Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వరుణుడి ఆట! | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Nov 28,2022

వరుణుడి ఆట!

- భారత్‌, కివీస్‌ రెండో వన్డే వర్షార్పణం
- మెరిసిన గిల్‌, సూర్యకుమార్‌

            భారత్‌, న్యూజిలాండ్‌ వైట్‌బాల్‌ పోరును వరుణుడు వీడటం లేదు. టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌ వర్షంతో రద్దు కాగా.. తాజాగా వన్డే సిరీస్‌లో రెండో మ్యాచ్‌ ఎడతెగని వర్షంతో ఫలితం తేలకుండా ముగిసింది. వర్షం అంతరాయానికి ముందు శుభ్‌మన్‌ గిల్‌ (45 నాటౌట్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (34 నాటౌట్‌) ధనాధన్‌ షోతో అభిమానులను అలరించారు. సిరీస్‌లో చివరి మ్యాచ్‌ నవంబర్‌ 30న క్రైస్చ్‌చర్చ్‌లో జరుగనుంది.
నవతెలంగాణ-హామిల్టన్‌
            ఊహించినట్టే హామిల్టన్‌ సెడాన్‌ పార్క్‌ వన్డేకు వర్షం అంతరాయం కలిగించింది. వన్డే పోరుకు అంతరాయం కలిగించి, విరామం ఇస్తుందని ఆశించగా.. పరిస్థితి భిన్నంగా సాగింది. రెండు సార్లు మ్యాచ్‌కు అంతరాయం కలిగించిన వరుణుడు.. ఓ సారి మ్యాచ్‌ ఓవర్ల కుదింపునకు కారణం కాగా, రెండోసారి ఏకంగా మ్యాచ్‌ను రద్దు చేసే నిర్ణయానికి దారితీశాడు. ఆటను రద్దు చేసే సమయానికి రెండో వన్డేలో భారత్‌ 89/1తో నిలిచింది. శుభ్‌మన్‌ గిల్‌ (45 నాటౌట్‌, 42 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (34 నాటౌట్‌, 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో కదం తొక్కారు. మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ విజయం సాధించింది. రెండో వన్డే మ్యాచ్‌ ఫలితం తేలకుండా ముగిసింది. ఇక సిరీస్‌లో మూడో వన్డే బుధవారం (నవంబర్‌ 30న) క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతుంది. వన్డే సిరీస్‌ను చేజార్చుకోకుండా ఉండేందుకు చివరి వన్డేలో భారత్‌ కచ్చితంగా గెలిచి తీరాలి. న్యూజిలాండ్‌ చివరి వన్డేలో ఓడినా.. సిరీస్‌ను కోల్పోలేదు. భారత్‌తో 1-1తో సమంగా ట్రోఫీని పంచుకుంటుంది. దీంతో బుధవారం చివరి వన్డే భారత్‌కు చావోరేవో కానుంది.
గిల్‌, సూర్య మెరుపులు : సెడాన్‌ పార్క్‌లో టాస్‌ నెగ్గిన న్యూజిలాండ్‌ మళ్లీ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. కఠిన పరిస్థితుల్లో తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన టీమ్‌ ఇండియాకు ఆరంభం ఆశించినట్టు లభించలేదు. 4.5 ఓవర్లలో 22/0తో ఉన్న సమయంలో వరుణుడు అంతరాయం కలిగించాడు. ఎడతెగని వర్షం, తడి అవుట్‌ ఫీల్డ్‌తో మ్యాచ్‌ పున ప్రారంభం ఆలస్యమైంది. దీంతో మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదించారు. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ (3)ను మాట్‌ హెన్రీ వెనక్కి పంపించగా.. శుభ్‌మన్‌ గిల్‌ (45 నాటౌట్‌)తో కలిసి సూర్యకుమార్‌ యాదవ్‌ (34 నాటౌట్‌) మెరుపు షో అందించాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ ఏకంగా మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో చెలరేగాడు. తొలి వన్డేలో అర్థ సెంచరీ బాదిన శుభ్‌మన్‌ గిల్‌ నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో మరో అర్థ సెంచరీ దిశగా సాగాడు. కానీ 12.5 ఓవర్లలో భారత్‌ 89/1తో ఉన్న సమయంలో వరుణుడు మరోసారి ఆటంకం కలిగించాడు. విడువని వర్షం, సమయం మించిపోవటంతో రెండో వన్డే మళ్లీ మొదలు కాలేదు. ఫలితం తేలని వన్డే పోరును అంపైర్లు రద్దు చేశారు.
మా చేతుల్లో లేదు! : వాతావరణం, పరిస్థితులు మా చేతుల్లో ఉండవని భారత కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ అన్నాడు. 'వాతావరణం మా నియంత్రణలో లేదు. మెరుగైన వాతావరణం కోసం ఎదురుచూడటమే. సిరీస్‌లో చివరి మ్యాచ్‌ కోసం ఎదురుచూస్తున్నాను. హామిల్టన్‌ పిచ్‌ బాగుంది. పిచ్‌ నుంచి అధిక సీమ్‌ లభించింది. అయినా, బ్యాటర్లు దూకుడుగా ఆడారు. ఆరో బౌలింగ్‌ వనరు ఉండాలని అనుకున్నాం. అందుకే సంజు శాంసన్‌ స్థానంలో దీపక్‌ హుడాను తీసుకున్నాం. చాహర్‌ రూపంలో, అధిక స్వింగ్‌ రాబట్టే పేసర్‌, ప్రత్యర్థి బ్యాటర్లను ఇరుకున పెట్టగల పేసర్‌ దీపక్‌ చాహర్‌. సీనియర్‌ ఆటగాళ్లందరూ విశ్రాంతి తీసుకున్నారు. ఈ సిరీస్‌లో జట్టు బెంచ్‌ బలం తెలిసింది. కుర్రాళ్లపై నాకు నమ్మకం ఉంది. న్యూజిలాండ్‌లో నాణ్యమైన క్రికెట్‌ ఆడటం బాగుంది. ఈ పరిస్థితుల్లో శుభ్‌మన్‌ గిల్‌ బాగా ఆడుతున్నాడు. చివరి మ్యాచ్‌లో ఉమ్రాన్‌ మాలిక్‌ సైతం రాణించాడు. కుర్రాళ్లు రూపాంతరం, పరిణితి పొందే ప్రక్రియ చక్కగా ఉంది. జట్టుగా మేము ఈ ప్రక్రియను ఆస్వాదిస్తున్నాం. ఈ ప్రక్రియలో మేము సరిగ్గా సాగుతున్నాం, ఫలితాలు సైతం మాకు సరిగ్గానే వస్తాయని ఆశిస్తున్నామని' అని శిఖర్‌ ధావన్‌ తెలిపాడు.
స్కోరు వివరాలు :
భారత్‌ ఇన్నింగ్స్‌ : శిఖర్‌ ధావన్‌ (సి) ఫెర్గుసన్‌ (బి) హెన్రీ 3, శుభ్‌మన్‌ గిల్‌ నాటౌట్‌ 45, సూర్యకుమార్‌ యాదవ్‌ నాటౌట్‌ 34, ఎక్స్‌ట్రాలు : 7, మొత్తం : (12.5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 89.
వికెట్ల పతనం : 1-23.
బౌలింగ్‌ : టిమ్‌ సౌథీ 3-0-12-0, మాట్‌ హెన్రీ 4-0-20-1, లాకీ ఫెర్గుసన్‌ 2.5-0-24-0, మైకల్‌ బ్రాస్‌వెల్‌ 2-0-18-0, మిచెల్‌ శాంట్నర్‌ 1-0-9-0.

