Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పేస్కేలు అడిగితే... వీఆర్‌ఏల అరెస్టులు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 22,2022

పేస్కేలు అడిగితే... వీఆర్‌ఏల అరెస్టులు

- ప్లకార్డులతో సీసీఎల్‌ఏ వైపు దూసుకెళ్లే యత్నం
- వాహనాల్లో కుక్కి బలవంతంగా పోలీస్‌స్టేషన్లకు తరలింపు
- జిల్లాల్లో నిర్బంధాలు... నగరశివార్లలో అడ్డగింతలు
- మహిళకు రోడ్డుప్రమాదం.. విరిగిన చేయి
- పోలీసుల పర్యవేక్షణ నడుమ సీసీఎల్‌ఏ కార్యదర్శికి వీఆర్‌ఏల జేఏసీ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వీఆర్‌ఏలు గొంతెమ్మ కోరికలేం కోరలేదు.. 'సీఎం కేసీఆర్‌ సార్‌ పేస్కేలు ఇస్తనన్నాడు.. వారసత్వ ఉద్యోగాలిస్తనన్నాడు.. వాటిని వెంటనే అమల్లోకి తేవాలని వేడుకుంటాం.. సీసీఎల్‌ఏ కార్యాలయంలో వినతిపత్రం ఇస్తాం' అని అనుమతి అడిగితే ప్రభుత్వం తిరస్కరించింది. హక్కులడిగితే సహించబోమంటూ పోలీసు యంత్రాంగాన్ని ప్రయోగించింది. శనివారం తలపెట్టిన వీఆర్‌ఏల చలో సీసీఎల్‌ఏ ముట్టడిని అడుగడుగునా అడ్డుకున్నది. హైదరాబాద్‌లో పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో వికారాబాద్‌ జిల్లా కొట్టాలగూడకు చెందిన మహిళా వీఆర్‌ఏ రోడ్డు ప్రమాదానికి గురైంది. అమె చేయి విరిగింది. తలకు గాయమైంది. సీసీఎల్‌ఏ ముట్టడి ప్రకటన నాటి నుంచే వీఆర్‌ఏలను బెదిరింపులకు దిగింది. రెండ్రోజుల ముందు నుంచే 23 వేల మంది వీఆర్‌ఏల ప్రతికదలికపైనా నిఘా పెట్టింది. శుక్రవారం సాయంత్రం నుంచే అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్లకు తరలించింది. ఎలాగో అలాగా తప్పించుకుని పట్నం బాట పట్టినవారిని నగరశివార్లలోనే ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఎక్కడికక్కడ అడ్డగించింది. అయినా, ఏదోరకంగా వచ్చిన వీఆర్‌ఏలను సీసీఎల్‌ఏ కార్యాలయానికి ఎటూ కిలోమీటర్‌ దూరంలో డేగకన్ను నిఘా పెట్టి ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తూ.. కనిపించినోళ్లను కనిపించినట్టుగా డీసీఎమ్‌లలో కుక్కి వందలాది మందిని పోలీస్‌స్టేషన్లకు తరలించింది. ముసలోళ్లం మమ్ముల్ని వదలండని వేడుకున్నా కనికరించలేదు. కొందరికైతే 'ఆ ఆఫీసు ఇక్కడలేదు.. మస్తు దూరం ఉంది.. ఎండల ఏడ్కిపోతరు? ఈ చెట్టు కిందనే కూర్చోండి' అంటూ సీసీఎల్‌ఏ కార్యాలయం సమీపంలోనే ఊర్ల నుంచి వచ్చిన వీఆర్‌ఏలను కూర్చోబెట్టిన పరిస్థితి కనిపించింది. అతికష్టం మీద ఆ కార్యాలయం సమీపానికి చేరుకున్న వీఆర్‌ఏ జేఏసీ నేతలను పోలీసులు తమ అదుపులోకి తీసుకునే క్రమంలో వాగ్వివాదం చోటుచేసుకున్నది. బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించే క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. 'మేం గొడవ చేయడానికి రాలేదు...ఆఫీసుల మీద దాడి చేయడానికి రాలేదు..శాంతియుతంగా ధర్నా చేసి వినతిపత్రం ఇస్తామని చెబుతున్నాం..దీనికి కూడా అనుమతి ఇవ్వరా? ఇదేం ధోరణి? ఇదెక్కడి న్యాయం? ఇంత నిరకుంశమా?' అంటూ జేఏసీ నేతలు పోలీసు ఉన్నతాధికారులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో జేఏసీ ప్రతినిధులు ఐదారుగురు మాత్రమే వెళ్లి వినతిపత్రం ఇచ్చేందుకు అవకాశం ఇస్తామని చెప్పి...పదుల సంఖ్యలో పోలీసుల బందోబస్తు మధ్య వారిని సీసీఎల్‌ఏ కార్యాలయంలోకి తీసుకెళ్లారు. మీడియాను లోపలికి అనుమతించలేదు. జేఏసీ ప్రతినిధులు సీసీఎల్‌ఏ కార్యదర్శి హైమావతికి వినతిపత్రం ఇచ్చారు. తమ సమస్యలను పరిష్కరించాలని వేడుకున్నారు.
