Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రిఫరీపై రెజ్లర్‌ దాడి | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • May 18,2022

రిఫరీపై రెజ్లర్‌ దాడి

- జాతీయ ట్రయల్స్‌లో అనూహ్య ఘటన
- సతీందర్‌ మాలిక్‌పై జీవితకాల నిషేధం
న్యూఢిల్లీ : కెడి జాదవ్‌ హాల్‌, ఇందిరాగాంధీ స్టేడియం. బర్మింగ్‌హామ్‌ కామన్‌వెల్త్‌ క్రీడలకు భారత మెన్స్‌ రెజ్లింగ్‌ జట్టుకు ట్రయల్స్‌. జాతీయ ట్రయల్స్‌లో మునుపెన్నడూ చోటుచేసుకోని విధంగా.. ఓ రెజ్లర్‌ రిఫరీపై పిడిగుద్దల వర్షం కురిపించాడు. భారత రెజ్లింగ్‌ సమాఖ్య నుంచి జీవితకాల నిషేధానికి గురయ్యాడు. భారత రెజ్లింగ్‌లో చోటుచేసుకున్న అనూహ్య ఘటన క్రీడా వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. సర్వీసెస్‌ రెజ్లర్‌ సతీందర్‌ మాలిక్‌ (ఎయిర్‌ఫోర్స్‌) 125 కేజీల విభాగంలో పోటీపడుతున్నాడు. బౌట్‌ మరో 18 సెకండ్లలో ముగియనుండగా సతీందర్‌ మాలిక్‌ 3-0తో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. ప్రత్యర్థి రెజ్లిర్‌ మోహిత్‌ ప్రభావశీల 'టేక్‌డౌన్‌' సహా సతీందర్‌ మాలిక్‌ను మ్యాట్‌ మీద నుంచి కిందకు నెట్టాడు. టేక్‌ డౌన్‌కు రెండు పాయింట్లు ఇవ్వని రిఫరీ వీరెందర్‌ మాలిక్‌.. పుష్‌ఔట్‌కు ఓ పాయింట్‌ను మాత్రమే కేటాయించాడు. దీంతో మోహిత్‌ ఆన్‌ మ్యాట్‌ రిఫరీ నిర్ణయాన్ని సవాల్‌ చేశాడు. జ్యూరి రిఫరీ సత్యదేవ్‌ మాలిక్‌ దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. సతీందర్‌ మాలిక్‌, సత్యదేవ్‌ మాలిక్‌లది ఒకే గ్రామం కావటంతో అతడు జ్యూరి నిర్ణయానికి దూరంగా ఉన్నాడు. మరో సీనియర్‌ రిఫరీ జగ్బిర్‌ సింగ్‌ను మోహిత్‌ సవాల్‌పై నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరాడు. టీవీ రిప్లేలు పరిశీలించిన జగ్బిర్‌ సింగ్‌.. మోహిత్‌కు మూడు పాయింట్లు ప్రకటించాడు. దీంతో స్కోరు 3-3తో సమమైంది. స్కోర్లు సమం కావటంతో బౌట్‌లో చివరి పాయింట్‌ సాధించిన రెజ్లిర్‌ మోహిత్‌ను విజేతగా ప్రకటించారు. పక్క మ్యాట్‌లో ఒలింపిక్‌ హీరో రవి దహియ, ఆమన్‌లు 57 కేజీల విభాగంలో పోటీపడుతుండగా.. వారిని దాటుకుంటూ వెళ్లిన సతీందర్‌ మాలిక్‌ నేరుగా రిఫరీ దగ్గరకు వెళ్లాడు. జగ్బిర్‌సింగ్‌ను దూషించిన సతీందర్‌ మాలిక్‌.. సీనియర్‌ రిఫరీపై పిడుగుద్దల వర్షం కురిపించాడు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఇతర మ్యాచులను నిలిపివేశారు. జాతీయ రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ కళ్లెదుటే ఇదంతా చోటుచేసుకుంది. అభిమానులు, రెజ్లర్ల కుటుంబ సభ్యులు చూస్తుండగా సతీందర్‌ మాలిక్‌ రెచ్చిపోయాడు. రెజ్లింగ్‌ సమాఖ్య అధికారులు సతీందర్‌ మాలిక్‌ను బలవంతంగా కెడి జాదవ్‌ హాల్‌ నుంచి బయటకు పంపించారు. సతీందర్‌ మాలిక్‌పై జీవితకాల నిషేధం విధిస్తూ భారత రెజ్లింగ్‌ సమాఖ్య నిర్ణయం తీసుకుంది.
            ' ఆ బౌట్‌ రిఫరీల నుంచి సైతం వివరణ కోరనున్నాం. పరిస్థితి ఇంత వరకు రావడానికి వారు కారణమయ్యారు. టేక్‌డౌన్‌ పట్టు క్లియర్‌గా కనిపించినా.. పాయింట్లు ఎందుకు ఇవ్వలేదో తెలియాలి. నేను 65, 97 కేజీల బౌట్‌లు చూస్తున్నాను. కోరితేనే ఈ బౌట్‌లో నిర్ణయం తీసుకున్నాను. సతీందర్‌పై ఏ చర్యలు తీసుకుంటారనేది రెజ్లింగ్‌ సమాఖ్యకే వదిలేస్తున్నాను' అని జగ్బిర్‌ సింగ్‌ తెలిపాడు. 'సతీందర్‌ పాల్‌, నేను ఇరుగు పొరుగు కావటంతో నిర్ణయంలో పక్షపాత ఆరోపణలకు తావులేకుండా నేను తప్పుకున్నాను. అంతర్జాతీయ రెజ్లింగ్‌లోనూ భారత రెజ్లర్ల బౌట్‌కు భారత రిఫరీలు నిర్ణయాలు తీసుకోరు. ఇది ఏమాత్రం ఊహించనది. సతీందర్‌ మాలిక్‌ సహజంగానే చాలా నెమ్మదస్థుడు' అని సత్యదేవ్‌ మాలిక్‌ తెలిపాడు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పంత్‌ ప్రతాపం
హ్యాండ్‌బాల్‌కు కొత్త జోష్‌
ముగిసిన పోరాటం
అమ్మాయిలు అలవోకగా..
సిరీస్‌ చిక్కేనా?!
ఆసియా హ్యాండ్‌బాల్‌ విజేత అల్‌ కువైట్‌
క్వార్టర్స్‌లో ప్రణయ్‌, సింధు
కూర్పు కుదిరేదెలా?
సింధు ముందంజ
ఖోఖోకు బాలీవుడ్‌ గ్లామర్‌!
జకోవిచ్‌ జోరు
ఇగా స్వైటెక్‌ @ 36
ఓ శకం ముగిసే
దీపక్‌ ధనాధన్‌
ప్రణయ్‌ శుభారంభం
మయాంక్‌కు పిలుపు
సిరీస్‌ లాంఛనమేనా?
ఇంగ్లాండ్‌ ఊడ్చేసింది
కెప్టెన్సీకి మోర్గాన్‌ గుడ్‌బై?
శ్రీలంకకు ఊరట
రోహిత్‌కు కరోనా
చివరిదీ నెగ్గితే.. చరిత్రే!
రంజీ చాంప్‌ మధ్యప్రదేశ్‌
ముంబయి ఎదురీత
సిరీస్‌ చిక్కింది
భారత్‌కు ఎదురుందా?
ఉత్కంఠగా హ్యాండ్‌బాల్‌ పోటీలు
పంత్‌ ఫటాఫట్‌
ఐపీఎల్‌పై పీసీబీ అభ్యంతరం?
ఖతార్‌ సూపర్‌ విక్టరీ

