Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రసపట్టులో..! | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Nov 29,2021

రసపట్టులో..!

- కాన్పూర్‌లో ఇరు జట్లను ఊరిస్తోన్న విజయం
- న్యూజిలాండ్‌ లక్ష్యం 284, ప్రస్తుతం 4/1
- అయ్యర్‌, సాహా బాధ్యతాయుత అర్థ సెంచరీలు
- భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 234/7 డిక్లేర్డ్‌
కాన్పూర్‌ టెస్టు రసకందాయంలో పడింది. భారత్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 51/5తో ఇరకాటంలో పడేసి మ్యాచ్‌పై న్యూజిలాండ్‌ పట్టు బిగించినా.. మిడిల్‌ ఆర్డర్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ (65), లోయర్‌ ఆర్డర్‌లో వృద్దిమాన్‌ సాహా (61 నాటౌట్‌) అర్థ సెంచరీలతో భారత్‌ను తిరుగులేని స్థానంలో నిలబెట్టారు. అయ్యర్‌, సాహా మెరుపులతో 283 పరుగుల ఆధిక్యంలో నిలిచిన టీమ్‌ ఇండియా.. చివరి సెషన్లో ఛేదనకు ఆహ్వానించింది. నేడు 90 ఓవర్ల ఆటలో భారత్‌ విజయానికి 9 వికెట్లు అవసరం కాగా.. న్యూజిలాండ్‌కు 280 పరుగులు కావాలి. అశ్విన్‌, అక్షర్‌, జడేజా త్రయాన్ని ఎదుర్కొని కివీస్‌ ఏ మేరకు నిలబడుతుందో చూడాలి.
నవతెలంగాణ-కాన్పూర్‌
గ్రీన్‌పార్క్‌లో ఘన విజయానికి టీమ్‌ ఇండియా రంగం సిద్ధం చేసుకుంది. న్యూజిలాండ్‌కు 284 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన రహానెసేన.. అప్పుడే గెలుపు దిశగా ఓ అడుగు ముందుకేసింది. నాల్గో రోజు చివరి సెషన్లో 4 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 4/1తో కొనసాగుతోంది. ఓపెనర్‌ విల్‌ యంగ్‌ (2)ను అశ్విన్‌ సాగనంపాడు. టామ్‌ లాథమ్‌ (2 నాటౌట్‌), నైట్‌ వాచ్‌మన్‌ సోమర్‌విలె (0 నాటౌట్‌) అజేయంగా ఆడుతున్నారు. అంతకముందు టీమ్‌ ఇండియాను రెండో ఇన్నింగ్స్‌లో కష్టాల కడలి నుంచి శ్రేయస్‌ అయ్యర్‌ (65, 125 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌), వృద్దిమాన్‌ సాహా (61 నాటౌట్‌, 126 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ సెంచరీలతో ఆదుకున్నారు. అశ్విన్‌ (32), అక్షర్‌ పటేల్‌ (28 నాటౌట్‌) కీలక భాగస్వామ్యాల్లో పాలు పంచుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌ను భారత్‌ 234/7 పరుగుల వద్ద డిక్లరేషన్‌ ప్రకటించింది. తొలి ఇన్నింగ్స్‌లో 49 పరుగుల ఆధిక్యంతో కలుపుకుని భారత్‌ 283 పరుగుల ముందంజలో నిలిచింది. న్యూజిలాండ్‌కు 284 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్‌, న్యూజిలాండ్‌ తొలి టెస్టులో నేడు చివరి రోజు ఆట.
కుప్పకూలిన టాప్‌ ఆర్డర్‌ : భారత్‌ 84/5
ఓవర్‌నైట్‌ స్కోరు 14/1తో నాల్గో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన టీమ్‌ ఇండియాకు టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు నిరాశే మిగిల్చారు. మయాంక్‌ అగర్వాల్‌ (17, 53 బంతుల్లో 3 ఫోర్లు), చతేశ్వర్‌ పుజారా (22, 33 బంతుల్లో 3 ఫోర్లు) ఆరంభంలో ఆశలు రేకెత్తించారు. ఈ జోడీ క్రీజులో ఉండగా భారత్‌ మంచి స్కోరుపై కన్నేసింది. పుజారాను జెమీసన్‌, అగర్వాల్‌ను సౌథీలు సాగనంపటంతో టాప్‌ ఆర్డర్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. కెప్టెన్‌ అజింక్య రహానె (4), ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (0) చేతులెత్తేశారు. టిమ్‌ సౌథీ ఇన్నింగ్స్‌ 20వ ఓవర్లో వరుసగా మయాంక్‌ అగర్వాల్‌, రవీంద్ర జడేజా వికెట్లతో భారత్‌ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 49 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 51 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. 51/5తో భారత్‌ ఆధిక్యం 150-160 పరుగులకే పరిమితం అయ్యేలా కనిపించింది. న్యూజిలాండ్‌ పేసర్లు మరోసారి ఆ జట్టుకు తిరుగులేని బ్రేక్‌ అందించారు. తొలి సెషన్లో మరో వికెట్‌ పడకుండా అరంగేట్ర శ్రేయస్‌ అయ్యర్‌, అశ్విన్‌లు జాగ్రత్త వహించారు. ఉదయం సెషన్లో నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్‌ 70 పరుగులు జోడించింది.
ఆదుకున్న అయ్యర్‌ : భారత్‌ 167/7
టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లను కోల్పోయిన భారత్‌ తీవ్ర ఒత్తిడిలో కూరుకుంది. న్యూజిలాండ్‌ రెట్టించిన ఉత్సాహంతో లంచ్‌ విరామం అనంతరం జోరు పెంచింది. ఈ పరిస్థితుల్లో తొలి ఇన్నింగ్స్‌ శతక హీరో, అరంగేట్ర ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ (65) జట్టును ఆదుకున్నాడు. టెయిలెండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (32, 62 బంతుల్లో 5 ఫోర్లు)తో కలిసి అయ్యర్‌ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఓ ఎండ్‌లో అశ్విన్‌ సైతం పూర్తి స్థాయి బ్యాటర్‌ను తలపించే ఇన్నింగ్స్‌ను నమోదు చేశాడు. అశ్విన్‌, అయ్యర్‌లు ఆరో వికెట్‌కు 52 పరుగులు జోడించారు. జెమీసన్‌ మరోసారి బ్రేక్‌ సాధించి అశ్విన్‌ను వెనక్కి పంపించాడు. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ వృద్దిమాన్‌ సాహాతో కలిసి అయ్యర్‌ పోరాటం కొనసాగించాడు. ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 109 బంతుల్లో అయ్యర్‌ అర్థ సెంచరీ నమోదు చేశాడు. టీ విరామానికి ఆఖరు ఓవర్లో శ్రేయస్‌ అయ్యర్‌ నిష్క్రమించాడు. దీంతో భారత్‌ రెండో సెషన్‌ ముగిసే సమయానికి 167/7తో నిలిచింది. లంచ్‌ అనంతరం రెండు వికెట్లే కోల్పోయిన భారత్‌ 83 పరుగులు సాధించింది.
మెరిసిన సాహా : భారత్‌ 234/7 డిక్లేర్డ్‌
ప్రతికూల పరిస్థితుల్లో ఎదురీదిన టీమ్‌ ఇండియా రెండో సెషన్‌ ముగిసే సరికే మంచి స్థితికి చేరుకుంది. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ వృద్దిమాన్‌ సాహా (61 నాటౌట్‌) అర్థ సెంచరీతో భారత్‌ ఆధిక్యాన్ని మరింత పెంచాడు. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ (28 నాటౌట్‌)తో కలిసి అభేద్యమైన ఎనిమిదో వికెట్‌కు 67 పరుగులు జోడించాడు. మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో వృద్దిమాన్‌ సాహా 115 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. అక్షర్‌ పటేల్‌ సైతం రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో కదం తొక్కాడు. మూడో సెషన్లో భారత బ్యాటింగ్‌ వ్యూహం విమర్శలకు దారితీసింది. మ్యాచ్‌లో చివరి రోజే మిగిలి ఉన్న నేపథ్యంలో టెయిలెండర్లు ధనాధన్‌ పరుగులపై దృష్టి నిలపకుండా, సావధానంగా ఆడటం ఆశ్చర్యానికి గురి చేసింది. పిచ్‌ నుంచి బౌలర్లకు సహకారం లభించకపోవటంతో భారత్‌ ఈ వ్యూహం అనుసరించినట్టు తెలిసింది. సెషన్‌ చివర్లో భారత్‌ ఇన్నింగ్స్‌ను 234/7 వద్ద డిక్లరేషన్‌ ప్రకటించింది. 94 ఓవర్ల ఆట మిగిలి ఉన్న టెస్టులో న్యూజిలాండ్‌కు 284 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
మాయ మొదలైంది : 284 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు నాల్గో రోజే గట్టి షాక్‌ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ విల్‌ యంగ్‌ (2)ను వికెట్ల ముందు ట్రాప్‌ చేశాడు. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లోనే కివీస్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. మరో ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌ (2 నాటౌట్‌), నైట్‌వాచ్‌మన్‌ విలియం సోమర్‌విలె (0 నాటౌట్‌) క్రీజులో కొనసాగుతున్నారు. చివరి రోజు ఆటలో న్యూజిలాండ్‌ విజయానికి మరో 280 పరుగులు అవసరం. ఇదే సమయంలో భారత్‌ విజయానికి మరో 9 వికెట్ల దూరంలో నిలిచింది. చివరి రోజు పిచ్‌ స్పిన్‌కు గొప్పగా సహకరించే అవకాశాలు ఉన్నాయి. తొలి నాలుగు రోజులు పిచ్‌ అంచనాలకు భిన్నంగా స్పందించినా.. చివరి రోజు ఆటలో స్పిన్‌కు అనుకూలించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. 9 వికెట్లు కాచుకుని అవసరైమైతే విజయం దిశగా సాగేందుకు దీటైన బ్యాటర్లు న్యూజిలాండ్‌కు అందుబాటులో ఉన్నప్పటికీ.. భారత్‌ నేడు ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది.
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 345/10
న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ : 296/10
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : మయాంక్‌ (సి) లాథమ్‌ (బి) సౌథీ 17, గిల్‌ (బి) జెమీసన్‌ 1, పుజారా (సి) బ్లండెల్‌ (బి) జెమీసన్‌ 22, రహానె (ఎల్బీ) అజాజ్‌ 4, అయ్యర్‌ (సి) బ్లండెల్‌ (బి) సౌథీ 65, జడేజా (ఎల్బీ) సౌథీ 0, అశ్విన్‌ (బి) జెమీసన్‌ 32, సాహా నాటౌట్‌ 61, అక్షర్‌ నాటౌట్‌ 28, ఎక్స్‌ట్రాలు : 4, మొత్తం :(81 ఓవర్లలో 7 వికెట్లకు) 234 డిక్లేర్డ్‌.
వికెట్ల పతనం : 1-2, 2-32, 3-41, 4-51, 5-51, 6-103, 7-167.
బౌలింగ్‌ : సౌథీ 22-2-75-3, జెమీసన్‌ 17-6-40-3, అజాజ్‌ 17-3-60-1, రచిన్‌ 9-3-17-0, సోమర్‌విలె 16-2-38-0.
న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ : లాథమ్‌ నాటౌట్‌ 2, యంగ్‌ (ఎల్బీ) అశ్విన్‌ 2, సోమర్‌విలె నాటౌట్‌ 0, ఎక్స్‌ట్రాలు : 0, మొత్తం :(4 ఓవర్లలో ఒక వికెట్‌) 4.
వికెట్ల పతనం : 1-3.
బౌలింగ్‌ : అశ్విన్‌ 2-0-3-1, అక్షర్‌ 2-1-1-0.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

