Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పేదల పెన్నిధి, పోరాట కవి కాళోజీ రామేశ్వరరావు | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • May 21,2022

పేదల పెన్నిధి, పోరాట కవి కాళోజీ రామేశ్వరరావు

ఎక్కడో పుట్టిన వ్యక్తి గురించి, ఎక్కడో ఎదిగిన గొప్ప మనిషి గురించి రాయడం విశేషమే కావచ్చును గాక, కాని మా ఊరు పక్కన ఉన్న ఆలూరు (చేవెళ్ళ) సమీపంలో పుట్టిన ఇంతటి అరుదైన గొప్ప మనిషి గురించి రాయడం సగర్వంగా ఉంది. ఆ గొప్ప మానవ మూర్తియే కాళోజి నారాయణరావు సోదరుడు రామేశ్వరరావు. వీరి పూర్వీకులు ఎక్కడి నుండో వచ్చి వరంగల్‌ మడికొండలో స్థిరపడినా వీరు మాత్రం మాకు సమీపాన పుట్టడం మా ప్రాంతానికి గర్వ కారణం.
రామేశ్వరరావు పేరు పొందిన కవి, స్వాతంత్య్ర సమర యోధుడికి సోదరుడు. ఇతను 1908 జూన్‌ 22 న కాళోజి రంగారావు, రమాబాయిలకు జన్మించాడు. వీరి కుటుంబం మడికొండలో స్థిరపడింది. దీంతో తండ్రి ఉద్యోగం రీత్యా పలు ప్రాంతాలకు వెళ్ళవలసి రావడంతో రామేశ్వరరావు విద్య హైదరాబాద్‌, మడికొండ, వరంగల్లులో సాగింది. ఇతనికి నటనలో ఆసక్తిగా ఉండడంతో తండ్రి ప్రోత్సహించాడు. ఆ ప్రోత్సాహంతో పలు నాటకాలలో నటించాడు. ఎవరైనా తమకున్న కళను రెండు విధాలుగా సద్వినియోగం చేసుకుం టారు. ఒకటి తను ఆర్థికంగా మెరుగుపడడం కోసం, రెండు తనకున్న కళను ప్రదర్శించి చుట్టూరా ఉన్న సమాజంలో పేరు పొందడం కోసం. కాని కొందరు మాత్రమే ఈ రెండింటిని కాదని సంఘ శ్రేయస్సు కోసం ప్రదర్శిస్తారు. ఆ కొందరిలో రామేశ్వరరావు ఒకరు. ఇతను తనకున్న ఆసక్తితో నాట కాలు వేసి తద్ద్వారా వచ్చిన డబ్బును 'ప్రతాపరుద్ర గ్రంథాలయ' నిర్వహణకు అందించేవాడు. ఇలా ఇతను 'జయంత జయరామ పాపము, లంకా దహనం, ఉషాపరిణయం' వంటి నాటకాలలో నటించాడు. న్యాయవాదవత్తిపై తనకున్న అభిప్రా యాన్ని, అభీష్టాన్ని ''మా చిన్ననాటి రోజులు''లలో రాసుకున్నారు.
సేవా రంగం
1947 నాటికి, జాతీయోద్యమ శతాబ్దంలో అత్యంత ఆదరణ ఉన్న, విలువైన, గౌరవమైన విద్య న్యాయశాస్త్రం. స్వాతంత్య్ర పోరాట కాలంలో, అంతకు ముందు పుట్టిన వాళ్ళలో సామాజిక జీవనంలో కాస్త మెరుగైన జీవనాన్ని గడుపుతున్న వారు తమ పిల్లలను న్యాయశాస్త్రం వైపు మళ్ళించారు. అయితే నిజాం కాలంలో న్యాయస్థానాలే న్యాయవాద విద్యకు సంబంధించిన తరగతులను నిర్వహిస్తుండేవి. దీనికి 7 వ తరగతి అర్హతగా ఉండడంతో రామేశ్వరరావు హనుమకొండలో 7 వరకు చదివి, న్యాయశాస్త్ర తరగతులలో చేరి పట్టా పొంది 1928 నాటికి న్యాయవాదిగా హనుమకొండలో స్థిరపడ్డాడు. నిజాం ప్రభుత్వ కాలంలోని సంక్లిష్ట పరిస్థితుల నడుమ తాను నిజాం వ్యతిరేక కేసులను కూడా చేపట్టి వాదించిన వ్యక్తి. నిరుపేదల పాలిట దయతో ఉండి, వారి జీవన స్థితిని అర్థం చేసుకొని ఖర్చు లేకుండా కోర్టులలో వాదించేవాడు.
ప్రజలను బెదిరింపులకు గురి చేసి, వారిపై దౌర్జన్యాలకు పాల్పడి అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకున్న భూస్వాములకు ప్రతికూలంగా రైతుల పక్షాన కోర్టులలో పోరాటం చేశాడు. రామేశ్వరరావు తన న్యాయవాద వత్తిని చేపడుతూనే రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనే వాడు. నాడు ప్రజలను చైతన్య వంతులని చేయడానికి స్థాపించిన ప్రతి సంస్థతో ఇతనికి సంబంధం ఉండేది. అయితే ఇతను ప్రగతి శీల భావాలు గల వ్యక్తిగా ఉండి అక్రమ కార్యక్రమాలను ప్రశ్నించేవాడు.
వరంగల్‌ లోని పురపాలక సంఘంలో కౌన్సిలర్‌గా ఉన్నాడు. అలాగే ఒక పట్టణానికి కాంగ్రెసు అధ్యక్షునిగా పని చేసిన అనంతరం ప్రజాస్వామ్య వ్యవస్థ సరైన మార్గంలో ఉండడం లేదని భావించి దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులను చూసి విరక్తి చెంది కాంగ్రెసు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. స్వాతంత్య్రోద్యమంలో కవిగా, నిజాయితీ గల న్యాయవాదిగా సమాజం పట్ల తనకున్న బాధ్యతను నిర్వర్తించాడు. మొదటి నుండి కాంగ్రెసు అభిమానిగా ఉంటున్న ఇతడు వయసులో చిన్నవాడైనప్పటికి నాటి ఉద్యమ నాయకులు అభిమానించేవారు. ''బందగి రక్తం, చిందిన నేత్రం, బలిదానాలకు వెరవని క్షేత్రం'' అని స్మతి గేయానికి కారణమైన పోరాటయోధుడు షేక్‌ బందగీకి, విసునూరు దేశ్‌ముఖ్‌ రాపాక రామచంద్రారెడ్డికి మధ్య జరిగిన భూ వివాద కేసులో రామేశ్వరరావు వాదించి బందగీని గెలిపించాడు.
సాహిత్య అభిలాష
రామేశ్వరరావు ఉర్దూ కవిగా ప్రసిద్ధుడు. వరంగల్లులో వీరి ఇల్లు ఎప్పుడు సాహీతి మిత్రులతో, కవిత్వ సువాసనలతో విరాజిల్లేది. వీరి ఇంటికి ప్రముఖ సాహేతీవేత్తల రాకపోకలు నిరాటంకంగా ఉండేవి. ఒకసారి మన తొలి జ్ఞానపీఠాధిపతి అతిధిగా వెళ్ళిన విషయాన్ని వానమామలై వరదాచార్యుల గారి 'మణిమాల' పీఠికలో తెలిపారు. నిజాం రాజ్యంలో అధికార భాష ఉర్దూ అయినప్పటి నుండి ఆ భాష ప్రభావం, ఆ భాష తాలూకు సాహిత్యం వెలువడేది. అయితే ఇది ఎక్కువగా ఆంధ్రేతరులే రాసేవారు. కాని ఆంధ్రులుగా ఉర్దూలో సాహిత్యం రాసినవారు చాలా అరుదు. వారిలో రామేశ్వరరావు ప్రముఖుడు. ఇతను తెలుగుతో పాటు హైదరాబాద్‌లో ఉన్న ఇతర బాషలలో కూడా రచనలు చేయగల పాండిత్యమున్న ప్రతిభాశాలి. ఉర్దూలో కవిత్వంతో పాటు తెలుగులో 'ఫోటోగ్రాఫర్‌' వంటి పలు కథలు రాసిన రామేశ్వరరావు 1996 నవంబర్‌ 11 న కన్నుమూసాడు.
- ఘనపురం సుదర్శన్‌,
9000470542

