Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
విరాట్‌ ఒక్కడే..! | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Jan 12,2022

విరాట్‌ ఒక్కడే..!

- అర్థ సెంచరీతో ఆదుకున్న కోహ్లి
- భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 223/10
- నాలుగు వికెట్లతో మెరిసిన రబాడ
- దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ 17/1
   చారిత్రక సందర్భం. మేఘావృత వాతావరణం. బ్యాటింగ్‌కు కఠిన పరిస్థితులు!. భారత్‌, దక్షిణాఫ్రికా న్యూలాండ్స్‌ టెస్టు తొలి రోజు సన్నివేశమిది. సంయమనం, ఏకాగ్రత, డిఫెన్స్‌తో కూడిన బ్యాటింగ్‌ ప్రదర్శనతో విరాట్‌ కోహ్లి ఆకట్టుకోగా.. పదునైన పేస్‌తో, కండ్లుచెదిరే స్పెల్స్‌తో కగిసో రబాడ అభిమానుల మనసు దోచుకున్నాడు. కేప్‌టౌన్‌ టెస్టు తొలి రోజు భారత్‌ తరఫున విరాట్‌ కోహ్లి వన్‌మ్యాన్‌ షో చేయగా.. దక్షిణాఫ్రికా శిబిరంలో ఆ పని పేసర్‌ కగిసో రబాడ చేశాడు. విరాట్‌ కోహ్లి (79) అర్థ సెంచరీతో రాణించిన కగిసో రబాడ (4/73) విజృంభణతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులకే కుప్పకూలింది.
నవతెలంగాణ-కేప్‌టౌన్‌
కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (79, 201 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌) బాధ్యతాయుత అర్థ సెంచరీతో కదం తొక్కాడు. గాయంతో రెండో టెస్టుకు దూరమైన విరాట్‌ కోహ్లి కేప్‌టౌన్‌ టెస్టులో సత్తా చాటాడు. బ్యాటింగ్‌కు అనువైన పరిస్థితులు లేకపోయినా సఫారీ పేస్‌ ప్రతాపాన్ని ఎదురించి నిలిచాడు. విరాట్‌ కోహ్లి కెరీర్‌లో అత్యంత సంయమనంతో కూడిన ఇన్నింగ్స్‌ కేప్‌టౌన్‌ అర్థ సెంచరీని భావించవచ్చు. విరాట్‌ కోహ్లికి తోడుగా చతేశ్వర్‌ పుజారా (43, 77 బంతుల్లో 7 ఫోర్లు) సైతం రాణించటంతో తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగుల గౌరవప్రద స్కోరు సాధించింది. అజింక్య రహానె (9), కెఎల్‌ రాహుల్‌ (12), మయాంక్‌ అగర్వాల్‌ (15) నిరాశపరిచారు. పేసర్లు కగిసో రబాడ (4/73), మార్కో జాన్సెన్‌ (3/55) భారత పతనాన్ని శాసించారు. భారత స్టార్‌ పేసర్‌ జశ్‌ప్రీత్‌ బుమ్రా దెబ్బకు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో కీలక కెప్టెన్‌ వికెట్‌ను కోల్పోయింది. డీన్‌ ఎల్గార్‌ (3) పెవిలియన్‌కు చేరగా దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 17/1తో కొనసాగుతోంది. ఎడెన్‌ మార్కరం (8 నాటౌట్‌, 20 బంతుల్లో 1 ఫోర్‌)కు తోడుగా నైట్‌వాచ్‌మన్‌ కేశవ్‌ మహరాజ్‌ (6 నాటౌట్‌, 12 బంతుల్లో 1 ఫోర్‌) అజేయంగా క్రీజులో ఉన్నాడు. భారత తొలి ఇన్నింగ్స్‌కు దక్షిణాఫ్రికా 206 పరుగుల వెనుకంజలో నిలిచింది.
