Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కూలుతున్న కుటుంబాలు | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • May 15,2022

కూలుతున్న కుటుంబాలు

            కుటుంబం అంటే ఒక భరోసా, కుటుంబం అంటే ఒక ధైర్యం, కుటుంబం అంటే నమ్మకం. కుటుంబ సభ్యుల మధ్య ఎన్ని బేధాభిప్రాయాలు ఉన్నా అందరూ ఒక్క మాటపై నిలుస్తారనే విశ్వాసం. అదే కుటుంబమంటే. భారతదేశం 'భిన్నత్వంలో ఏకత్వం' అనే సూత్రం పైనే ఆధారపడి ఉంది. దేశమంతా కూడా ఒకే కుటుంబంగా ఏకతాటిపై నడవాలి. పూర్వం తల్లిదండ్రులు పిల్లలు అంతా కలిసి ఉమ్మడి కుటుంబంగా జీవించేవాళ్లు. ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ చెరొక ఆఫీసులో పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు. ఇదీ నేటి కుటుంబ వ్యవస్థ.
            ప్రస్తుతం కుటుంబ వ్యవస్థ క్షీణించిపోయి ఛిన్నాభిన్నం అవుతుండడంతో దీనికీ ఒక రోజును కేటాయించాల్సిన అవసరం ఏర్పడింది. పడిపోతున్న బలహీనపడిన కుటుంబ విలువలను తెలియజెప్పడం కోసం ఐక్యరాజ్యసమితి 'మే' నెల 15వ తేదీని అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా ప్రకటించింది. 1993వ సంవత్సరం నుంచీ ఈ ప్రపంచ కుటుంబ దినోత్సవం జరపబడుతున్నది. కుటుంబ వ్యవస్థను పటిష్టం చేయడం కోసం దీనిని నిర్వహింపబడుతున్నది.
ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు లేవు. ఉమ్మడి కుటుంబాల దాకా ఎందుకు, ఇంట్లో ఉన్న నలుగురూ నాలుగు ఊళ్ళల్లో ఉంటున్నారు. 'చిన్న కుటుంబం చింతలేని కుటుంబం' అని కుటుంబ నియంత్రణ కోసం ప్రచారం చేశారు కానీ ప్రస్తుతం మరల ఉమ్మడి కుటుంబాల ప్రాసశ్త్యానికై కొత్త నినాదాలను తీసుకురావలసి ఉంటుంది. ఉమ్మడి కుటుంబం ఉజ్జ్వల కుటుంబం అంటే బాగుంటుందేమో!
గత కాలపు సినిమాలను చూస్తే ఉమ్మడి కుటుంబాల్లోని బరువు బాధ్యతలతో పాటు 'కలసి ఉంటే కలదు సుఖం' అని చూపించేవారు. ఇప్పటి సినిమాల్లో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పెళ్ళి చేసుకుని సర్దుకుపోవడమే గగనమై విడాకుల కోసం పడే మానసిక సంఘర్షణలను చూపిస్తున్నారు. సినిమాలు అంటే సమాజానికి అద్దం పట్టేదే కదా! గత సినిమాల పేర్లను గమనిస్తే బంగారు కుటుంబం, ఆదర్శ కుటుంబం, వింత కుటుంబం, విచిత్ర కుటుంబం, నాయుడి గారి కుటుంబం, రైతు కుటుంబం, ఒకే కుటుంబం, మంచి కుటుంబం అంటూ కుటుంబ నేపథ్యంగా ఉండే పేర్లే కనిపించేవి. ప్రస్తుతం మొండి పట్టు పట్టుకు కూర్చున్న యువతకు మంచి చెడు చెప్పే పెద్దలెవరూ ఇంట్లో ఉండటం లేదు. పిల్లల్ని అతి గారాబం చేస్తూ అడిగిందల్లా కొనిస్తూవాళ్ళు అలగకుండా చూడటమే తమ ధ్యేయం అనుకునే తల్లిదండ్రులకు మంచి మాటలు చెప్పే అవకాశమే లేదు. తాము అలసిపోయి ఆఫీసుల నుంచి వచ్చాక తమను విసిగించకుండా ఎవరితో తిరిగినా పర్లేదు! అనుకునే దశలోకి తల్లిదండ్రులు వెళ్ళిపోతున్నారు.
ఇంతకు ముందు ఉండే ఇరుగుపొరుగు బంధువుల పాత్ర కూడా అంతంత మాత్రమే అవుతున్నాయి. అదీ నగరంలో అయితే పక్క ఫ్లాట్‌లో ఉన్న వారెవరో కూడా తెలియదు. ఈ మధ్యనే వార్తలలో చూసినట్లు, ఒక అపార్టుమెంట్‌లో ఉంటున్న వారిలో తల్లి మరణిస్తే పిల్లవాడు నాలుగు రోజులు అదే ఇంట్లో ఇండి స్కూలుకుపోయి వచ్చిన ఘటన హృదయాలను కలచి వేస్తుంది. అపార్టుమెంట్‌లలో నెలకొసారైనా కనీసం ఒకే ఫ్లోర్‌లోఉండే వాళ్ళైనా కలుసుకుంటే బాగుంటుంది. కనీసం పేర్లు, ఊర్లు, పిల్లలు తెలుస్తారు. మనుషుల మధ్య దూరం పెరిగి ఒంటరివారై పోతున్నారు. ఒంటరి తనం వల్ల మనసులో మాట చెప్పుకునేందుకు లేక అనేక మానసిక జబ్బుల బారిన పడుతున్నారు. బలహీన పడుతున్న బంధాలను గట్టి పరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మానసిక ఒత్తిడి ఎక్కువై ఆత్మహత్యల బారిన పడటమూ నిత్యం గమనిస్తూనే ఉన్నాం.
1993 నుంచి ప్రతి సంవత్సరం ఒక థీమ్‌ను తీసుకుని ప్రజల్ని చైతన్య పరుస్తున్నారు. ప్రజా చైతన్యం కోసం ప్రపంచ వ్యాప్తంగా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. 2016లో ''హెల్తీ లైవ్స్‌ అండ్‌ సస్టెయినబుల్‌ ఫ్యూచర్‌'' అనే థీమ్‌తో సమావేశాలు జరిగాయి. నూతన తల్లులు మొదటి బిడ్డ జన్మించినపుడు పడ్డ కష్టాలు చూసి రెండో బిడ్డను కనే సాహసం చెయ్యడం లేదు. అందరూ ఉద్యోగాలు, కెరీర్ల ధ్యాసలో పడి పిల్లల పెంపకం అత్యంత క్లిష్టమైన అంశంగా మారింది. 2018లో కుటుంబాలు, అందరికీ భాగస్వామ్యం కల్పించుకునే సమాజాలను నిర్మించడం అనే థీమ్‌తో జరిగింది. 2022లో ''ఫ్యామిలిస్‌ అండ్‌ ఆర్గనైజేషన్స్‌'' అనే థీమ్‌ను తీసుకొచ్చారు.
ఆత్మీయత - ఆనందం, కష్టం - సుఖం, బాధ - సంతోషం అన్ని రకాల భావాలూ కలగలసిన ప్రపంచమే కుటుంబం. మనలోపల ఉన్న ఆశల్ని కలల్ని రంగుల్ని రంగవల్లుల్ని విడమరిచి చెప్పేదే కుటుంబం. ముఖ్యంగా పెద్దవాళ్ళ అనుభవాలు యువతకు ఎంతో ఉపయోగకరం. మనకు వచ్చిన సమస్యకై అల్లల్లాడేవాళ్ళు, పూర్వకాలంలో ఈ సమస్యను ఎలా పరిష్కరించుకున్నారో తెలిస్తే ధైర్యం వస్తుంది. నవ సమాజంలో కొన్ని కొత్త సమస్యలు రావచ్చు. దేనికీ పరిష్కారం లేకుండా ఉండదు.
భారతదేశం అంటేనే కుటుంబ వ్యవస్థకు ప్రతీక లాంటిది. భారతదేశంలోనే కుటుంబాలు కూలిపోతున్నాయి. నెర్రెలిచ్చిన, బీటలు వారిన బంధాలకు ప్రేమ అనే లేపనాన్ని పూయాలి. ఏడాదికి ఒకసారైనా కుటుంబ సభ్యులు అందరూ కలిస్తే వారి మధ్య ఆత్మీయతలు చిగురించే అవకాశం ఉంటుంది. అందరూ కలిసి మూడు నాలుగు రోజులు యాత్రలకు వెళ్ళడం లాంటివి చేస్తే ఇంకా బాగుంటుంది. 'మీకు తోడుగా మేమున్నాం' అనే ధైర్యాన్నీ విశ్వాసాన్నీ కలిగిస్తే చాలు! ఎదుటి వారు ధైర్యంగా ఉండి తమ సమ స్యను తామే పరిష్కరించు కోగలుగుతారు. పిల్లల పెంపకంలో కూడా కుటుంబం పాత్ర పెద్దది, ప్రధానమైనది.

