Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అసమానతలు లేని సమాజాన్ని కాంక్షించిన నవల 'అవతలి గుడిసె' | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Apr 24,2022

అసమానతలు లేని సమాజాన్ని కాంక్షించిన నవల 'అవతలి గుడిసె'

             'కులం పునాదుల మీద ఒక జాతిని కాని, నీతిని కాని నిర్మించలేము' అన్న బాబా సాహెబ్‌ డా. అంబేద్కర్‌ మాటలకు ఒక బావాజాల వ్యాప్తి రూపం ఇస్తూ, ఒక స్పష్టమైన, నిర్దిష్టమైన ఉద్యమాన్ని నిర్మిస్తూ తద్వారా బాదిత సమాజాన్ని మేల్కొలిపే కషి నవలలోని పాత్రలలో మనకు కన్పిస్తుంది. ఈ అవతలి గుడిసె నవలలోని ప్రధాన పాత్రధారి అయిన చందన్‌ కులాన్ని, ఆదిపత్య ధార్మిక మూడాచారాలను కూలదోసి ఒక సమానత్వానికి చిహ్నంగా ఉండే జాతిని, ఒక నీతివంతమైన సమాజాన్ని పునఃనిర్మించాలన్నే సంకల్పాన్ని కలిగి ఉంటాడు. అదే సంకల్పాన్ని, సమానత్వం కొరకు జరిగే పోరాట స్పూర్తిని తన చుట్టూ ఉండే ప్రజల్లో కూడా కల్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
             వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా గొంతు విప్పి, అనేక రచనలు చేసిన బుద్ధుడు, చార్వాకుడు, కబీర్‌, రవిదాస్‌ లాంటి మహానీయుల దగ్గర్నుంచి రచనలు చేసి సామాజిక ఉద్యమాలకు బాటలు వేసిన జ్యోతిరావు పూలే, సావిత్రి భాయి ఫూలే, డా. బీ.ఆర్‌ అంబేద్కర్‌, అయ్యంకాలి, నారాయణ గురు, అన్నా భావు సాటే, గుర్రం జాషువా, కాన్సీరాం లాంటి మహనీయుల వరకు అందరూ కుల వ్యవస్థకు, అస్పశ్యత, అంటరాని తనానికి, అణచివేతకు, ధార్మిక, శారీరక, శ్రమ దోపిడీకి, బానిసత్వానికి విరుద్ధంగా తమ, తమ కాలాల్లో వాళ్ల రచనల ద్వారా, అనేక ఉద్యమాల నిర్మించి, నిరంతర పోరాటాల ద్వారా సమాజాన్ని చైతన్య పరిచినవారే.
అట్లాంటి గొప్ప పోరాటానికి ప్రతీక ఈ ''అవతలి గుడిసె'' నవల. ఈ నవలలో విద్యావంతుడు, మహనీయుల ఆశయాల స్ఫూర్తికి ప్రతిబింబంగా ఉండే ''చందన్‌'' అనే పాత్ర కూడా ఇట్లాంటి పోరాటమే చేస్తుంది.
బోధించు!..., పోరాడు!!...., సమీకరించు!!!.... అన్న అంబేద్కర్‌ మాటలకు ప్రతీ రూపంగా ''చందన్‌'' దళిత సమాజాన్ని, ఆ సమాజంలోని విద్యావంతులు యువకులకు, పీడితులు, శ్రమ జీవులు, గ్రామీణ ప్రజలకు, పేద రైతులకు, మహిళలకు బోధించి వాళ్లకు పోరాటం నేర్పి, వాళ్ళనంతా ఐక్యంగా సమీకరించి ఉద్యమ వికేంద్రకరణకు, సామాజిక పోరాటాన్ని దేశంలోని అనేక ప్రాంతాలకు విస్తత పరిచేందుకు ఒక మహత్తరమైన కషి చేస్తాడు. సాంఘీక మార్పులను, సమానాత్వన్ని కాంక్షించి ఆ మహనీయుల ఆలోచన విధానానికి అక్షర రూపం ఇచ్చి దాదాపు 28 ఏండ్ల క్రితం డా. జయప్రకాష్‌ కర్ధమ్‌ రాసిన హింది సాహిత్యపు మొట్ట మొదటి దళిత నవల ఈ చప్పర్‌ (అవతలి గుడిసె)ను రాశారు. ఇది నేటికీ కూడా అత్యంత ప్రాసంగీకతను కలిగి ఉన్న నవలగా ప్రాచుర్యం పొందుతూనే ఉంది.