వీరోచిత విరాట్‌ : కేప్‌టౌన్‌లో టాస్‌ నెగ్గిన టీమ్‌ ఇండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. న్యూలాండ్స్‌ కొత్త పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. దీంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించటం లాంఛనమే అనిపించింది. కానీ మేఘావృత వాతావరణం, పిచ్‌ స్వభావంపై సఫారీ పేసర్ల మెరుగైన అవగాహనతో కోహ్లిసేనకు భంగపాటు తప్పలేదు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు ఇద్దరూ ఆరంభంలో వికెట్‌ చేజార్చుకున్నారు. కెఎల్‌ రాహుల్‌ (12, 35 బంతుల్లో 1 ఫోర్‌) మరోసారి యువ పేసర్‌ ఒలీవర్‌ చేతికి చిక్కాడు. రాహుల్‌ ఫుట్‌వర్క్‌, కదలికలపై కన్నేసి బంతులు సంధిస్తున్న ఒలీవర్‌ మానసికంగా పైచేయి సాధించినట్టే ఉన్నాడు!. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (15, 35 బంతుల్లో 3 ఫోర్లు) కగిసో రబాడకు వికెట్‌ కోల్పోయాడు. 33 పరుగులకే ఓపెనర్లను కోల్పోయిన భారత్‌ ఒత్తిడిలో పడింది.
   ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (79) అద్భుతంగా రాణించాడు. చతేశ్వర్‌ పుజారా (43)తో కలిసి నిర్మాణాత్మక భాగస్వామ్యం నమోదు చేశాడు. పుజారా, విరాట్‌ క్రీజులో ఉండగా భారత్‌ ఇన్నింగ్స్‌ చక్కబడినట్టే కనిపించింది. పుజారా దూకుడు కొనసాగించాడు. 7 ఫోర్లతో 77 బంతుల్లోనే 43 పరుగులు సాధించాడు. జాన్సెన్‌ ఓవర్లో అవుట్‌సైడ్‌ ఎడ్జ్‌తో వికెట్ల వెనకాల దొరికిపోయాడు. దీంతో విలువైన భాగస్వామ్యానికి తెరపడింది. పుజారా నిష్క్రమణ అనంతరం మరో బ్యాటర్‌ నుంచి విరాట్‌ కోహ్లికి సహకారం లభించలేదు. సహజంగా దూకుడుగా ఆడే విరాట్‌ కోహ్లి పరుగుల వేటలో బౌలర్లపై ఎదురుదాడి చేస్తాడు. కానీ కేప్‌టౌన్‌లో కొత్త కోహ్లి కనిపించాడు. 201 బంతులు ఎదుర్కొన్న విరాట్‌ కోహ్లి 39.30 స్ట్రయిక్‌రేట్‌తో 79 పరుగులు చేశాడు. ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 158 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన విరాట్‌ కోహ్లి శతక నిరీక్షణకు ముగింపు పలికే దిశగా సాగాడు. తొలి సెషన్లో రెండు వికెట్లు కోల్పోయిన భారత్‌.. లంచ్‌ విరామం అనంతరం సెషన్లో సైతం రెండు వికెట్లు కోల్పోయింది. అజింక్య రహానె (9)ను అద్భుత బంతితో కగిసో రబాడ వెనక్కి పంపించాడు. టీ విరామ సమయానికి భారత్‌ 141/4 వద్ద నిలిచింది.