 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రిషబ్‌ పంత్‌ను చెంపమీద కొట్టాలనుంది : కపిల్‌ దేవ్‌
డబ్ల్యూటీసీ ఫైనల్‌...తేదీ,వేదిక ఖరారు
వేలంలో 409 మంది క్రికెటర్లు
ఫెన్సర్‌ లోకేశ్‌ స్వర్ణ జోరు
ముగ్గురు స్పిన్నర్ల ఆలోచన!
ఇక్కడ నెగ్గితే..యాషెస్‌ కంటే గొప్ప!
దంత వైద్యుల ధమాకా
నాయకత్వ సవాల్‌
ముఖేశ్‌ మెమోరియల్‌ 'మల్లయుద్ధ'
విజేతలు గాయత్రి, చంద్రశేఖర్‌ జోడీ
జోష్‌ హాజెల్‌వుడ్‌ అవుట్‌
సందడి షురూ
రివర్స్‌ స్వింగ్‌
సెమీస్‌లో సౌరాష్ట్ర
దీపపై 21 నెలల నిషేధం
మీ విజయం యువతకు స్ఫూర్తిదాయకం
సెమీస్‌లో నంద్యాల జోడీ
కార్లు వచ్చేశాయ్‌
సాధన మొదలైంది
సాయిప్రణీత్‌ ఓటమి
హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ షురూ
సెమీస్‌లో బెంగాల్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌
ప్రపంచ విజేతలకు జేజేలు
క్వార్టర్స్‌లో సాయిప్రణీత్‌
ధోని పాత్రకు సిద్ధమే
కంగారూ పడకుండా!
శివాలెత్తిన శుభ్‌మన్‌
క్రీడలకూ కంటితుడుపే..!
ఆంధ్ర 379 ఆలౌట్‌
సిరీస్‌ సవాల్‌

