Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
త్రీ లయన్స్‌ తీన్‌మార్‌ | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Dec 06,2022

త్రీ లయన్స్‌ తీన్‌మార్‌

- ఫిఫా ప్రపంచకప్‌ 2022
- 3-0తో సెనెగల్‌పై ధనాధన్‌
- క్వార్టర్స్‌లో అడుగేసిన ఇంగ్లాండ్‌
- ఫ్రాన్స్‌తో అమీతుమీకి రంగం సిద్ధం
              ప్రపంచకప్‌ను ఛేదిస్తున్న ఇంగ్లాండ్‌ ఆ దిశగా ఓ అడుగు ముందుకేసింది. కెప్టెన్‌ హ్యారీ కేన్‌ ప్రపంచకప్‌లో తొలి గోల్‌ నమోదు చేయగా, మిడ్‌ఫీల్డర్‌ జ్యూడ్‌ బెల్లింగ్‌హామ్‌ అద్భుత ప్రదర్శనతో త్రీ లయన్స్‌ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. సెనెగల్‌పై 3-0తో తిరుగులేని విజయం సాధించిన ఇంగ్లాండ్‌.. సెమీస్‌లో చోటు కోసం డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫ్రాన్స్‌తో సమరానికి సిద్ధం కానుంది. ఫిఫా ప్రపంచకప్‌ క్వార్టర్స్‌కు చేరటం ఇంగ్లాండ్‌కు ఇది పదోసారి కావటం విశేషం.
నవతెలంగాణ-దోహా (ఖతార్‌)
              ఫిఫా ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరుకుంది. ప్రీ క్వార్టర్‌ఫైనల్లో సెనెగెల్‌పై ఎదురులేని విజయం నమోదు చేసిన ఇంగ్లాండ్‌.. టైటిల్‌ రేసులో త్రీ లయన్స్‌ సత్తా ఏంటో నిరూపించింది. జోర్డాన్‌ హెండర్సన్‌ (39వ నిమిషం), హ్యారీ కేన్‌ (45+3 నిమిషం), బుకాయో సకా (57వ నిమిషం)లు ఇంగ్లాండ్‌కు గోల్స్‌ సాధించిపెట్టారు. సెనెగల్‌ గోల్‌ కోసం గట్టిగా ప్రయత్నించినా.. ఇంగ్లాండ్‌ రక్షణ శ్రేణిని ఛేదించలేకపోయింది. గోల్స్‌ పరంగా సెనెగల్‌కు ప్రపంచకప్‌లో ఇదే భారీ ఓటమి. వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో సెనెగల్‌ ఎన్నడూ మూడు గోల్స్‌ కోల్పోలేదు. గతంలో ఉరుగ్వే (2002)తో గ్రూప్‌ మ్యాచ్‌లో 3-3తో డ్రా చేసుకోవటమే ఆ జట్టుకు డిఫెన్స్‌ పరంగా చెత్త ప్రదర్శన. చీఫ్‌ కోచ్‌ గారెత్‌ సౌత్‌గేట్‌ 2018, 2022 వరుస ప్రపంచకప్‌లలో ఇంగ్లాండ్‌ను క్వార్టర్‌ఫైనల్స్‌కు చేర్చి విమర్శలకు గట్టి కౌంటర్‌ ఇచ్చాడు!.
బెల్లింగ్‌హామ్‌ షో : సెనెగల్‌తో ప్రీ క్వార్టర్స్‌ను ఇంగ్లాండ్‌ ఫేవరేట్‌గా మొదలెట్టింది. కానీ ఆరంభంలో 30 నిమిషాల ఆట అందుకు పూర్తి విరుద్ధంగా సాగింది. ఇంగ్లాండ్‌ డిఫెండర్ల పొరపాట్లను సొమ్ముచేసుకున్న సెనెగల్‌ ఏకంగా గోల్‌ కోసమే ఎదురుదాడి చేసింది. డిఫెండర్‌ హ్యారీ మాగూరే బలహీనతను సెనెగల్‌ ఎటాకర్లు ఎత్తిచూపారు. 22వ నిమిషంలో గోల్‌ కోసం సెనెగల్‌ అద్భుత ప్రదర్శన చేసింది. ఇంగ్లాండ్‌ గోల్‌కీపర్‌ జోర్డాన్‌ పిక్‌ఫోర్డ్‌ అడ్డుకున్నాడు. 