Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తన శరీరాన్ని వ్యాపార సరుకుగా మార్చిన సమాజంపై న్యాయపోరాటం చేసిన 'లక్ష్మి' | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • May 22,2022

తన శరీరాన్ని వ్యాపార సరుకుగా మార్చిన సమాజంపై న్యాయపోరాటం చేసిన 'లక్ష్మి'

వేశ్యా వత్తి ప్రపంచంలో అతి పురాతనమైన వత్తి అని అందరికి తెలుసు. మన దేశంలో రకరకాల పద్ధతిలో స్త్రీని భోగ వస్తువుగా మార్చింది సమాజం. దేవదాసీలు అనో, జోగినీలు అనో కొందరు స్త్రీలను ఉమ్మడి సొత్తుగా వ్యవస్థ మార్చివేసింది. ఎప్పుడయితే వస్తు మార్పిడి నుండి డబ్బు వైపుకి సమాజంలో వ్యాపారం ప్రయాణించిందో, స్త్రీ శరీరంపై తరాలుగా జరుగుతున్న వ్యాపారం ఇంకా ఇంకా క్రూరంగా మారిపోయింది. ఒక కులం లేదా వర్గంగా ఉండి ఈ వత్తి సాగిస్తున్నంత కాలం ఆ వత్తిలోని స్త్రీకి సమాజం కొంత రక్షణ ఇస్తూ వచ్చింది. అది దేవాలయం నుండి పొందే భూమి కావచ్చు లేదా ఆ స్త్రీలు తమ తెలివితో, లౌక్యంతో సంపాదించుకున్న ఆస్థి కావచ్చు, అది పూర్తిగా వారి సొత్తుగా గుర్తుంపు పొందేది. కాని ఈ వ్యవస్థలను కూల్చివేసి స్త్రీ జీవితాన్ని బాగుపరుద్దాం అనుకున్న సంస్కర్తలకు విచారం గొల్పేలా, స్త్రీ శరీరంపై ఆ వ్యవ్యస్థల కూల్చివేతతో జరుగుతున్న దోపిడి తగ్గక పోగా, వారికి పూర్వం ఉన్న రక్షణ కూడా కరువయ్యింది. భయంకరమైన పరిస్థితుల మధ్య వేశ్యావత్తిని సాగిస్తూ జీవిస్తున్నారు ప్రస్తుతం ఆ వత్తిలో ఉన్న వారు. ఆధునిక సమాజంలో స్త్రీ శరీరాలపై జరుగుతున్న దోపిడిని దాపరికం లేకుండా చూపించిన తెలుగు సినిమా ''లక్ష్మీ''.
వేశ్యా వత్తిని నివారించాలంటే వారి జీవితాలలో మార్పు రావాలంటే ఆ స్త్రీలలోనే రావల్సిన తెగింపు, ధైర్యం, ఆలోచనలను ఇతివత్తంగా తీసుకుని తీసిన సినిమా ఇది. ఈ వత్తిలో జీవిస్తున్న వారి కథల ఆధారంగా ఎన్నో సినిమాలు ఇంతకు ముందు వచ్చినా, 'లక్ష్మి' సినిమా సమస్యను చూపడమే కాకుండా, ఈ సమస్య పరిష్కారం దిశగా కూడా కొంతవరకు ఆలోచింపజేస్తుంది.
పద్నాలుగేళ్ళ లక్ష్మిని ఆమె ఊరి నుండి ఎత్తుకొస్తాడు చిన్న అనే ఒక బ్రోకర్‌. ఇలా దొంగచాటుగా తీసుకొచ్చిన అమ్మాయిలను హైదరాబాద్‌ వైపుకు ట్రక్‌లో తీసుకొస్తాడు. దారిలో అతని అన్న రాంరెడ్డి వచ్చి లక్ష్మిని తన ఇంటికి తీసుకువెళతాడు. ఆ ఇంట్లో పనికి తనను పెట్టుకుంటారని అనుకుంటుంది లక్ష్మి. ఇంట్లో అమ్మ అనే మరో స్త్రీ పనులు చేసుకుంటూ ఉంటుంది. ఆమెకు తోడుగా తాను హాయిగా అక్కడ ఉండిపోగలనని అనుకుంటుంది లక్ష్మి. కాని ఒక రోజు తరువాత ఆమెపై అత్యాచారం చేస్తాడు రాంరెడ్డి. విపరీతంగా రక్తస్రావం అవుతున్న