Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎన్‌ఈపీని రాష్ట్రాలపై రుద్దుతున్న కేంద్రం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 22,2022

ఎన్‌ఈపీని రాష్ట్రాలపై రుద్దుతున్న కేంద్రం

- అనేక అంశాలపై భిన్నమైన అభిప్రాయాలున్నాయి
- లోతైన చర్చ జరగడం అవసరం
- పరీక్ష ద్వారానే పీహెచ్‌డీ ప్రవేశాలు
- ఆర్ట్స్‌ కాలేజీ జ్ఞానానికి ప్రతీక
- రాజకీయ నాయకులకు అనుమతి లేదు : ఓయూ వీసీ రవీందర్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
'విద్యారంగం ఉమ్మడి జాబితాలో ఉన్నది. అయినా నూతన విద్యావిధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించలేదు. కానీ ఎన్‌ఈపీని అమలు చేస్తున్న కర్ణాటక ప్రభుత్వం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నది. యూజీసీ చైర్మెన్‌తో భేటీ అయినపుడు ఓయూ నుంచి కొన్ని ప్రతిపాదలు చెప్పాం. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నది. రాష్ట్రాలపై ఎన్‌ఈపీని రుద్దడం ఇబ్బందికరం. క్షేత్రస్థాయిలో దాని అమలుకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేదు. ఎన్‌ఈపీలో అనేక అంశాలపై భిన్నమైన అభిప్రాయాలున్నాయి. దానిపై లోతుగా చర్చించాల్సిన అవసరముంది. వీసీల సమావేశంలోనూ దానిపై చర్చించాం. యూజీసీ ఇస్తున్న మార్గదర్శకాలను ముందుకు తీసుకెళ్తున్నాం. డిగ్రీలో క్లస్టర్‌ విధానం అమలు అందులో భాగమే. అకడమిక్‌ బ్య్రాంక్‌ ఆఫ్‌ కెడిట్స్‌పై అధ్యయనం చేస్తున్నాం. ఆ నివేదిక వచ్చాక అమలు చేస్తాం.'అని ఓయూ వీసీ డి రవీందర్‌ చెప్పారు. వీసీగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరీక్ష ద్వారానే పీహెచ్‌డీ ప్రవేశాలు చేపడతామని స్పష్టం చేశారు. 2017కు ముందు పీహెచ్‌డీలో చేరిన వారు పత్రాలు సమర్పించకపోతే వాటిని రద్దు చేశామన్నారు. 2018 తర్వాత చేరిన వారు పత్రాలను 2023, జూన్‌ నాటికి సమర్పించాలని కోరారు. లేదంటే వారి పీహెచ్‌డీ ప్రవేశాలు రద్దవుతాయని చెప్పారు. పరిశోధనల్లో నాణ్యతా ప్రమాణాలు పెంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. 21 పాయింట్లతో ఒక ఎజెండాను రూపొందించుకుని ప్రయాణాన్ని ప్రారంభించామని వివరించారు. తరగతి గదుల్లో పాఠ్యాంశాల బోధన, పరిశోధనల్లో వేగం, మౌళిక వసతుల అభివృద్ధి, కొంగొత్త ఆలోచనలతో నూతన ఆవిష్కరణల వైపు విద్యార్థులను మళ్లించటమే ప్రధాన లక్ష్యంగా వర్సిటీ పనిచేస్తున్నదని చెప్పారు. విశ్వవిద్యాలయంలో ప్రతిసంఘటన ఆలోచనల పండుగగా మారే సంస్కృతి వైపు పయనిస్తున్నామని వివరించారు. వర్సిటీ గత వైభవాన్ని తిరిగి పొందేందుకు యత్నిస్తున్నట్టు చెప్పారు. ఆధునిక సమాజానికి అనుగుణంగా ఓయూలో సంస్కరణలు చేపడుతున్నామని అన్నారు. వర్సిటీలో విద్యార్థులకు అహ్లాదకరమైన వాతావరణాన్ని అందించటంతోపాటు అకడమిక్‌ విభాగాలను పటిష్ట పరిచేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఆర్ట్స్‌ కాలేజీ జ్ఞానానికి ప్రతీక అని అన్నారు. అయితే అక్కడ ఉద్యమాలు, ఆందోళనలు చేయడం, పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం, పోస్టర్లు, బ్యానర్లు కట్టడం సరైంది కాదన్నారు. విద్యార్థి సంఘాల నాయకులతో పలుమార్లు చర్చించి ఓ నిర్ణయానికి వచ్చామనీ, స్టూడెంట్‌ కౌన్సిళ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం విద్యార్థి సంఘాలకు ఎన్నికలు జరపాలని నిర్ణయిస్తే తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. అయితే స్టూడెంట్‌ కౌన్సిళ్లకు విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు. ఓయూలోకి రాజకీయ నాయకులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అందులో భాగంగానే రాహుల్‌గాంధీకి అనుమతి ఇవ్వలేదని చెప్పారు. తమ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించిందని గుర్తు చేశారు. ఓయూలో ఏదైనా విభాగం సమకాలీన అంశంపై ఆహ్వానిస్తే రాజకీయ నాయకులకు అనుమతి ఇస్తామని చెప్పారు. విద్యార్థులుగా చేరండి... సివిల్‌ సర్వెంట్లుగా వెళ్లండి అనే నినాదంతో ముందుకెళ్తున్నామని వివరించారు. 15, 20 రోజుల్లో సివిల్‌ సర్వీసెస్‌ అకాడమిని ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే గ్రూప్‌-1, గ్రూప్‌-2 కోచింగ్‌ ప్రారంభమైందని వివరించారు. ఏడాది కాలంలో ఓయూలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. సెంటర్‌ ఫర్‌ ఇండోపసిఫిక్‌ స్టడీస్‌ను త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఓయూ షీ సెంటర్‌ను ఈసీ ఆమోదం తీసుకుని ప్రారంభిస్తామని అన్నారు. శతాబ్ది ఉత్సవాల వేడుకల జ్ఞాపకంగా పైలాన్‌ను ఆవిష్కరిస్తామని చెప్పారు. సంస్కరణ, పనితీరు మెరుగుకావడం, రూపాంతరం చెందడం అనే నినాదంతో ముందుకెళ్తున్నామని అన్నారు. విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్‌ లక్ష్మినారాయణ, ఓఎస్డీ రెడ్యానాయక్‌, ప్రొఫెసర్లు మల్లేష్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గెలవకున్నా రాష్ట్ర ప్రభుత్వాలు కూలుస్తామని తీర్మానిస్తారా?
పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలి
టీఆర్టీ నోటిఫికేషన్‌ ఎప్పుడు?
ఎకో-టూరిజానికి భారీ ప్రణాళికలు
'కొరటాల' వల్లే మన పత్రికలు ఈ స్థాయిలో ఉన్నాయి
అరాచకాలు హద్దులు దాటుతున్నాయి
టెట్‌లో మిశ్రమ ఫలితాలు
4న ఎఫ్‌టిసిసిఐ అవార్డుల ప్రదానం
విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి
అత్యవసర సేవలు బంద్‌
తెరుచుకున్న బాబ్లీగేట్లు
'సికింద్రాబాద్‌'లో అరెస్టయిన యువతకు బెయిల్‌ ఇప్పించాలి
రైతులకు బేడీలు వేసి అవమానించడం తగదు
విభజన చట్టంలోని హామీలను అమలు చేయండి
వర్గీకరణ కోసం రూట్‌మ్యాప్‌ ప్రకటించాలి
బొల్లారంలో 'ఉషోదయ సూపర్‌ మార్కెట్‌' ప్రారంభం
డాక్టర్‌ ఆనంద్‌కు ఉత్తమ డాక్టర్‌ ప్రశంసా పత్రం
కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తల కొట్లాట
తిరుమల వెంకన్న దర్శనం కావాలా...
నేటి నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
ఊకదంపుడు ఉపన్యాసాలొద్దు.. బియ్యం కొనండి
జర్నలిస్టుల అరెస్ట్‌ అక్రమం:టీడబ్ల్యూజేఎఫ్‌
అసంపూర్తిగా ముగిసిన జేబీసీసీఐ సమావేశం
వైద్యో నారాయణో హరి...
యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తి
రాష్ట్రంలో 1.81 శాతం పాజిటివ్‌ రేటు
'గురుకులం'లో 18 మంది విద్యార్థులకు కరోనా
జమునా హేచరీస్‌ భూమిపై తీర్పు వాయిదా
19 సంస్థలకు ఎఫ్‌టీసీసీఐ ఎక్స్‌లెన్సీ అవార్డులు
ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం

తాజా వార్తలు

01:04 PM

ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న ధోనీ

12:55 PM

హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్ష‌లు

12:42 PM

నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం..

12:37 PM

రెబల్‌గా మారాలని నన్నూ పిలిచారు : సంజయ్ రౌత్

12:27 PM

జలవిహార్‌కు ర్యా‌లీగా బ‌య‌ల్దే‌రిన య‌శ్వంత్, కేసీఆర్‌

12:22 PM

ఇన్నోవేషన్ సెంటర్‌కు కేంద్ర మంత్రి శంకుస్థాపన

12:09 PM

రామారావు ఆన్ డ్యూటీ నుంచి ఐటమ్ సాంగ్ విడుదల

12:04 PM

భాగ్యలక్ష్మీ టెంపుల్ వద్ద భారీ భద్రత

12:00 PM

య‌శ్వంత్ సిన్హాకు స్వాగతం పలికిన కేసీఆర్

11:53 AM

బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేసీఆర్

11:49 AM

మోడీకి యోగా శిక్షకుడిగా మంచిర్యాల వాసి

11:41 AM

పోలీసులపై దుండుగుడి కాల్పులు.. ముగ్గురు మృతి

11:31 AM

మెదక్ జిల్లాలో కేంద్ర మంత్రికి అవమానం

11:23 AM

తెలంగాణలో 3 రోజలు వర్షాలు

10:58 AM

ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

10:47 AM

బేగంపేట ఎయిర్‌పోర్టులో భారీ భద్రత

10:39 AM

దేశంలో కొత్తగా 17,092 కరోనా కేసులు

10:37 AM

భాష లేకపోతే చరిత్ర లేదు: సీజేఐ ఎన్వీ రమణ

10:31 AM

విమానంలో పొగ...ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్

10:23 AM

కోనసీమలో తల్లీకూతుళ్ల సజీవదహనం

10:19 AM

ఏబీవీ సస్పెన్షన్ ను తక్షణమే ఎత్తివేయాలి: సీపీఐ రామకృష్ణ

10:17 AM

బిర్యానీ దుకాణంలో మాదకద్రవ్యాల విక్రయం

09:02 AM

నేడు సడక్‌ బంద్‌కు ఎమ్మార్పీఎస్‌ పిలుపు

08:58 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

08:51 AM

గూగుల్‌ మరో కీలక నిర్ణయం

08:41 AM

సినీఫక్కీలో చోరీ.. తుపాకీతో బెదిరించి..

08:30 AM

మణిపూర్‌లో కొండచరియలు విరిగిపడి 81 మంది మృతి

08:15 AM

పుతిన్‌కు ప్రధాని మోడీ ఫోన్‌

08:08 AM

వికారాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

08:01 AM

మోడీకి కేటీఆర్ బహిరంగ లేఖ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.