31వ నిమిషంలో మరోసారి సెనెగల్‌ గోల్‌ కొట్టేలా కనిపించింది. కానీ మళ్లీ ఇంగ్లాండ్‌కు అదృష్టం కలిసొచ్చింది. మ్యాచ్‌లో బంతిని 62 శాతం నియంత్రణలో ఉంచుకున్న ఇంగ్లాండ్‌.. మిడ్‌ ఫీల్డర్‌ జ్యూడ్‌ బెల్లింగ్‌హామ్‌ షోతో మ్యాచ్‌లోకి దూసుకొచ్చింది. మిడ్‌ఫీల్డ్‌లో బెల్లింగ్‌హామ్‌ బంతిని నియంత్రణలో ఉంచుకోవటంతో సెనెగల్‌ ఆట కట్టినట్టు అయ్యింది. దీంతో ఇంగ్లాండ్‌ ఎటాకర్లు స్వేచ్ఛగా గోల్‌ ప్రయత్నాలు చేశారు. 39వ నిమిషంలో పర్‌ఫెక్ట్‌ క్రాస్‌ పాస్‌ను అందించిన బెల్లింగ్‌హామ్‌.. జోర్డాన్‌ హెండర్సన్‌ గోల్‌కు మార్గం సుగమం చేశాడు. ఇక ప్రథమార్థం అదనపు సమయంలో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ హ్యారీ కేన్‌ గోల్‌ను సైతం బెల్లింగ్‌హామ్‌ సెట్‌ చేశాడు. సెనెగల్‌ ఆటగాళ్లను తప్పిస్తూ గోల్‌ అవకాశం సృష్టించిన బెల్లింగ్‌హామ్‌ తెలివిగా బంతిని ఫిల్‌ ఫోడెన్‌ను పాస్‌ చేశాడు. ఫోడెన్‌ బంతిని హ్యారీ కేన్‌కు చేర్చగా.. అతడు చేయాల్సిన పని పర్‌ఫెక్ట్‌గా ముగించాడు. దీంతో ప్రథమార్థంలో ఇంగ్లాండ్‌ 2-0తో తిరుగులేని ఆధిక్యం సాధించింది.
రెండో అర్థ భాగంలోనూ ఇంగ్లాండ్‌ జోరు తగ్గలేదు. ద్వితీయార్థం 12వ నిమిషంలోనే ఇంగ్లాండ్‌ మూడో గోల్‌ సాధించింది. 57వ నిమిషంలో ఫిల్‌ ఫోడెన్‌ సున్నితమైన పాస్‌ను అందించగా.. బుకాయో సకా కండ్లుచెదిరే గోల్‌ కొట్టాడు. సెనెగల్‌ ప్రయత్నాలను ఇంగ్లాండ్‌ సమర్థవంతంగా నిలువరించగా త్రీ లయన్స్‌ 3-0తో ఘన విజయం సాధించింది. ఇక గోల్‌కీపర్‌ పిక్‌ఫోర్డ్‌పై తరచుగా విమర్శలు వినిపించినా.. చీఫ్‌ కోచ్‌ సౌత్‌గౌట్‌ అతడిపై పూర్తి నమ్మకం ఉంచాడు. ర్యాష్‌ఫోర్డ్‌ వేల్స్‌పై రెండు గోల్స్‌ కొట్టినా.. సకా, ఫోడెన్‌లను బరిలో నిలిపిన సౌత్‌గౌట్‌ ఆశించిన ఫలితాన్ని రాబట్టుకున్నాడు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వేలంలో 409 మంది క్రికెటర్లు
ఫెన్సర్‌ లోకేశ్‌ స్వర్ణ జోరు
ముగ్గురు స్పిన్నర్ల ఆలోచన!
ఇక్కడ నెగ్గితే..యాషెస్‌ కంటే గొప్ప!
దంత వైద్యుల ధమాకా
నాయకత్వ సవాల్‌
ముఖేశ్‌ మెమోరియల్‌ 'మల్లయుద్ధ'
విజేతలు గాయత్రి, చంద్రశేఖర్‌ జోడీ
జోష్‌ హాజెల్‌వుడ్‌ అవుట్‌
సందడి షురూ
రివర్స్‌ స్వింగ్‌
సెమీస్‌లో సౌరాష్ట్ర
దీపపై 21 నెలల నిషేధం
మీ విజయం యువతకు స్ఫూర్తిదాయకం
సెమీస్‌లో నంద్యాల జోడీ
కార్లు వచ్చేశాయ్‌
సాధన మొదలైంది
సాయిప్రణీత్‌ ఓటమి
హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ షురూ
సెమీస్‌లో బెంగాల్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌
ప్రపంచ విజేతలకు జేజేలు
క్వార్టర్స్‌లో సాయిప్రణీత్‌
ధోని పాత్రకు సిద్ధమే
కంగారూ పడకుండా!
శివాలెత్తిన శుభ్‌మన్‌
క్రీడలకూ కంటితుడుపే..!
ఆంధ్ర 379 ఆలౌట్‌
సిరీస్‌ సవాల్‌
కుల్దీప్‌ కీలకం
పర్యవేక్షణ కమిటీలో బబిత ఫోగట్‌

