Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మిర్చి రైతు కన్నెర్ర | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 25,2022

మిర్చి రైతు కన్నెర్ర

- వరంగల్‌ మార్కెట్‌లో గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌
- మార్కెట్‌ ప్రధాన కార్యాలయం ముట్టడి
నవతెలంగాణ-కాశిబుగ్గ
వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం మిర్చి రైతులు ఆందోళన బాట పట్టారు. జెండా పాటలో ఒకరిద్దరికి మాత్రమే మద్దతు ధర ఇచ్చి మిగతా రైతులకు తక్కువ ధర ఇవ్వడంతో రగిలిపోయారు. తమకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ, మిర్చి యార్డు నుంచి మార్కెట్‌ ప్రధాన కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న వరంగల్‌ ఏసీపీ గిరికుమార్‌ ఆధ్వర్యంలో ఇంతేజార్‌ గంజ్‌ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతుల ఆందోళనతో వ్యాపారు లతో అధికారులు చర్చలు జరిపారు. మిర్చి నాణ్యత చూసి మరోసారి పరిశీలించాలని, ధరలు సవరించాలని వ్యాపారులకు అధికారులు సూచించారు. ఈ విషయంలో.. ఇప్పటికే నిర్ణయించిన ధరకు రూ.2వేలు అదనంగా ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేశారు. ఓ వైపు చర్చలు జరుగుతుండగానే మరోవైపు అధికారులు కాంటాలు నిర్వహిస్తుండటంతో రైతులు తీవ్ర ఆవేశానికి లోనయ్యారు. మిర్చి యార్డులోని కంటాలను ధ్వంసం చేశారు. మిర్చిని లోడ్‌ చేస్తున్న డీసీఎం వాహనంపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. మిర్చి బస్తాలను కింద పడేశారు. రైతుల దాడిని అడ్డుకొన్న ఏసీపీ, సీఐ మల్లేష్‌ యాదవ్‌ రైతులకు నచ్చజెప్పి శాంతింపజేశారు. రైతులతో మార్కెట్‌ అధికారులు, పాలకవర్గం జరిపిన చర్చలు సఫలం కాకపోవడంతో సాయంత్రం వరకు మిర్చి యార్డులో కాంటాలు జరగలేదు. దాంతో నేడు, రేపు మార్కెట్‌యార్డుకు మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ సెలవు ప్రకటించారు.
   ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వ్యాపారస్తులు మార్కెట్‌ అధికారులు కుమ్మక్కై కావాలనే ధరలు తగ్గిస్తున్నారని రైతులు విమర్శించారు. సోమవారం వరంగల్‌ మార్కెట్‌ యార్డుకు సుమారు 20,000 మిర్చి బస్తాలు రాగా అందులో తేజాలకు జెండా పాటలో రూ. 17,200 ధర పెట్టారని అన్నారు. ఒకరిద్దరికి మాత్రమే గరిష్ట ధర పెట్టి మిగతా వారికి రూ.14వేల లోపు ధర చెల్లించారని వాపోయారు. ఒకే క్వాలిటీ ఉన్న మిర్చికి ధరలో ఇంత తేడా ఎందుకని ప్రశ్నించారు. సాధారణంగా ఒకే రకం మిర్చికి ధరలో రూ.500 నుంచి రూ.1000 తేడా ఉంటుందని, కానీ, వ్యాపారులు రూ.4వేల నుంచి రూ.5వేల వరకు తేడాతో కొనుగోలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.14వేల లోపు ధర పెట్టిన రైతులకు మరో రెండు వేలు కలిపి చెల్లించాలని డిమాండ్‌ చేసినా వ్యాపారుల నుంచి స్పందన లేదని వాపోయారు. ఇప్పటికే అధిక వర్షాలు, తెగుళ్లతో తీవ్రంగా నష్టపోయిన తమకు ఉన్న కొద్దిపాటి పంట అమ్మడానికి మార్కెట్‌కు వస్తే తమను నిండా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా బాధిత రైతులకు సీపీఐ(ఎం) కాశిబుగ్గ ఏరియా కార్యదర్శి బషీర్‌ అహ్మద్‌ మద్దతు తెలిపి మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పాలనలో రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. రైతులు ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నా టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడం సిగ్గుచేటని తెలిపారు. ఒకే రకం మిర్చి పంటకు ధర రూ.6వేల నుంచి రూ.7వేల తేడా ఉండటం ఏమిటని ప్రశ్నించారు.
అధికారుల నుంచి స్పందన లేదు : కిషన్‌రావు, నర్సక్కపల్లె, నడికూడ, వరంగల్‌
   ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నా అధికారుల నుంచి స్పందన లేదు. ఇప్పటివరకు తిండి లేదు, నీళ్లు లేవు. రెండు ఎకరాల్లో మిర్చి తోట వేస్తే నాలుగు బస్తాలు పండింది. మార్కెట్‌కు వస్తే ఒక ఇద్దరికీ ధర రూ.17,200 పెట్టి మిగతా వారికి రూ.10వేల నుంచి రూ.14వేల లోపు చెల్లిస్తు న్నారు. ఇప్పటికే వడగండ్ల వాన, తెగుళ్లతో నష్టపోయాం. పెట్టుబడి, కూలీల చార్జీలు పెరిగాయి. ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి మిర్చి పంట కొనుగోలు చేయాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కేంద్ర నూతన విద్యావిధానం ఏకపక్షం
కేసీఆర్‌ను దించుడే..
సుప్రీం సూచనలు అమలు చేయాలి
పేస్కేలు అడిగితే... వీఆర్‌ఏల అరెస్టులు
జీఎస్టీ పరిహారాలను మరో ఐదేండ్లు పొడిగించాలి
నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు
ఎన్‌ఈపీని రాష్ట్రాలపై రుద్దుతున్న కేంద్రం
రాష్ట్రాభివృద్ధికి కలిసిరండి
బేగంబజార్‌ హత్య కేసును ఛేదించిన పోలీసులు
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
రేపటినుంచి 'పది' పరీక్షలు
కట్టేది మేడలు.. జీవనం గుడిసెల్లో..
కులదురహంకార హత్యపై బేగంబజార్‌ మార్కెట్‌ బంద్‌
ఒకే దఫా రెండు లక్షల రుణమాఫీ
మతం పేరుతో రాజకీయమా..
సీతారామ ప్రాజెక్టు కాలువలో ఇద్దరు మృతి
సంపదను కొల్లగొట్టిన కేసీఆర్‌ కుటుంబం
ఎస్‌టీపీపీకి జాతీయ పురస్కారాలు
ద.మ.రైల్వేలో ఉగ్రవాద వ్యతిరేక ప్రతిజ్ఞ
ప్రమాద బాధితులను ఆదుకోవాలి
నీరజ్‌ హంతకులను కఠినంగా శిక్షించాలి : ఐద్వా
టీఎఎస్‌ఎహెచ్‌సీ ఏర్పాటు
డీఎస్పీ అభ్యర్థుల వయోపరిమితి రెండేండ్లు పెంపు
సమస్యలను పరిష్కరించిన స్టాండింగ్‌ కమిటీకి కృతజ్ఞతలు
'గుట్ట'లో ఆటో కార్మికుల కోర్కెలను తీర్చండి
రైతు ఆత్మహత్య
రాజీవ్‌ మార్గంలో వెళ్లడమే ఘనమైన నివాళి
నలుగురు డిప్యూటీ కలెక్టర్ల బదిలీ
వీఆర్‌ఏల అరెస్ట్‌
వీఆర్‌ఏల అక్రమ అరెస్టులు సరిగాదు

