Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పెదకొండూరులో కాకతీయులనాటి మల్లు బాలమ్మ దాన శాసనం | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • May 21,2022

పెదకొండూరులో కాకతీయులనాటి మల్లు బాలమ్మ దాన శాసనం

కొత్తతెలంగాణ చరిత్రబందం సభ్యులు వేముగంటి మురళీకష్ణ, డా.మండల స్వామి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని పెదకొండూరు వరదరాజస్వామి ఆలయం ప్రాంగణంలో కొత్త కాకతీయ శాసనాన్ని గుర్తించారు. ఈ శాసనం గుర్తించడంలో కొండూరు గ్రామసర్పంచ్‌ కాయితి రమేష్‌ గౌడ్‌, ఎంపిటీసి బద్దం కొండల్‌ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్‌ జక్కిడి కొండల్‌ రెడ్డి, వైస్‌ ఛైర్మన్‌ గుండెబోయిన ఇస్తారి యాదవ్‌, ఉపాధ్యాయుడు పాలకూర వెంకటేశ్‌ గౌడ్‌ సహకరించారు.
112 పంక్తులున్న ఈ శాసనలిపి, భాష తెలుగు. లిపి ఆధారంగా ఈ శాసనం 13,14వ శతాబ్దాలకు చెందింది. ఈ శాసనం (పేర్కొన్న శక సం. భాగం విరిగిపోయి వుంది) విరోధికత్‌ శ్రావణ శుద్ధ ద్వాదశి బుధవారం వేసినట్టు, ప్రతాపరుద్రుని పాలనాకాలం ఆధారంగా ఇండియన్‌ ఎఫిమెరిస్‌ ప్రకారం శాసనం 1311 జూలై 28 అని అర్థమవుతున్నది. కాకతీయ ప్రతాపరుద్రదేవుని పాలనా కాలంలో అతని లెంక మాదయ (భార్య) మల్లు బాలమ్మ పెదకొండూరులో వరద రాజస్వామి తిరుప్రతిష్ట చేసి, చేసిన దాన వివరాలు ఈ శాసనంలో పేర్కొన బడ్డాయి. మల్లు బాలమ్మ, మాదయ లెంక లు పెదకొండూరు వరదరాజ స్వామి అంగరంగభోగాలకు, అముడుపడి (ఆహార నైవేద్యం)కి ధారాపూర్వకంగా కొండూరి చెరువు దగ్గర ఇరుకార్తెలు పండే జలచేను (నీర్నేల, తరిభూమి)ను, క్రయలబ్ధం చేసిన(కొన్న) భూములను, ఇంతవరకు సర్వమాన్యంగా పెక్కండ్రు (వస్తుమార్పిడ వ్యాపారసంస్థ) ఇచ్చిన ఆదాయం, 20 పొంకలు (పొనికెలు, ఎడ్లబండ్లల్లో వేసే గూడు వంటిది) పత్తి కొన్న వారు మాడలెక్కన, తమలపాకుల మోపు కొన్నవారు, ధాన్యాల అమ్మకం చేసినవారు మాడ, మానెడు ధాన్యం, అష్టాదశప్రజలు, మహాజనాలు గుడిలో రంగభోగానికి తమ వ్రిత్తుల(పారంపర్య దాన మాన్యాలు) నుంచి 1 మర్తురు(ఒకటిన్నర ఎకరం) తరిపొలము, చిన్నము (చిన్నబంగారు నాణెం), మెట్టపొలమున్న వారు 1పుట్టి ధాన్యం, చిన్నము నాణెం, పెరికలు, కోమట్లు, అద్దుగులు, సానెవారు, కరణాలు, తలారులు, బంట్లు మాడలు ఇవ్వాలని శాసనంలో ఉంది.
ఈ శాసనం కాకతీయుల నాటి సామాజిక, ఆర్థిక సంస్థలను వివరించింది. గ్రామం గుడి నిర్మాణం చేసినపుడు ఊరుమ్మడిగా తమ ఆదాయాల నుంచి దేవాలయ నిర్వహణకు తమ వంతుగా ఇవ్వాల్సిన పన్నులను పేర్కొన్నది శాసనం. ఈ శాసనంలో కాకతీయపాలకులు రుద్రదేవుడు, అతని తమ్ముడు మహదేవుడు, తనకూతురు రుద్రమదేవి, ఆమె కూతురు కొడుకు ప్రతాపరుద్రుని వరకు పేర్కొన్నప్పటికి వంశనామం 'కాకతీయ' పేర్కొనలేదు. ఇది మా చరిత్ర బందానికి కొత్తగా లభించిన కొత్త కాకతీయ శాసనం.
పెదకొండూరులో శాసనాలున్న రెండు వీరగల్లులు, రెండు ఆత్మాహుతి వీరగల్లులు, ఒక సతిశిల వీరగల్లులను సభ్యులు గుర్తించారు. పెదకొండూరులోని వరదరాజస్వామి దేవాలయం ఏక కూటాలయం. గర్భగుడి, అంతరాళం, అర్థమంటపం, ముఖ మంటపాలతో, ఇటుకలతో కట్టిన విమానంతో ఉండేది. ఆ గుడి పునఃనిర్మాణం కొరకు విప్పిపెట్టారు. అక్కడి ప్రాచీన శివాలయంలో కాకతీయశైలి లింగవేది, శివలింగం ఉన్నాయి. ద్వారబంధాలకు రెండువైపుల కలశాలున్నాయి. గుడి ద్వారానికి లలాటబింబంగా మూలాధారబంధనాసనంతో గజలక్ష్మి శిల్పం ఉంది. చాళుక్యశైలిలో ఒక సప్తమాతకాఫలకం ఆ ప్రాంగణంలో ఉంది. చాళుక్యపూర్వశైలిలో చెక్కిన మహిషాసురమర్దిని శిల్పం ప్రత్యేకమైనది.
సభ్యులు పెదకొండూరు పాటిగడ్డమీద సాతవాహనుల కాలం నాటి ఎరుపుపూత కుండపెంకులు సేకరించారు. లభించిన పురా వస్తు, శిల్ప, దేవాలయాల ఆధారంగా పెదకొండూరు సాతవాహనుల నుంచి కాకతీయులదాక చారిత్రకంగా విలసిల్లిన గ్రామమనిపిస్తుంది.
క్షేత్రపరిశోధన, శాసనప్రతి సేకరణ :
వేముగంటి మురళీకష్ణ-9676598465,
మండల స్వామి-9182365250,
కొత్తతెలంగాణ చరిత్రబందం
శాసన పరిష్కరణ, చరిత్రరచన :
శ్రీరామోజు హరగోపాల్‌, 9949498698,
కన్వీనర్‌, కొత్తతెలంగాణ చరిత్రబృందం