16ఏండ్ల ప్రజ్ఞానంద మరో సంచలనం
బెంగళూరుదే గెలుపు
ఐఓఏ అధ్యక్ష పదవికి బత్రా రాజీనామా
మూడోరౌండ్‌కు జకో
మరిన్ని అపూర్వ విజయాలు సాధించాలి..
గెలిచి.. నిలిచేదెవరో?
ఆ నిర్ణయం రాహుల్‌ ద్రవిడ్‌దే!
రాష్ట్రస్థాయి ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌
సెమీఫైనల్లో ప్రజ్ఞానంద
ఆసీస్‌ సహాయ కోచ్‌గా వెటోరీ
ఫైనల్లో టైటాన్స్‌
క్రజికోవాకు షాక్‌
భారత్‌ 1-1 పాకిస్థాన్‌
తొలి అడుగు పడేదెవరిదో?
ఉమ్రాన్‌కు పిలుపు
అభిషేక్‌ ఒక్కడే!
పుజారా వచ్చేశాడు
ఢిల్లీ ఆశలపై నీళ్లు చల్లిన టిమ్‌
సెమీస్‌లో సింధు ఓటమి
ప్రజ్ఞానంద సంచలనం
భగత్‌, ఢిల్లాన్‌కు బంగారు పతకాలు
అశ్విన్‌ అదరగొట్టాడు
ఒలింపిక్‌ స్వర్ణమే లక్ష్యం!
మహిమ ముగియలేదు!
సెమీస్‌లో సింధు
నిఖత్‌ చారిత్రక పంచ్‌
క్వార్టర్స్‌లో సింధు
కదం తొక్కిన కోహ్లి
ఆర్చర్‌కు మరో గాయం
సిద్దూకి ఏడాది జైలు

