Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పోరాడి ఓడిన టీమిండియా | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Dec 08,2022

పోరాడి ఓడిన టీమిండియా

- మెహిదీ హసన్‌ సెంచరీ,
- రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌, అక్షర్‌ అర్ధసెంచరీలు
- వన్డే సిరీస్‌ బంగ్లాదేశ్‌ కైవసం
ఢాకా : రెండో వన్డేలోనూ టీమిండియా ఓటమిపాలైంది. 272 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన టీమిండియా ఐదు పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. బొటనవేలి గాయంతో చివర్లో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వీరోచిత పోరాటం చేసినా.. మ్యాచ్‌ను గెలిపించలేకపోయాడు. రోహిత్‌ శర్మ 28బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేసి చివరి వరకు క్రీజులో నిలిచాడు. టీమిండియా విజయానికి 6బంతుల్లో 20 పరుగులు చేయాల్సి దశలో.. ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ వేసిన ఆ ఓవర్లో రోహిత్‌ శర్మ 2ఫోర్లు, ఒక సిక్స్‌ కొట్టి ఆశలు కల్పించాడు. చివరి బంతికి సిక్స్‌ కొడితే విజయం దక్కుతుందనగా, ముస్తాఫిజుర్‌ యార్కర్‌ వేయడంతో రోహిత్‌ శర్మ భారీ షాట్‌ కొట్టేందుకు సాధ్యపడలేదు. దాంతో టీమిండియా స్కోరు 266 పరుగుల వద్ద నిలిచిపోయింది. తొలుత రోహిత్‌ శర్మ గాయపడడంతో విరాట్‌ కోహ్లీ(5) ఓపెనర్‌గా బరిలో దిగాడు. మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(8) సైతం విఫలం కావడంతో టీమిండియా 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. సుందర్‌ 11, కేఎల్‌ రాహుల్‌ 14 పరుగులకే వెనుదిరగడంతో టీమిండియాకు కష్టాలు ప్రారంభమయ్యాయి. శ్రేయస్‌ అయ్యర్‌ 6ఫోర్లు, 3సిక్సర్లతో 82పరుగులు చేశాడు. అక్షర్‌ పటేల్‌(56) అర్ధసెంచరీతో రాణించాడు. తొలుత బంగ్లాదేశ్‌కూ శుభారంభం దక్కలేదు. జట్టు స్కోర్‌ 69పరుగులకు చేరుకొనే సరికే 6వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో తొలి వన్డే హీరో మెహిదీ హసన్‌ (100నాటౌట్‌) సెంచరీకి తోడు, మహ్మదుల్లా(77) 7వ వికెట్‌కు 148పరుగులు జతచేశారు. దీంతో ఆ జట్టు భారీస్కోర్‌ను నమోదు చేయగల్గింది. సుందర్‌కు మూడు, శార్దూల్‌, ఉమ్రన్‌కు రెండేసి వికెట్లు దక్కాయి.
రోహిత్‌ శర్మకు గాయం
బంగ్లాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గాయం కారణంగా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో అతడి బొటన వేలికి గాయమైంది. అనంతరం మెడికల్‌ టీం అతడిని స్కానింగ్‌ కోసం ఆస్పత్రికి తరలించింది. అతడి స్థానంలో మైదానంలోకి రజత్‌ పటిదార్‌ వచ్చాడు. బంగ్లా ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. సిరాజ్‌ వేసిన నాలుగో బంతికి అనముల్‌ భారీ షాట్‌ ఆడాడు. సెకండ్‌ స్లిప్‌లో ఉన్న రోహిత్‌ దాన్ని క్యాచ్‌ పట్టేందుకు ప్రయత్నిస్తుండగా అతడి బొటన వేలికి తీవ్ర గాయమైంది.
స్కోర్‌బోర్డు..
బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: అనుముల్‌ (ఎల్‌బి) సిరాజ్‌ 11, లింటన్‌ దాస్‌ (బి)సిరాజ్‌ 7, షాంటో (బి)ఉమ్రన్‌ మాలిక్‌ 21, షకీబ్‌ (సి)ధావన్‌ (బి)సుందర్‌ 8, ముష్ఫికర్‌ రహీమ్‌ (సి)ధావన్‌ (బి)సుందర్‌ 12, మహ్మదుల్లా (సి)కేఎల్‌ రాహుల్‌ (బి)ఉమ్రన్‌ మాలిక్‌ 77, అఫిప్‌ హొసైన్‌ (బి)సుందర్‌ 0, మెహిదీ హసన్‌ (నాటౌట్‌) 1000, నసూమ్‌ అహ్మద్‌ (నాటౌట్‌) 18, అదనం 17. (50 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 271పరుగులు.
వికెట్ల పతనం: 1/11, 2/39, 3/52, 4/66, 5/69, 6/69, 7/217,
బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 3-0-12-0, సిరాజ్‌ 10-0-73-2, శార్దూల్‌ 10-1-47-0, ఉమ్రన్‌ మాలిక్‌ 10-2-58-2, సుందర్‌ 10-0-37-3, అక్షర్‌ 7-0-40-0
ఇండియా ఇన్నింగ్స్‌: కోహ్లి (బి)ఇబాదత్‌ 5, ధావన్‌ (సి)మెహిదీ (బి)ముస్తఫిజుర్‌ 8, శ్రేయస్‌ (సి)అఫిప్‌ (బి)మెహిదీ 82, సుందర్‌ (సి)లింటన్‌ దాస్‌ (బి)షకీబ్‌ 11, కేఎల్‌ రాహుల్‌ (ఎల్‌బి) మెహిదీ 14, అక్షర్‌ (సి)షకీబ్‌ (బి)ఇబాదత్‌ 7, దీపక్‌ చాహర్‌ (సి)షాంటో (బి)ఇబాదత్‌ 11, రోహిత్‌ శర్మ (నాటౌట్‌) 51, మహ్మద్‌ సిరాజ్‌ (బి)మహ్మదుల్లా 2, ఉమ్రన్‌ మాలిక్‌ (నాటౌట్‌) 0, అదనం 19. (50 ఓవర్లకు 9వికెట్ల నష్టానికి) 266పరుగులు.
వికెట్ల పతనం: 1/7, 2/13, 3/39, 4/64, 5/172, 6/189, 7/207, 8/213, 9/252.
బౌలింగ్‌: మెహిదీ 6.1-0-46-2, ఇబాదత్‌ 10-0-45-3, ముస్తఫిజుర్‌ 10-1- 43-1, నసూమ్‌ అహ్మద్‌ 10-0-54-0, షకీబ్‌ 10-1-39-2, మహ్మదుల్లా 3.5-0-33-1.

