Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆటోవాలా బతుకు ఆగం..! | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 13,2022

ఆటోవాలా బతుకు ఆగం..!

- చమురు ధరల పెంపుతో దిక్కుతోచని స్థితి
- అదనపు చలాన్లతో సర్కారు దోపిడీ
- పెరిగిన ధరలకు అనుగుణంగా పెరగని చార్జీలు
- ఆందోళనలో ఆటో కార్మికులు
- ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కార్మికుల డిమాండ్‌
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
              చమురు ధరల పెంపుతో ఆటో కార్మికుల బతుకులు ఛిద్రమైనవి. పెరిగిన ధరలకు అనుగుణంగా చార్జీలు పెరగకపోగా.. అదనంగా ప్రభుత్వం చలాన్ల పేరుతో పెనాల్టీలు వేసి కార్మికులను ఊపిరి పీల్చుకోనీయకుండా చేస్తోంది. పెట్రోల్‌, డీజల్‌, గ్యాస్‌ ధరలు పెంచడంతో ఆటో రంగం కుదేలైంది. రోజంతా ఆటో నడిపితే వచ్చే డబ్బులు ఆటో మెయింటెనెన్స్‌, ఫైనాన్స్‌కే సరిపోవడం లేదు. పైగా అదనపు పెనాల్టీలు కట్టలేక అవస్థలు పడుతున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు వివిధ ప్రాంతాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన యువత ఎక్కువ మంది ఆటో డ్రైవర్లుగా జీవనం సాగిస్తోంది. జిల్లాలో సుమారు 3లక్షల మంది ఆటో కార్మికులు ఉన్నారు. ఇందులో 60 శాతం మంది అద్దె ఆటోలు నడుపుతున్నారు. ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పట్టిందని అనుకుంటున్న సమయంలో కార్మికుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చాల్లింది. వరుసగా చమురు ధరలు పెరడంతో ట్రాన్స్‌పోర్టు రంగంపై కోలుకోలేని దెబ్బపడింది. దీంతో ఎంతోమంది ఆటో డ్రైవర్లు ప్రభుత్వం వేసిన పెనాల్టీలు చెల్లించలేక ఆటోలను వదిలివేశారు.
              కాటేదాన్‌ ప్రాంతానికి చెందిన మల్లేశ్‌ 20 ఏండ్లుగా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. పాత ఆటో అమ్మి కొత్త ఆటో కొనుగోలు చేద్దామని ఆటో కన్సల్‌టెన్సీకి వెళ్లాడు. పాత ఆటోను అమ్మకానికి పెడితే రూ.లక్ష 10 వేలకు ధర నిర్ణయించారు. కానీ తన చేతికి అందింది మాత్రం రూ.10 వేలు మాత్రమే.. మిగతా రూ.లక్ష ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఫిట్‌నెస్‌ పెనాల్టీ కింద చెల్లించాల్సి వచ్చింది. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టంగా ఉన్న తరుణంలో ఫిట్‌నెస్‌ చార్జీలు రెగ్యూలర్‌గా చెల్లించకపోవడంతో ప్రభుత్వం అందిన కాడికి దోచుకుంది. కొత్త ఆటో కొందామని.. పాతదాన్ని తీసుకొని పోతే అసలులే లేకుండా పోయింది.
              ఎల్‌బీనగర్‌ ప్రాంతానికి చెందిన నవీన్‌ ఐదేండ్లుగా ఆటో నడుపుతున్నారు. మూడేండ్లుగా కరోనాతో పెద్దగా ఆటోకు గీరాకీ లేక కుటుంబాన్ని కష్టతరంగా నెట్టుకొచ్చాడు. ప్రసుత్తం ప్రభుత్వం చమురు ధరలు పెంచడం, చలాన్ల వసూలు చేయడంతో ఫైనాన్స్‌లు చెల్లించలేక రోజురోజుకూ అప్పులు పెరుగుతున్నాయని ఆటో అమ్మాడు. అయినా ఫైనాన్స్‌ బకాయిలు తీరకపోవడంతో భార్య బంగారం తాకట్టు పెట్టి ఫైనాన్స్‌ క్లియర్‌ చేశాడు. ప్రస్తుతం దినసరి కూలీ పనులు చేస్తున్నాడు. ప్రభుత్వం పెట్రోల్‌, డీజల్‌ ధరలు పెంచడంతోపాటు పెనాల్టీలు వసూలు చేయడంతో తమ పరిస్థితి దయనీయంగా మారిందని ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పొద్దాంతా తిరిగినా గిట్టుబాటు లేదు
              పెరిగిన ధరలకు అనుగుణంగా చార్జీల పెరగకపోవడం, దీనికి తోడు ఓలా, ఊబర్లు ఆటో కార్మికుల నడ్డి విరిచాయి. ప్రయాణికులు ఓలా, ఊబర్ల చార్జీల ప్రకారమే ఆటోలకు కూడా చెల్లిస్తుండటంతో కార్మికులకు గిట్టుబాటు అవడం లేదు. రోజుకు సుమారు రూ.1500 వస్తే.. అందులో పెట్రో, గ్యాస్‌ లేదా డీజల్‌ ఖర్చులు రూ.600 పోను, ఆటో మెయింటెనెన్స్‌ రూ.100, ఫైనాన్స్‌ రూ.300, అడ్డ చార్జీ రూ.100, డ్రైవర్‌ తిండి ఖర్చు రూ.100 ఇలా అన్నీ పోను రోజుకు రూ.300 నుంచి 400 మాత్రమే మిగులుతున్నాయి. పెరిగిన ధరలతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం ఆటో కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని ఆటో కార్మికులు కోరుతున్నారు.
పూట గడవడమే కష్టంగా ఉంది
ఆటో కార్మికుడు రాజు- రాజేందర్‌నగర్‌
              పొద్దాంతా ఆటో తిప్పినా సాయంత్రానికి రూ.400 కూడా చేతికి వస్తలేవు. ఇంటి అద్దె చెల్లింపులకు అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం చమురు ధరలను జీఎస్‌టీ పరిధిలోకి తేవాలి. ధరలను నియంత్రించాలి. ఆటో కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి కార్మికులను ఆదుకోవాలి.
పెనాల్టీలను రద్దు చేయాలి
రుద్రకుమార్‌- తెలంగాణ రోడ్డు ప్రయివేటు టాన్స్‌పోర్టు వర్కర్స్‌ అండ్‌ ఫెడరేషన్‌ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి
              పెరిగిన చమురు ధరలతో ఆటో కార్మికుల జీవనం దుర్భరంగా మారింది. బతకడమే కష్టతరమైన పరిస్థితిలో ప్రభుత్వం పెనాల్టీల పేరుతో డబ్బులు వసూలు చేయడం శ్రేయస్కరం కాదు. తక్షణమే ఫిట్‌నెస్‌ పెనాల్టీల వసూలు పక్రియను వెనక్కి తీసుకోవాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