ఆమెకు ఆ పనిమనిషి అన్ని సపర్యలు చేస్తుంది. అప్పుడు లక్ష్మికి తనను కావాలనే అక్కడకు తీసుకువచ్చారని అర్థం అవుతుంది. ఆ పని మనిషికి తనపై జరగబోయే అత్యాచారం గురించి ముందే తెలుసని, తెలిసే తనను మోసం చేసిందని ఆమెను ద్వేషిస్తుంది లక్ష్మి. అన్న రాంరెడ్డికి లక్ష్మిపై మోజు తీరిన తరువాత అతని తమ్ముడు చిన్న లక్ష్మిని తాము నడుపుతున్న వేశ్యా గహానికి తీసుకువస్తాడు. ఆ గహాన్ని చూసుకుంటున్న స్త్రీ పేరు జ్యోతి. అక్కడి నుండి పారిపోవాలని మొదటి రోజే ప్రయత్నిస్తుంది లక్ష్మి. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి రాంరెడ్డి చిన్నాలపై కంప్లయింట్‌ ఇస్తుంది. వారి పేర్లు వినగానే వారి వద్ద లంచాలు తినే పోలీస్‌ ఎస్‌.ఐ. ఆమెను తిరిగి వారికే అప్పగిస్తాడు. తప్పని పరిస్థితులలో ఆమె ఆ వత్తిలోకి నెట్టబడుతుంది. కాని ఎప్పటికైనా ఆక్కడి నుండి పారిపోవాలని బలంగా నిర్ణయించుకుంటుంది.
ఆమెకు అక్కడ సువర్ణ అనే మరో వేశ్యతో స్నేహం అవుతుంది. సువర్ణ ద్వారా అక్కడి ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది లక్ష్మి. ఆ ఇంటిని నడిపే జ్యోతి తన కూతురిని ఇంజనీరింగ్‌ చదివిస్తూ ఉంటుంది. కూతురి చదువు కోసం ఆమె రెడ్డి దగ్గర పని చేస్తూ ఉంటుంది. కూతురికి తాను చేస్తున్న పని గురించి తెలియనివ్వదు. ఆమె చదువు అయిపోయి ఏదో ఒక ఉద్యోగం వచ్చాక ఈ పని వదిలేయాలన్నది జ్యోతి కోరిక. ఆ ఇంట్లో ఏ అమ్మాయి మాట వినకపోయినా చిన్నా జ్యోతిని విపరీతంగా కొడతాడు. లక్ష్మి పారిపోయిన రోజు కూడా చిన్నా చేతిలో దెబ్బలు తింటుంది జ్యోతి. తనకు తోచిన రీతిలో ఆ అమ్మాయిలకు సాయం చేయాలనే ప్రయత్నిస్తుంది కాని ఆమె కూడా రెడ్డి చేతిలో కీలుబొమ్మే. అక్కడికి ఉమ అనే ఒక సోషల్‌ వర్కర్‌ తరుచు వస్తూ ఉంటుంది. ఆ అమ్మాయిలకు ఆరోగ్య పరిక్షలు చేయిస్తూ వారికి అవసరమయ్యే వస్తువులు తీసుకొస్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా వారి రక్షణ కోసం కండోమ్స్‌, వారెప్పుడూ రుచి చూడలేని కొన్ని స్వీట్లు ఉంటాయి.
ఒక పెద్ద డబ్బున్న వ్యక్తి ఇంటికి ఒక రోజు ముగ్గురు అమ్మాయిలను తీసుకువెళతాడు చిన్న. సువర్ణతో, లక్ష్మి కూడా అక్కడకు వెళుతుంది. అక్కడి నుండి మళ్ళీ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఆమెను పట్టుకున్న చిన్న ఆమెను విపరీతంగా కోడతాడు. అతని దగ్గర ఎప్పుడూ ఉండే ఇనప కర్రతో కాలి మీద గాయం చేస్తాడు. తిరిగి వచ్చిన లక్ష్మికి విపరీతమైన జ్వరం వస్తుంది. గాయపడిన కాలు ఇన్ఫెక్ట్‌ అవుతుంది. జ్యోతి సువర్ణ ఇద్దరు కూడా ఆమెకు సపర్యలు చేస్తూ ఉంటారు. కాని ఆ స్థితిలో కూడా స్పహలోలేని ఆమెతో వ్యభిచారం చేయిస్తూ ఉంటాడు చిన్న. లక్ష్మి పరిస్థితి బాలేదని, ఆమెకు కొంత కాలం విశ్రాంతి ఇవ్వాలని జ్యోతి ఎంత చెప్పినా ఒప్పుకోడు.
