Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బడి ఇలా.. చదువు ఎలా..! | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 21,2022

బడి ఇలా.. చదువు ఎలా..!

- ఏటా సర్వేల్లోనే.. పనులు
- కేటాయింపుల్లో నిధులు.. సౌకర్యాలు నిల్‌
- సీడీపీ నిధుల పేరుతో ప్రచారానికే పరిమితం
- కొత్తగా మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కేటాయింపు
- ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలెన్నో..
నవతెలంగాణ-సిటీబ్యూరో
సర్కారు బడులను కార్పొరేట్‌కు దీటుగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం మౌలిక సదుపాయాలే కొరవడ్డాయి. శిథిల భవనాలు, అరకొర వసతులున్న గదులు, పెచ్చులూడుతున్న పైకప్పులు, నిర్వహణ లేక కంపుకొడుతున్న మరుగుదొడ్లు, చెత్తాచెదారంతో నిండిపోయిన ప్రాంగణాలు, దుర్గంధం నడుమే విద్యార్థుల మూత్ర విస్తర్జన.. ఇలాంటి చోట్ల అమ్మాయిల అవస్థలు వర్ణనాతీతం.. ఇదీ ప్రభుత్వ పాఠశాలల దుస్థితి. ప్రతి యేటా విద్యాసంవత్సరం ప్రారంభంలో బడుల్లో వసతుల కల్పనపై సర్వే చేసి హడావుడి చేస్తున్న ప్రభుత్వం.. పనులు చేయడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోంది. ఇప్పుడు కొత్తగా నిధులు కేటాయింపునకు క్యాబినెట్‌ నిర్ణయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నా.. అమలులో చిత్తశుద్ధితో వ్యవహరించి బడి అభివృద్ధికి బాటలు వేయాలని టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరుతున్నారు.
   హైదరాబాద్‌ జిల్లాలో మొత్తం 682 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 182 ఉన్నత, 8 ప్రాథమి కోన్నత, 492 ప్రాథమిక పాఠశాలలున్నాయి. అన్ని బడుల్లోనూ కనీస సదుపాయాలే కరువయ్యాయి. అయినా.. ఉన్నంతలోనే విద్యార్థులు సర్దుకుపోయి చదువుకుంటూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. గదులు ఉన్నచోట ఇతర సౌకర్యాలు లేవు. అవి ఉన్నచోట గదుల్లేవు.. టీచర్లు లేరు. మరుగుదొడ్లు, మూత్రశాలలు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా లేవు. తాగునీటి కొరత తీవ్రంగా ఉన్నది. చాలా చోట్ల ఆర్వో ప్లాంట్స్‌ పనిచేయడం లేదు.
సర్వేలు.. ప్రచార ఆర్భాటాలే..
   ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఏటా విద్యాశాఖ ఆధ్వర్యంలో సర్వేలు చేపడుతున్నారు. వాటి పరిష్కారం దిశగా మాత్రం చర్యలు కొరవడుతున్నాయి. గతేడాది జులైలో విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్‌ఐఎస్‌(స్కూల్‌ ఇన్‌ఫ్రా స్టేటస్‌) సర్వే చేపట్టింది. వసతుల కల్పనకు సంబంధించిన వివరాలు ఆ యాప్‌లో నమోదు చేయించింది. ఈ వివరాల ఆధారంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. కానీ ఈ సర్వే పూర్తి చేసి ఆరు నెలలు గడుస్తున్నా ఒక్క అడుగు ముందుకు పడలేదు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధి నిధుల(సీడీపీ) పేరిట ఒకటి రెండు నెలలు హడావుడి చేశారు. ఈ నిధుల్లో 40శాతం అంటే ఒక్కో నియోజకవర్గ పరిధిలో సుమారు రూ.2 కోట్ల మేర పాఠశాలల అభివృద్ధికి తప్పనిసరిగా ఖర్చు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ డీఈవోల నుంచి ఇప్పటికే నివేదికలు తీసుకున్నా.. పనులు మాత్రం శూన్యం. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సమా వేశంలో.. ప్రయివేటు బడుల్లో ఫీజులపైనా నియంత్రణ కమిటీ ఏర్పాటుతో పాటు సర్కారు బడుల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.7289 కోట్లు కేటాయిస్తూ ఆమోదం తెలిపింది. గతేడాది బడ్జెట్‌లో బడుల్లో వసతుల కల్పనకు రూ.8వేల కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, కేటాయింపులకే పరిమితం కాకుండా ఇకనైనా సర్కారు బడిలో వసతుల కల్పనకు నిధులు వెచ్చించాలని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నేతలు కోరుతున్నారు.
జీజీహెచ్‌ఎస్‌ (దారుల్‌-షిఫా) హైస్కూల్‌ బహుద్దూర్‌పురా