డిజిటల్‌ ఇండియా పేరుతో మోసం
వర్క్‌ టూ ఓనర్‌ పథకాన్ని త్వరగా పూర్తి చేయాలి
నీట్‌ కోసం ఆడిప్రిప్‌ను విడుదల చేసిన ఆకాశ్‌ బైజూస్‌
టీఆర్టీ నోటిఫికేషన్‌ ప్రకటించాలి
ఇంజినీరింగ్‌ ఫీజుల పెంపుపై కసరత్తు
పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు
మరో ఎనిమిది మంది కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ
గ్యాస్‌ బండ ధర పెంపుదలను నిరసిస్తూ...
అర్హులకు తక్షణం పెన్షన్లు ఇవ్వండి
ఏపీ గ్రూప్‌-1 ఫలితాల్లో 21వ సెంచరీ ఐఏఎస్‌ అకాడమి అభ్యర్థుల ఎంపిక
పెట్టుబడులు పెట్టండి - అండగా ఉంటాం
మళ్లీ 'పోడు' గోడు
తీరని అన్యాయం
కాలగర్భంలోకి.. కాకతీయ కట్టడాలు
వెల్‌నెస్‌ సెంటర్లలో అడ్డగోలు ప్రిస్క్రిప్షన్లు
ప్రయివేటు విద్యా సంస్థల్లో ఇబ్బడి ముబ్బడిగా ఫీజుల వసూలు
దొంగ బాబాలు, నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠాల అరెస్ట్‌
రేపు హైదరాబాద్‌లో మహాధర్నా
'జాక్టో' డీఎస్‌ఈ ముట్టడి ఉద్రిక్తం
ఆస్పత్రుల్లో పెరిగిన ప్రసవాలు.. తగ్గుతున్న మాతాశిశు మరణాలు
సరళీకరణ విధానాలు, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం
పర్యాటకానికి పునర్వైభవం
బురదరోడ్లపై నాట్లు వేసి నిరసన
అర్జీకే ఇండ్లను వెడల్పు చేయాలి...
'రవాణా'కు కమిషనర్‌ వచ్చారు..
ప్రతిష్టాత్మకంగా కాకతీయ వైభవ సప్తాహం : మంత్రి కేటీఆర్‌
కృష్ణన్నతో మాట్లాడుతా..!
ఇంటర్‌ విద్యార్థులకు ఉచిత బస్‌పాస్‌
సీజనల్‌ వ్యాధులపై మూడంచెల వ్యూహం
నెట్‌వర్క్‌ ఆస్పత్రులతో త్వరలో సమావేశం