ఒక రాత్రి చిన్న పిల్ల కావాలని వచ్చిన ఒక వ్యక్తిని బలవంతంగా లక్ష్మి గదిలోకి పంపిస్తాడు చిన్న. ఆ తరువాత ఆమె దగ్గరకు చాలా మంది విటులు వస్తారు. కాని మొదటిసారి వచ్చినతను మోహన్‌ అనే సోషల్‌ వర్కర్‌ అని, లేడీస్‌ హాస్టల్‌గా రిజిస్టర్‌ అవబడి, చెలామణీలో ఉన్న ఆ ఇంట్లో జరుగుతున్నవి సాక్షాలతో బైటపెట్టాలని అతను జ్యోతి సహాయంతో అక్కడికి వచ్చాడని తరువాత తెలుస్తుంది. ఈ సారి పకడ్బందీగా వేసిన ప్లాన్‌ కారణంగా రెడ్డి చిన్నా ఇద్దరూ అరెస్టు అవుతారు. ఆ గహంలోని అమ్మాయిలందరూ సోషల్‌ వెల్ఫేర్‌ షెల్టర్‌కు చేరతారు. మోహన్‌ వారి పునరావాస ఏర్పాట్లు చూస్తూ ఉంటాడు. వారికి బతకడానికి చిన్న చిన్న వత్తులు నేర్పిస్తూ ఉంటాడు.
సువర్ణ అక్కడ ఉండలేకపోతుంది. ప్రపంచం మొహం చూడకుండా కనీసం తన తాగుడికి కూడా సరిపడ సంపాదించలేని స్థితిలో తాను అక్కడ ఉండలేనని నిశ్చయించుకుంటుంది. తిరిగి తన పాత వత్తిలోకి వెళ్ళిపోతుంది. సాక్షాలు లేక రెడ్డి మీద పెట్టిన కేస్‌ పలచనబడిపోతుంది. ఆ ఇంటి నుండి బైటకు వచ్చిన ఎవరూ కూడా సాక్షం చెప్పడానికి ముందుకు రారు. లక్ష్మి ఒక్కత్తే రెడ్డికి విరుద్ధంగా సాక్షం చెప్పడానికి ఒప్పుకుంటుంది. అవినాష్‌ అనే లాయర్‌ సహాయంతో కోర్టు బోనులో నిలబడి రెడ్డి కారణంగా తనకు జరిగిన అన్యాయం అందరి ముందూ బైటపెడుతుంది. కోర్టులో ఆ చిన్న పిల్లను లాయర్లు వేసే ప్రశ్నలు, చూసే చూపులను తట్టుకుని నిలబడుతుంది. అపస్మారక స్థితిలో ఉన్న తన గదిలోకి బలవంతంగా విటులను పంపి వారు తన శరీరంతో కామం తీర్చుకోవడాన్ని మోహన్‌ గదిలో దాచిన కెమెరాలో రికార్డు చేసినదాన్ని కోర్టులో బైటపెట్టడానికి ఒప్పుకుంటుంది లక్ష్మి. కేసు గెలిచి, రెడ్డికి శిక్ష పడేలా తోడ్పడుతుంది. అయితే అక్కడే తనను తన తండ్రే ముప్పై వేల కోసం అమ్మేశాడని, తనను కొనుక్కున్న కార్పొరేటర్‌ తిరిగి చిన్నాకు అమ్మేసిందనే విషయాన్ని బైటపెడుతుంది. కార్పొరేటర్‌ సాక్ష్యం చెప్పకుండా ఉండడానికి ఎంతో డబ్బు లంచంగా ఇవ్వ చూపినా లక్ష్మి వెనక్కు తగ్గదు. తన భవిష్యత్తు ప్రశ్నార్ధకమని, ఆ డబ్బుతో తన జీవితానికి ఒక రక్షణ ఏర్పడవచ్చని ఆమెకు తెలిసినా కేసు వెనక్కు తీసుకోదు. రెడ్డికి దానికి తోడ్పడిన కార్పొరేటర్‌కు శిక్ష పడాలని న్యాయం కోసం పోరాడుతుంది.
