Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పదే పదే ఆర్‌ఎంసీ భేటీల వాయిదా | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 23,2022

పదే పదే ఆర్‌ఎంసీ భేటీల వాయిదా

- తేలని కృష్ణా జలాల వివాదం !
- రాష్ట్రం వాటా ప్రశ్నార్థకమే ?
- ఆందోళనలో సాగునీటిరంగ నిపుణులు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
              కృష్ణా యాజమాన్య నిర్వహణ బోర్డు (కేఆర్‌ఎంబీ) ఏర్పాటు చేసిన రిజర్వాయర్ల మేనేజ్‌మెంట్‌ కమిటీ(ఆర్‌ఎంసీ) మూడో సమావేశం పదే పదే వాయిదా పడుతున్న నేపథ్యంలో కృష్ణా జలాల కేటాయింపు సమస్య ఎప్పటికప్పుడు పెండింగ్‌లో పడుతున్నది. ఈనెల 16 జరగాల్సి ఆర్‌ఎంసీ భేటి మరోసారి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ భేటిని ఈనెల 28న నిర్వహించే అవకాశాలు ఉన్నట్టు సాగునీటిశాఖ అధికారుల అధికారిక సమాచారం. గతంలో జరిగిన రెండు సమావేశాలకు తెలంగాణ సాగునీటి పారుదల అధికారులు గైర్హాజరయ్యారు. వానాకాలం ముందస్తు సన్నాహాక ఏర్పాట్లల్లో ఉన్న కారణంగా ఆర్‌ఎంసీ సమావేశాలను జూన్‌ 16న నిర్వహించాలని గతంలో రాష్ట్ర సాగునీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.మురళీధర్‌ కృష్ణా బోర్డుకు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రిజర్వాయర్ల నిర్వహణపై తెలంగాణ అభిప్రాయాలను వినేందుకు బోర్డు ఈనెల 16న సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, ఏపీ అధికారులు రాకపోవడంతో అది కూడా జరగలేదు. ఆర్‌ఎంసీ ఉద్దేశ్యాలు, సమావేశంలోని ఎజెండా కీలకంగా మారడంతో మూడోసారి జరిగే సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్రంలోని కృష్ణా జలాలను 50:50 శాతం ప్రాతిపదికన పంపిణీ చేయాలని రాష్ట్రసాగునీటి పారుదల శాఖ కేఆర్‌ఎంబీకి స్పష్టం చేస్తున్నది. ఈ విషయంలో పదే పదే లేఖలు రాసింది. తాత్కాలికంగా అంటూ ప్రతి నీటి ఏడాదిలో కృష్ణా జలాలను 66:34 శాతం ప్రాతిపదికన కేటాయించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. శ్రీశైలం నుంచి ఏపీ 34 టీఎంసీలకు మించి తరలించకుండా నియంత్రించాలని బోర్డును తెలంగాణ ప్రభుత్వం డిమాండ్‌ చేస్తున్నది. కాగా ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో కృష్ణాలో నీటి లభ్యత పెరిగే అవకాశం ఉంది. వరద జలాలతో రిజర్వాయర్లు నిండితే ఈ సారీ కూడా తెలంగాణకు 34 శాతం నీటి వాటా మాత్రమే దక్కే ప్రమాదముందని నీటిపారుదలరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆందోళన చెందుతున్నారు.
నిజానికి ఆర్‌ఎంసీ సేకరించాల్సిన అభిప్రాయాల్లో ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వాటా ఎజెండా కూడా ప్రధానమైంది. ఈ జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు ఉమ్మడి ప్రాజెక్టుల్లో విద్యుదత్పత్తి, నీటి నిల్వ, విడుదల ప్రక్రియ, వరద దినాల్లో మళ్లించిన నీటిని కోటా కింద కేటాయించాలా? వద్దా? అన్నవే ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై నివేదిక ఇచ్చే బాధ్యతను ఆర్‌ఎంసీకి గతంలోనే కేఆర్‌ఎంబీ అప్పగించింది.
ఈ ఏడాది నీటి సంవత్సరం ప్రారంభానికి ముందు ఈ అంశాన్ని పరిష్కరించాల్సిన పరిస్థితుల్లో ఆర్‌ఎంసీ సమావేశం పడటంతో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు అసంతృప్తితో ఉన్నారు. తాజాగా ఈనెల 28న ఆర్‌ఎంసీ సమావేశాన్ని మరోసారి నిర్వహించేందుకు కేఆర్‌ఎంబీ సన్నద్ధమవుతున్నది.
ఈ భేటికి సంబంధించిన ఆహ్వానాన్ని ఒకటి, రెండు రోజుల్లో ఇరు రాష్ట్రాల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లకు కేఆర్‌ఎంబీ పంపనుంది. ఇప్పటికే ఎజెండా అంశాలు ఖరారైన నేపథ్యంలో సమావేశం నిర్వహించడమే మిగిలి ఉంది. ఇదిలావుండగా ఆర్‌ఎంసీ మూడో సమావేశానికైనా ఇటు తెలంగాణ, అటు ఏపీ ఇరిగేషన్‌ అధికారులు హాజరవుతారా ? లేదా ? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