తాజా వార్తలు

09:54 PM

పదో తరగతి పాసైన 58 ఏండ్ల ఎమ్మెల్యే

09:50 PM

మెట్రో స్టేష‌న్‌లో మహిళపై లైంగికవేధింపులు

09:40 PM

తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు

09:34 PM

రేపు శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల

09:29 PM

రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు

09:16 PM

రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్రప్రసాద్‌

09:05 PM

రూ. 40 వేల కోట్ల అవినీతిని బయటపెడతా : కోమటిరెడ్డి

08:58 PM

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

08:52 PM

నిజామాబాద్‌లో ముగ్గురు పీఎఫ్ఐ సభ్యుల అరెస్టు

08:42 PM

ధరణిని రద్దు చేయాల్సిందే : రేవంత్ రెడ్డి

08:32 PM

బాబూ జగజ్జీవన్ రామ్ ఫోటోకు అవ‌మానం

08:25 PM

టెట్ పాసైన అభ్యర్థులకు శుభవార్త

08:11 PM

వర్షపు నీటిలో కూర్చుని సీపీఐ(ఎం) నేత నిరసన

07:55 PM

లోన్‌యాప్ సంస్థల్లో ఈడీ తనిఖీలు

07:42 PM

ఢిల్లీలో విమానం ఇంజన్ ఫెయిల్..!

07:30 PM

తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

07:17 PM

ఒకేసారి యుద్ధ విమానాన్ని నడిపిన తండ్రి, కూతురు

07:13 PM

10 మంది మంత్రుల రాజీనామా..!

06:55 PM

ఆటోలో నుంచి పడిపోయిన బాలుడు..

06:45 PM

ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

06:29 PM

11.16 లక్షలమంది పేదలకు తక్షణమే పెన్షన్లు మంజూరు చేయాలి

06:21 PM

రంగారెడ్డి జిల్లాలో డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా

06:17 PM

డోలో ట్యాబ్లెట్ తయారీ సంస్థపై ఐటీ దాడులు

05:55 PM

బూస్టర్ డోస్‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం

05:34 PM

తమిళనాడు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

05:27 PM

ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా

05:20 PM

ఉపాధ్యాయుడిపై దాడి

05:08 PM

'ది వారియర్`ఈవెంట్‌కు 28 మంది అతిథులు

04:59 PM

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

04:45 PM

'కాళీ`పోస్టర్ వివాదం.. క్షమాపణలు చెప్పిన కెనడా మ్యూజియం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.