Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
క్రీడాశాఖ కమిటీపై రెజ్లర్ల అసంతృప్తి | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Jan 25,2023

క్రీడాశాఖ కమిటీపై రెజ్లర్ల అసంతృప్తి

- ఏర్పాటు ప్రక్రియలో సంప్రదించలేదు
- రెజ్లర్లు వినేశ్‌, సాక్షి, బజరంగ్‌ ట్వీట్లు
నవతెలంగాణ-న్యూఢిల్లీ
భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ), బిజెపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై లైంగిక ఆరోపణలు, ఆర్థిక అవకతవకల ఆరోపణలను విచారణ చేసేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నియమించిన కమిటీ పట్ల రెజ్లింగ్‌ క్రీడాకారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ నియంతృత్వ విధానాలతో దశాబ్దకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రెజ్లింగ్‌ క్రీడాకారులు, బిజెపీ ఎంపీపై చట్టపర చర్యలు తీసుకోవాలని మూడు రోజుల పాటు జంతర్‌మంతర్‌ వద్ద నిరసన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. జంతర్‌ మంతర్‌ ఆందోళనలో భారత్‌కు ఒలింపిక్‌, వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పతకాలు సాధించిన వినేశ్‌ ఫోగట్‌, సాక్షి మాలిక్‌, అన్షు మాలిక్‌, బజరంగ్‌ పూనియా, దీపక్‌ పూనియాలు ఉన్నారు. రెజ్లర్ల ఆందోళనకు దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం డబ్ల్యూఎఫ్‌ఐ బాధ్యతల నుంచి బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను తాత్కాలికంగా తప్పిస్తూ, విచారణ కమిటీ ఏర్పాటు అంగీకారం తెలిపింది. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ హామీతో రెజ్లర్లు మూడు రోజుల ఆందోళనను విరమించారు.
సంప్రదించలేదు! : డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ సహా ఆఫీస్‌ బేరర్లను బాధ్యతలకు దూరంగా ఉండమని ఆదేశిస్తూ క్రీడాశాఖ సర్క్యూలర్‌ జారీ చేసింది. బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై ఆరోపణలను విచారణ చేసే కమిటీని ఏర్పాటు చేసే ప్రక్రియలో రెజ్లింగ్‌ క్రీడాకారులతో భాగం చేస్తామని మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ హామీ ఇచ్చారు. దిగ్గజ బాక్సర్‌ ఎంసీ మేరీకోమ్‌ అధ్యక్షతన ఐదుగురు సభ్యుల విచారణ, పర్యవేక్షణ కమిటీని క్రీడాశాఖ సోమవారం ప్రకటించింది. మంత్రి హామీ మేరకు విచారణ కమిటీ ఏర్పాటు అంశంలో ఎటువంటి సంప్రదింపులు జరుపలేదని రెజ్లర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒలింపిక్‌ మెడలిస్ట్‌, దిగ్గజ రెజ్లర్‌ యోగేశ్వర్‌ దత్‌, మిషన్‌ ఒలింపిక్‌ సభ్యురాలు, మాజీ షట్లర్‌ తృప్తి, సారు మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాధికా శ్రీమాన్‌, టాప్స్‌ మాజీ సీఈవో రాజేశ్‌ రాజగోపాలన్‌ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. నాలుగు వారాల్లో ఈ కమిటీ విచారణ నివేదికను క్రీడాశాఖకు అందజేయాల్సి ఉంది. కమిటీ నివేదికపై క్రీడాశాఖ తదుపరి నిర్ణయం తీసుకునే వరకు మేరీకోమ్‌ సారథ్యంలోని పర్యవేక్షణ కమిటీ డబ్ల్యూఎఫ్‌ఐ వ్యవహారాలను చూడనుంది. భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) సైతం ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. మేరీకోమ్‌ సారథ్యంలోని పర్యవేక్షణ కమిటీతో కలిసి ఐఓఏ కమిటీ సైతం సమాంతర విచారణ జరుపనుంది. ఆర్థిక అవకతవకల ఆరోపణలు ఎదుర్కొన్న భారత రెజ్లింగ్‌ సమాఖ్య సహాయ కార్యదర్శి వినోద్‌ తోమర్‌ (ప్రభుత్వ ఉద్యోగి)ను సస్పెండ్‌ చేస్తూ క్రీడాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మాట తప్పడంపై రెజ్లర్లు ట్విట్టర్‌ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. 'డబ్ల్యూఎఫ్‌ఐపై విచారణ, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు ముందు మమ్మల్ని (రెజ్లర్లు) సంప్రదిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. కమిటీ ఏర్పాటు ప్రక్రియలో ఎవరూ సంప్రదించే ప్రయత్నం చేయకపోవటం అత్యంత విచారకరం' అంటూ వినేశ్‌ ఫోగట్‌, బజరంగ్‌ పూనియా, సాక్షి మాలిక్‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌కు ప్రధాని నరెంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, క్రీడామంత్రి అనురాగ్‌ ఠాకూర్‌లను ట్యాగ్‌ చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వేలంలో 409 మంది క్రికెటర్లు
ఫెన్సర్‌ లోకేశ్‌ స్వర్ణ జోరు
ముగ్గురు స్పిన్నర్ల ఆలోచన!
ఇక్కడ నెగ్గితే..యాషెస్‌ కంటే గొప్ప!
దంత వైద్యుల ధమాకా
నాయకత్వ సవాల్‌
ముఖేశ్‌ మెమోరియల్‌ 'మల్లయుద్ధ'
విజేతలు గాయత్రి, చంద్రశేఖర్‌ జోడీ
జోష్‌ హాజెల్‌వుడ్‌ అవుట్‌
సందడి షురూ
రివర్స్‌ స్వింగ్‌
సెమీస్‌లో సౌరాష్ట్ర
దీపపై 21 నెలల నిషేధం
మీ విజయం యువతకు స్ఫూర్తిదాయకం
సెమీస్‌లో నంద్యాల జోడీ
కార్లు వచ్చేశాయ్‌
సాధన మొదలైంది
సాయిప్రణీత్‌ ఓటమి
హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ షురూ
సెమీస్‌లో బెంగాల్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌
ప్రపంచ విజేతలకు జేజేలు
క్వార్టర్స్‌లో సాయిప్రణీత్‌
ధోని పాత్రకు సిద్ధమే
కంగారూ పడకుండా!
శివాలెత్తిన శుభ్‌మన్‌
క్రీడలకూ కంటితుడుపే..!
ఆంధ్ర 379 ఆలౌట్‌
సిరీస్‌ సవాల్‌
కుల్దీప్‌ కీలకం
పర్యవేక్షణ కమిటీలో బబిత ఫోగట్‌

