Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వేగు చుక్కల వెలుగు తార ఇరివెంటి కృష్ణమూర్తి | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • May 15,2022

వేగు చుక్కల వెలుగు తార ఇరివెంటి కృష్ణమూర్తి

స్వాతంత్య్రం అతని చిరకాల వాంఛ.
పరిశోధన ఆయన మేలైన గ్రంథం.
అధ్యాపకత్వం ఆయన ఉత్తమ ధర్మం.
సాహితీ రచన ఆయన చైతన్య వాహిక.
ఆయనే ఆచార్య ఇరివెంటి కృష్ణమూర్తి.
పుట్టుక, విద్య
               ఇరివెంటి కృష్ణమూర్తి జూలై 12, 1930 సం.లో మహబూబునగర్‌ లోని కల్వకుర్తి తాలుకా రఘునాథపల్లి అనే గ్రామంలో పుట్టాడు. తల్లి రాములమ్మ, తండ్రి రాఘవ శాస్త్రి. కష్ణమూర్తి నిక్కచ్చిగా అన్యాయాన్ని ప్రశ్నించేటి వ్యక్తి. చక్కటి వక్త. దేనినైనా నిర్మొహమాటంగా భేషజాలకు తావు లేకుండా అడుగుతూ పెత్తనాన్ని ఎదుర్కొన్న వాడు. బానిస జీవనాన్ని సమాధి చేస్తూ స్వాతంత్య్రం కావాలని కోరుకున్న వ్యక్తి. సౌజన్యశీలి. సంస్కతాంధ్ర భాషలతో పాటు ఉర్దూలో పండితుడిగా పేరు గడించి ఆ భాషా, సాహిత్య అధ్యయనాలకు కృషి చేశాడు. ఈ క్రమంలోనే హిందీ, ఇంగ్లీషు భాషలను నేర్చుకునేందుకు ప్రయత్నం చేశాడు. ఉస్మానియాలో బి.ఏ. ఎం.ఏ. లలో పట్టభద్రుడయ్యాడు.
స్వాతంత్య్రోద్యమం
               దేశమంతా స్వాతంత్య్ర ఉద్యమం ఒక త్రోవన వెళ్తే, హైదరాబాదులో మాత్రం రెండు త్రోవలలోనూ వెళ్ళేది. వ్యాపార కాంక్షతో వలస వచ్చి భారతీయుడిపై పెత్తనం చేసి బానిస పాలనకు తెర లేపిన బ్రిటిషు వారు ఎంతటి క్రూరులో నిజాం కూడా అంతటి క్రూరుడు. కాకపోతే తరతరాల పాలకుల చేత రాజ్యాధికారిగా ఉంటూ బానిసత్వాన్ని పెంచి పోషించిన వారు నిజాం రాజ్య వంశస్తులు. ఇది చివరి నిజాం కాలంలో పరాకాష్టకు చేరుకుంది. ఇటువంటి సమయంలోనే అశాంతిని, అలుముకున్న అలజడిని అంతం చేసేందుకు పౌరులు పుట్టుకొచ్చారు. స్వేచ్చా జీవితాన్ని పొందాలని భావించిన ప్రతీ భారతీయుడు బానిస రాజ్య నిర్మూలనకు బాసటగా నిలిచాడు. అనేక మంది పాటలు రాశారు. ప్రజలను ప్రభోధాలతో చైతన్యపరిచారు. అలాంటి వారు హైదరాబాదు సంస్థానంలో అనేకులు ఉన్నారు. కొందరు కేవలం నిజాం ప్రభుత్వంతో పోరాడితే, కొందరు బ్రిటిషు వారితో పోరాడారు. అలా చిన్న వయసులోనే నిజాం ప్రభుత్వంతో పోరాడుతూ హైదరాబాదుకు స్వాతంత్య్రం రావాలని, అందుకు స్వతంత్ర భారతంలో హైదరాబాదు చేరాలని జాయిన్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు ఇరివెంటి కష్ణమూర్తి.
అడ్డు అదుపు లేని నిజాం రజాకార్ల సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. తెలంగాణ స్వాతంత్య్రోద్యమంలో చేయెత్తి స్వాతంత్య్ర తెలంగాణను కోరుతూ అరెస్టయినాడు. జైలు శిక్షకు గురయ్యాడు.
రచనలు
               ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న సమయంలోనే రచనా వ్యాసంగాన్ని ప్రారంభించాడు. అనేక సందర్భాల్లో రచించిన అనేక వ్యాసాలను సారస్వత పరిషత్‌ 1990లో 'ఇరువెంటి వ్యాసాలు' పేరుతో ప్రచురించింది. కష్ణమూర్తి రాసిన కవిత్వం అధిక శాతం యువ భారతి ప్రోత్సాహంతోనే రాయబడింది. చాలా మటుకు కవితా సంకలనాలను అనగా 'వీచిక,(1968), అక్షరాలూ (1971), స్వరాలు(1973), ఉషస్సు (1973), వేడి వెలుగులు (1980), రేఖలు (1981) వంటి వాటిని యువభారతి ప్రచురించింది. అలాగే 'పఠనీయం', ఇది 39 గ్రంథాల పరిచయ వ్యాసాల గ్రంథం. దాదాపు ఏడేళ్ళ పాటు యువభారతి వారి 'నందిని' త్రైమాసిక పత్రికలో ధారావాహికంగా రాసిన వ్యాసాల సంకలనం ఈ గ్రంథం. ఇరివెంటి కవిత్వంతో పాటు వ్యాసాలూ, కథలూ రాశాడు. కథలు యాభై దశకంలో 'వర్ధిని పత్రికలో, ఆరవై దశకంలో భారతిలో, యువభారతి ప్రచురించిన 'ఉదయం' పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఇరివెంటి బాల సాహితీ వేత్త కూడా. స్ఫూర్తివంతమైన అంశాలను తీసుకుని వారిలో పరివర్తన కలిగేలా బాల సాహిత్యం రాశాడు. జాతి గర్వించదగిన మహనీయుల గాథల గురించి, జాతికి అవసరమయ్యే ప్రభోదాల గురించి అనేక అంశాలు ఆరు పుస్తకాలలో రాశాడు.
1993 లో 'వాగ్భూషణం భూషణం' అనే పుస్తకాన్ని రాశాడు. ప్రసంగం ఎలా చేయాలి, అందరిని ఆకట్టుకునేలా ఎలా ప్రసంగించాలి, దానిలో ఉన్న మెళకువలు ఏమిటి? వంటి తదితర అంశాలతో వెలువడ్డ చిన్న పుస్తకమే 'వాగ్భూషణం భూషణం'. వీరు పరిశోధన చేసిన 'కవి సమయాలు' అన్న సిద్ధాంత గ్రంథం ఉత్తమ పరిశోధనా విలువలు గలిగి అనేకుల ప్రశంసలు పొందింది. కష్ణమూర్తి కొన్ని కథలు కూడా రాశాడు. అవి: 'రంగుల లంగయ్య, పట్నపోల్లు, పంచయతి నెంబరు, కనువిప్పు.
కృషి
               ఇరివెంటి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీకి, ఆంధ్ర సారస్వత పరిషత్తుకు కార్యదర్శిగా వ్యవహరించాడు. యువ భారతి సంస్థకు చాలా ఏళ్ల పాటు అధ్యక్షుడిగా కొనసాగాడు. చదువుకున్న చోటనే, సమాజం అంటే ఏంటో తెలియచెప్పిన విద్యాలయంలోనే ప్రొఫెసర్‌ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాడు. ఇతను ధ్వన్యనుకరణ (మిమిక్రి) కళకారుడు. ఒక్కసారి ఎవరి స్వరాన్నైనా వింటే వారి స్వర శబ్దం ఎలాగున్నా దానినే యధారీతిగా మిమిక్రి చేసేటటువంటి ప్రతిభ ఉన్న వ్యక్తి.
ఇరివెంటి వారి సంస్మరణ సభలో సినారె గారు తమ 'ప్రపంచ పదులు' అన్న పుస్తకాన్ని ఇరివెంటి వారికి అంకితం ఇస్తానని ప్రకటించారు. అలాగే వారిరువురి మధ్య స్నేహ బంధాన్ని జ్ఞాపకం చేసుకున్నారు.
మదు స్వభావశీలి అయిన ఇరివెంటి పలు ప్రక్రియలలో సాహిత్యం సష్టించి పరిశోధనతో గుర్తింపును పొందాడు. యువభారతిలో కీలక బాధ్యత పోషించి సంస్థకు మంచి పేరును తీసుకొచ్చిన ఇతను ఏప్రిల్‌ 26, 1989 లో మరణించాడు.