 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సిరీస్‌ సవాల్‌
కుల్దీప్‌ కీలకం
పర్యవేక్షణ కమిటీలో బబిత ఫోగట్‌
9వ స్థానంలో సింధు
జ్వెరెవ్‌పై చర్యల్లేవ్‌
ఇదేం పిచ్‌?
మెల్‌బోర్న్‌ మొనగాడు
ఐదేండ్లలో రూ.12.5 కోట్లు
జూన్‌లో హ్యాండ్‌బాల్‌ ప్రీమియర్‌ లీగ్‌
హాకీ కోచ్‌ రాజీనామా
మురళీ విజయ్ వీడ్కోలు
జగజ్జేత భారత్‌
జకోవిచ్‌ విజయ ఢంకా
ఛేదనలో చతికిల
ఫైనల్లో అమ్మాయిలు
అవమానం 'ఆరు'
సరిలేరు సానియాకెవ్వరు
ఇక పొట్టి పోరు!
ఫిబ్రవరి 4న ఏసీసీ భేటీ
కష్టాల్లో హైదరాబాద్‌
రుతురాజ్‌కు గాయం
గిల్‌, రోహిత్‌ శతకోత్సవం
క్రీడాశాఖ కమిటీపై రెజ్లర్ల అసంతృప్తి
రాణించిన రాయుడు
ఫిబ్రవరి 1న రానున్న ఆసీస్‌
క్లీన్‌స్వీప్‌పై కన్నేసి..
రంజీ పోరుకు జడేజా
విచారణ కమిటీ చీఫ్‌ మేరీకోమ్‌
రేసులో ఐపీఎల్‌ ప్రాంఛైజీలు
ఇక్కడైనా మెరుస్తారా?

తాజా వార్తలు

09:00 PM

దేశంలోని మెజార్టీ ప్రజల ఆశలను చిదిమేశారు : చిదంబరం

08:45 PM

శుభ్‌మ‌న్ గిల్ విధ్వంసం..న్యూజిలాండ్ కు భారీ లక్ష్యం

08:41 PM

రాష్ట్రాన్ని, ప్రజలను కేంద్రం వద్ద జగన్ తాకట్టు పెట్టారు: రామ్మోహన్ నాయుడు

08:28 PM

శుభ్ మన్ గిల్ అధ్భుత సెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్

08:09 PM

సర్జరీ తర్వాత బాలిక మృతి.. అవయవాలు చోరీ!

07:57 PM

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి బాలినేని సవాల్

07:35 PM

3న కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్..

07:30 PM

ఇషాన్ ఔట్.. భారత్ స్కోర్ 58/1

07:16 PM

విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన బడ్జెట్ :ఎస్ఎఫ్ఐ

06:59 PM

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్..

06:38 PM

కరెన్సీ నోట్లను పేర్చి..ఉద్యోగులకు కోట్లలో బోనస్..

06:33 PM

కేంద్ర బడ్జెట్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్..

06:17 PM

బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ వివరణ..

06:13 PM

కెమికల్‌ డ్రమ్ము పేలి ఇద్దరు దుర్మరణం..

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.