తాజా వార్తలు

04:36 PM

పెట్రోల్‌పై రూ. 18 పెంచి రూ. 8 త‌గ్గించారు : ఉద్ధవ్‌ థాకరే

04:31 PM

దావోస్‌లో ఏపీ పెవిలియ‌న్‌ను ప్రారంభించిన ఏపీ సీఎం జ‌గ‌న్‌

04:28 PM

శేఖర్ సినిమా ప్రదర్శనలు నిలిపివేత

04:21 PM

భారత బ్యాడ్మింటన్ బృందంతో ప్రధాని మోడీ సమావేశం

04:13 PM

పరిగి ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం..!

03:54 PM

100 అడుగుల బోరుబావిలో పడిన బాలుడు

03:46 PM

విద్యార్థిని చెంపదెబ్బ కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

03:28 PM

కేంద్రంపై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం

03:13 PM

తిరుమల శ్రీవారికి లారీ విరాళం

03:08 PM

కేజీఎఫ్‌-2 నుంచి మరో వీడియో సాంగ్ విడుదల

02:57 PM

25న భారత్ బంద్‌

02:43 PM

జయశంకర్ సారుకు గుర్తింపు లేకుండా చేశారు : రేవంత్ రెడ్డి

02:38 PM

మరో రెండు దేశాలకు పాకిన మంకీపాక్స్

02:23 PM

గొప్పల కోసమే డబ్బులు పంచుతున్న సీఎం కేసీఆర్ : బండి సంజయ్

02:16 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను క‌లిసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌

01:26 PM

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంది హత్యే.. పోస్టుమార్టం నివేదిక

01:10 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

12:49 PM

కొండపోచమ్మ జలాశయంలో విషాదం..ఇద్దరు యువకులు గల్లంతు

12:38 PM

హోట‌ల్‌లో చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్ అభిమానుల భేటీ

12:30 PM

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది మృతి

12:15 PM

తెలంగాణ సొమ్మును పంజాబ్ రైతులకు పంచ‌డానికి మీ తాత జాగీరా దొరా?

12:05 PM

ఓడిన ఢిల్లీ..ఆర్సీబీ సంబరాలు..వీడియో వైరల్

11:44 AM

అల్లు అర్జున్ కుమార్తె సమాధానంపై నెటిజన్ల ఫైర్..

11:36 AM

రోడ్డు ఫ్లైఓవర్‌ నుంచి కిందపడ్డ కారు..దంపతులు మృతి

11:33 AM

బీర్ల లారీ బోల్తా..ఎగబడిన స్థానికులు

11:10 AM

భాగ్యరెడ్డి వర్మకు నివాళులర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

10:47 AM

దేశంలో కొత్తగా 2,226 పాజిటివ్ కేసులు నమోదు

10:30 AM

బైక్‎ను ఢీకొట్టిన లారీ..ఇద్దరు మృతి

10:15 AM

కొనుగోలు కేంద్రంలో 54 వడ్ల బస్తాలు మాయం

10:09 AM

షుగర్ ఫ్యాక్టరీ మూసివేయించినందుకే కవిత ఓడిపోయారు : జీవన్‌రెడ్డి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.