Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వైద్యారోగ్యశాఖలో కరోనా కలకలం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 19,2022

వైద్యారోగ్యశాఖలో కరోనా కలకలం

- డీహెచ్‌కు పాజిటివ్‌
- ప్రభుత్వాస్పత్రుల్లో పదుల సంఖ్యలో డాక్టర్లు, నర్సులకూ
- సిబ్బంది కొరతతో రోగులకు ఇబ్బందులు
- డోసుల మధ్య గడువు తగ్గించాలి
- కేంద్రానికి మంత్రి హరీశ్‌ రావు లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
రాష్ట్రంలో కరోనా కలకలం రేపుతోంది. రాజకీయ నాయకులకు ఒకరి తర్వాత ఒకరికన్నట్టు సోకుతున్న వైరస్‌ అదే స్థాయిలో ఆయా శాఖల ముఖ్య కార్యాలయాల సిబ్బందిని వదిలి పెట్టడం లేదు. రాష్ట్ర సచివాలయం నడుస్తున్న బీఆర్కె భవన్‌, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, పోలీసు సిబ్బంది ఇలా అన్ని విభాగాల్లో తన ప్రతాపాన్ని చూపిస్తున్నది. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావుకు స్వల్ప లక్షణాలు రాగా టెస్టులో వైరస్‌ సోకినట్టు బయటపడింది. సాధారణ పరిపాలనాశాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌ రాజ్‌, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌.ఏ.ఎం.రిజ్వీ, విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, రోడ్లు, భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి కె.శ్రీనివాసరాజుతో ఆయా కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు, సిబ్బందిలో పదుల సంఖ్య వ్యాధి బారిన పడ్డారు. ఇప్పటికే గాంధీ, ఉస్మానియా, ఎర్రగడ్డ మానసిక వైద్యశాల, నిలోఫర్‌ తదితర ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సులు వందల సంఖ్యలో దీని బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలోనూ దాదాపు 70 మందికి పైగా సిబ్బందికి పాజిటివ్‌ రావడం, మిగిలిన బోధనాస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడం గమనార్హం. ఒకవైపు రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతుండటం, మరోవైపు వైద్యసిబ్బందిలో ఎక్కువ మంది క్వారంటైన్‌ లోకి వెళ్లిపోతుండటంతో వైద్యసేవలకు అంతరాయం కలుగుతున్నది. క్షేత్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ స్వల్ప లక్షణాలు కలిగిన సిబ్బందికి పరీక్షలు చేస్తే పాజిటివ్‌ కేసులు ఎక్కువగా వస్తున్నాయని సమాచారం. ఈ పరిస్థితుల్లో ప్రజలు మరింతజాగ్రత్తగా ఉండా లని డీహెచ్‌ డాక్టర్‌ జి.శ్రీనివాసరావు కోరారు. కోవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వాస్పత్రుల్లో నాన్‌-కోవిడ్‌ సేవలను యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే క్షేత్రస్థాయిలో దాన్ని అమలు చేయడం దుర్లభంగా మారిందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న సిబ్బందిలో ఎక్కువ మంది పాజిటివ్‌ బారినపడ టం, అత్యవసరకేసులు తప్పనిసరిగాచూడటంతో మిగిలినసేవలు నామమాత్రం గా ఉన్నట్టు చెబుతున్నారు. ఇక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో డాక్టరుకు పాజిటివ్‌వస్తే అందుకుప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడాచేయలేదు. దీంతో వచ్చే రోగులను నర్సులు, ఫార్మాసిస్టులు మందులిచ్చి పంపిస్తున్నారు. ఎట్టి పరిస్థి తిల్లోనూ సేవలునిలిచిపోవని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం వైద్యసిబ్బందిలో పాజిటివ్‌ పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై మాత్రం శ్రద్ధ చూపించినట్టు లేదు. ఈ నేపథ్యంలో ప్రజలు కరోనాతో పాటు ఇతర వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడమే మేలని డాక్టర్లు సూచిస్తున్నారు.
