Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నాయకత్వ సవాల్‌ | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Feb 06,2023

నాయకత్వ సవాల్‌

- రోహిత్‌కు అతిపెద్ద కెప్టెన్సీ పరీక్ష 
- బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ టెస్టు సిరీస్‌

          ఫిబ్రవరి 2022, భారత జట్టు టెస్టు పగ్గాలు రోహిత్‌ శర్మ
చేతికి అందాయి. కాగితంపైనే మూడు ఫార్మాట్ల కెప్టెన్‌గా కొనసాగుతున్న రోహిత్‌ శర్మ.. నాయకుడిగా రెండు టెస్టులే ఆడాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ బెర్త్‌ ఊరిస్తున్న తరుణంలో టెస్టుల్లో నాయకుడిగా రోహిత్‌ శర్మ తొలిసారి కఠిన పరీక్ష ఎదుర్కొంటున్నాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్‌-గవాస్కర్‌ టెస్టు సిరీస్‌ ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌ టెస్టుతో ఆరంభం కానుంది.
నవతెలంగాణ క్రీడావిభాగం
అసలు మొదలైందా?!
భారత జట్టు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ప్రస్థానం ఏడాది కిందటే మొదలైంది. కానీ నిజానికి భారత క్రికెట్‌లో రోహిత్‌ శర్మ నాయకత్వ శకం మొదలైందా? అంటే కాదనే చెప్పాలి. వైట్‌బాల్‌ ఫార్మాట్‌లో రోహిత్‌ శర్మ నాయకత్వం కనిపిస్తున్నా.. టెస్టుల్లో అతడు ప్రయాణమే ఆరంభించలేదు. ఆల్‌ఫార్మాట్‌ కెప్టెన్‌గా భారత్‌ చివరి ఐదు టెస్టుల్లో రోహిత్‌ శర్మ ఏకంగా మూడు టెస్టులకు దూరమయ్యాడు. ఇంగ్లాండ్‌పై టెస్టు సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించిన చారిత్రక విజయంలో 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'గా నిలిచాడు. అంతకుముందే, ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌ చారిత్రక 2-1తో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత టెస్టుల్లో విదేశీ జైత్రయాత్రకు బ్రేక్‌ పడింది. జొహనెస్‌బర్గ్‌, కేప్‌టౌన్‌, బర్మింగ్‌హామ్‌ టెస్టుల్లో భారత్‌ విజయం సాధించే స్థితిలో ఉండీ పరాజయం పాలైంది. ఇటీవల బంగ్లాదేశ్‌తో టెస్టుల్లో సాధికారిక విజయాలు నమోదు చేయటంలో తేలిపోయింది. కానీ, స్వదేశంలో టీమ్‌ ఇండియా రికార్డు దుర్బేద్యం. బలమైన ఆస్ట్రేలియాతో ఒత్తిడితో కూడిన సిరీస్‌లో రోహిత్‌ శర్మ నాయకత్వ పటిమ తేలనుంది. టెస్టుల్లో నాయకుడిగా రోహిత్‌ శర్మ ప్రభావం ఈ సిరీస్‌ తేల్చనుంది.
పొంచిఉన్న ప్రమాదం
భారత జట్టు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ భవితవ్యం ప్రమాదంలోనే కొనసాగుతుంది!. మూడు ఫార్మాట్లలో రోహిత్‌ శర్మ కెప్టెన్సీ పగ్గాలు కోల్పోయే ప్రమాదంలోనే ఉన్నాడు. టీ20ల్లో హార్దిక్‌ పాండ్య అనధికార రెగ్యులర్‌ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ అనంతరం రోహిత్‌ శర్మ పొట్టి ఫార్మాట్‌లో నాయకత్వం సంగతి అటుంచి, అసలు జట్టులోనే నిలువలేదు. ఇక వన్డే ఫార్మాట్‌లో ఈ ఏడాది స్వదేశంలో ఐసీసీ 2023 వన్డే వరల్డ్‌కప్‌ అతడి భవిష్యత్‌ను నిర్ణయించనుంది. సొంతగడ్డ అనుకూలత, టైటిల్‌ అంచనాలను సైతం మోసుకొస్తుంది. కప్పు నెగ్గాలనే ఒత్తిడి రోహిత్‌ శర్మపై ఉంటుంది. వరల్డ్‌కప్‌లో ఏమాత్రం తేడా వచ్చినా.. రోహిత్‌ శర్మ నాయకత్వం కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక టెస్టు క్రికెట్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. 35 ఏండ్ల రోహిత్‌ శర్మ బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ నెగ్గటంతో పాటు ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో చోటు సాధించాల్సి ఉంది.
ఆ సంగతి బాగా తెలుసు!