- డా|| కందేపి రాణీప్రసాద్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'ప్రబొధ గీతాల' కొక్కొరోకో (సంకలనం)
ఆనాటి సమాజం మీద ఆత్మార్పణ వీరుల ప్రభావం
50 యేళ్ళ క్రితం నేనో పెద్ద తప్పు చేశాను
భువి స్వ‌ర్గం మేఘాల‌య‌
వితంతు వివాహాల మాటున స్త్రీలపై జరిగిన అన్యాయం ఎక్‌ చాదర్‌ మైలీ సీ
వస్తే - ఇస్తా
పోటీ పరీక్షలకు సమాయాత్తమవ్వడమెలా..?
దుంప‌ల‌తో గంపెడు లాభాలు
బాల్యం- సమస్యల వలయం
బేతి రెడ్డి గ్రంథాలయం-పిల్లలమర్రి
బుక్‌ ఫెయిర్‌ ఒక ఉద్వేగం...
అడవి తల్లి ఒడిలో ఉద్యమాల తల్లి మల్లు స్వరాజ్యం
అద్భుత ఊహాకాల్పనిక వైచిత్రి 'నీటినీడ' కథా సంపుటి
యల్లాప్రగడ సీతాకుమారి
మట్టిదిబ్బ కింద మహా దేవాలయం గొంగులూరు గుడి కథ
ఘనమైన చరిత్రకు సాక్ష్యం సంస్థాన్‌ నారాయణపురం
దూమపానం - నోటి క్యాన్సర్లు
స్మార్ట్‌ఫోన్‌లతో బాలలు దారి తప్పవద్దు
పెదకొండూరులో కాకతీయులనాటి మల్లు బాలమ్మ దాన శాసనం
జీవ వైవిధ్యం - మానవ మనుగడ
తన శరీరాన్ని వ్యాపార సరుకుగా మార్చిన సమాజంపై న్యాయపోరాటం చేసిన 'లక్ష్మి'
విద్యార్థి గేయకర్త సేనాపతి భాష్యకాచార్యులు
పేదల పెన్నిధి, పోరాట కవి కాళోజీ రామేశ్వరరావు
మరణాన్ని సైతం కవిత్వం చేస్తాన్నేను
పిల్లలను అలరించిన వేసవి శిబిరం
బొమ్మలరామారంలో కొత్తరాతిబొమ్మల తావు
వేగు చుక్కల వెలుగు తార ఇరివెంటి కృష్ణమూర్తి
అమ్మకు ఓ బహుమతి
ఒట్టు... నీ మీద ఒట్టు
కూతురుగా పుట్టి కొడుకుగా భాద్యతలు నెరవేర్చిన ఆర్తి కథ ఆమా