డోసుల మధ్య గడువు తగ్గించాలి : కేంద్రానికి మంత్రి హరీశ్‌ రావు లేఖ
   మరోవైపు కరోనా రెండో డోసు, ప్రికాషనరీ డోసు మధ్య గడువును తొమ్మిది నెలల నుంచి ఆరు నెలలకు తగ్గించే అవకాశాన్ని పరిశీలించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్‌ మాండవీయకు లేఖ రాశారు. ఆరోగ్య సిబ్బందికి ఈ గడువును మూడు నెలలకు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఇతర వ్యాధులతో సంబంధం లేకుండా 60 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికి మూడో డోసును ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. 18 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికి బూస్టర్‌ డోసు ఇచ్చే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాల్లో అమలు చేస్తున్న బూస్టర్‌ డోసు పాలసీలు, వాటి ఫలితాల ఆధారంగా తన ప్రతిపాదనలున్నాయని మంత్రి తెలిపారు.
2,983 మందికి కరోనా
   రాష్ట్రంలో కొత్తగా 2,983 మందికి కరోనా సోకింది. ఇద్దరు మరణించారు. సోమవారం సాయంత్రం 5.30 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు 1,07,904 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్‌-19 మీడియా బులెటిన్‌ వెల్లడించింది. 13,895 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 22,472 యాక్టివ్‌ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 1,206 మందికి కరోనా సోకింది. కాగా సోమవారంతో పోలిస్తే మంగళవారం జీహెచ్‌ఎంసీతో సహా 30 జిల్లాల్లో కేసులు పెరిగాయి. ములుగు, సిద్ధిపేట, వనపర్తి జిల్లాల్లో కేసులు తగ్గాయి. పాజిటివ్‌ రేటు 2.76 శాతంగా నమోదయింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'మాస్‌ లైన్‌...' పున:ప్రారంభం
ఫ్యామిలీ ఫిజిషియన్ల డే సందర్భంగా డాక్టర్ల ఉచిత సేవలు
సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శం
నేడు ఢిల్లీకి కేసీఆర్‌...
సుందరయ్య స్ఫూర్తితో దోపిడీ, అణచివేతల వ్యతిరేక పోరాటం
తూకం వేయడం లేదని.. ధాన్యానికి నిప్పంటించిన రైతు
రైతులకు పాసుపుస్తకాలు అందజేయాలి
టీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థిగా రవి నామినేషన్‌
వర్గ ఉద్యమాల్లో శ్రామిక మహిళల పాత్ర కీలకం : ఎస్వీ రమ
చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు మృతి
29లోగా పూర్తి సమాచారాన్ని అందజేయాలి
సమగ్ర భూపంపిణీ కోసం పోరాటాలు
టీఆర్‌ఎస్‌కు షాక్‌
సుందరయ్య ఆదర్శమూర్తి
సీఎస్‌కు పుస్తకాలను బహూకరించిన ఏడీజీ ఉమేష్‌ షర్రాఫ్‌
గాంధీ ప్రభుత్వాస్పత్రిలో ఒకే రోజు ఆరు మోకాలిచిప్ప మార్పిడి శస్త్రచికిత్సలు
పట్టణ ప్రగతిలో అగ్రభాగన నిలబడదాం
కళాకారుల బృందాలకు ఆహ్వానం
ప్రభుత్వాస్పత్రుల్లో ఎనిమిది శాతం పెరిగిన ఆరోగ్యశ్రీ సేవలు
భారీగా పెరిగిన మద్యం ధరలు
గొర్రెల మందపై కుక్కల దాడి
లండన్‌ పారిశ్రామికవేత్తలతో మంత్రి కేటీఆర్‌ భేటీ
జూన్‌ మూడోవారంలో ఇంటర్‌ ఫలితాలు
ద.మ.రైల్వేకు ఐదు జాతీయ నైపుణ్యాభివృద్ధి అవార్డులు
సీనియర్‌ ఐఎఎస్‌లకు అదనపు బాధ్యతలు
సింగరేణిలో 155 క్లర్క్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
గ్రామపంచాయతీలకు నేరుగా నిధులిస్తే తప్పేంటి?
మీ చిల్లర బుద్దిని చూడలేకే... పంచాయతీలకు నేరుగా నిధులు
47 మందికి కరోనా
సిల్వర్‌ లైన్‌ ప్రాజెక్టు అవసరం