తాజా వార్తలు

11:28 AM

సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం..

11:26 AM

దేశంలోనే గొప్పపథకం కంటివెలుగు: స్పీకర్

11:19 AM

ఆస్పత్రి గది నుంచి తొలిసారి బయటకొచ్చిన రిషబ్ పంత్..

11:05 AM

కన్యత్వ పరీక్ష అంటే మహిళల గౌరవానికి భంగం కలిగించడమే..

10:57 AM

లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు..

10:06 AM

పంజాబ్‌ మెయిల్‌కు తప్పిన పెను ప్రమాదం..

09:55 AM

ఢిల్లీ మద్యం కేసులో..ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్

09:45 AM

1300 ఉద్యోగులకు షాకిచ్చిన ‘జూమ్’..

09:12 AM

నేడ ఏపీ క్యాబినెట్ భేటీ…

09:02 AM

ఘనంగా బాలీవుడ్ ప్రేమజంట కియారా-సిద్ధార్థ్ మల్హోత్రా వివాహం

07:53 AM

లోయలో పడ్డ బస్సు, కారు.. 30 మంది మృతి

07:39 AM

సిరియాకు చేరిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానం..

07:22 AM

మృత్యుంజయులు ఈ చిన్నారులు..

07:02 AM

టోఫెల్ ఎగ్జామ్ లో మాస్ కాపీయింగ్..

06:56 AM

భూకంప విధ్వంసం..7,700కు చేరిన మరణాలు

06:48 AM

నేడు అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ రద్దు..

09:43 PM

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

09:34 PM

18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు..

08:58 PM

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..

08:48 PM

ఇంటర్ విద్యార్థులకు 4 వేల వీడియో పాఠాలు

08:39 PM

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై..

07:50 PM

వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్‌..

07:39 PM

భార్యతో గొడ‌వ‌..చూస్తుండగానే భ‌వ‌నం పైకి ఎక్కి దూకాడు

07:09 PM

వాట్సాప్‌ యూజర్స్ కు శుభవార్త..కీలక అప్‌డేట్

06:49 PM

2వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న బోయింగ్‌

05:58 PM

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్..

05:57 PM

ఫాంహౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

05:41 PM

తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ..

05:24 PM

రెండోరోజూ నష్టాలతో ముగిసిన మార్కెట్లు..

05:10 PM

మందు బాబులకు జరిమానాలు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.