తాజా వార్తలు

07:02 AM

టోఫెల్ ఎగ్జామ్ లో మాస్ కాపీయింగ్..

06:56 AM

భూకంప విధ్వంసం..7,700కు చేరిన మరణాలు

06:48 AM

నేడు అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ రద్దు..

09:43 PM

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

09:34 PM

18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు..

08:58 PM

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..

08:48 PM

ఇంటర్ విద్యార్థులకు 4 వేల వీడియో పాఠాలు

08:39 PM

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై..

07:50 PM

వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్‌..

07:39 PM

భార్యతో గొడ‌వ‌..చూస్తుండగానే భ‌వ‌నం పైకి ఎక్కి దూకాడు

07:09 PM

వాట్సాప్‌ యూజర్స్ కు శుభవార్త..కీలక అప్‌డేట్

06:49 PM

2వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న బోయింగ్‌

05:58 PM

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్..

05:57 PM

ఫాంహౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

05:41 PM

తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ..

05:24 PM

రెండోరోజూ నష్టాలతో ముగిసిన మార్కెట్లు..

05:10 PM

మందు బాబులకు జరిమానాలు..

04:45 PM

వ్యక్తిని ఢీ కొట్టి పది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు..!

04:27 PM

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే

04:16 PM

రాష్ట్ర బడ్జెట్ పై వైఎస్ షర్మిల మాట్లాడటం బాధకరం : కడియం శ్రీహరి

03:51 PM

సిరియా భూకంపం.. శిథిలాల కిందే ప్రసవం

03:45 PM

ఎన్నేళ్లయినా అసమానతలు కొనసాగుతూనే ఉంటాయి : కూనంనేని

03:24 PM

జగన్ ను 'అప్పురత్న' అంటూ పవన్ కల్యాణ్ ఎద్దేవా

03:04 PM

27న ఓటీటీలోకి ‘వాల్తేరు వీరయ్య’..

02:42 PM

ముంబై ఎయిర్ పోర్ట్ కు బెదిరింపు కాల్..భద్రత అప్రమత్తం

02:41 PM

మేయర్‌ ఎన్నికపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్..

02:34 PM

తెలంగాణ బడ్జెట్ పై షర్మిల సెటైర్లు..

01:58 PM

టర్కీకి చేరుకున్న భారత తొలి ఎన్‌డీఆర్ఎఫ్ బృందం

01:49 PM

అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి

01:23 PM

జమ్ములో అక్రమ నిర్మాణాల కూల్చివేత..రాళ్లు రువ్విన స్థానికులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.