జ్యోతి ప్రమేయంతోనే మోహన్‌ లక్ష్మి గదిలోని విషయాలను రికార్డు చేసాడని తెలుసుకున్న చిన్న ఆమెను విపరీతంగా కొట్టడమే కాకుండా, ఆమె కూతురిని పిలిచి తల్లి చేస్తున్న ఉద్యోగం గురించి చెబుతాడు. తల్లి చేసే వ్యాపారం తెలుసుకున్న ఆ కూతురు అసహ్యంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏ కూతిరి కోసం బతుకుతుందో ఆమె చూసే చూపులో అసహ్యాన్ని తట్టుకోలేకపోతుంది జ్యోతి. పైగా క్రూరంగా ఆమెపై చిన్నా అత్యాచారం చేయడం, హింసించడంతో ఆమె చిన్నాను అత్యంత దారుణంగా హత్య చేస్తుంది. చివరకు తాను కూడా ఆత్మహత్య చేసుకుంటుంది.
సినిమాలో దర్శకుడు చాలా విషయాలను చర్చకు తీసుకు వస్తాడు. పేదరికంతో లేదా అత్యాశతో తండ్రులే బిడ్డలను అమ్ముకోవడం, చిన్నపిల్లలతో సెక్స్‌ జరిపితే ఎయిడ్స్‌ తగ్గుతుందనే నమ్మకంతో చిన్న పిలల్లపై జరుగుతున్న అత్యాచారాలు, హ్యూమన్‌ ట్రాఫికింగ్‌తో సంబంధం ఉండే పెద్ద మనుష్యులు, ముఖ్యంగా స్త్రీలు, వీరికి న్యాయం చేయడానికి ముందుకురాని న్యాయ వ్యవస్థ, ఇవన్నీ ఈ సినిమా చర్చించే విషయాలు.
ఈ గహాలను నడిపే స్త్రీల అసహాయ పరిస్థితులను కూడా చూపిస్తారు దర్శకులు. ఈ గహాల నుండి బైటపడి వీరు బాగుపడాలనుకుంటూనే, వీరిని స్వీకరించలేని సమాజం మధ్య ఉండలేక, చాలీచాలని సంపాదనతో ఆకలితో మాడి చావలేక చివరకు వారు మళ్ళి అదే వత్తిలోకే వెళ్ళిపోవడం వెనుక ఉన్న సామాజిక పరిస్థితులనూ చర్చిస్తారు దర్శకులు. ఇలాంటి స్త్రీల పునరావాసానికి ఎన్‌.జీ.వోల సహకారాన్ని కూడా ప్రస్తావిస్తారు. ఒక వేశ్యగా వారి జీవితం ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేస్తూ ఆ స్త్రీలపై సానుభూతిని వారి పట్ల సమాజ భాద్యతను గుర్తు చేసే ప్రయత్నం ఈ సినిమా చేయగలిగింది. కోర్టులో పద్నాలుగేళ్ళ లక్ష్మి ఎదుర్కొనే ప్రశ్నలు, చూపులు, అసహ్యాన్ని చూపిస్తూ, ఒక చిన్న పిల్లను అటువంటి స్థితిలోకి నెట్టిన పేదరికం, మనిషి స్వార్ధం, మగవాని ఆకలి, వ్యాపార వస్తువుగా మారిన స్త్రీ శరీరం, వీటన్నిటికి కారణాలు వెతకమంటాయి సినిమాలోని కొన్ని సీన్లు.
గ్రేట్‌ ఆంధ్రా డాట్‌ కామ్‌ అనే ఇంగ్లీషు ఆన్‌లైన్‌ పత్రికలో వచ్చిన వ్యాసం ప్రకారం కేవలం హైదరాబాద్‌ లోనే 5000 వేశ్యా గహాలున్నాయట. ఇవి చాలా వరకు అపార్ట్‌మెంట్లలో నడుస్తున్నాయట. ఈ వ్యాసంలో రాసినవన్నీ చదివిన తరువాత ఈ సినిమాలో చూపించిన వాటితో ఏకీభవించకుండా ఉండలేం. ఆ అమ్మాయిలంతా చాలా భాగం నగరంలో పని కోసం వచ్చి ఈ వత్తిలో ఇరుక్కుపోయినవారు. వీరిని పట్టుకుని శిక్షించినా, మళ్ళీ బైటకు వచ్చి అదే వత్తి మరో చోట మొదలెడతారు. వీరి జీవితాలకు మరో దారి చూపించే స్థితిగతులలో ప్రస్తుత సమాజం లేదు, ఎప్పటికీ ఉండదేమో కూడా.