ఉత్తర భారతదేశంలో ప్రజాధరణ పొందిన రచనల్లో ముందు వరుసలో వుండే ఈ నవల. ఆధునిక హింది సాహిత్యంలో ఈ నవల ప్రస్తావన లేకుండా, ఈ నవల గురించిన చర్చ చేయకుండా ఏ సాహిత్య చర్చ కొనసాగదు. ఒకవేళ ఆలా కొనసాగినా అది అసంపూర్ణ, అర్థ రహిత సాహిత్య చర్చ అవుతుందనడంలో ఎటువంటి సందేహం అక్కరలేదు. ఇప్పుడు ఇదే నవలను తెలుగులో ''అవతలి గుడిసె'' పేరుతో ఆచార్య. వి. కష్ణ అనువాదం చేశారు. దీన్ని ''సాంస్కతిక సంస్థ'' వారు ప్రచురించారు. హైదరాబాదు విశావిద్యాలయంలోని హిందీ విభాగంలో గత మూడు దశాబ్దాలుగా అద్యాపకుడిగా సేవలు అందించిన వి.కష్ణ స్వతహాగా రచయిత, ప్రముఖ అనువాదకుడు. ఇప్పటి వరకు అనేక రచనలను హిందీ నుంచి తెలుగుకి, తెలుగు నుంచి హిందీలోకి అనేక రచనలు అనువాదం చేశారు.
ఈ నవల ముఖ్యంగా ఉత్తర భారత దేశం తాలూకు వివిక్షను, మనువాదులు చేసే అణచివేత, బ్రాహ్మణీయ పండిత వర్గం చేసే ధార్మిక దోపిడీ, ఆధిపత్య కులాల దోపిడీ, నిత్యం మహిళలపై వాళ్లు చేసే క్రూర లైంగిక దాడులను మనకు పరిచయం చేస్తుంది. వాస్తవానికి భారతీయ సమాజం భారత స్త్రీని కేవలం వంటింటి పని మనిషిగా భావించి చదవు, ఆటలు, పాటలు, ఇంటి నిర్ణయాలకు దూరంగా ఉంచి ఒక యంత్రంలా చూసి వాళ్ళను వంచనకు గురి చేసింది. కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి. నేటి మహిళలు ఆదిపత్య భావాజాలానికి వ్యతిరేకంగా గొంతు విప్పుతూ, సమాజంలో విస్తతంగా వ్యాపించిన మూడ విశ్వాసం, అజ్ఞానం, దోపిడీ సమాజాన్ని భూస్తాపితం చేసి సమానత్వం వైపు అడుగులు వేసే సామాజిక ఉద్యమాల్లో ముఖ్య భూమికను పోషిస్తున్నారు. వందలు, వేలు, లక్షల సైన్యాన్ని కదిలించే మహత్తర సాహితి, సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్నారు. నిజానికి గతంలోనూ సావిత్రి బాయి ఫూలే, ఫాతిమా బాయి, చాకలి అయిలమ్మ, టిఎన్‌. సదాలక్ష్మి, ఈశ్వరి బాయి, మల్లు స్వరాజ్యం లాంటి మహిళా ఉద్యమకారిణిలు ఉన్నారు. వీళ్ళ స్పూర్తితో ఇప్పటి వర్తమాన ఉద్యమాల్లో అనేక మంది మహిళలు దాన్ని కొనసాగిస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం అక్కరా లేదు. దీనికి అవతలి గుడిసె లోని రమియా, కమల, రజని మొదలగు పాత్రలే దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
1994 సంవత్సరంలో ప్రచురుంచిన 'అవతలి గుడిసె' నవల చందన్‌ తల్లి రమియా, హరియా కూతురు కమలా, ఠాకూర్‌ హర్నాం సింగ్‌ కూతురు రజని మొదలగు పాత్రల ద్వారా ఏ విధంగా ఆధునిక భారతీయ స్త్రీ సమాజంలో కూరుకుపోయిన జాతి మలినాలను, ఆదిపత్య భావాలను కూలదోసి సమానత్వ సమాజాన్ని సాదించడంలో వాళ్ళు చేసే పోరాటాన్ని కావచ్చు, పోరాటాలను చేసే వాళ్లకు ఇచ్చే సహాయ సహాకారలను అందించే విధానాన్ని ఈ నవలలో చిత్రించడం జరిగింది.
జయప్రకాష్‌ కర్ధం ఆదునిక భారతీయ సాహితి ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొదుతున్న సాహిత్యకారుడు. కర్ధం ఒక బహుముఖ ప్రతిభాశాలి అటూ కవిత్వం, కథ, నవల, విమర్శ మొదలగు ప్రక్రియల్లో తన దళిత అస్తిత్వ గొంతును, సమతా, సమానత్వం, అహింసా గొంతుకను స్పష్టంగా అభివ్యక్తీకరించే అరుదైన ఆలోచనా పరుడు సాహిత్య ఉద్యమకారుడు. హిందీ దళిత సాహిత్యంలో కర్ధం రాసిన అనేక రచనలు దళిత సమాజం వాస్తవిక, యథార్థ ఘటనలకు అక్షర రూపంగా రచనలు, పాత్రల చిత్రణ ఉంటుంది.