అనంతరం వీఆర్‌ఏ జేఏసీ చైర్మెన్‌ జి.రాజయ్య, కో-చైర్మెన్‌ రమేశ్‌ బహదూర్‌, ప్రధాన కార్యదర్శి ఎస్‌కే దాదేమియా, కన్వీనర్‌ సాయన్న, కో-కన్వీనర్లు వంగూరు రాములు, ఎస్‌కే రఫీ, వెంకటేశ్‌యాదవ్‌, గోవింద్‌, తదితరులు మాట్లాడుతూ.. 2020 సెప్టెంబర్‌ 9న అసెంబ్లీలో నూతన రెవెన్యూ చట్టం తెస్తున్న సందర్భంగా 23 వేల మంది వీఆర్‌ఏలందరికీ పేస్కేల్‌ ఇస్తామనీ, వారసులకు తండ్రుల స్థానంలో ఉద్యోగాలిస్తామని నిండు శాసనసభలో స్వయానా సీఎం కేసీఆర్‌ హామీనిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.
20 నెలలుగా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నా సీఎం హామీ నెరవేరలేదని వాపోయారు. పేస్కేల్‌, వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, అర్హత కల్గిన వారికి పదోన్నతులు కల్పించకుండా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. క్షేత్రస్థాయిలో బండెడు చాకిరీ చేస్తున్న వీఆర్‌ఏలపై సర్కారు వైఖరి సరిగాదని తెలిపారు. నూటికి 90 శాతం మంది పైగా సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన దళితులే ఉన్నారన్నారు. వచ్చే జీతం చాలక వీఆర్‌ఏలు కుటుంబ పోషణ కోసం అప్పులు చేస్తున్నారనీ, కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే పే-స్కేల్‌ జీఓ విడుదల చేయాలనీ, ఇతర పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేని యెడల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గెలవకున్నా రాష్ట్ర ప్రభుత్వాలు కూలుస్తామని తీర్మానిస్తారా?
పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలి
టీఆర్టీ నోటిఫికేషన్‌ ఎప్పుడు?
ఎకో-టూరిజానికి భారీ ప్రణాళికలు
'కొరటాల' వల్లే మన పత్రికలు ఈ స్థాయిలో ఉన్నాయి
అరాచకాలు హద్దులు దాటుతున్నాయి
టెట్‌లో మిశ్రమ ఫలితాలు
4న ఎఫ్‌టిసిసిఐ అవార్డుల ప్రదానం
విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి
అత్యవసర సేవలు బంద్‌
తెరుచుకున్న బాబ్లీగేట్లు
'సికింద్రాబాద్‌'లో అరెస్టయిన యువతకు బెయిల్‌ ఇప్పించాలి
రైతులకు బేడీలు వేసి అవమానించడం తగదు
విభజన చట్టంలోని హామీలను అమలు చేయండి
వర్గీకరణ కోసం రూట్‌మ్యాప్‌ ప్రకటించాలి
బొల్లారంలో 'ఉషోదయ సూపర్‌ మార్కెట్‌' ప్రారంభం
డాక్టర్‌ ఆనంద్‌కు ఉత్తమ డాక్టర్‌ ప్రశంసా పత్రం
కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తల కొట్లాట
తిరుమల వెంకన్న దర్శనం కావాలా...
నేటి నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
ఊకదంపుడు ఉపన్యాసాలొద్దు.. బియ్యం కొనండి
జర్నలిస్టుల అరెస్ట్‌ అక్రమం:టీడబ్ల్యూజేఎఫ్‌
అసంపూర్తిగా ముగిసిన జేబీసీసీఐ సమావేశం
వైద్యో నారాయణో హరి...
యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తి
రాష్ట్రంలో 1.81 శాతం పాజిటివ్‌ రేటు
'గురుకులం'లో 18 మంది విద్యార్థులకు కరోనా
జమునా హేచరీస్‌ భూమిపై తీర్పు వాయిదా
19 సంస్థలకు ఎఫ్‌టీసీసీఐ ఎక్స్‌లెన్సీ అవార్డులు
ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం

తాజా వార్తలు

12:42 PM

నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం..

12:37 PM

రెబల్‌గా మారాలని నన్నూ పిలిచారు : సంజయ్ రౌత్

12:27 PM

జలవిహార్‌కు ర్యా‌లీగా బ‌య‌ల్దే‌రిన య‌శ్వంత్, కేసీఆర్‌

12:22 PM

ఇన్నోవేషన్ సెంటర్‌కు కేంద్ర మంత్రి శంకుస్థాపన

12:09 PM

రామారావు ఆన్ డ్యూటీ నుంచి ఐటమ్ సాంగ్ విడుదల

12:04 PM

భాగ్యలక్ష్మీ టెంపుల్ వద్ద భారీ భద్రత

12:00 PM

య‌శ్వంత్ సిన్హాకు స్వాగతం పలికిన కేసీఆర్

11:53 AM

బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేసీఆర్

11:49 AM

మోడీకి యోగా శిక్షకుడిగా మంచిర్యాల వాసి

11:41 AM

పోలీసులపై దుండుగుడి కాల్పులు.. ముగ్గురు మృతి

11:31 AM

మెదక్ జిల్లాలో కేంద్ర మంత్రికి అవమానం

11:23 AM

తెలంగాణలో 3 రోజలు వర్షాలు

10:58 AM

ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

10:47 AM

బేగంపేట ఎయిర్‌పోర్టులో భారీ భద్రత

10:39 AM

దేశంలో కొత్తగా 17,092 కరోనా కేసులు

10:37 AM

భాష లేకపోతే చరిత్ర లేదు: సీజేఐ ఎన్వీ రమణ

10:31 AM

విమానంలో పొగ...ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్

10:23 AM

కోనసీమలో తల్లీకూతుళ్ల సజీవదహనం

10:19 AM

ఏబీవీ సస్పెన్షన్ ను తక్షణమే ఎత్తివేయాలి: సీపీఐ రామకృష్ణ

10:17 AM

బిర్యానీ దుకాణంలో మాదకద్రవ్యాల విక్రయం

09:02 AM

నేడు సడక్‌ బంద్‌కు ఎమ్మార్పీఎస్‌ పిలుపు

08:58 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

08:51 AM

గూగుల్‌ మరో కీలక నిర్ణయం

08:41 AM

సినీఫక్కీలో చోరీ.. తుపాకీతో బెదిరించి..

08:30 AM

మణిపూర్‌లో కొండచరియలు విరిగిపడి 81 మంది మృతి

08:15 AM

పుతిన్‌కు ప్రధాని మోడీ ఫోన్‌

08:08 AM

వికారాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

08:01 AM

మోడీకి కేటీఆర్ బహిరంగ లేఖ

07:47 AM

ఇరాన్‌లో భారీ భూకంపం

06:50 AM

రేపు పలు ఎంఎంటీఎస్‌ సర్వీసుల రద్దు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.