తాజా వార్తలు

08:54 PM

తెలంగాణలో కొత్తగా 49 కరోనా కేసులు

08:50 PM

ఏపీ అసెంబ్లీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల

08:44 PM

హైద‌రాబాద్‌కు రూ. 500 కోట్ల భారీ పెట్టుబడి

08:37 PM

జూన్ 5న బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష

08:28 PM

జీహెచ్ఎంసీ ప‌రిధిలో వాహ‌నాల వేగ ప‌రిమితి పెంపు

08:22 PM

టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న లక్నో

08:18 PM

హైద‌రాబాద్‌లో మ‌రో సైబ‌ర్ క్రైమ్..!

08:05 PM

టాయిలెట్‌లో కూర్చొని వీడియోగేమ్‌ ఆడుతుండగా పాము కాటు..!

07:52 PM

ఇసుక దిబ్బ కూలి ఇద్దరు కూలీలు మృతి

07:46 PM

ఎమ్మెల్సీ అనంత బాబును సస్పెండ్ చేసిన వైసీపీ

07:36 PM

అనుమతి లేకుండా రాహుల్ గాంధీ లండన్ వెళ్లారు : కేంద్రం

07:23 PM

డ్ర‌గ్స్ కేసులో మాజీ ఎంపీ కుమారుడు అరెస్టు

07:19 PM

లాడ్జీ‌లో పిల్ల‌ల‌తో స‌హా నిద్ర‌మాత్ర‌లు మింగిన దంప‌తులు..!

07:07 PM

రేపు బెంగ‌ళూరుకు సీఎం కేసీఆర్

07:01 PM

కోనసీమ జిల్లాలో ఎస్పీ కారుపై రాళ్ల దాడి

06:53 PM

మహిళపై ఆరుగురు వలస కూలీల లైంగికదాడి, హత్య..!

06:31 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

06:25 PM

యాసిన్ మాలిక్‌కు యావజ్జీవ శిక్ష

06:19 PM

ఇంట్లో దొంగతనం చేసి 'ఐ లవ్ యూ`అని రాసిన దొంగలు..!

06:03 PM

తపాలా శాఖలో ఏజెంట్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

05:43 PM

ఏసీబీకి రెడ్ హ్యాండ‌డ్‌గా దొరికిన శంషాబాద్‌ అటవీ అధికారి

05:36 PM

గనిలో వజ్రం కనుగొన్న మహిళ..!

05:29 PM

ఎస్పీజీ ఆధీనంలో బేగంపేట విమానాశ్రయం..

05:20 PM

నాగచైతన్య 'థ్యాంక్యూ`టీజ‌ర్ విడుదల

05:15 PM

తెలంగాణకు మరో పెట్టుబడి

05:11 PM

మాదాపూర్‌ ఓయో రూంలో వ్యభిచారం..!

05:01 PM

అల్లర్లకు పాల్పడిన 46 మంది అరెస్టు : ఏపీ హోం మంత్రి వనిత

04:53 PM

నష్టాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:44 PM

పాఠశాల గొడలు, మెట్లపై 'సారీ..సారీ..` అని రాతలు..!

04:33 PM

విషాదం.. చిరుతను సజీవదహనం చేసిన గ్రామస్తులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.