- ఘనపురం సుదర్శన్‌,
  9000470542

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఐక్యత సాధిస్తేనే ప్రగతి
మనసున్న వానరం
COME... LET’S SPEAK ENGLISH LESSON-5
ఉత్సవ విగ్రహాలు
తల్లి పాలు శిశువుకు రక్ష
COME... LET’S SPEAK ENGLISH LESSON-4
''మహిళా కీర్తి శిఖరాలు''
ఇంటి పానియాలు ఒంటికి మేలు
గరీబీ బచావో...
COME... LET’S SPEAK ENGLISH LESSON-3
ఐన్‌స్టీన్‌ను మించిన ప్రజ్ఞ కలిగిన తొమ్మిదేండ్ల బాలిక
COME... LET’S SPEAK ENGLISH LESSON-2
జనగామ సింహం, సాయుధ పోరాటాల యోధుడు నల్లా నర్సింహులు
COME... LET’S SPEAK ENGLISH
కార్యకర్తలు కావలెను
ప్రతాపరుద్రునికాలంనాటి గానుగులవారు, సేనివారి శాసనం
ఆధునిక ద్రౌపదుల కథ - బ్రిణ
ఓరుగల్లు స్వాతంత్య్ర సమరవీరుడు హయగ్రీవాచారి
తెలంగాణ చరిత్రపై సమగ్ర పుస్తకం
పశువుల పండుగ 'దాటోడి'
జనాభా అదుపు ప్రగతికి మెట్లు
పిల్లలు 'వయస్సు' మీరుతున్నారా..?
ఏడు కాకతీయుల వేడుక
ప్రకృతి వైద్య నిధి వరంగల్‌ గ్రంథాలయం
గెలిపించేవాడు
'ప్రబొధ గీతాల' కొక్కొరోకో (సంకలనం)
ఆనాటి సమాజం మీద ఆత్మార్పణ వీరుల ప్రభావం
50 యేళ్ళ క్రితం నేనో పెద్ద తప్పు చేశాను
భువి స్వ‌ర్గం మేఘాల‌య‌
వితంతు వివాహాల మాటున స్త్రీలపై జరిగిన అన్యాయం ఎక్‌ చాదర్‌ మైలీ సీ

తాజా వార్తలు

09:06 PM

రాజస్థాన్‌లో దళిత విద్యార్థి దారుణ హత్యను తీవ్రంగా ఖండించిన ఎస్.ఎఫ్.ఐ

09:02 PM

బంగాళాఖాతంలో వాయుగుండం..

08:45 PM

175 మంది ఖైదీల విడుదలకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

08:21 PM

మంత్రిత్వ శాఖలు కేటాయించిన మహారాష్ట్ర సీఎం

07:57 PM

దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

07:19 PM

కిన్నెరసాని జలాశయానికి భారీగా వరద నీరు

07:14 PM

వీడియో నిజమైనదా, కాదా అనే సంగతి పోలీసులు చూసుకుంటారు: గోరంట్ల

06:42 PM

గ్యాస్ తో నడిచే స్విఫ్ట్ మోడల్ ను ఆవిష్కరించిన మారుతి సుజుకి

06:28 PM

ఆకు పైన భారతదేశ పటాన్ని గీసిన కళాకారుడు

06:10 PM

పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్

05:39 PM

చర్చిలో అగ్ని ప్రమాదం..41 మంది సజీవ దహనం

05:34 PM

ఇండియా-పాక్ మ్యాచ్.. రేపటి నుంచే టికెట్ల విక్రయం

05:23 PM

మునుగోడులో గెలిచేది మేమే : మంత్రి జగదీశ్ రెడ్డి

04:52 PM

బ్యాంక్ రాబరీ..32 కేజీల బంగారం చోరీ

04:32 PM

ఆ లాకర్ లో నాణేలు తప్ప ఏమీ లేవు

04:12 PM

30 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో సినిమా థియేటర్ ప్రారంభం

03:51 PM

బాల భవన్ లో రంగవల్లులు భళా..ముగ్గులేసి అలరించిన చిన్నారులు

03:44 PM

కందిపప్పు పై కేంద్రం కీలక సూచనలు

03:40 PM

కోర్టులో భార్య గొంతు కోసిన భర్త

03:36 PM

జబర్దస్త్ లో నా పై పంచులు నచ్చడం లేదు : అనసూయ

02:35 PM

వీఎల్సీ మీడియా ప్లేయర్ పై నిషేధం..!

01:45 PM

విశాఖపట్నంలో కొనసాగుతున్న అగ్నివీర్‌ల నియామకం

01:35 PM

హ్యారీ పోటర్‌ రచయిత్రిని చంపుతామంటూ బెదిరింపు

01:27 PM

జూరాలకు కొనసాగుతున్న వరద..38 గేట్లు ఎత్తివేత

01:17 PM

తిరంగా వాటర్ ఫాల్స్ వీడియో వైరల్

01:04 PM

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

12:45 PM

‘తిరంగా సైకిల్ యాత్ర’ను అభినందించిన స్పీకర్‌ పోచారం

12:44 PM

బైక్ పై నుంచి పడ్డ బీజేపీ నేత స్వామి గౌడ్

12:33 PM

విమానాశ్రయంలో కాల్పుల కలకం

12:27 PM

యాదాద్రికి పోటెత్తిన భక్త జనం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.