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పిల్లలు 'వయస్సు' మీరుతున్నారా..?
ఏడు కాకతీయుల వేడుక
ప్రకృతి వైద్య నిధి వరంగల్‌ గ్రంథాలయం
గెలిపించేవాడు
'ప్రబొధ గీతాల' కొక్కొరోకో (సంకలనం)
ఆనాటి సమాజం మీద ఆత్మార్పణ వీరుల ప్రభావం
50 యేళ్ళ క్రితం నేనో పెద్ద తప్పు చేశాను
భువి స్వ‌ర్గం మేఘాల‌య‌
వితంతు వివాహాల మాటున స్త్రీలపై జరిగిన అన్యాయం ఎక్‌ చాదర్‌ మైలీ సీ
వస్తే - ఇస్తా
పోటీ పరీక్షలకు సమాయాత్తమవ్వడమెలా..?
దుంప‌ల‌తో గంపెడు లాభాలు
బాల్యం- సమస్యల వలయం
బేతి రెడ్డి గ్రంథాలయం-పిల్లలమర్రి
బుక్‌ ఫెయిర్‌ ఒక ఉద్వేగం...
అడవి తల్లి ఒడిలో ఉద్యమాల తల్లి మల్లు స్వరాజ్యం
అద్భుత ఊహాకాల్పనిక వైచిత్రి 'నీటినీడ' కథా సంపుటి
యల్లాప్రగడ సీతాకుమారి
మట్టిదిబ్బ కింద మహా దేవాలయం గొంగులూరు గుడి కథ
ఘనమైన చరిత్రకు సాక్ష్యం సంస్థాన్‌ నారాయణపురం
దూమపానం - నోటి క్యాన్సర్లు
స్మార్ట్‌ఫోన్‌లతో బాలలు దారి తప్పవద్దు
జీవ వైవిధ్యం - మానవ మనుగడ
తన శరీరాన్ని వ్యాపార సరుకుగా మార్చిన సమాజంపై న్యాయపోరాటం చేసిన 'లక్ష్మి'
విద్యార్థి గేయకర్త సేనాపతి భాష్యకాచార్యులు
పేదల పెన్నిధి, పోరాట కవి కాళోజీ రామేశ్వరరావు
మరణాన్ని సైతం కవిత్వం చేస్తాన్నేను
పిల్లలను అలరించిన వేసవి శిబిరం
కూలుతున్న కుటుంబాలు
బొమ్మలరామారంలో కొత్తరాతిబొమ్మల తావు