   చివరి సెషన్లో భారత్‌ వేగంగా వికెట్లు కోల్పోయింది. రిషబ్‌ పంత్‌ (27, 50 బంతుల్లో 4 ఫోర్లు) వైఫల్య ప్రస్థానం కేప్‌టౌన్‌లోనూ కొనసాగింది. టెయిలెండర్లు అశ్విన్‌ (2), శార్దుల్‌ ఠాకూర్‌ (12), జశ్‌ప్రీత్‌ బుమ్రా (0), మహ్మద్‌ షమి (7)లు పెద్దగా ఆకట్టుకోలేదు. 17 ఓవర్లలోనే భారత్‌ చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. అత్యద్భుతంగా ఆడిన విరాట్‌ కోహ్లి (79) ఇన్నింగ్స్‌కు రబాడ ముగింపు పలకటంతో భారత్‌ పతనం లాంఛనమైంది. 77.3 ఓవర్లలో భారత్‌ 223 పరుగులకు కుప్పకూలింది. కెరీర్‌ 50వ టెస్టు ఆడుతున్న సఫారీ పేసర్‌ కగిసో రబాడ నాలుగు స్పెల్స్‌లో 22 ఓవర్లు వేసి భారత్‌ను వణికించాడు. రబాడ పేస్‌ ప్రతాపానికి భారత అభిమానులు సైతం ఫిదా అయిపోయారనటం అతిశయోక్తి కాదు. ఒలీవర్‌, ఎంగిడి, మహరాజ్‌లు తలా ఓ వికెట్‌ ఖాతాలో వేసుకున్నారు.
స్కోరు వివరాలు :
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : కెఎల్‌ రాహుల్‌ (సి) వెరెన్నె (బి) ఒలీవర్‌ 12, మయాంక్‌ అగర్వాల్‌ (సి) మార్కరం (బి) రబాడ 15, చతేశ్వర్‌ పుజారా (సి) వెరెన్నె (బి) జాన్సెన్‌ 43, విరాట్‌ కోహ్లి (సి) వెరెన్నె (బి) రబాడ 79, అజింక్య రహానె (సి) వెరెన్నె (బి) రబాడ 9, రిషబ్‌ పంత్‌ (సి) పీటర్సన్‌ (బి) జాన్సెన్‌ 27, రవిచంద్రన్‌ అశ్విన్‌ (సి) వెరెన్నె (బి) జాన్సెన్‌ 2, శార్దుల్‌ ఠాకూర్‌ (సి) పీటర్సన్‌ (బి) మహరాజ్‌ 12, జశ్‌ప్రీత్‌ బుమ్రా (సి) ఎల్గార్‌ (బి) రబాడ 0, ఉమేశ్‌ యాదవ్‌ నాటౌట్‌ 4, మహ్మద్‌ షమి (సి) బవుమా (బి) ఎంగిడి 7, ఎక్స్‌ట్రాలు : 13, మొత్తం : (77.3 ఓవర్లలో ఆలౌట్‌) 223.
వికెట్ల పతనం : 1-31, 2-33, 3-95, 4-116, 5-167, 6-175, 7-205, 8-210, 9-211, 10-223.
బౌలింగ్‌ : కగిసో రబాడ 22-4-73-4, ఒలీవర్‌ 18-5-42-1, మార్కో జాన్సెన్‌ 18-6-55-3, లుంగిసాని ఎంగిడి 14.3-7-33-1, కేశవ్‌ మహరాజ్‌ 5-2-14-1.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ : డీన్‌ ఎల్గార్‌ (సి) పుజారా (బి) బుమ్రా 3, ఎడెన్‌ మార్కరం 8 నాటౌట్‌, కేశవ్‌ మహరాజ్‌ 6 నాటౌట్‌, ఎక్స్‌ట్రాలు : 0, మొత్తం : (8 ఓవర్లలో ఓ వికెట్‌) 17.
వికెట్ల పతనం : 1-10.
బౌలింగ్‌ : జశ్‌ప్రీత్‌ బుమ్రా 4-4-0-1, ఉమేశ్‌ యాదవ్‌ 2-0-10-0, మహ్మద్‌ షమి 2-0-7-0.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అమ్మాయిలకు పరీక్ష!
జడేజా సెంచరీ
పంత్‌ ప్రతాపం
హ్యాండ్‌బాల్‌కు కొత్త జోష్‌
ముగిసిన పోరాటం
అమ్మాయిలు అలవోకగా..
సిరీస్‌ చిక్కేనా?!
ఆసియా హ్యాండ్‌బాల్‌ విజేత అల్‌ కువైట్‌
క్వార్టర్స్‌లో ప్రణయ్‌, సింధు
కూర్పు కుదిరేదెలా?
సింధు ముందంజ
ఖోఖోకు బాలీవుడ్‌ గ్లామర్‌!
జకోవిచ్‌ జోరు
ఇగా స్వైటెక్‌ @ 36
ఓ శకం ముగిసే
దీపక్‌ ధనాధన్‌
ప్రణయ్‌ శుభారంభం
మయాంక్‌కు పిలుపు
సిరీస్‌ లాంఛనమేనా?
ఇంగ్లాండ్‌ ఊడ్చేసింది
కెప్టెన్సీకి మోర్గాన్‌ గుడ్‌బై?
శ్రీలంకకు ఊరట
రోహిత్‌కు కరోనా
చివరిదీ నెగ్గితే.. చరిత్రే!
రంజీ చాంప్‌ మధ్యప్రదేశ్‌
ముంబయి ఎదురీత
సిరీస్‌ చిక్కింది
భారత్‌కు ఎదురుందా?
ఉత్కంఠగా హ్యాండ్‌బాల్‌ పోటీలు
పంత్‌ ఫటాఫట్‌

