Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మూడు దశాబ్దాల చట్టసభల సభ్యుడు, స్వాతంత్య్ర సమరయోధుడు చెన్నమనేని రాజేశ్వరరావు | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Apr 17,2022

మూడు దశాబ్దాల చట్టసభల సభ్యుడు, స్వాతంత్య్ర సమరయోధుడు చెన్నమనేని రాజేశ్వరరావు

                    రాజేశ్వరరావు 1923 ఆగస్టు 31 న కరీంనగర్‌ జిల్లాలోని వేములవాడ మండలం మారుపాక గ్రామంలో జన్మించాడు. రాజేశ్వరరావు చారిత్రక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీ.ఎస్సి, ఎల్‌.ఎల్‌.బి, లను అభ్యసించాడు. విద్యార్థిగా ఉన్నప్పుడే జరుగుతున్న రాజకీయ పరిణామాలను, నిజాం ప్రభుత్వ నిరంకుశ ధోరణులను అత్యంత సమీపంగా చూశాడు. ఆ ఘటనలు తనపై బలమైన ప్రభావాన్ని చూపాయి. విద్యార్థిగా ఉన్నప్పుడే జాతీయోద్యమం పట్ల ఆకర్షితుడై పోరాటంలో పాల్గొన్నాడు.
స్వాతంత్య్రోద్యమం
                   నిజాం ప్రభుత్వం తనకున్న అన్ని శక్తులతో సంస్థాన ప్రజలపై దాడులు చేస్తూ, స్వాతంత్య్రోద్యమాన్ని అడ్డుకుంటూ తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకునే దిశలో ఉంది. అందుకు అణచడానికి వేయాల్సిన ఎత్తులు, వ్యూహాలు, ప్రత్యక్షదాడులు అన్నిటిని కొనసాగించాడు నిజాం సంస్థాన రాజు. ఇదే సమయంలో తన ప్రగతిశీల భావాలతో చైతన్యం పొంది నిరంకుశ ప్రభుత్వాన్ని ఎలాగైనా యునియన్‌లో విలీనం చేయాలని తలిచి జాయిన్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. 1947 ఆగస్టు 15న బ్రిటిషు వారి కబంధ హస్తాల నుండి భారతదేశం విముక్తి అయిన పర్వదినం సందర్భంగా హైదరాబాదులో ప్రముఖులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. వారిలో రాజేశ్వరరావు ఒకరు. అనంతరం సాయుధ పోరాటంలో పాల్గొనగా అరెస్టయి జైలుకు వెళ్ళాడు.
రాజకీయ జీవితం
                   నాడు జాతీయోద్యమంలో పాల్గొన్న అగ్ర నాయకుల నుండి మధ్యస్థ నాయకుల వరకు దాదాపు అందరు చట్టసభలలో సభ్యులయ్యారు. అలాగే రాజేశ్వరరావు కూడా నిజాం భారతదేశంలో కలిసిన తర్వాత కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. పి.డి.ఎఫ్‌ తరపున ఐదుసార్లు శాసనసభకు ఎన్నికయ్యాడు. రాజకీయాలలో ప్రవేశించక పూర్వం సాహిత్యం పట్ల అమితమైన ఆసక్తిని కనబర్చినా రాజకీయ రంగంలోకి వెళ్ళాక సాహిత్యానికి దూరమయ్యాడు. బాధ్యతాయుతమైన స్థానం కావడంతో సాహిత్య సష్టికి సమయం లేదని భావించి ఉండవచ్చు. 1957లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. 1999లో రాజేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో చేరి 2004లో శాసనసభకు ఆరవసారి ఎన్నికయ్యాడు. తన మొత్తం రాజకీయ జీవితంలో సిరిసిల్ల నియోజక వర్గం నుండి ఐదు సార్లు, మెట్‌పల్లి నుండి ఒకసారి గెలిచాడు. నందమూరి తారక రామారావు ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా వ్యహరించారు.
సాహిత్యం
                   రాజేశ్వరరావు ప్రాథమికంగా సాహిత్య అభిమాని. అనంతరం సాహిత్య సష్టికర్త. ఆ తర్వాతనే ఆయన రాజకీయ నాయకుడు. స్వాతంత్య్ర పోరాటకాలంలో జైలులో ఎందరో నిర్భంధించబడ్డారు. అలాంటి వారు జైలులో కేవలం శిక్షకు గురై జీవితాన్ని గడపడమో, జైలుకు వచ్చినందుకు బాధపడుతూ కాలాన్ని తిట్టుకుంటూ నిరీక్షించడమో చేయలేదు. అక్షరాస్యత గల్గిన ప్రతీ స్వాతంత్య్ర సమరయోధుడు ప్రజలను రచనల ద్వారా చైతన్యవంతులను చేయడంలోనో, స్వాతంత్య్ర సాధనకు వ్యూహాలను రచించడంలోనో, జీవిత సారాన్ని తెలుసుకొని ప్రబోధ రచనలను సష్టించడంలోనో ఉండిపోయారు. అలాంటి స్వాతంత్య్ర సమరులలో రాజేశ్వరరావు కూడా ఉన్నాడు. ఆయన 1948లో సాయుధ పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్ళిన తర్వాత ''పిట్ట బ్రతుకు'' అనే కథ రాశాడు. ఇది 1954 నాటి 'సారస్వత జ్యోతి' పత్రికలో ప్రచురించబడింది. ఈ కథలో అగ్రకులస్తులమని పెత్తనంతో దొర సాగించిన దుశ్చర్యలు, పాలేరుతో పరిమితి లేని పనిని చేయించుకోవడం వంటి సాంఘిక అసమానత గల అంశాలు ఉన్నాయి.
                   చెన్నమనేని రాజేశ్వరరావు తొలుత స్వాతంత్య సమరయోధుడిగా వామపక్ష భావాలతో రాజకీయ రంగంలోకి దిగి దశాబ్దాలు చట్టసభలలో ఉండి మరల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కషి చేశాడు. అంటే ఉద్యమంతో మొదలైన ఆయన జీవితం కన్నుమూసే వరకు ఉద్యమాన్ని, ఉద్యమ ఫలాల్ని కాంక్షించింది. రాజకీయ రంగంలో చెన్నమనేని కుటుంబం ఎంతగానో పేరు పొందినది. మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించిన విద్యాసాగర్‌ రావు వీరికి సోదరుడు. వీరి తర్వాతి తరం వారు కూడా రాజకీయ రంగంలో స్థిరపడ్డారు.
                   రాజేశ్వరరావు ఉద్యమకారుడిగా, రాజకీయ నాయకుడిగా, అపారమైన సేవలు అందించాడు. ఈయన పేరుతో ప్రస్తుతం హైదరాబాదులోని కొండాపూర్‌లో ఒక వద్దాశ్రమం నిర్వహించబడుతుంది. సంక్లిష్ట జీవితం నుండి శేష జీవితం వరకు ఎంతో ఉదారంగా ఉంటూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన రాజేశ్వరరావు మే, 9, 2016 లో మరణించాడు.