లక్ష్మి సినిమాలో షెఫాలీ షా గొప్ప నటనను ప్రదర్శించారు. జ్యోతి పాత్రలో ఆమెలో మంచితనం, కటువుతనం కూడా సమపాళ్లలో చూస్తాం. ఆమె పాత్రను దర్శకులు చాలా జాగ్రత్తాగా మలిచారు. తప్పని పరిస్థితులలో కూతురి కోసం ఆ గహంలో ఉంటూ వేరే అమ్మాయిలతో వ్యాపారం చేయిస్తూ మనస్సాక్షి అడిగే ప్రశ్నలకు నలిగిపోతూ చివరకు ఆత్మహత్య చేసుకునే జ్యోతి పాత్రలో సమజంలో స్త్రీ ఎన్ని రకాలుగా దోపిడికి గురి అవుతుందో కనబడుతుంది. ఆమె నైతిక పతనం వెనుక ఉన్న కారణాలను కనీసం వెతికే ప్రయత్నం చేస్తే మన చుట్టూ ఉన్న సమాజంలోని స్వార్థం కొంతవరకన్నా అర్థం అవుతుంది. లక్ష్మి కన్నా, ఆమెపై అధికారం చెలాయించే జ్యోతి అతి పెద్ద విక్టింగా కనిపిస్తుంది. అయినా ఆమె లక్ష్మి ద్వారా తమ కథ బైటకు రావాలని ప్రయత్నిస్తుంది. ఈ రెండు పాత్రల ద్వారా దర్శకులు తమ జీవితాలను తామే మార్చుకోవాలనే ఆలోచనతోనే ఈ పీడిత స్త్రీలు ప్రయత్నించాలని, ముందుకు సాగాలని, తమలాంటి స్త్రీలకు అండగా నిలబడాలనే ఉద్దేశాన్ని స్పష్టపరుస్తారు.
తెలుగులో వేశ్యా వత్తిపై చాలా సినిమాలు వచ్చాయి. వేశ్యల జీవితాలపై ఎందరో సాహిత్యకారులు రాసారు, దర్శకులు సినిమాలు తీసారు. కాని ఈ సమస్యను పరిష్కార దిశగా తీసుకెళ్ళే ప్రయత్నం చేసిన సినిమాలు అతి తక్కువ. ఒక పురుషుడు హీరోలా వచ్చి ఒక వేశ్యను వివాహం చేసుకోవడం లాంటి సినీ ముగింపులు చాలా చూసాం. కాని తమలోని మానసిక బలంతో తమ స్థితిని అర్థం చేసుకుని తామే స్వేచ్ఛ కోసం పోరాడాలని, ఆ దారి ఎంత కష్టమయినదో, అది చేర్చే గమ్యం ఇంకా కష్టమని, అయినా తమ శరీరాలను వ్యాపార వస్తువుగా మార్చే వత్తిని అవకాశం వచ్చినప్పుడు ఒదులు కోవాలని ఈ సినిమా సూచిస్తుంది. ఆ అవకాశం ఆకర్షణీయంగా ఉండక పోయినా తమలాంటి ఎందరో స్త్రీల జీవితాలను మార్చే క్రమంలో మొదటి అడుగు కాగలదనే విషయాన్ని చర్చకు పెట్టిన సినిమా ఇది. ఇందులో లక్ష్మీ అదే పని చేస్తుంది. తన శరీరాన్ని ఎవరికీ అమ్ముకోన్ని నిశ్చయించుకుంటుంది. ఆ వత్తిలోకి నెట్టబడినా ఇతరుల వలే, రాజీ పడకుండా అందులో నుండి బైట పడాలని శతవిధాలా ప్రయత్నిస్తుంది. దాని కోసం చాలా ప్రలోభాలపై విజయం సాధిస్తుంది. అందువలనే ఆమె తాను చేసే యుద్ధంలో విజయం సాధిస్తుంది. అపారమైన ధైర్యసాహసాలు చూపి ధీరగా నిలిచి పోతుంది. పరిస్థితులు ఎంత దిగజార్చినా ఆత్మబలంతో అందులో నుండి బైటపడాలని లక్ష్మి చివరిదాకా చేసిన ప్రయత్నం, ఆమెలాంటి ఎందరో స్త్రీలకు, బాలికలకు స్ఫూర్తిదాయకం. సినిమాలో లక్ష్మి పాత్రలో మోనాలీ ఠాకూర్‌ నటన ప్రశంసలు అందుకుంది. 2014లో వచ్చిన ఈ సినిమా ఎన్నో ఫిలిం ఫెస్టివల్స్‌లో దేశంలోనూ, విదేశాలలోనూ ప్రదర్శించబడి క్రీటీక్స్‌ మన్ననలను పొందింది.
- పి.జ్యోతి, 9885384740

