Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గాంధీ ఆస్పత్రిలో త్వరలో సంతాన సాఫల్య కేంద్రం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 23,2022

గాంధీ ఆస్పత్రిలో త్వరలో సంతాన సాఫల్య కేంద్రం

- అందుబాటులోకి రూ.100 కోట్ల అత్యాధునిక వైద్యపరికరాలు
- ఎంఆర్‌ఐ మిషన్‌, క్యాత్‌ల్యాబ్‌ ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
               గాంధీ ఆస్పత్రిలో త్వరలోనే సంతాన సాఫల్య కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించారు. 'గాంధీ'లో ఆదివారం రూ. 13 కోట్ల విలువైన అత్యాధునిక ఎంఅర్‌ఐ మిషన్‌, రూ. 9 కోట్ల విలువైన క్యాత్‌ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ..ఆస్పత్రిలో దాదాపు 100 కోట్ల రూపాయలతో అత్యంత అధునాతన వైద్య పరికరాలు, సదుపాయాలు సమకూర్చుతున్నామని చెప్పారు. ఇన్‌ఫెర్టిలిటీ సెంటర్‌ సంతానం లేని దంపతులకు వరం లాంటిదని చెప్పారు. ప్లేట్ల బురుజు, వరంగల్‌ ఆస్పత్రుల్లోనూ ఆ సెంటర్లను రూ.5 కోట్లతో ఏర్పాటు చేయబోతున్నామన్నారు. దేశంలో తెలంగాణ సర్కారే తొలిసారి ప్రభుత్వాస్పత్రుల్లో ఇలాంటి సెంటర్లను ఏర్పాటు చేయడం గర్వకారణంగా ఉందని చెప్పారు. గాంధీ ఆస్పత్రికి ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల ప్రజలు కూడా వైద్యం కోసం వస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. కరోనా సమయంలో లక్షలాది మంది ప్రజల ప్రాణాలు కాపాడిన చరిత్ర గాంధీకుందనీ, సుమారు లక్ష మంది పాజిటివ్‌ కేసులకు చికిత్స అందించిందనీ, కోవిడ్‌ సోకిన 1698 గర్భిణీలకు డెలివరీలు చేయడంతో పాటు 1163 మందికి బ్లాక్‌ ఫంగస్‌ రోగులకు వైద్యం అందించిందని వివరించారు. మోకాలి చిప్ప మార్పిడి లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్నదనీ, గాంధీ ఆస్పత్రిలో నాలుగు నెలల్లో 48, ఉస్మానియాలో ఆరు నెలల్లో 50కిపైగా మోకీలు ఆపరేషన్లు ఉచితంగా చేశామని చెప్పారు. నిజామాబాద్‌, వేములవాడ, సిద్దిపేట ఆస్పత్రుల్లోనూ మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్లు ప్రారంభమయ్యా యని తెలిపారు. గుండెసంబంధ రోగులకు గాంధీలోని క్యాత్‌ల్యాబ్‌ ఎంతో చక్కగా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో సిటీ స్కాన్లు, ఎంఆర్‌ఐతో పాటు వెంటిలేటర్లు, అత్యాధునిక ఐసీయూలు, మోడ్యులర్‌ థియేటర్లు, ఎండోస్కోప్స్‌, క్యాథ్‌ల్యాబ్‌ వంటి అధునాతన వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకువచ్చామ న్నారు. రాష్ట్ర ప్రభుత్వం రు. 20 కోట్లతో తొలిసారి బయోమెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ మెయింటనెన్స్‌ పాలసీని తీసుకురాబోతున్నదనీ, తద్వారా అన్ని ఆస్పత్రుల్లోని వైద్య పరికరాలు ఎల్లప్పుడూ క్రియాశీలకంగా ఉండనున్నాయని తెలిపారు. ఆరోగ్యరంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంలో భాగంగా బడ్జెట్‌లో రూ.11,440 కోట్లు కేటాయించామన్నారు. హైదరాబాద్‌లో నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఉన్నవాటిపై రోగుల ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు. హైదరాబాద్‌లో మరో 91 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. టి డయాగస్టిక్‌లో 57 రకాల పరీక్షలు చేస్తున్నామనీ, ఆ సంఖ్యను 134కి పెంచబోతున్నామని తెలిపారు. రోగుల సహాయకుల కోసం 18 చోట్ల రూ.5 భోజనం అందిస్తున్నామనీ, షెల్టర్‌ హోమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ ఫరూక్‌ హుస్సేన్‌, టీఎస్‌ఎమ్‌ఎస్‌ఐడీసీ చైర్మెన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, డీఎంఇ రమేష్‌ రెడ్డి, గాంధీ సూపరింటెండెంట్‌ రాజారావు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గెలవకున్నా రాష్ట్ర ప్రభుత్వాలు కూలుస్తామని తీర్మానిస్తారా?
పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలి
టీఆర్టీ నోటిఫికేషన్‌ ఎప్పుడు?
ఎకో-టూరిజానికి భారీ ప్రణాళికలు
'కొరటాల' వల్లే మన పత్రికలు ఈ స్థాయిలో ఉన్నాయి
అరాచకాలు హద్దులు దాటుతున్నాయి
టెట్‌లో మిశ్రమ ఫలితాలు
4న ఎఫ్‌టిసిసిఐ అవార్డుల ప్రదానం
విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి
అత్యవసర సేవలు బంద్‌
తెరుచుకున్న బాబ్లీగేట్లు
'సికింద్రాబాద్‌'లో అరెస్టయిన యువతకు బెయిల్‌ ఇప్పించాలి
రైతులకు బేడీలు వేసి అవమానించడం తగదు
విభజన చట్టంలోని హామీలను అమలు చేయండి
వర్గీకరణ కోసం రూట్‌మ్యాప్‌ ప్రకటించాలి
బొల్లారంలో 'ఉషోదయ సూపర్‌ మార్కెట్‌' ప్రారంభం
డాక్టర్‌ ఆనంద్‌కు ఉత్తమ డాక్టర్‌ ప్రశంసా పత్రం
కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తల కొట్లాట
తిరుమల వెంకన్న దర్శనం కావాలా...
నేటి నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
ఊకదంపుడు ఉపన్యాసాలొద్దు.. బియ్యం కొనండి
జర్నలిస్టుల అరెస్ట్‌ అక్రమం:టీడబ్ల్యూజేఎఫ్‌
అసంపూర్తిగా ముగిసిన జేబీసీసీఐ సమావేశం
వైద్యో నారాయణో హరి...
యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తి
రాష్ట్రంలో 1.81 శాతం పాజిటివ్‌ రేటు
'గురుకులం'లో 18 మంది విద్యార్థులకు కరోనా
జమునా హేచరీస్‌ భూమిపై తీర్పు వాయిదా
19 సంస్థలకు ఎఫ్‌టీసీసీఐ ఎక్స్‌లెన్సీ అవార్డులు
ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం

తాజా వార్తలు

12:55 PM

హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్ష‌లు

12:42 PM

నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం..

12:37 PM

రెబల్‌గా మారాలని నన్నూ పిలిచారు : సంజయ్ రౌత్

12:27 PM

జలవిహార్‌కు ర్యా‌లీగా బ‌య‌ల్దే‌రిన య‌శ్వంత్, కేసీఆర్‌

12:22 PM

ఇన్నోవేషన్ సెంటర్‌కు కేంద్ర మంత్రి శంకుస్థాపన

12:09 PM

రామారావు ఆన్ డ్యూటీ నుంచి ఐటమ్ సాంగ్ విడుదల

12:04 PM

భాగ్యలక్ష్మీ టెంపుల్ వద్ద భారీ భద్రత

12:00 PM

య‌శ్వంత్ సిన్హాకు స్వాగతం పలికిన కేసీఆర్

11:53 AM

బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేసీఆర్

11:49 AM

మోడీకి యోగా శిక్షకుడిగా మంచిర్యాల వాసి

11:41 AM

పోలీసులపై దుండుగుడి కాల్పులు.. ముగ్గురు మృతి

11:31 AM

మెదక్ జిల్లాలో కేంద్ర మంత్రికి అవమానం

11:23 AM

తెలంగాణలో 3 రోజలు వర్షాలు

10:58 AM

ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

10:47 AM

బేగంపేట ఎయిర్‌పోర్టులో భారీ భద్రత

10:39 AM

దేశంలో కొత్తగా 17,092 కరోనా కేసులు

10:37 AM

భాష లేకపోతే చరిత్ర లేదు: సీజేఐ ఎన్వీ రమణ

10:31 AM

విమానంలో పొగ...ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్

10:23 AM

కోనసీమలో తల్లీకూతుళ్ల సజీవదహనం

10:19 AM

ఏబీవీ సస్పెన్షన్ ను తక్షణమే ఎత్తివేయాలి: సీపీఐ రామకృష్ణ

10:17 AM

బిర్యానీ దుకాణంలో మాదకద్రవ్యాల విక్రయం

09:02 AM

నేడు సడక్‌ బంద్‌కు ఎమ్మార్పీఎస్‌ పిలుపు

08:58 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

08:51 AM

గూగుల్‌ మరో కీలక నిర్ణయం

08:41 AM

సినీఫక్కీలో చోరీ.. తుపాకీతో బెదిరించి..

08:30 AM

మణిపూర్‌లో కొండచరియలు విరిగిపడి 81 మంది మృతి

08:15 AM

పుతిన్‌కు ప్రధాని మోడీ ఫోన్‌

08:08 AM

వికారాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

08:01 AM

మోడీకి కేటీఆర్ బహిరంగ లేఖ

07:47 AM

ఇరాన్‌లో భారీ భూకంపం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.