తాజా వార్తలు

05:31 PM

ఎమ్మెల్యే రాజా సింగ్ కు త్రుటిలో ఘోర ప్రమాదం..

05:27 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు విద్యార్థులు మృతి

05:07 PM

తొలి రోజు ముగిసిన ఆట..రోహిత్ అర్ధ సెంచరీ

04:44 PM

సీఎం కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ..

04:30 PM

పెండ్లి రోజే కల్యాణ లక్ష్మి చెక్కులు : మంత్రి గంగుల

04:18 PM

మైన‌ర్ వ‌ద్ద 15 కేజీల హెరాయిన్ పట్టివేత‌..

04:08 PM

పోలీసుల ఆధీనంలో ఉన్న వాహనాల వివరాలను వెబ్ సైట్ లో ఉంచాం

04:04 PM

వరి పంటలు ఎండుతున్నాయి..

04:04 PM

బాంబుల‌తో పేల్చేయాల‌న‌డం కాంగ్రెస్ విధానామా..కేటీఆర్ ఫైర్

04:03 PM

మృతుడి కుటుంబానికి కంసాల ఆర్థిక సాయం

04:01 PM

బడ్జెట్ లో ఏకకాలంలో రుణమాఫీకి నిధులు పెంచాలి

03:55 PM

ఆ ఎమ్మెల్యేలపై డీజీపీకి ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి

03:54 PM

టెస్టుల్లో అరుదైన రికార్డు సాధించిన అశ్విన్‌..

03:52 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

03:28 PM

భార్య మృతదేహాన్ని భుజంపై మోసిన వ్యక్తి..స్పందించిన పోలీసులు

04:04 PM

దారుణమైన ఘటన..కన్నతల్లి తల, మొండెం వేరు చేశాడు

03:03 PM

177 పరుగుకు ఆసీస్ ఆలౌట్..

02:53 PM

ఏపీ సీఎం జగన్ తో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ భేటీ

02:37 PM

ఆస్ట్రేలియా స్కోరు..174/8

02:19 PM

ట్విటర్‌లో బ్లూ సర్వీసులకు..ప్ర‌త్యే‌క‌ ఛార్జీలు

01:59 PM

తెలంగాణకు పసిడి పతకం..

01:50 PM

మసీదులో మహిళల నమాజ్‌కు అభ్యంతరం లేదు..

01:26 PM

రేపు సుప్రీంకోర్టులో అదానీ వ్యవహారంపై విచారణపై..

01:19 PM

శాస‌న‌మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుదల..

01:08 PM

ఎమ్మెల్సీల ఎన్నికల‌ షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ..

12:52 PM

పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో బీఆర్ఎస్‌, ఆప్ నిర‌స‌న..

12:45 PM

కశ్మీర్‌ ఫైల్స్ సినిమాపై ప్రకాశ్‌రాజ్‌ సంచలన వ్యాఖ్యలు.

12:38 PM

సైనికాధికారులతో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ భేటి

12:32 PM

చిత్రా రామ‌కృష్ణకు బెయిల్ మంజూరీ..

04:05 PM

తుర్కియేలో చలికి తట్టుకోలేక ఏంచేస్తున్నారంటే ...

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.