తాజా వార్తలు

01:38 PM

మోడీకి వ్యతిరేకంగా మనీ హెస్ట్ వేష ధారణలో నిరసన

01:25 PM

ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ

01:14 PM

ఒకే ఇంట్లో ఐదుగురు ఆత్మహత్య..!

01:04 PM

ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న ధోనీ

12:55 PM

హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్ష‌లు

12:42 PM

నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం..

12:37 PM

రెబల్‌గా మారాలని నన్నూ పిలిచారు : సంజయ్ రౌత్

12:27 PM

జలవిహార్‌కు ర్యా‌లీగా బ‌య‌ల్దే‌రిన య‌శ్వంత్, కేసీఆర్‌

12:22 PM

ఇన్నోవేషన్ సెంటర్‌కు కేంద్ర మంత్రి శంకుస్థాపన

12:09 PM

రామారావు ఆన్ డ్యూటీ నుంచి ఐటమ్ సాంగ్ విడుదల

12:04 PM

భాగ్యలక్ష్మీ టెంపుల్ వద్ద భారీ భద్రత

12:00 PM

య‌శ్వంత్ సిన్హాకు స్వాగతం పలికిన కేసీఆర్

11:53 AM

బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేసీఆర్

11:49 AM

మోడీకి యోగా శిక్షకుడిగా మంచిర్యాల వాసి

11:41 AM

పోలీసులపై దుండుగుడి కాల్పులు.. ముగ్గురు మృతి

11:31 AM

మెదక్ జిల్లాలో కేంద్ర మంత్రికి అవమానం

11:23 AM

తెలంగాణలో 3 రోజలు వర్షాలు

10:58 AM

ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

10:47 AM

బేగంపేట ఎయిర్‌పోర్టులో భారీ భద్రత

10:39 AM

దేశంలో కొత్తగా 17,092 కరోనా కేసులు

10:37 AM

భాష లేకపోతే చరిత్ర లేదు: సీజేఐ ఎన్వీ రమణ

10:31 AM

విమానంలో పొగ...ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్

10:23 AM

కోనసీమలో తల్లీకూతుళ్ల సజీవదహనం

10:19 AM

ఏబీవీ సస్పెన్షన్ ను తక్షణమే ఎత్తివేయాలి: సీపీఐ రామకృష్ణ

10:17 AM

బిర్యానీ దుకాణంలో మాదకద్రవ్యాల విక్రయం

09:02 AM

నేడు సడక్‌ బంద్‌కు ఎమ్మార్పీఎస్‌ పిలుపు

08:58 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

08:51 AM

గూగుల్‌ మరో కీలక నిర్ణయం

08:41 AM

సినీఫక్కీలో చోరీ.. తుపాకీతో బెదిరించి..

08:30 AM

మణిపూర్‌లో కొండచరియలు విరిగిపడి 81 మంది మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.