''ఏ విధంగా అయితే దేవుని పూజలు,అర్చనలు చేయడంలో మహిళలు ముందుంటారో అలాగే పిల్లలను విద్యావంతులను చేయడంలో కూడా ఆ విధంగానే ముందుకు రావాల్సిన అవసరం ఉంది. పిల్లలను ఉన్నత విద్యావంతులను చేసే భాద్యత మహిళలదే. అజ్ఞానాన్ని పెంపొందించే పూజలకు ఇవ్వాలే ముగింపు పలికి నా అక్కలు, అమ్మలు, మహిళలు సామాజిక మార్పులకు అవసరమైన ముందడుగు మీ మహిళలదే అయ్యుండాలి'' అని హితవు పలికిన డా. బీ.ఆర్‌ అంబేద్కర్‌ మాటలకు సాక్ష్యంగా కమల నిలుస్తుంది. నిజానికి కమల ఒక అత్యాచార బాధితురాలు కొన్నేళ్ళ క్రితం తన తల్లి తండ్రితో కలిసి ఇటుక బట్టిలో పని చేస్త్తున్న కమలను కొంత మంది అరాచకులు సాముహిక అత్యాచారం చేస్తారు. దాంతో గర్భం దాల్చిన కమల శారీరక దోపిడీకి, అనేక అవమానాలకు గురి అవుతుంది. తనకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా కొట్లాడే విధంగా తన కొడుకు కిల్లర్‌ను తీర్చిదిద్దాలని భావించి చదివించడానికి సిద్ధపడుతుంది. కేవలం తన కోసం కాదు తనలా హింసకు, దోపిడీకి గురి అయిన అందరి తరుపున కొట్లాడే ఆయుధంగా తీర్చడానికి ఎంతటి కష్టం అయినా ఓర్చుకోవడానికి సిద్ధపడి తన కొడుకు గురించి చందన్‌తో ఇలా అంటుంది ''ఇప్పుడు వీడే నాకు తోడూ. పెరిగి పెద్దై ఉన్నత చదువులు చదివాక నాకు జరిగిన అన్యాయానికి, అత్యాచారానికి బదులు తీర్చోకోవాలన్నదే నా ఆశ'' అని అంటుంది.
చందన్‌ బాల్య మిత్రురాలు రజని దళిత సమాజానికి విద్య అందాలని, ఆ విద్య ద్వారానే సమానత్వాన్ని సాధించవచ్చనే అభిప్రాయాన్ని కలిగి ఉంటుంది. భారత దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కును పొందుతూ, గౌరవాన్ని, ఆస్తిని, జ్ఞానాన్ని పొందే హక్కు ఉందని అంటూ ''భారత రాజ్యాంగం ఏ విధంగానైతే గౌరవంగా జీవిస్తూ, విద్యను ఆర్జించి జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళే హక్కును, అవకాశాన్ని కల్పించందన్న'' విషయాన్ని రజని సమర్థిస్తుంది. అందుకోసం తన వంతు పాత్రను ఉద్యమించడం ద్వారా నిర్వర్తిస్తుంది. ఈ నవలలోని ఠాకూర్‌ హర్నాం సింగ్‌, అతని కూతరు రజని పాత్రలు ఆదునిక భారత దేశంలోని సవర్ణ సమాజం నుంచి వచ్చి, దళిత, ఆదివాసి, వెనకబడిన సమాజం తరుపున వాళ్లకు జరిగిన అన్ని రకాల అన్యాయాలకు విరుద్ధంగా పోరాటం చేసి, వాళ్లకు దక్కాల్సిన న్యాయంకోసం ఉద్యమాల బాట పట్టిన కొంతమంది బుద్ధిజీవులు, విద్యావంతులకు ప్రతీకగా నిలిచారని చెప్పొచ్చు.
ఈ నవల దళిత సమాజంలో ఉండే స్త్రీ, పురుష సమానత్వానికి, దళితుల్లో ఉండే ఆత్మ గౌరవానికి, ఉద్యమ చైతన్యానికి. దళితుల్లో, మరీ ముఖ్యంగా దళిత స్త్రీలలో ఉండే ఉద్యమ స్ఫూర్తికి, పట్టుదలకు. శాంతి పూర్వక పోరాటానికి ఒక అందమైన నిలువుటద్దం ఈ ''అవతలి గుడిసె'' నవల.

