతి
ఒట్టు... నీ మీద ఒట్టు
కూతురుగా పుట్టి కొడుకుగా భాద్యతలు నెరవేర్చిన ఆర్తి కథ ఆమా
నేడే... మేడే...
'చింతల'పాలెంలో శిథిల త్రికూటాలయం, అపూర్వ శిల్పాలు
తల లేని తోక!
అసమానతలు లేని సమాజాన్ని కాంక్షించిన నవల 'అవతలి గుడిసె'
మంచి జీవితానికి భరోసా
పర్యావరణ రక్షణే ధరిత్రీ రక్షణ
స్త్రీల రక్తం పీల్చేసి, జీవితాంతం పీక్కుతింటూన్న రాకాసి గద్ద వంటిల్లు ''ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌''
తరతరాల చికిత్స విధానం... కైరాలి ఆయుర్వేద విధానం
మూడు దశాబ్దాల చట్టసభల సభ్యుడు, స్వాతంత్య్ర సమరయోధుడు చెన్నమనేని రాజేశ్వరరావు
బాలల సినీ గీతకారుడు డా. సి.నారాయణ రెడ్డి
రిజర్వేషన్లు సామాజిక న్యాయం కోసం
విగ్రహం
తీరిక లేని ప్రధాని, సాహిత్య పిపాసి పి.వి.
తెలుగు ధ్వనిలో బహు లయలు
ప్రేక్షక హృదయాలలో శాశ్వత ముద్ర వేసిన పాకీజా
అపశతుల కోయిల ?!
ఉపాధ్యాయ, ఉప్పు సత్యాగ్రహి స్వామి రామానంద తీర్థ
పంజాబీ పల్లెటూరి స్త్రీ జీవన సమస్యలను చిత్రించిన ''గేలో''
బైపొలార్‌ రెండు పరస్పర వ్యతిరేక లక్షణాలు
నాటక రంగానికి జేజేలు
జానపద బాలల కవి పాలడుగు నాగయ్య
ఇంటికో దీపం!!
భారతీయ సినిమా తొలితరం నటి దేవికా రాణి
''నాది దు:ఖం వీడని దేశం''

తాజా వార్తలు

06:43 PM

జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ

06:23 PM

వాళ్లతో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పొత్తులు ఉండ‌వు: కేఏ పాల్

06:02 PM

ఒప్పో ఎలివేట్ ప్రోగ్రామ్ 2వ ఎడిషన్ కోసం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపిన ఒప్పో

05:59 PM

లండ‌న్‌లో రాహుల్ గాంధీ..

05:44 PM

హైదరాబాద్ కు ప్రధాని మోడీ.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

05:42 PM

ఏపీలో విషాదం..రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్‌ మృతి..

05:26 PM

పద చూస్కుందాం కమల్ 'విక్రమ్' తెలుగు ట్రైలర్..

05:06 PM

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..

04:50 PM

జాతీయ స్థాయి ప‌ర్య‌ట‌న నిమిత్తం ఢిల్లీ బ‌య‌ల్దేరిన సీఎం కేసీఆర్

04:29 PM

రేప‌టి నుండి పదోతరగతి పరీక్షలు..విద్యార్థుల‌కు ఆర్టీసీ గుడ్ న్యూస్

03:46 PM

అలాంటి గుడివాడను క్యాసినోవాడగా కొడాలి నాని మార్చాడు : దివ్యవాణి

03:24 PM

జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్యే ఆజంఖాన్‌

03:04 PM

దిశ ఎన్‌కౌంటర్‌‌పై సుప్రీంలో ముగిసిన విచారణ..ఎన్ కౌంటర్ బూటకం

02:40 PM

పోలీసు ఉద్యోగార్థుల‌కు కేసీఆర్ గుడ్ న్యూస్

02:26 PM

లారీని ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్.. 9 మంది సజీవ దహనం

02:23 PM

గుంటూరు జీజీహెచ్లో సీపీఐ ఆందోళన

01:56 PM

ప్రముఖ నటుడు కెప్టెన్‌ చలపతి చౌదరి కన్నుమూత

01:45 PM

పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన..

01:33 PM

369 పోస్టులతో యూపీఎస్సీ సీడీఎస్‌ నోటిఫికేషన్‌..

01:18 PM

కారులో డ్రైవర్ మృతదేహం..వైసీపీ ఎమ్మెల్సీ వివరణ

01:16 PM

ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ ఫస్ట్ లుక్.. ఊర మాస్‌లుక్‌లో ఎన్టీఆర్

12:53 PM

రైలు పట్టాలపై యువకుని మృతదేహం

12:51 PM

ఏపీ ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు

12:24 PM

విశాఖలో 40 కిలోల గంజాయి స్వాధీనం

12:17 PM

బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కాల్

11:36 AM

నిఖత్ జరీన్ కు ప్రధాని మోడీ, ఆనంద్ మహీంద్రా అభినందనలు

11:26 AM

మెట్టుగూడ వద్ద పవన్ కు ఘన స్వాగతం

10:58 AM

హెల్మెట్ విసిరి, బ్యాట్ ను విరగ్గొట్టిన మ్యాథ్యూ వేడ్

10:49 AM

నిజామాబాద్‌లో చెట్టును ఢీకొట్టిన కారు: వ్యక్తి మృతి

10:48 AM

అందుకే ఈ మ్యాచ్‌లో బాగా ఆడ‌గ‌లిగాను: విరాట్ కోహ్లీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.