జాతీయ జట్టు నాయకుడి గొప్పతనం ద్వైపాక్షిక సిరీస్‌ విజయాల్లో ఉండదు. ఐసీసీ టోర్నమెంట్‌లో విజయమే నాయకుడి సామర్థ్యానికి కొలమానం. ఈ విషయం చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు బాగా తెలుసు. కెప్టెన్‌గా భారత్‌ను వన్డేల్లో విజయవంతమైన, దూకుడైన ఛేదించే జట్టుగా నిలిపిన రాహుల్‌ ద్రవిడ్‌.. నాయకత్వం విషయంలో ఎప్పుడూ 2007 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో గ్రూప్‌ దశ నుంచి నిష్క్రమించిన జట్టు సారథిగానే కనిపిస్తాడు. ఇదే విషయం రోహిత్‌ శర్మకు సైతం వర్తించనుంది. 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో నాకౌట్‌కు అర్హత సాధించని టీమ్‌ ఇండియాను.. 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌, ద్రవిడ్‌ సెమీఫైనల్స్‌కు చేర్చారు. అయితే, వరుస టీ20 ప్రపంచకప్‌లలో టీమ్‌ ఇండియా పరాజయానికి కారణాలు ఒకటే కావటం గమనార్హం.
వేధిస్తున్న బలహీనతలు
కీలక బోర్డర్‌-గవాస్కర్‌ టెస్టు సిరీస్‌ ముంగిట, టీమ్‌ ఇండియా పలు సమస్యలు ఎదుర్కొంటుంది. గత రెండేండ్లుగా భీకర ఫామ్‌లో ఉన్న ముగ్గురు కీలక క్రికెటర్లు దూరమయ్యారు. రిషబ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌లు పరుగుల వేటలో ముందున్నారు. పంత్‌ సిరీస్‌కు దూరమవగా.. స్పిన్‌పై అద్భుతంగా అయ్యర్‌ తొలి టెస్టులో ఆడటం లేదు. పేస్‌ దళపతి జశ్‌ప్రీత్‌ బుమ్రా సైతం అందుబాటులో లేడు. ఈ ముగ్గురు ఆటగాళ్లు లేకుండా బరిలోకి దిగుతుండటం ప్రత్యర్థి జట్టుకు అనుకూలించే పరిణామం. ఇక స్టార్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లి, చతేశ్వర్‌ పుజారలు అంచనాల మేరకు రాణించటం లేదు. 2021 ఆరంభం నుంచి పుజార సగటు 34.61 కాగా, విరాట్‌ కోహ్లి సగటు 23.85. రోహిత్‌ శర్మ టెస్టు ఫామ్‌పై ఇప్పుడే ఏమీ చెప్పలేని స్థితి. ఎందుకంటే, మార్చి 2022 తర్వాత రోహిత్‌ శర్మ ఒక్క టెస్టు మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు.
నాయకుడిగా నిలబడేనా?
బోర్డర్‌-గవాస్కర్‌ టెస్టు సిరీస్‌ విజయం సాధించినా, విఫలమైన రోహిత్‌ శర్మ నాయకత్వ శకం స్వల్పకాలికమే. ఈ సిరీస్‌ విజయం భారత ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ అవకాశాలను నిర్దేశించనుంది. 2013 నుంచి ఐసీసీ టైటిల్‌కు దూరంగా ఉంటున్న టీమ్‌ ఇండియాకు ఆ లోటు తీర్చేందుకు రోహిత్‌ శర్మకు వరుసగా మూడు అవకాశాలు ముందున్నాయి. 2023 వన్డే వరల్డ్‌కప్‌, ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ సహా 2024 టీ20 ప్రపంచకప్‌లో వరుసగా ఉన్నాయి. నాయకుడిగా చరిత్రలో నిలిచేందుకు రోహిత్‌ శర్మకు ఇందులో ఒక్క విజయం చాలు!. భారత క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత విలువైన, ప్రతిభావంతులైన యువ క్రికెటర్లతో కూడిన టెస్టు జట్టుకు సారథ్యం వహిస్తున్న రోహిత్‌ శర్మ... స్వదేశంలో బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని అందుకుంటాడా? ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో చోటు సాధిస్తాడా? చూడాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పసిడి పంచ్‌
మనుకు కాంస్యం
ఇంగ్లాండ్‌, శ్రీలంక, యుఏఈ!
సింధు పరాజయం
రుద్రాంక్ష్‌ కాంస్య గురి
మెస్సిఏ 800 గోల్స్‌
పసిడి పోరుకు నిఖత్‌
ఆ బాధ్యత ఆటగాళ్లదే!
శ్రీకాంత్‌ ఔట్‌
పోరాడినా..
షూటింగ్‌లో భారత్‌కు తొలిస్వర్ణం
సిరీస్‌ నీదా?నాదా?
క్వార్టర్‌ఫైనల్లో నిఖత్‌
ఈ బలహీనత దాటేదెలా?
క్వార్టర్స్‌లో సాక్షి
కివీస్‌ క్లీన్‌స్వీప్‌
కుప్పకూలి..!
ఎ.ఆర్‌ రావుకు టెన్నిస్‌ టైటిల్‌
డబుల్స్‌ చాంప్‌ బోపన్న జోడీ
ప్రీ క్వార్టర్స్‌లో నిఖత్‌
కథ ముగిసింది
తీరంలో తేల్చేస్తారా?
గెలిపించిన రాహుల్‌, జడేజా
సెమీస్‌కు త్రీసా-గాయత్రి
అంతర్జాతీయ క్రికెట్‌కు టిమ్‌ పైన్‌ గుడ్‌బై
గిల్‌, రాహుల్‌కు పరీక్ష
నిఖత్‌ శుభారంభం
ఐపిఎల్‌-2023 సీజన్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా వార్నర్‌
ఫిఫా అధ్యక్షునిగా ఇన్ఫాంటినో మళ్లీ ఎన్నిక
క్వార్టర్స్‌కు త్రీషా-గాయత్రి జోడీ