తాజా వార్తలు

02:32 PM

ఫోటోలు మార్ఫింగ్ చేసి బాలిక‌కు వేధింపులు..!

02:23 PM

ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకున్న గ్రామస్తులు

02:14 PM

బీజేపీ సమావేశాల్లో కలకలం..!

02:08 PM

బీజేపీ రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన అమిత్ షా

01:46 PM

తెలంగాణ వనరులను దోచుకోడానికి వచ్చారు: జీవన్ రెడ్డి

01:32 PM

టీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌

01:21 PM

ఆటా కన్వెన్షన్‌లో ఏపీ పెవిలియన్‌ ప్రారంభం

01:08 PM

జూలై 4న భీమవరానికి ప్రధాని మోడీ

12:59 PM

దేశంలో కొత్తగా 16,103 కరోనా కేసులు

12:53 PM

పారిస్‌ నుంచి ఏపీకి తిరిగొచ్చిన సీఎం జగన్‌

12:35 PM

దివ్యాంగులను ఆదుకోవాలి: పవన్ కళ్యాణ్

12:26 PM

ప్రధాని సభకు జీహెచ్ఎంసీ సహాయ నిరాకరణ

12:05 PM

భద్రాద్రి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

11:45 AM

జ‌న‌సేన జ‌న‌వాణి ప్రారంభం

11:37 AM

సాయంత్రం ఎంజీబీఎస్‌-జేబీఎస్‌ మధ్య మెట్రో రైళ్లు బంద్‌

11:33 AM

సంగారెడ్డిలో సాఫ్ట్‌వేర్‌ ఉ‍ద్యోగి దారుణ హత్య

11:21 AM

బీజేపీ ఫ్లెక్సీలపై బాదుడే బాదుడు...

11:09 AM

హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

11:02 AM

ఇండియన్ ఆఫ్ ద వ‌ర‌ల్డ్ అవార్డు అందుకున్న ఫ‌డ్న‌వీస్ స‌తీమ‌ణి

10:59 AM

సత్తుపల్లిలో భారీ వర్షం..నిలిచిన బొగ్గు ఉత్పత్తి

10:53 AM

కామారెడ్డిలో కత్తిపోట్ల కలకలం

10:51 AM

ఇంగ్లండ్​ బోర్డుపై దినేశ్​ కార్తీక్​ ఆగ్రహం

09:23 AM

ప్రధాని ప్రశంసలకు గర్వంగా ఉంది: మిథాలీరాజ్‌

09:16 AM

ప్రధాని మోడీ నేటి షెడ్యూల్ ఇదే...

09:09 AM

దుకాణంలో అర్ధరాత్రి వెరైటీ చోరీ..ఏరికోరి కావాల్సిన వస్తువులను..!

08:58 AM

ఖాజాబాగ్‌ డెకరేషన్ గోదాంలో అగ్నిప్రమాదం

08:48 AM

అల్లూరి సీతారామరాజు మనవలు, మునిమనవళ్లతో భేటీకానున్న మోడీ

08:16 AM

భాగ్యలక్ష్మి అ‍మ్మవారిని దర్శించుకున్న సీఎం యోగి

08:08 AM

ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో వైద్యారోగ్య శాఖ మంత్రి రక్తదానం

07:58 AM

నేడు హైదరాబాద్ మెట్రో సేవలు యథాతథం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.