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పిల్లలు 'వయస్సు' మీరుతున్నారా..?
ఏడు కాకతీయుల వేడుక
ప్రకృతి వైద్య నిధి వరంగల్‌ గ్రంథాలయం
గెలిపించేవాడు
'ప్రబొధ గీతాల' కొక్కొరోకో (సంకలనం)
ఆనాటి సమాజం మీద ఆత్మార్పణ వీరుల ప్రభావం
50 యేళ్ళ క్రితం నేనో పెద్ద తప్పు చేశాను
భువి స్వ‌ర్గం మేఘాల‌య‌
వితంతు వివాహాల మాటున స్త్రీలపై జరిగిన అన్యాయం ఎక్‌ చాదర్‌ మైలీ సీ
వస్తే - ఇస్తా
పోటీ పరీక్షలకు సమాయాత్తమవ్వడమెలా..?
దుంప‌ల‌తో గంపెడు లాభాలు
బాల్యం- సమస్యల వలయం
బేతి రెడ్డి గ్రంథాలయం-పిల్లలమర్రి
బుక్‌ ఫెయిర్‌ ఒక ఉద్వేగం...
అడవి తల్లి ఒడిలో ఉద్యమాల తల్లి మల్లు స్వరాజ్యం
అద్భుత ఊహాకాల్పనిక వైచిత్రి 'నీటినీడ' కథా సంపుటి
యల్లాప్రగడ సీతాకుమారి
మట్టిదిబ్బ కింద మహా దేవాలయం గొంగులూరు గుడి కథ
ఘనమైన చరిత్రకు సాక్ష్యం సంస్థాన్‌ నారాయణపురం
దూమపానం - నోటి క్యాన్సర్లు
స్మార్ట్‌ఫోన్‌లతో బాలలు దారి తప్పవద్దు
పెదకొండూరులో కాకతీయులనాటి మల్లు బాలమ్మ దాన శాసనం
జీవ వైవిధ్యం - మానవ మనుగడ
తన శరీరాన్ని వ్యాపార సరుకుగా మార్చిన సమాజంపై న్యాయపోరాటం చేసిన 'లక్ష్మి'
విద్యార్థి గేయకర్త సేనాపతి భాష్యకాచార్యులు
మరణాన్ని సైతం కవిత్వం చేస్తాన్నేను
పిల్లలను అలరించిన వేసవి శిబిరం
కూలుతున్న కుటుంబాలు
బొమ్మలరామారంలో కొత్తరాతిబొమ్మల తావు