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పిల్లలు 'వయస్సు' మీరుతున్నారా..?
ఏడు కాకతీయుల వేడుక
ప్రకృతి వైద్య నిధి వరంగల్‌ గ్రంథాలయం
గెలిపించేవాడు
'ప్రబొధ గీతాల' కొక్కొరోకో (సంకలనం)
ఆనాటి సమాజం మీద ఆత్మార్పణ వీరుల ప్రభావం
50 యేళ్ళ క్రితం నేనో పెద్ద తప్పు చేశాను
భువి స్వ‌ర్గం మేఘాల‌య‌
వితంతు వివాహాల మాటున స్త్రీలపై జరిగిన అన్యాయం ఎక్‌ చాదర్‌ మైలీ సీ
వస్తే - ఇస్తా
పోటీ పరీక్షలకు సమాయాత్తమవ్వడమెలా..?
దుంప‌ల‌తో గంపెడు లాభాలు
బాల్యం- సమస్యల వలయం
బేతి రెడ్డి గ్రంథాలయం-పిల్లలమర్రి
బుక్‌ ఫెయిర్‌ ఒక ఉద్వేగం...
అడవి తల్లి ఒడిలో ఉద్యమాల తల్లి మల్లు స్వరాజ్యం
అద్భుత ఊహాకాల్పనిక వైచిత్రి 'నీటినీడ' కథా సంపుటి
యల్లాప్రగడ సీతాకుమారి
మట్టిదిబ్బ కింద మహా దేవాలయం గొంగులూరు గుడి కథ
ఘనమైన చరిత్రకు సాక్ష్యం సంస్థాన్‌ నారాయణపురం
దూమపానం - నోటి క్యాన్సర్లు
స్మార్ట్‌ఫోన్‌లతో బాలలు దారి తప్పవద్దు
పెదకొండూరులో కాకతీయులనాటి మల్లు బాలమ్మ దాన శాసనం
జీవ వైవిధ్యం - మానవ మనుగడ
విద్యార్థి గేయకర్త సేనాపతి భాష్యకాచార్యులు
పేదల పెన్నిధి, పోరాట కవి కాళోజీ రామేశ్వరరావు
మరణాన్ని సైతం కవిత్వం చేస్తాన్నేను
పిల్లలను అలరించిన వేసవి శిబిరం
కూలుతున్న కుటుంబాలు
బొమ్మలరామారంలో కొత్తరాతిబొమ్మల తావు