- ఘనపురం సుదర్శన్‌,
   9000470542

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'ప్రబొధ గీతాల' కొక్కొరోకో (సంకలనం)
ఆనాటి సమాజం మీద ఆత్మార్పణ వీరుల ప్రభావం
50 యేళ్ళ క్రితం నేనో పెద్ద తప్పు చేశాను
భువి స్వ‌ర్గం మేఘాల‌య‌
వితంతు వివాహాల మాటున స్త్రీలపై జరిగిన అన్యాయం ఎక్‌ చాదర్‌ మైలీ సీ
వస్తే - ఇస్తా
పోటీ పరీక్షలకు సమాయాత్తమవ్వడమెలా..?
దుంప‌ల‌తో గంపెడు లాభాలు
బాల్యం- సమస్యల వలయం
బేతి రెడ్డి గ్రంథాలయం-పిల్లలమర్రి
బుక్‌ ఫెయిర్‌ ఒక ఉద్వేగం...
అడవి తల్లి ఒడిలో ఉద్యమాల తల్లి మల్లు స్వరాజ్యం
అద్భుత ఊహాకాల్పనిక వైచిత్రి 'నీటినీడ' కథా సంపుటి
యల్లాప్రగడ సీతాకుమారి
మట్టిదిబ్బ కింద మహా దేవాలయం గొంగులూరు గుడి కథ
ఘనమైన చరిత్రకు సాక్ష్యం సంస్థాన్‌ నారాయణపురం
దూమపానం - నోటి క్యాన్సర్లు
స్మార్ట్‌ఫోన్‌లతో బాలలు దారి తప్పవద్దు
పెదకొండూరులో కాకతీయులనాటి మల్లు బాలమ్మ దాన శాసనం
జీవ వైవిధ్యం - మానవ మనుగడ
తన శరీరాన్ని వ్యాపార సరుకుగా మార్చిన సమాజంపై న్యాయపోరాటం చేసిన 'లక్ష్మి'
విద్యార్థి గేయకర్త సేనాపతి భాష్యకాచార్యులు
పేదల పెన్నిధి, పోరాట కవి కాళోజీ రామేశ్వరరావు
మరణాన్ని సైతం కవిత్వం చేస్తాన్నేను
పిల్లలను అలరించిన వేసవి శిబిరం
కూలుతున్న కుటుంబాలు
బొమ్మలరామారంలో కొత్తరాతిబొమ్మల తావు
వేగు చుక్కల వెలుగు తార ఇరివెంటి కృష్ణమూర్తి
అమ్మకు ఓ బహుమతి
ఒట్టు... నీ మీద ఒట్టు