తాజా వార్తలు

01:46 PM

తెలంగాణ వనరులను దోచుకోడానికి వచ్చారు: జీవన్ రెడ్డి

01:32 PM

టీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌

01:21 PM

ఆటా కన్వెన్షన్‌లో ఏపీ పెవిలియన్‌ ప్రారంభం

01:08 PM

జూలై 4న భీమవరానికి ప్రధాని మోడీ

12:59 PM

దేశంలో కొత్తగా 16,103 కరోనా కేసులు

12:53 PM

పారిస్‌ నుంచి ఏపీకి తిరిగొచ్చిన సీఎం జగన్‌

12:35 PM

దివ్యాంగులను ఆదుకోవాలి: పవన్ కళ్యాణ్

12:26 PM

ప్రధాని సభకు జీహెచ్ఎంసీ సహాయ నిరాకరణ

12:05 PM

భద్రాద్రి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

11:45 AM

జ‌న‌సేన జ‌న‌వాణి ప్రారంభం

11:37 AM

సాయంత్రం ఎంజీబీఎస్‌-జేబీఎస్‌ మధ్య మెట్రో రైళ్లు బంద్‌

11:33 AM

సంగారెడ్డిలో సాఫ్ట్‌వేర్‌ ఉ‍ద్యోగి దారుణ హత్య

11:21 AM

బీజేపీ ఫ్లెక్సీలపై బాదుడే బాదుడు...

11:09 AM

హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

11:02 AM

ఇండియన్ ఆఫ్ ద వ‌ర‌ల్డ్ అవార్డు అందుకున్న ఫ‌డ్న‌వీస్ స‌తీమ‌ణి

10:59 AM

సత్తుపల్లిలో భారీ వర్షం..నిలిచిన బొగ్గు ఉత్పత్తి

10:53 AM

కామారెడ్డిలో కత్తిపోట్ల కలకలం

10:51 AM

ఇంగ్లండ్​ బోర్డుపై దినేశ్​ కార్తీక్​ ఆగ్రహం

09:23 AM

ప్రధాని ప్రశంసలకు గర్వంగా ఉంది: మిథాలీరాజ్‌

09:16 AM

ప్రధాని మోడీ నేటి షెడ్యూల్ ఇదే...

09:09 AM

దుకాణంలో అర్ధరాత్రి వెరైటీ చోరీ..ఏరికోరి కావాల్సిన వస్తువులను..!

08:58 AM

ఖాజాబాగ్‌ డెకరేషన్ గోదాంలో అగ్నిప్రమాదం

08:48 AM

అల్లూరి సీతారామరాజు మనవలు, మునిమనవళ్లతో భేటీకానున్న మోడీ

08:16 AM

భాగ్యలక్ష్మి అ‍మ్మవారిని దర్శించుకున్న సీఎం యోగి

08:08 AM

ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో వైద్యారోగ్య శాఖ మంత్రి రక్తదానం

07:58 AM

నేడు హైదరాబాద్ మెట్రో సేవలు యథాతథం

07:46 AM

మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌

07:43 AM

తల్లికి క్యాన్సర్‌ అని తెలిసి కుమారుడి ఆత్మహత్య

07:37 AM

రోడ్డు ప్ర‌మాదంలో ఎస్ఐ మృతి

07:18 AM

భద్రాద్రిలో భారీగా గంజాయి పట్టివేత

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.