Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సన్‌రైజర్స్‌ నిలిచింది! | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • May 18,2022

సన్‌రైజర్స్‌ నిలిచింది!

- ముంబయిపై 3 పరుగులతో గెలుపు
- హైదరాబాద్‌ ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవం
నవతెలంగాణ-ముంబయి
          ప్లే ఆఫ్స్‌ రేసులో ఆశలు సజీవంగా నిలవాలంటే తప్పకుండా నెగ్గాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మెరిసింది. ఉత్కంఠకు దారితీసిన పోరులో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌పై 3 పరుగుల తేడాతో మెరుపు విజయం సాధించింది. సీజన్లో ఏడో విజయంతో 14 పాయింట్లతో ఉన్న సన్‌రైజర్స్‌.. ఇతర సమీకరణాల కలసొస్తే ఇప్పటికీ టాప్‌-4లో నిలిచే అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. 194 పరుగుల భారీ ఛేదనలో ముంబయి ఇండియన్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులే చేసింది. 12 బంతుల్లో 19 పరుగులు చేయాల్సి తరుణంలో స్వింగ్‌స్టర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లో ఓ వికెట్‌ పడగొట్టి ఒక్క పరుగూ ఇవ్వలేదు. చివరి ఓవర్లో 19 పరుగులు చేయాల్సి ఉండగా ముంబయి 15 పరుగులే చేసింది. డెత్‌ ఓవర్లలో టిమ్‌ డెవిడ్‌ (46, 18 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మ్యాచ్‌ను మలుపు తిప్పే ఇన్నింగ్స్‌ ఆడాడు. నటరాజన్‌ ఓవర్లో ఏకంగా నాలుగు సిక్సర్లు బాది ముంబయిని గెలుపు దిశగా తీసుకెళ్లాడు. కానీ లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్‌గా నిష్క్రమించాడు. డెవిడ్‌ నిష్క్రమణతో మ్యాచ్‌ ముంబయి చేజారింది. రోహిత్‌ శర్మ (48, 36 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇషాన్‌ కిషన్‌ (43, 34 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) తొలి వికెట్‌కు 95 పరుగులు జోడించినా.. మిడిల్‌ ఆర్డర్‌లో డానియల్‌ శామ్స్‌ (15), తిలక్‌ వర్మ (8) వైఫల్యంతో ముంబయి వెనుకడుగు వేసింది. సన్‌రైజర్స్‌ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ (3/23) మూడు వికెట్లతో మెరిశాడు. తొలుత, రాహుల్‌ త్రిపాఠి (76, 44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ అర్థ సెంచరీతో కదం తొక్కాడు. ప్రియాం గార్గ్‌ (42, 26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), నికోలస్‌ పూరన్‌ (38, 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌లతో మెరవటంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు సాధించింది.
హైదరాబాద్‌ దూకుడు : టాస్‌ నెగ్గిన ముంబయి ఇండియన్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. తుది జట్టులో రెండు మార్పులు చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్‌ ప్రియాం గార్గ్‌, పేసర్‌ ఫారుఖీని తీసుకుంది. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో చేసిన మార్పు సన్‌రైజర్స్‌కు సానుకూల ఫలితాన్ని అందించింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కిందకు వెళ్లి.. యువ బ్యాటర్‌ ప్రియాం గార్గ్‌ను ఓపెనర్‌గా దించాడు. అభిషేక్‌ శర్మ (9) విఫలమైనా.. ప్రియాం గార్గ్‌ (42) పవర్‌ప్లేలో సత్తా చాటాడు. రాహుల్‌ త్రిపాఠితో కలిసి ముంబయి ఇండియన్స్‌ బౌలర్లపై దండెత్తాడు. నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదిన గార్గ్‌.. అర్థ సెంచరీకి చేరువలో వికెట్‌ కోల్పోయాడు. మరో ఎండ్‌లో నికోలస్‌ పూరన్‌ (38) జతకట్టడంతో రాహుల్‌ త్రిపాఠి తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదిన త్రిపాఠి సన్‌రైజర్స్‌ను 200 పైచిలుకు స్కోరు దిశగా తీసుకెళ్లాడు. పూరన్‌ సైతం మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో ధనాధన్‌ జోరు చూపించాడు. డెత్‌ ఓవర్లలో బుమ్రా మ్యాజిక్‌తో హైదరాబాద్‌ 193 పరుగులే చేసింది. చివరి నాలుగు ఓవర్లలో 29 పరుగులే ఇచ్చిన ముంబయి ఇండియన్స్‌ నాలుగు వికెట్లు పడగొట్టింది. ముంబయి ఇండియన్స్‌ యువ పేసర్‌ రమన్‌దీప్‌ సింగ్‌ (3/20) మూడు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు.
స్కోరు వివరాలు :
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ : 193/6 ( రాహుల్‌ త్రిపాఠి 76, ప్రియాం గార్గ్‌ 42, నికోలస్‌ పూరన్‌ 38, రమన్‌దీప్‌ 3/20)
ముంబయి ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌ : 190/7 ( రోహిత్‌ శర్మ 48, టిమ్‌ డెవిడ్‌ 46, ఇషాన్‌ కిషన్‌ 43, ఉమ్రాన్‌ మాలిక్‌ 3/23)