- సిలపాక వెంకటాద్రి, 9133495362
  పరిశోధక విద్యార్థి, హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'ప్రబొధ గీతాల' కొక్కొరోకో (సంకలనం)
ఆనాటి సమాజం మీద ఆత్మార్పణ వీరుల ప్రభావం
50 యేళ్ళ క్రితం నేనో పెద్ద తప్పు చేశాను
భువి స్వ‌ర్గం మేఘాల‌య‌
వితంతు వివాహాల మాటున స్త్రీలపై జరిగిన అన్యాయం ఎక్‌ చాదర్‌ మైలీ సీ
వస్తే - ఇస్తా
పోటీ పరీక్షలకు సమాయాత్తమవ్వడమెలా..?
దుంప‌ల‌తో గంపెడు లాభాలు
బాల్యం- సమస్యల వలయం
బేతి రెడ్డి గ్రంథాలయం-పిల్లలమర్రి
బుక్‌ ఫెయిర్‌ ఒక ఉద్వేగం...
అడవి తల్లి ఒడిలో ఉద్యమాల తల్లి మల్లు స్వరాజ్యం
అద్భుత ఊహాకాల్పనిక వైచిత్రి 'నీటినీడ' కథా సంపుటి
యల్లాప్రగడ సీతాకుమారి
మట్టిదిబ్బ కింద మహా దేవాలయం గొంగులూరు గుడి కథ
ఘనమైన చరిత్రకు సాక్ష్యం సంస్థాన్‌ నారాయణపురం
దూమపానం - నోటి క్యాన్సర్లు
స్మార్ట్‌ఫోన్‌లతో బాలలు దారి తప్పవద్దు
పెదకొండూరులో కాకతీయులనాటి మల్లు బాలమ్మ దాన శాసనం
జీవ వైవిధ్యం - మానవ మనుగడ
తన శరీరాన్ని వ్యాపార సరుకుగా మార్చిన సమాజంపై న్యాయపోరాటం చేసిన 'లక్ష్మి'
విద్యార్థి గేయకర్త సేనాపతి భాష్యకాచార్యులు
పేదల పెన్నిధి, పోరాట కవి కాళోజీ రామేశ్వరరావు
మరణాన్ని సైతం కవిత్వం చేస్తాన్నేను
పిల్లలను అలరించిన వేసవి శిబిరం
కూలుతున్న కుటుంబాలు
బొమ్మలరామారంలో కొత్తరాతిబొమ్మల తావు
వేగు చుక్కల వెలుగు తార ఇరివెంటి కృష్ణమూర్తి
అమ్మకు ఓ బహుమతి
ఒట్టు... నీ మీద ఒట్టు