తాజా వార్తలు

01:46 PM

ఒకే ఇంట్లో 9 మంది మృతి కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు..!

01:46 PM

షాంఘై, బీజింగ్​ లలో ఆంక్షలు సడలింపు

01:32 PM

గూగుల్‌కు తెలంగాణ పోలీసుల లేఖ‌

01:24 PM

నేడు ఐర్లాండ్ తో భారత్ రెండో టీ20

01:19 PM

పానీపూరీపై నిషేధం.. ఎందుకంటే..?

01:16 PM

నాలుగు అంతస్తుల భవనం కూలి..ముగ్గురు మృతి

01:09 PM

గవర్నర్ తేనీటి విందులో పాల్గొన్న కేసీఆర్

01:09 PM

ఎస్‌బీఐ బ్యాంక్‌లో రూ.5 కోట్లు గోల్ మాల్..!

12:59 PM

ఇంట‌ర్ ఫ‌లితాల్లో మెరిసిన గురుకుల విద్యార్థులు..

12:59 PM

న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు..

12:55 PM

డీఎంఈ ఆఫీస్ వద్ద సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ఆందోళన

12:50 PM

శుభకార్యానికి వెళ్తుండగా వ్యాన్ బోల్తా

12:40 PM

వెబ్‌సైట్‌లో ఇంటర్ మెమోలు.. ఎప్పటి నుంచి అంటే..?

12:34 PM

కర్ణాటకలో మళ్లీ భూకంపం

12:25 PM

30న గోల్కొండలో బోనాలు

12:15 PM

పీవీ స్ఫూర్తి తో ముందుకు.. : కేసీఆర్

12:02 PM

లోన్‌యాప్ వేధింపులకు యువకుడు బలి

11:57 AM

ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్...

11:50 AM

జీ7 దేశాధినేతలకు ప్రధాని మోడీ ప్రత్యేక బహుమతులు

11:49 AM

జువెనైల్‌ హోం నుంచి అయిదుగురు పరారీ

11:35 AM

క‌రీంన‌గ‌ర్‌లో అర్ధ‌రాత్రి పిల్లి‌ని కాపాడిన పోలీసులు

11:29 AM

ఆగ‌స్టు 1 నుంచి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు

11:24 AM

క్షీణిస్తున్న పుతిన్ ఆరోగ్యం..!

11:18 AM

ఇంటర్‌ ఫలితాలు విడుదల...

11:14 AM

3డీ ప్రింటింగ్‌తో ఎన్‌95 మాస్కు

11:06 AM

అగ్నిపథ్‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌

11:04 AM

పీవీకి భారత రత్న ఇవ్వాలి : మంత్రి తలసాని

10:51 AM

బిజినెస్‌ టైకూన్‌ కన్నుమూత

10:43 AM

దేశంలో కొత్తగా 11,793 కరోనా కేసులు

10:33 AM

హనుమకొండలో ఉద్రిక్తత

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.