తాజా వార్తలు

06:02 PM

ఒప్పో ఎలివేట్ ప్రోగ్రామ్ 2వ ఎడిషన్ కోసం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపిన ఒప్పో

05:59 PM

లండ‌న్‌లో రాహుల్ గాంధీ..

05:44 PM

హైదరాబాద్ కు ప్రధాని మోడీ.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

05:42 PM

ఏపీలో విషాదం..రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్‌ మృతి..

05:26 PM

పద చూస్కుందాం కమల్ 'విక్రమ్' తెలుగు ట్రైలర్..

05:06 PM

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..

04:50 PM

జాతీయ స్థాయి ప‌ర్య‌ట‌న నిమిత్తం ఢిల్లీ బ‌య‌ల్దేరిన సీఎం కేసీఆర్

04:29 PM

రేప‌టి నుండి పదోతరగతి పరీక్షలు..విద్యార్థుల‌కు ఆర్టీసీ గుడ్ న్యూస్

03:46 PM

అలాంటి గుడివాడను క్యాసినోవాడగా కొడాలి నాని మార్చాడు : దివ్యవాణి

03:24 PM

జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్యే ఆజంఖాన్‌

03:04 PM

దిశ ఎన్‌కౌంటర్‌‌పై సుప్రీంలో ముగిసిన విచారణ..ఎన్ కౌంటర్ బూటకం

02:40 PM

పోలీసు ఉద్యోగార్థుల‌కు కేసీఆర్ గుడ్ న్యూస్

02:26 PM

లారీని ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్.. 9 మంది సజీవ దహనం

02:23 PM

గుంటూరు జీజీహెచ్లో సీపీఐ ఆందోళన

01:56 PM

ప్రముఖ నటుడు కెప్టెన్‌ చలపతి చౌదరి కన్నుమూత

01:45 PM

పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన..

01:33 PM

369 పోస్టులతో యూపీఎస్సీ సీడీఎస్‌ నోటిఫికేషన్‌..

01:18 PM

కారులో డ్రైవర్ మృతదేహం..వైసీపీ ఎమ్మెల్సీ వివరణ

01:16 PM

ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ ఫస్ట్ లుక్.. ఊర మాస్‌లుక్‌లో ఎన్టీఆర్

12:53 PM

రైలు పట్టాలపై యువకుని మృతదేహం

12:51 PM

ఏపీ ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు

12:24 PM

విశాఖలో 40 కిలోల గంజాయి స్వాధీనం

12:17 PM

బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కాల్

11:36 AM

నిఖత్ జరీన్ కు ప్రధాని మోడీ, ఆనంద్ మహీంద్రా అభినందనలు

11:26 AM

మెట్టుగూడ వద్ద పవన్ కు ఘన స్వాగతం

10:58 AM

హెల్మెట్ విసిరి, బ్యాట్ ను విరగ్గొట్టిన మ్యాథ్యూ వేడ్

10:49 AM

నిజామాబాద్‌లో చెట్టును ఢీకొట్టిన కారు: వ్యక్తి మృతి

10:48 AM

అందుకే ఈ మ్యాచ్‌లో బాగా ఆడ‌గ‌లిగాను: విరాట్ కోహ్లీ

10:37 AM

నేటితో ముగియ‌నున్న‌ పోలీస్ ఉద్యోగాల‌ దర‌ఖా‌స్తు ప్ర‌క్రియ

10:32 AM

పెండ్లి బస్సు బోల్తాపడి: ఒకరు మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.