   ఈ బడి సొంత భవనంలో కొనసాగుతోంది. ఉర్దూ మీడియం, కో-ఎడ్యూకేషన్‌. 97 మంది విద్యార్థులు, 7 మంది టీచర్లు పనిచేస్తుండగా.. హెడ్‌మాస్టర్‌ సహా ఇద్దరు టీచర్ల అవసరముంది. తరగతి గదులు అయిదు ఉండగా.. మూడింటిలో లీకేజీలున్నాయి. ఆర్వో ప్లాంట్‌ పనిచేయడం లేదు. బడి ఆవరణ కుంగిపోయింది. పాములు, పంది కొక్కులు, కుక్కలు గదుల్లోకి వస్తున్నాయి. మరుగుదొడ్లు దారుణంగా ఉన్నాయి. నాలుగు యూనిట్లు ఉండగా.. పందికొక్కులు తొవ్వడంతో పనిచేయడం లేదు. అమ్మాయిల టాయిలెట్లు అపరిశుభ్రత కారణంగా నిరుపయోగంగా మారాయి. ప్రహరీ కూలిపోవడంతో రాత్రిపూట కుక్కలు తరగతి గదుల్లోకి వస్తున్నాయి.
జీపీఎస్‌ కవాడిగూడ
   గుండా ఈశ్వరయ్య ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో ఐదు గదులుండాల్సి ఉండగా.. మూడు గదులే ఉన్నాయి. మరో రెండు గదులు నిర్మాణంలో ఉన్నాయి. 1-5వ తరగతిలో 209 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తు న్నారు. ఐదుగురు టీచర్లు ఉన్నారు. ఉన్నత పాఠశాల ఇక్కడే కొనసాగుతోంది. టాయిలెట్‌ బ్లాక్స్‌ తక్కువగా ఉన్నాయి. నిర్మాణం జరగుతుండటంతో చెత్తా చెదారం భారీగా పెరుకుపోయింది.
శిథిల భవనంలో ముషీరాబాద్‌ ఉన్నత పాఠశాల
   ముషీరాబాద్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల దాదాపు 50 ఏండ్ల పాత భవనం. శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. జీహెచ్‌ఎంసీ రెండు సార్లు నోటీసులు కూడా ఇచ్చింది. 20 గదులు అవసరం ఉండగా.. 7 గదులు మాత్రమే ఉన్నాయి. హెచ్‌ఎం, ల్యాబ్‌, రెస్ట్‌, ఉర్దూ స్టాఫ్‌, పీటీఈ స్టాఫ్‌ రూం, స్టోర్‌ రూమ్స్‌ అవసరముంది.
జీబీహెచ్‌ఎస్‌ జనపాడ బాగ్‌ అంబర్‌పేట్‌
   నాలుగు అంతస్తుల భవనం. 12 గదులు ఉన్నాయి. ఇక్కడ మరో రెండు గదులు అవసరం ఉంది. 204మంది విద్యార్థులు ఉండగా.. 11 మంది టీచర్లు ఉన్నారు. మరో ఇద్దరు కావాలి. ఆటస్థలం లేదు. పక్కనే ఉన్న ప్రభుత్వం స్థలం కేటా యిస్తే విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ పెరిగే అవకా శం ఉందని టీచర్లు చెబుతున్నారు. పాఠశాల కాంపౌండ్‌ ఆవరణలో భారీ చెట్టు ఉండటంతో ప్రహరీ కూలిపోయింది. కొద్దిరోజులు గా ఆర్వో ప్లాంట్‌ పనిచేయడం లేదు.
ఆ నిర్ణయం హర్షనీయం : ఏ. శ్యామ్‌సుందర్‌, అధ్యక్షుడు టీఎస్‌యూటీఎఫ్‌- హైదరాబాద్‌ జిల్లా
   ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.7289 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. కానీ గతంలో ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరలేదు. ఇప్పటికైనా బడుల్లో మౌలిక వసతుల కల్పనకు గట్టిచర్యలు తీసుకోవాలి. ప్రీప్రైమరీనుంచే విద్యా ర్థులకు ఇంగ్లీష్‌ బోధనకు కావాల్సిన అన్ని చర్యలు చేపట్టాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బ్యాంకుల్లో రైతుల రుణాలు చెల్లించే బాధ్యత కాంగ్రెస్‌దే..
వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశాలకు కేటీఆర్‌
ఈతకొచ్చి ఇద్దరు.. కుంటలో మునిగి ఇద్దరు మృతి
సాధ్యంకాని చోట ఆర్‌ఆర్‌ఆర్‌ ఇంటర్‌ఛేంజర్‌
జూన్‌ 20లోపు ఇంటర్‌ ఫలితాలు
గాంధీ ఆస్పత్రిలో త్వరలో సంతాన సాఫల్య కేంద్రం
పంటల ప్రణాళికపై రేపు రాష్ట్ర సదస్సు
పర్సా ఆశయసాధన కోసం కృషి చేయాలి
ఆ హంతకులను కఠినంగా శిక్షించాలి
నేటినుంచి టెన్త్‌ పరీక్షలు
మార్కెట్‌ యార్డులో సమస్యలు పరిష్కరించాలి
రక్తమోడిన వరంగల్‌ నగరం
జయశంకర్‌ ఊరిపై నిర్లక్ష్యం ఎందుకు?
పప్పుగింజల సాగను ప్రోత్సహించాలి
పెంచింది బారానా... తగ్గించింది చారానా
ఎర్రజెండా పోరాటాలతోనే ప్రజా సంక్షేమం
వైద్యుని నిర్లక్ష్యంతో..
చిరిగిన గ్రంథం.. శిథిల భవనం
మరో డ్రామా!
ప్రాంతీయపార్టీలతో ప్రత్యామ్నాయ ఫ్రంట్‌
రైతుల పక్షాన మాట్లాడితే కేంద్రానికి గిట్టదు
కేంద్ర నూతన విద్యావిధానం ఏకపక్షం
కేసీఆర్‌ను దించుడే..
సుప్రీం సూచనలు అమలు చేయాలి
పేస్కేలు అడిగితే... వీఆర్‌ఏల అరెస్టులు
జీఎస్టీ పరిహారాలను మరో ఐదేండ్లు పొడిగించాలి
నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు
ఎన్‌ఈపీని రాష్ట్రాలపై రుద్దుతున్న కేంద్రం
రాష్ట్రాభివృద్ధికి కలిసిరండి
బేగంబజార్‌ హత్య కేసును ఛేదించిన పోలీసులు