తాజా వార్తలు

10:22 PM

RC15 సెట్ లో కేక్ కట్ చేసిన రామ్ చరణ్...

09:16 PM

రేపు శ్రీహరికోట నుంచి ఇస్రో వాణిజ్య రాకెట్ ప్రయోగం

08:49 PM

బీజేపీ నేతలు నిరుద్యోగ మార్చ్ మోడీ ఇంటి ముందు చేయాలి : కేటీఆర్

08:40 PM

అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను ప‌రిశీలించిన‌ సీఎస్

08:19 PM

ఏపీసీఆర్‌డీఏ కీలక ప్రకటన..

08:06 PM

పేపర్‌ లీకేజీ కేసులో.. నలుగురు నిందితులకు కస్టడీ

07:40 PM

సీపీఆర్‌ ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలి : కొప్పుల ఈశ్వర్

07:30 PM

రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే : వైఎస్ షర్మిల

08:52 PM

ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో నీతూకి పసిడి పతకం..

06:45 PM

అమెరికాలో టోర్నడోల బీభత్సం.. 23 మంది మృతి

06:24 PM

దారుణం.. ఇద్దరు పిల్లలతో సహా కుటుంబం ఆత్మహత్య

08:53 PM

ఎల్‌బీన‌గ‌ర్ చౌర‌స్తాకు శ్రీకాంతాచారి పేరు : మంత్రి కేటీఆర్

05:42 PM

రేపు హైదరాబాద్ వ్యాప్తంగా రాహుల్ అనర్హత వేటుపై నిరసన : రేవంత్‌రెడ్డి

05:29 PM

ఎంజీఎంలో మృతదేహాల తారుమారు..

04:59 PM

తొలి టీ20లో పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్ తొలి విజయం..

04:26 PM

రేపే తుది పోరు.. ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబై ఇండియన్స్ ఢీ

07:19 PM

ఇంటెల్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు గోర్డ‌న్ మూర్ క‌న్నుమూత‌..

03:28 PM

కొత్త మెట్రో లైన్‌ను ప్రారంభించిన ప్రధాని..

03:08 PM

మోడీ కళ్లలో భయాన్ని చూశాను : రాహుల్‌గాంధీ

02:52 PM

సిసోడియాబెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా..

02:04 PM

ఉప్పల్ స్టేడియంలో ముమ్మరంగా ప్రాక్టీస్​ చేస్తున్న సన్ రైజర్స్

07:18 PM

నేను ప్రశ్నించడం ఆపను : రాహుల్ గాంధీ

01:25 PM

ఏప్రిల్ 14న బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహ ఆవిష్కరణ...

01:11 PM

రాహుల్‌పై అనర్హత వేటు.. సుప్రీంలో కీలక పిటిషన్‌

01:09 PM

పొరపాటున పేలిన మూడు క్షిపణులు...

12:55 PM

స్వదేశంలో వరల్డ్ కప్ ముంగిట భారత జట్టుకు జహీర్ ఖాన్ హెచ్చరిక

12:39 PM

నెలలో15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు

12:37 PM

రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలు..!

12:08 PM

దేశంలో కొత్తగా 1590 కరోనా కేసులు...

12:07 PM

టీడీపీ నేత విజయ్‌కు మరోసారి సీఐడీ నోటీసులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.