తాజా వార్తలు

01:46 PM

తెలంగాణ వనరులను దోచుకోడానికి వచ్చారు: జీవన్ రెడ్డి

01:32 PM

టీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌

01:21 PM

ఆటా కన్వెన్షన్‌లో ఏపీ పెవిలియన్‌ ప్రారంభం

01:08 PM

జూలై 4న భీమవరానికి ప్రధాని మోడీ

12:59 PM

దేశంలో కొత్తగా 16,103 కరోనా కేసులు

12:53 PM

పారిస్‌ నుంచి ఏపీకి తిరిగొచ్చిన సీఎం జగన్‌

12:35 PM

దివ్యాంగులను ఆదుకోవాలి: పవన్ కళ్యాణ్

12:26 PM

ప్రధాని సభకు జీహెచ్ఎంసీ సహాయ నిరాకరణ

12:05 PM

భద్రాద్రి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

11:45 AM

జ‌న‌సేన జ‌న‌వాణి ప్రారంభం

11:37 AM

సాయంత్రం ఎంజీబీఎస్‌-జేబీఎస్‌ మధ్య మెట్రో రైళ్లు బంద్‌

11:33 AM

సంగారెడ్డిలో సాఫ్ట్‌వేర్‌ ఉ‍ద్యోగి దారుణ హత్య

11:21 AM

బీజేపీ ఫ్లెక్సీలపై బాదుడే బాదుడు...

11:09 AM

హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

11:02 AM

ఇండియన్ ఆఫ్ ద వ‌ర‌ల్డ్ అవార్డు అందుకున్న ఫ‌డ్న‌వీస్ స‌తీమ‌ణి

10:59 AM

సత్తుపల్లిలో భారీ వర్షం..నిలిచిన బొగ్గు ఉత్పత్తి

10:53 AM

కామారెడ్డిలో కత్తిపోట్ల కలకలం

10:51 AM

ఇంగ్లండ్​ బోర్డుపై దినేశ్​ కార్తీక్​ ఆగ్రహం

09:23 AM

ప్రధాని ప్రశంసలకు గర్వంగా ఉంది: మిథాలీరాజ్‌

09:16 AM

ప్రధాని మోడీ నేటి షెడ్యూల్ ఇదే...

09:09 AM

దుకాణంలో అర్ధరాత్రి వెరైటీ చోరీ..ఏరికోరి కావాల్సిన వస్తువులను..!

08:58 AM

ఖాజాబాగ్‌ డెకరేషన్ గోదాంలో అగ్నిప్రమాదం

08:48 AM

అల్లూరి సీతారామరాజు మనవలు, మునిమనవళ్లతో భేటీకానున్న మోడీ

08:16 AM

భాగ్యలక్ష్మి అ‍మ్మవారిని దర్శించుకున్న సీఎం యోగి

08:08 AM

ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో వైద్యారోగ్య శాఖ మంత్రి రక్తదానం

07:58 AM

నేడు హైదరాబాద్ మెట్రో సేవలు యథాతథం

07:46 AM

మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌

07:43 AM

తల్లికి క్యాన్సర్‌ అని తెలిసి కుమారుడి ఆత్మహత్య

07:37 AM

రోడ్డు ప్ర‌మాదంలో ఎస్ఐ మృతి

07:18 AM

భద్రాద్రిలో భారీగా గంజాయి పట్టివేత

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.