తాజా వార్తలు

09:37 PM

భారత్, ఇంగ్లండ్ టెస్టుకు మళ్లీ అడ్డుతగిలిన వరుణుడు

09:15 PM

హైద‌రాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

09:08 PM

20 వ‌ర‌కు కాచిగూడ-పెద్దపల్లి మ‌ధ్య రైళ్లు రద్దు..

08:49 PM

బుమ్రా హిట్టింగ్‌తో యువీని గుర్తు చేసుకున్న స‌చిన్‌

08:23 PM

రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం..రేవంత్ ను తొలగించాలంటూ..

08:03 PM

ఆరు రోజులు ముందే విస్తరించిన రుతుపవనాలు

07:55 PM

తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

07:13 PM

రాజ్యాంగ ఉల్లంఘనకు మారు పేరు సీఎం కేసీఆర్ : స్మృతి ఇరానీ

07:06 PM

గ‌ర్వంగా ఉంది..కూతురు మాస్ట‌ర్స్ డిగ్రీపై జ‌గ‌న్ ట్వీట్‌

06:55 PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం

06:29 PM

20 రూపాయల టీకి రూ. 50 సర్వీస్ చార్జి..!

06:23 PM

షికాగోలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

06:18 PM

నుపుర్ శర్మకు లుక్అవుట్ నోటీసులు జారీ

05:58 PM

కొంగాల జలపాతం వద్ద విషాదం

05:42 PM

రాష్ట్రానికి ఏం చేసారని మోడీ సభ : సీపీఐ(ఎం)

05:36 PM

సీఎం కేసీఆర్‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

05:25 PM

ఆ మాటని ఉపసంహరించుకుంటున్నాను : కేటీఆర్

05:19 PM

ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు కంపెనీ ఆస్తుల‌ను జ‌ప్తు చేసిన ఈడీ

05:18 PM

కాంగ్రెస్ ఆరోపణలపై స్సందించిన బీజేపీ

05:16 PM

గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీకి క‌రోనా

05:04 PM

సరిహద్దు దాటిన బాలుడు.. పాక్ ఆర్మీకి అప్పగించిన భారత్

05:01 PM

బుమ్రా ప్రపంచ రికార్డు

04:52 PM

సీఎం స్వాగతం పలకాలని ప్రొటొకాల్‌లో ఎక్కడ లేదు : తలసాని

04:52 PM

రైల్లే పోలీసుల కస్టడీకి సికింద్రాబాద్ అల్లర్ల కేసు నిందితులు

04:43 PM

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..

04:37 PM

చిల్లర రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ : రేవంత్ రెడ్డి

04:30 PM

మోడీపై ప్రకాశ్‌ రాజ్‌ సెటైర్లు..

04:28 PM

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

04:12 PM

భారత్ తొలి ఇన్నింగ్స్ 416..జడేజా అద్భుత సెంచరీ..చివర్లో బూమ్రా విధ్వంసం

03:58 PM

నుపుర్‌ శర్మకు మద్దతుగా పోస్టు పెట్టాడని హత్య..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.