Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తీరిక లేని ప్రధాని, సాహిత్య పిపాసి పి.వి. | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Apr 09,2022

తీరిక లేని ప్రధాని, సాహిత్య పిపాసి పి.వి.

         ఆయన న్యాయశాస్త్రం తప్ప రాజనీతి శాస్త్రం చదవలేదు కానీ అపర చాణక్యుడు. ఆయన ఆర్ధిక శాస్త్రం అభ్యసించలేదు అయినా అందులో పేరు మోసిన పండితులను అబ్బురపరిచాడు. ఆయన భాష శాస్త్రవేత్త కాదు. అయినా పదికి మించిన భాషలలో పండితుడు. తన అనువాదాలతో 'ఔరా' అనిపించాడు. ఆయన పట్టు పరుపుల్లో పెరగలేడు. సంక్లిష్ట స్థితిగతుల నడుమ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నాడు. విద్య కోసం సరిహద్దులు దాటాడు. ఉద్యమం కోసం ఆదర్శాల బాటలు తొక్కాడు. అతనే అతనే.. పాములపర్తి వెంకట నరసింహారావు. ''మౌనేన కలహం నాస్తి''కి సరైన చిరునామా. మన ప్రధానమంత్రి నరసింహారావు.
జననం, విద్య
         ఆంధ్ర దేశంలో ప్రజల ఇంటిపేర్లు సాధారణంగా వారు వలస వచ్చిన ఊరి పేర్లతో ఉంటాయి. కొంతమందికి కులాల పేర్లు, వంశ నామాలూ ఉంటాయి. ఇక్కడ పాములపర్తిని ఇంటి పేరుగా కల్గిన నరసింహారావు గారి పూర్వీకులు సిద్దిపేటలోని పాములపర్తికి చెందినవారు. వీరు ఈ గ్రామం నుండి హుజురాబాద్‌ తాలుకాలోని వంగరకు వలస వెళ్ళారు. పి.వి. నరసింహారావు ఇక్కడే రుక్మాబాయమ్మ, సీతారామారావులకు 1921 జూన్‌ 28 న జన్మించాడు.
వీరి గురువు రామయ్య పంతులు. ఇతను తన అక్క గారి ఊరైన వరంగల్లులోని వేలేరులో కొంతకాలం చదివాడు. హైస్కూలు విద్యను వరంగల్లులో పూర్తి చేశాడు. ఇక్కడే పి.వి.కి కాళోజి, పాములపర్తి సదాశివరావులు పరిచయమయ్యారు. 1938లో జరిగిన హైదరాబాదు వందేమాతర ఉద్యమం కారణంగా మహారాష్ట్రలోని పూణే ఫెర్గుసన్‌ కాలేజిలో చేరాడు. అనంతరం నాగపూరులో న్యాయశాస్త్రాన్ని అభ్యసించాడు. భారత ఉపరాష్ట్రపతిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ హిదయతుల్లా పి.వి.కి పాఠాలు చెప్పాడు. న్యాయవిద్య అయ్యాక బూర్గుల రామకష్ణారావు వద్ద ప్రాక్టిసు చేశాడు.
స్వాతంత్య్రోద్యమం
         హైదరాబాదు సంస్థాన స్వాతంత్య్రోద్యమంలో ఉస్మానియా వందేమాతర ఉద్యమం అనేది ఆంక్షల మధ్య నుండి ఉద్భవించిన యువ జనోద్యమం. ఫలితంగా అనేక మంది కళాశాల బహిష్కరణకు గురయ్యారు. ఈ సంఘటనతో విద్యార్థుల చదువూ ఆగలేదు. లేవనెత్తిన ఉద్యమమూ ఆగలేదు. పైగా ఉధతమైంది. పి.వి. అప్పటికే కాంగ్రెసు కార్యకర్తగా చురుకుగా ఉన్నాడు. ఈ సమయంలోనే, ప్రజలలో రేగిన స్వాతంత్య్ర కాంక్షను, స్వరాజ్య భావనను అంతం చేయుటకు రజాకార్లు, పోలీసులు నిజాం ఆజ్ఞ మేరకు ఉద్యమ ప్రాంతాలలో శిబిరాలు ఏర్పాటు చేసి ఉద్యమ కారులపై హింసాత్మకంగా విరుచుక పడ్డారు. అయినా ఉద్యమ ప్రాబల్యం తగ్గకుండా ఇంకా రెట్టింపు అయ్యింది. ఈ హింసాత్మక దాడు లకు వెరవకుండా కాంగ్రెసు కార్యకర్తలు, కమ్యూనిస్టులు, విముక్తిని కోరే ఇతర ఉద్యమకారులు నిజాం రాష్ట్ర సరిహద్దుల్లో, సంస్థానం లోపల క్యాంపులు నిర్వహించి ప్రతిదాడులకు పాల్పడ్డారు.