తాజా వార్తలు

02:05 PM

రోహిత్ శర్మ ఆరోగ్యంపై అతని కూతురు అప్ డేట్

01:55 PM

ఎస్‌బీఐ బ్యాంక్‌లో రూ. 5 కోట్లు గోల్‌మాల్‌..!

01:46 PM

ఒకే ఇంట్లో 9 మంది మృతి కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు..!

01:46 PM

షాంఘై, బీజింగ్​ లలో ఆంక్షలు సడలింపు

01:32 PM

గూగుల్‌కు తెలంగాణ పోలీసుల లేఖ‌

01:24 PM

నేడు ఐర్లాండ్ తో భారత్ రెండో టీ20

01:19 PM

పానీపూరీపై నిషేధం.. ఎందుకంటే..?

01:16 PM

నాలుగు అంతస్తుల భవనం కూలి..ముగ్గురు మృతి

01:09 PM

గవర్నర్ తేనీటి విందులో పాల్గొన్న కేసీఆర్

01:09 PM

ఎస్‌బీఐ బ్యాంక్‌లో రూ.5 కోట్లు గోల్ మాల్..!

12:59 PM

ఇంట‌ర్ ఫ‌లితాల్లో మెరిసిన గురుకుల విద్యార్థులు..

12:59 PM

న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు..

12:55 PM

డీఎంఈ ఆఫీస్ వద్ద సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ఆందోళన

12:50 PM

శుభకార్యానికి వెళ్తుండగా వ్యాన్ బోల్తా

12:40 PM

వెబ్‌సైట్‌లో ఇంటర్ మెమోలు.. ఎప్పటి నుంచి అంటే..?

12:34 PM

కర్ణాటకలో మళ్లీ భూకంపం

12:25 PM

30న గోల్కొండలో బోనాలు

12:15 PM

పీవీ స్ఫూర్తి తో ముందుకు.. : కేసీఆర్

12:02 PM

లోన్‌యాప్ వేధింపులకు యువకుడు బలి

11:57 AM

ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్...

11:50 AM

జీ7 దేశాధినేతలకు ప్రధాని మోడీ ప్రత్యేక బహుమతులు

11:49 AM

జువెనైల్‌ హోం నుంచి అయిదుగురు పరారీ

11:35 AM

క‌రీంన‌గ‌ర్‌లో అర్ధ‌రాత్రి పిల్లి‌ని కాపాడిన పోలీసులు

11:29 AM

ఆగ‌స్టు 1 నుంచి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు

11:24 AM

క్షీణిస్తున్న పుతిన్ ఆరోగ్యం..!

11:18 AM

ఇంటర్‌ ఫలితాలు విడుదల...

11:14 AM

3డీ ప్రింటింగ్‌తో ఎన్‌95 మాస్కు

11:06 AM

అగ్నిపథ్‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌

11:04 AM

పీవీకి భారత రత్న ఇవ్వాలి : మంత్రి తలసాని

10:51 AM

బిజినెస్‌ టైకూన్‌ కన్నుమూత

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.