Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జ్వర సర్వే దేశానికే ఆదర్శం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 29,2022

జ్వర సర్వే దేశానికే ఆదర్శం

- వందశాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యం
- రాష్ట్రంలో 77,33,427 ఇండ్లల్లో జ్వర సర్వే : హరీశ్‌ రావు
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కోవిడ్‌ రెండో దశలో తెలంగాణ రాష్ట్రంలో చేసిన జ్వర సర్వే దేశానికే ఆదర్శమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు అన్నారు. కేంద్ర ఆరోగ్య సంస్థలు సైతం దీనిపై ప్రశంసలు కురిపించాయని గుర్తు చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన అధునాతన క్యాథ్‌ ల్యాబ్‌, ట్రామా కేర్‌, మిల్క్‌ బ్యాంక్‌ని మంత్రి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం మాత, శిశుసంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్‌తో కలిసి మాట్లాడారు. ఫీవర్‌ సర్వేను దేశ వ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ఆరోగ్య సంస్థలు సూచించాయని తెలిపారు. రాష్ట్రంలో జ్వర సర్వే పలు జిల్లాల్లో ముగిసిందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 77,33,427 ఇండ్లల్లో జ్వర సర్వే చేసి 3,45,951 కిట్లను అందించామని తెలిపారు. టెస్టింగ్‌, హౌం ఐసోలేషన్‌ కిట్లకు కొదువ లేదన్నారు. వ్యాక్సినేషన్‌ రెండు డోసులు వేగంగా పూర్తి చేసిన జిల్లాగా కరీంనగర్‌ దక్షిణ భారతదేశంలోనే ముందుందని చెప్పారు. ఆ తర్వాతి స్థానంలో 94 శాతంతో ఖమ్మం జిల్లా ఉందన్నారు. మంత్రి అజరు, జిల్లా కలెక్టర్‌, వైద్యారోగ్యశాఖ అధికారులు దృష్టి సారించి జిల్లాలో రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ వందశాతం పూర్తి చేయాలన్నారు. రూ. 7.5 కోట్లతో క్యాథ్‌ ల్యాబ్‌ ప్రారంభించుకున్నామనీ, ఇది రాష్ట్రంలోనే నాల్గవ ల్యాబ్‌ అని తెలిపారు. ఈ సేవలు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయనీ, రాష్ట్రంలో నిమ్స్‌, ఉస్మానియా, ఎంజీఎం ఆస్పత్రుల్లో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. హైదరాబాద్‌కు దూరంలో ఖమ్మం ఉన్న నేపథ్యంలో ఇక్కడి ప్రజల సౌలభ్యం మేరకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో ఇక్కడ ల్యాబ్‌ ఏర్పాటు చేశామన్నారు. గుండె సంబంధ సమస్యలకు లక్షల్లో ఖర్చు అయ్యే చికిత్స ఇక్కడ ఉచితంగా అందనున్నదన్నారు. కార్డియాలజిస్టులనూ నియమించామని తెలిపారు. మంత్రి పువ్వాడ అజరు కోరిక మేరకు కీమో థెరపీ, రేడియో థెరపీ సేవలనూ అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎంఆర్‌ఐ ఏర్పాటు చేస్తామన్నారు. మార్చురీలను ఆధునికీకరణ చేస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీని ఆధునికీకరణ చేస్తామని తెలిపారు. మంత్రులతో పాటు ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌ రెడ్డి, రాములు నాయక్‌, టీస్‌ఎంఎస్‌ఐడిసి ఛైర్మెన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, డీఎంహెచ్‌వో మాలతి, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ బి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఫీవర్‌ సర్వేపై ప్రశంసలు
దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్న కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ
   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా నిర్వహిస్తున్న జ్వర సర్వేను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్‌ మాండవీయ ప్రశంసించారు. ఈ సర్వేను అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, కేరళ, తమిళనాడు, లక్షద్వీప్‌, అండమాన్‌ నికోబార్‌, పుదుచ్చేరి రాష్ట్రాల వైద్యారోగ్య శాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించింది. తెలంగాణ తరపున ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి మంత్రి హరీశ్‌ రావు హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా మూడో వేవ్‌ సన్నద్ధత, జ్వర సర్వే తీరు, వ్యాక్సినేషన్‌ తదితర అంశాలపై వివరించారు. 60 ఏండ్లు దాటిన అందరికీ బూస్టర్‌ డోసు ఇవ్వాలని, రెండు డోసుల గడువు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఈసీఆర్పీ - 2 పెండింగ్‌ నిధులు రూ. 248 కోట్లు విడుదల చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ఫీవర్‌ సర్వేను 'మంచి వ్యూహం'గా కేంద్రమంత్రి అభివర్ణించారు. ఇదే విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో అనుసరించేందుకు రూపకల్పన చేస్తామని వెల్లడించారు. రెండో వేవ్‌ సమయంలో కరోనా కట్టడి కోసం దేశంలోనే తొలిసారి తెలంగాణ జ్వర సర్వే మొదలు పెట్టి మంచి ఫలితాలు సాధించిందని వివరించారు. కోవిషీల్డ్‌ రెండు డోసుల గడువును తగ్గించాలనీ, అలాగే రెండో డోసు ప్రికాషనరీ డోసు మధ్య వ్యవధి 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించాలని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ఇంచార్జ్‌ కమిషనర్‌ రమేష్‌ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయపు ఓఎస్‌డీ గంగాధర్‌, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ, జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