''చాందాలో కె.వి. నరసింగరావు ఆధ్వర్యంలో సరిహద్దు పోరాట శిబిరం ఏర్పాటైంది. చాందా పోరాట శిబిరంలో మూడు వందల మంది కాంగ్రెసు కార్యక్తలు భాగస్వాములు అయ్యారు. వారిలో పి.వి. ఒకరు'' (విలక్షణ పి.వి. జీవితం, పుట19) ఈ పోరాట సమయానికి పి.వి పాతికేళ్ళ ప్రాయం దాటిన యువకుడు. ఇతనికి ఆదర్శం, గురువు అయిన రామానంద తీర్థ ప్రభావానికి లోనయి తన దర్శకత్వంలో ముందుకు సాగాడు. తన ఆత్మకథాత్మక నవలలో ఈ పోరాట కాలం నాటి సంఘటనలను తెలిపాడు. ఈ నవలలోని కథానాయకుడు ఆనంద్‌ రూపంలో పి.వి. మనకు దర్శనమిస్తాడు.
రాజకీయ జీవితం
         పి.వి మంథని నుండి నాలుగు సార్లు అసెంబ్లీకి వెళ్ళాడు. 1962లో తొలిసారి అమాత్యుడయ్యాడు. ఇలా రాజకీయ భవిష్యత్తు విస్తతమవుతున్న కొద్దీ న్యాయ, సమాచార, వైద్య- ఆరోగ్య శాఖల మంత్రిగా వ్యవహరించాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలంలోనే అనూహ్యంగా 1971 సెప్టెంబర్‌ 30 న ముఖ్యమంత్రి అయ్యాడు. రాజకీయాలలో వైరం లేకుండా దశాబ్దాల వరకు కొనసాగి భారత ప్రధానమంత్రి అయ్యాడు. అది వరకు లేని భారత రాజకీయ చరిత్రలో ఆర్ధిక సంస్కరణలు చేపట్టి అనేకుల విమర్శలను ఎదుర్కొన్నాడు. ఎవరికీ తల వంచకుండా, ఎవరిని వంచించకుండా అపర చాణక్యుడిలా తన వ్యూహాలను రచించి రాజకీయ క్షేత్రంలో అమలు పరిచాడు. ఇప్పుడు కొనసాగుతున్న భారత ఆర్ధిక వ్యవస్థకు పి.వి. చేపట్టిన సంస్కరణలే మూలమని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు.
రచనలు
         వీరి స్వగ్రామంలోనే 1970 దశాబ్దంలో తన ఆత్మకథాత్మక నవలైన ''ఇన్‌ సైడర్‌''ను ప్రారంభించాడు. విశ్వనాథ సత్య నారాయణ రాసిన 'వేయి పడగలు' నవలను 'సహస్రఫణ్‌' పేరుతో హిందీ అనువాదం చేశాడు(1968). ఈ నవల వెలిచాల కొండలరావు స్ఫూర్తితో ఇంగ్లీషులోకి తర్జుమా అయ్యింది. 'హరి నారాయణ ఆప్టే' అనే మరాఠి రచయిత రాసిన ''పన్‌ లక్ష్యత్‌ కోన్‌ ఘేతో'' అనే రచనను కేంద్ర సాహిత్య అకాడమీ కోరిక మేరకు పి.వి. ''అబలా జీవితం'' పేరుతో అనువాదం చేశాడు. 'మాకొద్దీ బతుకు, గొల్ల రామవ్వ' అనే కథలతో పాటు పలు వ్యాసాలూ రాశాడు. పత్రికను నడిపాడు. ఈ 'గొల్ల రామవ్వ' కథలో జాతీయోద్యమ పోరాటంలోని దాడిని తెలిపాడు. సాహిత్యంలో వానమామల వారు సుప్రసిద్ధులు. ఈ వరదాచార్యులు, జగన్నాథచార్యులు ఇద్దరు సోదరులు విడివిడిగా రాసిన వ్యాసవాణి, రైతు రామాయణం అనే కావ్యాలను పి.వి. కే అంకితమిచ్చారు. అలాగే సుప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త అయిన భద్రిరాజు కష్ణమూర్తి పి.వి. కి గల సాహితీ మిత్రుల్లో ఒకరు. ఇతను రాసిన ''భాష-సమాజం-సంస్కతి'' అనే గ్రంథాన్ని కూడా పి.వి. కే అంకిత మిచ్చాడు.
తెలుగు వాడి రాజకీయ ముద్రను పార్లమెంటులో వేసి, రాజకీయ కురువద్దులచే శభాష్‌ అనిపించుకున్న అపర ఠీవి మన పి.వి.