తాజా వార్తలు

03:31 PM

హైద‌రాబాద్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం

03:27 PM

జులై 1న టెట్ ఫలితాలు

03:25 PM

నడవలేని స్థితిలో నిత్యామీనన్..

03:22 PM

మద్యం తాగి వాహనం నడపకుండా ప్రతేక పరికరం..!

03:06 PM

విద్యార్థులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్: ఇద్దరు మృతి

03:05 PM

అవిభ‌క్త క‌వ‌ల‌లు వీణ‌, వాణిల ఇంటర్ రిజల్ట్స్..

02:56 PM

ఇంటర్నెట్‌ లేకున్నా జీమెయిల్ వాడొచ్చు..

02:50 PM

పాదయాత్రగా వచ్చామని ఏ మూర్ఖుడు చెప్పాడు: మోహన్ బాబు

02:42 PM

జపాన్ నుంచి యూఏఈ బయల్దేరిన మోడీ

02:05 PM

రోహిత్ శర్మ ఆరోగ్యంపై అతని కూతురు అప్ డేట్

01:55 PM

ఎస్‌బీఐ బ్యాంక్‌లో రూ. 5 కోట్లు గోల్‌మాల్‌..!

01:46 PM

ఒకే ఇంట్లో 9 మంది మృతి కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు..!

01:46 PM

షాంఘై, బీజింగ్​ లలో ఆంక్షలు సడలింపు

01:32 PM

గూగుల్‌కు తెలంగాణ పోలీసుల లేఖ‌

01:24 PM

నేడు ఐర్లాండ్ తో భారత్ రెండో టీ20

01:19 PM

పానీపూరీపై నిషేధం.. ఎందుకంటే..?

01:16 PM

నాలుగు అంతస్తుల భవనం కూలి..ముగ్గురు మృతి

01:09 PM

గవర్నర్ తేనీటి విందులో పాల్గొన్న కేసీఆర్

01:09 PM

ఎస్‌బీఐ బ్యాంక్‌లో రూ.5 కోట్లు గోల్ మాల్..!

12:59 PM

ఇంట‌ర్ ఫ‌లితాల్లో మెరిసిన గురుకుల విద్యార్థులు..

12:59 PM

న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు..

12:55 PM

డీఎంఈ ఆఫీస్ వద్ద సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ఆందోళన

12:50 PM

శుభకార్యానికి వెళ్తుండగా వ్యాన్ బోల్తా

12:40 PM

వెబ్‌సైట్‌లో ఇంటర్ మెమోలు.. ఎప్పటి నుంచి అంటే..?

12:34 PM

కర్ణాటకలో మళ్లీ భూకంపం

12:25 PM

30న గోల్కొండలో బోనాలు

12:15 PM

పీవీ స్ఫూర్తి తో ముందుకు.. : కేసీఆర్

12:02 PM

లోన్‌యాప్ వేధింపులకు యువకుడు బలి

11:57 AM

ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్...

11:50 AM

జీ7 దేశాధినేతలకు ప్రధాని మోడీ ప్రత్యేక బహుమతులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.