తాజా వార్తలు

09:56 PM

లోన్ రిక‌వ‌రీ ఏజెంట్ల ఆగ‌డాలు.. మ‌హిళ‌ ఫోటోలు మార్ఫింగ్ చేసి..

09:48 PM

బాచుపల్లిలో సెక్యూరిటీ గార్డుపై ట్రాన్స్ జెండర్లు దాడి

09:32 PM

జ‌పాన్‌కు బ‌య‌లుదేరిన ప్ర‌ధాని మోడీ

09:28 PM

ఐపీఎల్.. హైదరాబాద్ గౌరవప్రదమైన స్కోరు..

09:18 PM

తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల

09:14 PM

యాదాద్రిలో అధికంగా భక్తుల రద్దీ

09:08 PM

రైలు ఎక్కిన 300 ఆర్టీసీ బస్సులు.. వీడియో

08:57 PM

వనజీవి రామయ్యకు పవన్ కల్యాణ్ వీడియో కాల్..

08:42 PM

వ‌రంగ‌ల్ జిల్లా‌లో రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ వైద్యుడు మృతి

08:35 PM

కుతుబ్‌మినార్‌లో తవ్వకాలకు ఆదేశాలు ఇవ్వలేదు : కేంద్రం

08:33 PM

పోలీస్‌స్టేషన్‌కు నిప్పు.. నిందితుల ఇండ్లు కూల్చివేత

08:26 PM

బారాణా పెంచి.. చారాణా తగ్గించారు : మంత్రి హరీశ్ రావు

08:19 PM

లండన్ నుంచి దావోస్‌కు మంత్రి కేటీఆర్

07:58 PM

సోదరుడి కొడుకు పై మహిళ హత్యాయత్నం..!

07:45 PM

కొత్త ఆంగ్ల పదాన్ని పరిచయం చేసిన ఎంపీ

07:37 PM

కారులో నవ దంపతులు సజీవదహనం

07:22 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్

07:12 PM

తల్లి, ఇద్దరు కూతుర్లు దారుణ ఆత్మహత్య.. గ్యాస్ లీక్ చేసుకుని పీల్చి..

07:00 PM

రోడ్డు ప్రమాదంలో బిచ్చగాడు మృతి

06:47 PM

ప్రముఖ గాయకురాలు కన్నుమూత

06:39 PM

తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘానికి అధ్యక్షుడిగా కేటీఆర్

06:32 PM

దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఎంపిక‌..ఉమ్రాన్‌కు చోటు

06:18 PM

దేశంలోని రైతులంద‌రూ ఏక‌తాటిపైకి రావాలి : సీఎం కేసీఆర్

06:05 PM

అన్నమయ్య జయంతి ఉత్సవాలు ముగింపు

06:00 PM

గాంధీ ఆస్పత్రిలో ఎంఆర్ఐ మిషన్, క్యాత్ ల్యాబ్ ప్రారంభం

05:51 PM

వరుడికి బట్టతల ఉందని పెండ్లి ఆపేసిన వధువు

05:38 PM

శేఖర్ చిత్రం నిలిపివేతపై రాజశేఖర్ సంచలన ఆరోపణలు

05:29 PM

ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీగా స‌లీల్ ప‌రేఖ్

05:22 PM

ఆఫీసుకు వెళ్లలేక సాఫ్టవేర్ ఉద్యోగి ఆత్మహత్య

05:11 PM

ఎస్‌బీఐ ఖాతాదారుల‌కు కేంద్రం హెచ్చ‌రిక‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.