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పంత్‌ ప్రతాపం
హ్యాండ్‌బాల్‌కు కొత్త జోష్‌
ముగిసిన పోరాటం
అమ్మాయిలు అలవోకగా..
సిరీస్‌ చిక్కేనా?!
ఆసియా హ్యాండ్‌బాల్‌ విజేత అల్‌ కువైట్‌
క్వార్టర్స్‌లో ప్రణయ్‌, సింధు
కూర్పు కుదిరేదెలా?
సింధు ముందంజ
ఖోఖోకు బాలీవుడ్‌ గ్లామర్‌!
జకోవిచ్‌ జోరు
ఇగా స్వైటెక్‌ @ 36
ఓ శకం ముగిసే
దీపక్‌ ధనాధన్‌
ప్రణయ్‌ శుభారంభం
మయాంక్‌కు పిలుపు
సిరీస్‌ లాంఛనమేనా?
ఇంగ్లాండ్‌ ఊడ్చేసింది
కెప్టెన్సీకి మోర్గాన్‌ గుడ్‌బై?
శ్రీలంకకు ఊరట
రోహిత్‌కు కరోనా
చివరిదీ నెగ్గితే.. చరిత్రే!
రంజీ చాంప్‌ మధ్యప్రదేశ్‌
ముంబయి ఎదురీత
సిరీస్‌ చిక్కింది
భారత్‌కు ఎదురుందా?
ఉత్కంఠగా హ్యాండ్‌బాల్‌ పోటీలు
పంత్‌ ఫటాఫట్‌
ఐపీఎల్‌పై పీసీబీ అభ్యంతరం?
ఖతార్‌ సూపర్‌ విక్టరీ

తాజా వార్తలు

02:35 PM

త్వ‌ర‌లో నీట్ అడ్మిట్ కార్డులు జారీ

02:19 PM

మా దమ్ బిర్యానీ, ఇరానీ టీ ఎంజాయ్ చేయండి : కేటీఆర్

02:14 PM

గోపీచంద్ 'పక్కా కమర్షియల్‌’ ఫస్ట్‌డే కలెక్షన్స్‌..

02:07 PM

యశ్వంత్ సిన్హాకు పర్యటనలో బయటపడ్డ కాంగ్రెస్‌లోని విబేధాలు

01:51 PM

మోడీ స‌మాధానాలు చెప్పాలి : సీఎం కేసీఆర్

01:38 PM

మోడీకి వ్యతిరేకంగా మనీ హెస్ట్ వేష ధారణలో నిరసన

01:25 PM

ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ

01:14 PM

ఒకే ఇంట్లో ఐదుగురు ఆత్మహత్య..!

01:04 PM

ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న ధోనీ

12:55 PM

హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్ష‌లు

12:42 PM

నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం..

12:37 PM

రెబల్‌గా మారాలని నన్నూ పిలిచారు : సంజయ్ రౌత్

12:27 PM

జలవిహార్‌కు ర్యా‌లీగా బ‌య‌ల్దే‌రిన య‌శ్వంత్, కేసీఆర్‌

12:22 PM

ఇన్నోవేషన్ సెంటర్‌కు కేంద్ర మంత్రి శంకుస్థాపన

12:09 PM

రామారావు ఆన్ డ్యూటీ నుంచి ఐటమ్ సాంగ్ విడుదల

12:04 PM

భాగ్యలక్ష్మీ టెంపుల్ వద్ద భారీ భద్రత

12:00 PM

య‌శ్వంత్ సిన్హాకు స్వాగతం పలికిన కేసీఆర్

11:53 AM

బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేసీఆర్

11:49 AM

మోడీకి యోగా శిక్షకుడిగా మంచిర్యాల వాసి

11:41 AM

పోలీసులపై దుండుగుడి కాల్పులు.. ముగ్గురు మృతి

11:31 AM

మెదక్ జిల్లాలో కేంద్ర మంత్రికి అవమానం

11:23 AM

తెలంగాణలో 3 రోజలు వర్షాలు

10:58 AM

ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

10:47 AM

బేగంపేట ఎయిర్‌పోర్టులో భారీ భద్రత

10:39 AM

దేశంలో కొత్తగా 17,092 కరోనా కేసులు

10:37 AM

భాష లేకపోతే చరిత్ర లేదు: సీజేఐ ఎన్వీ రమణ

10:31 AM

విమానంలో పొగ...ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్

10:23 AM

కోనసీమలో తల్లీకూతుళ్ల సజీవదహనం

10:19 AM

ఏబీవీ సస్పెన్షన్ ను తక్షణమే ఎత్తివేయాలి: సీపీఐ రామకృష్ణ

10:17 AM

బిర్యానీ దుకాణంలో మాదకద్రవ్యాల విక్రయం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.