- ఘనపురం సుదర్శన్‌,

  9000470542

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'ప్రబొధ గీతాల' కొక్కొరోకో (సంకలనం)
ఆనాటి సమాజం మీద ఆత్మార్పణ వీరుల ప్రభావం
50 యేళ్ళ క్రితం నేనో పెద్ద తప్పు చేశాను
భువి స్వ‌ర్గం మేఘాల‌య‌
వితంతు వివాహాల మాటున స్త్రీలపై జరిగిన అన్యాయం ఎక్‌ చాదర్‌ మైలీ సీ
వస్తే - ఇస్తా
పోటీ పరీక్షలకు సమాయాత్తమవ్వడమెలా..?
దుంప‌ల‌తో గంపెడు లాభాలు
బాల్యం- సమస్యల వలయం
బేతి రెడ్డి గ్రంథాలయం-పిల్లలమర్రి
బుక్‌ ఫెయిర్‌ ఒక ఉద్వేగం...
అడవి తల్లి ఒడిలో ఉద్యమాల తల్లి మల్లు స్వరాజ్యం
అద్భుత ఊహాకాల్పనిక వైచిత్రి 'నీటినీడ' కథా సంపుటి
యల్లాప్రగడ సీతాకుమారి
మట్టిదిబ్బ కింద మహా దేవాలయం గొంగులూరు గుడి కథ
ఘనమైన చరిత్రకు సాక్ష్యం సంస్థాన్‌ నారాయణపురం
దూమపానం - నోటి క్యాన్సర్లు
స్మార్ట్‌ఫోన్‌లతో బాలలు దారి తప్పవద్దు
పెదకొండూరులో కాకతీయులనాటి మల్లు బాలమ్మ దాన శాసనం
జీవ వైవిధ్యం - మానవ మనుగడ
తన శరీరాన్ని వ్యాపార సరుకుగా మార్చిన సమాజంపై న్యాయపోరాటం చేసిన 'లక్ష్మి'
విద్యార్థి గేయకర్త సేనాపతి భాష్యకాచార్యులు
పేదల పెన్నిధి, పోరాట కవి కాళోజీ రామేశ్వరరావు
మరణాన్ని సైతం కవిత్వం చేస్తాన్నేను
పిల్లలను అలరించిన వేసవి శిబిరం
కూలుతున్న కుటుంబాలు
బొమ్మలరామారంలో కొత్తరాతిబొమ్మల తావు
వేగు చుక్కల వెలుగు తార ఇరివెంటి కృష్ణమూర్తి
అమ్మకు ఓ బహుమతి
ఒట్టు... నీ మీద ఒట్టు

తాజా వార్తలు

09:56 PM

ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుదల

09:51 PM

మ‌హారాష్ట్ర సీఎం రాజీనామా

09:48 PM

దేశాన్ని ఎన్నిసార్లు ఫూల్ చేస్తారు మోడీ: కేటీఆర్

09:35 PM

పెట్రోల్ పోసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

09:27 PM

సిద్దిపేట గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్

09:11 PM

ముంబైకు నూతన పోలీస్ క‌మిష‌న‌ర్‌ నియామకం

09:07 PM

తెలంగాణలో రేపు పాలిసెట్

08:51 PM

అలవోకగా తెలుగు చదివేస్తున్న అమెరికా అమ్మాయి

08:36 PM

భావోద్వేగానికి గురైన ఉద్ధ‌వ్ థాక‌రే..!

08:30 PM

హైదరాబాద్‌లో భారీగా డ్ర‌గ్స్ ప‌ట్టి‌వేత‌

08:14 PM

రైతులను కూరగాయల సాగు వైపు మళ్లించాలి : నిరంజన్ రెడ్డి

07:53 PM

ఢిల్లీలో ఆ వాహనాలపై నిషేధం..!

07:48 PM

ఆర్ఆర్ఆర్ సినిమాకు అరుదైన గౌరవం

07:29 PM

మ‌హారాష్ట్రలో 2 నగరాలు, ఎయిర్ పోర్టు పేరు మార్పు

07:26 PM

న‌టి స్వ‌ర భాస్క‌ర్‌కు బెదిరింపు లేఖ‌

07:09 PM

ఓటీటీపై టాలీవుడ్ నిర్మాతల కీలక నిర్ణయం

07:04 PM

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్..!

06:46 PM

తపాలా శాఖలో ఏజెంట్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

06:40 PM

వధువు కాళ్లకు నమస్కరించిన వరుడు.. వీడియో..

06:36 PM

ఉద‌య్‌పూర్ హ‌త్య ఉగ్ర సంస్థ ప‌నేనా..!

06:15 PM

'హ్యాపీ బర్త్‌ డే`ట్రైలర్ విడుదల చేసిన రాజమౌళి

06:12 PM

రెబల్ ఎమ్మెల్యేల ముంబై ప్రయాణం వాయిదా

06:05 PM

రేపు అసెంబ్లీ హామీల కమిటీ సమావేశం

06:01 PM

తెలంగాణలో మూడు రోజులు వర్షాలు..!

05:46 PM

ఐపీఎల్ పై జై షా కీలక ప్రకటన

05:35 PM

విద్యా సంవ‌త్స‌రం క్యాలెండ‌ర్ విడుద‌ల‌

05:28 PM

మలేషియా ఓపెన్‌లో సైనా శుభారంభం

05:13 PM

మహారాష్ర్ట సీఎంకు మరో షాక్

05:04 PM

ట్వి‌ట్ట‌ర్‌కు కేంద్ర ప్ర‌భుత్వం తుది నోటీసులు

04:43 PM

దోస్త్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.