టీచర్లూ...ఆస్తుల వివరాలివ్వండి!
ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం
సెల్లార్‌ మట్టిపెళ్లలు కూలి ముగ్గురు కార్మికుల మృతి
దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం
సత్యనారాయణ మృతి తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర 4వ మహాసభ ఆహ్వాన కమిటీ ఏర్పాటు
సర్కార్‌తోట రాయపోల్‌కే చెందాలి
బీసీ విద్యార్థులకు హార్వర్డ్‌ చదువులు
దళితులను, ఆదివాసీలను విస్మరిస్తున్న బ్యాంకులు
కరోనా కేసులు పెరుగుతున్నాయి
సీఎంఆర్‌ బియ్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా కొనాలి
ఐబీపీఎస్‌ ద్వారా ఉద్యోగాల భర్తీ
బదిలీలు,పదోన్నతుల షెడ్యూల్‌ ప్రకటించాలి
కేసీఆర్‌ ప్లేస్‌, డేట్‌ చెప్పండి..చర్చకు సిద్ధం
నోట్లో గుడ్డలు కుక్కి.. మహిళపై లైంగికదాడి
అగ్నిపథ్‌ ఆందోళనకారులను బేషరతుగా విడుదల చేయాలి
కోట్ల రూపాయలు నష్టపోతాననే..
ఈ నెల 27,28,29 తేదీల్లో స్వగృహ లాటరీ
సీఎం, మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలు ఏటా విడుదల చేయాలి : బండి
నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆర్టీసీ సిబ్బందిని పరామర్శించిన చైర్మెన్‌
టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో ఎస్‌ఎస్‌ఆర్‌ ధరల పెంపు
పాలరైతుల పెండింగ్‌ ప్రోత్సాహకాలు ఇవ్వండి
ఐబీపీఎస్‌ ద్వారా ఉద్యోగాల భర్తీ
అక్రమ బదిలీలు రద్దు చేయాలి : టీపీటీఎఫ్‌
ఉద్యోగార్ధులుగా కాదు.. ఉద్యోగ సృష్టికర్తలుగా మారాలి
కస్టమ్‌మిల్లింగ్‌ రైస్‌ను ఎఫ్‌సీఐ సేకరించాలి
పోడు గోడు పట్టదా?
గొర్రెల పంపిణీలో అక్రమాలు
మూడు పంటలు పండే భూములిచ్చాం
నెలవారీ టార్గెట్లు, రాజకీయ వత్తిళ్లు

తాజా వార్తలు

09:55 PM

రేపు య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్‌.. హాజ‌రు కానున్న మంత్రి కేటీఆర్

09:28 PM

టీమిండియా, ఐర్లాండ్ టీ20 మ్యాచ్ ప్రారంభానికి వర్షం అడ్డంకి

09:02 PM

రేపు శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన..

08:44 PM

28న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు

08:33 PM

రెబెల్ వర్గంలో చేరిన మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్

08:18 PM

మోడీ చదువు లేని వ్యక్తి.. అందుకే ఇలాంటి నిర్ణయాలు : రేవంత్ రెడ్డి

08:09 PM

28న రాజ్‌భవన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:37 PM

రేపటి నుంచి బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ

07:36 PM

సనత్‌నగర్‌లో దారుణం..

07:30 PM

తుపాకితో వచ్చి నగల షాపులో దోపిడీ..యజమాని మృతి

06:35 PM

గిన్నిస్ బుక్ లోకి తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమ'

06:23 PM

ఆర్టీసీ బ‌స్సులో గ‌ర్భిణి ప్ర‌స‌వం..

05:50 PM

నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌..ధరకే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ లు

05:13 PM

దేశంలో బై బై మోడీ ట్రెండింగ్ అవుతోంది: బాల్క సుమన్

05:05 PM

భార్యను హత్య చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌..

04:54 PM

28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

04:16 PM

ప్రేమించిన యువతి ఇంటి ముందు యువకుడి ఆత్మహత్మ

04:04 PM

క్లబ్ లో చెల్లా చెదురుగా మృతదేహాలు.. ఎం జరిగింది..?

03:52 PM

జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ

03:28 PM

శ్రీలంకలో లీటర్​ పెట్రోల్​ రూ.550, డీజిల్​ రూ.460..

03:01 PM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

02:48 PM

సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓట‌మి

02:41 PM

అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్ రెడ్డి

02:30 PM

ఈనెల 28న నూతన చీప్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణం

02:05 PM

టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

01:44 PM

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై కేటగిరి భద్రత..!

01:33 PM

ఈస్ట్‌ గోదావరిలో థియేటర్ల బంద్‌!

01:17 PM

ఎస్‌పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌కు ఎన్‌బీఏ గుర్తింపు రావాలి: టీటీడీ జేఈఓ

01:01 PM

కాజీపేట-బల్లార్షా మధ్య పలు రైళ్లు రద్దు

12:51 PM

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైక్లోథాన్ పోటీలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.