హైకోర్టులో మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు చుక్కెదురు
భారత్‌ను పీవీ ఆర్థికశక్తిగా నిలిపారు : పీసీసీ చీఫ్‌ రేవంత్‌
రాష్ట్రంలో 1.75 శాతం పాజిటివ్‌ రేటు
తీస్తా సెతల్వాద్‌ అరెస్టు అక్రమం: ఐద్వా
10,12వ తరగతి ఫెయిలైన వారికి ఎన్‌ఐఓఎస్‌లో ప్రవేశం
కాకతీయుల స్ఫూర్తితోనే మిషన్‌ కాకతీయ
జులై 4న చలో ప్రగతి భవన్‌
నిర్లక్ష్యం.. ఇంజినీర్ల వేతనంలో కోత
నకిలీ వైద్యులపై చర్యలు తీసుకోండి
రెండేండ్ల కార్గో ఆదాయం రూ.123.45 కోట్లు
జులై 1న టెట్‌ ఫలితాలు
ఇంటర్‌ ఫలితాల్లో ఎస్సీ గురుకులాల విద్యార్థుల ప్రతిభ : మంత్రి కొప్పుల
రేపు టెన్త్‌ ఫలితాలు
ఇంటర్‌ ఫలితాల్లో బిసి గురుకుల విద్యార్థుల జయకేతనం
ఇంటర్‌ ఫలితాల్లో గురుకులాల సత్తా
జులై 1 నుంచి ఆపరేషన్‌ ముస్కాన్‌ ప్రారంభం
'అసెంబ్లీ'లో పీవీకి ఘన నివాళి : పోచారం, గుత్తా
నేడు దోస్త్‌ నోటిఫికేషన్‌
సత్తాచాటిన సర్కారు కాలేజీలు
సీఎంఆర్‌ బియ్యాన్న ఎఫ్‌సీఐ ద్వారా కొనాలి
అమ్మాయిలదే హవా
ఆలోచనతో రండి.... ఆవిష్కరణలతో వెళ్లండి
సీజేగా ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణస్వీకారం
ఎనిమిదేండ్ల నుంచి రేషన్‌ కార్డు, పింఛన్లు లేవు
రాక్‌పాయింట్‌ కోసం దశాబ్దాల పోరాటం
లిఫ్టులను ప్రభుత్వమే నడిపించాలి
సారు.. మా నాన్నని బతికించండి
హెలెన్‌ కెల్లర్‌ స్ఫూర్తితో ముందుకు
మోడీ, కేసీఆర్‌ను బంగాళాఖాతంలో కలిపేయాలి
నేడు హైకోర్టు సీజే ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణస్వీకారం

తాజా వార్తలు

09:51 PM

దీపక్ హూడా అర్దసెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్

09:08 PM

ముంబయిలో కుప్పకూలిన భవనం..18కి పెరిగిన మృతుల సంఖ్య

08:58 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..

08:49 PM

రేపు దోస్త్ దరఖాస్తులకు నోటిఫికేషన్‌

08:14 PM

హైద‌రాబాద్‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌..జీహెచ్ఎంసీ హెచ్చ‌రిక‌

08:10 PM

అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ సారధి మోర్గాన్ వీడ్కోలు

07:12 PM

హైకోర్టులో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు చుక్కెదురు

06:44 PM

హైదరాబాద్‌ను స్టార్ట్ అప్ క్యాపిటల్ గా నిర్మించడమే ప్రభుత్వం లక్షం : సీఎం కేసీఆర్

06:39 PM

దారుణం..ఆడ‌ కుక్క‌పై రెండేండ్లుగా..

06:30 PM

చరిత్ర సృష్టించిన జకోవిచ్..

06:27 PM

ఎంఎస్ స్వామినాథ‌న్‌కు వెంక‌య్య ప‌రామ‌ర్శ‌

06:10 PM

అగ్ని‌పథ్‌కు వ్య‌తిరేకంగా అసెంబ్లీ‌లో తీర్మా‌నం : పంజాబ్ సీఎం

05:47 PM

రెబెల్ ఎమ్మెల్యేలకు మహారాష్ర్ట సీఎం లేఖ

05:45 PM

కృష్ణ నీళ్లు జూలై 1 నుంచి నిలిపేయండి: తమిళనాడు

05:34 PM

టీ హ‌బ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

05:22 PM

ఏపీలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు

05:12 PM

భార్యను చంపి.. రైలు కిందపడి..హైదరాబాద్ లో విషాదం

05:05 PM

భూ కుంభకోణం కేసులో సంజ‌య్ రౌత్‌కు మ‌రోసారి ఈడీ స‌మ‌న్లు

05:04 PM

జూన్ 30న పదో తరగతి ఫలితాలు

05:00 PM

రేపటి టీడీపీ మహానాడు వాయిదా

04:50 PM

అరేబియా సముద్రంలో అత్యవసరంగా దిగిన ఓఎన్జీసీ హెలికాప్టర్

04:44 PM

ముకేశ్ అంబానీ సంచలన నిర్ణయం

04:42 PM

తొలి రోజు 20 ల‌క్ష‌ల మందికి రైతు బంధు

04:37 PM

మార్కులు తక్కువొచ్చాయని విద్యార్థి ఆత్మహత్య

04:36 PM

భారత్ ఆర్ధికంగా శక్తివంతంగా నిలవడానికి పివినే కారణం : రేవంత్ రెడ్డి

04:29 PM

నెలసరి ట్రాకింగ్ యాప్‌ల‌ను తొల‌గిస్తు‌న్న మహిళలు

04:21 PM

బైడెన్ భార్య, కుమార్తె సహా 25 మందిపై రష్యా నిషేధం

04:12 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:08 PM

జీహెచ్ఎంసీ ఇంజనీర్లకు ఒక రోజు జీతం కట్

04:08 PM

తొలి రోజు 19 లక్షల మందికి రైతు బంధు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.