Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అంధకారంలో పుదుచ్చేరి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Oct 02,2022

అంధకారంలో పుదుచ్చేరి

- సీఎం, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ల ఇండ్లకూ పవర్‌ కట్‌
- ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్‌ ఉద్యోగుల సమ్మె తీవ్రం
- అక్కడి ఇంచార్జి గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌...
నవతెలంగాణ- హైదరాబాద్‌బ్యూరో
           కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి పూర్తి అంధకారంలోకి వెళ్లిపో యింది. ముఖ్యమంత్రి, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ ఇండ్లకూ విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అక్కడి విద్యుత్‌ ఉద్యోగుల సమ్మెతీవ్రస్థాయికి చేరింది. ఈనెల 27 నుంచి సమ్మెలో ఉన్న అక్కడి విద్యుత్‌ ఉద్యోగులు తమ డిస్కంను రక్షించుకొనేందుకు శతవిధాలా పోరాడుతున్నారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకపోవడంతో శనివారం ముఖ్యమంత్రి, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ల నివాసాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్‌ సరఫరాను బంద్‌ చేశారు. విద్యుత్‌ సంస్కరణల అమలు పేరుతో కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ పంపిణీ సంస్థల్ని ప్రయివేటీకరించడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఈ బిల్లును ఇటీవలి సమావేశాల్లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై పార్లమెంటు లోపల ప్రతిపక్షాలు, బయట దేశవ్యాప్తంగా విద్యుత్‌ ఉద్యోగులు తీవ్ర నిరసనలు తెలుపడంతో ఈ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపారు. కానీ ఈ బిల్లులోని అంశాలను తొలుత కేంద్రపాలిత రాష్ట్రాల్లో అమలు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తున్నది. దానిలో భాగంగానే పుద్దుచ్చేరి విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)ను ప్రయివేటుకు అప్పగించేందుకు కేవలం రూ.27 కోట్లకు అమ్మకానికి పెట్టింది. దానికి సంబంధించి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం బిడ్స్‌ను ఆహ్వానించింది. దీన్ని వ్యతిరేకిస్తూ అక్కడి విద్యుత్‌ ఉద్యోగులు సెప్టెంబర్‌ 28 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. టెండర్లు ఖరారు చేయాలని నిర్ణయించడంతో శనివారం రాత్రి నుంచి పుదుచ్చేరి విద్యుత్‌ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా సరఫరాను నిలిపివేశారు. దీనితో ముఖ్యమంత్రి, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ ఇండ్లూ అంధకారంలోకి వెళ్లిపోయాయి. మరో కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌లోని విద్యుత్‌ పంపిణీ సంస్థలను (డిస్కంలు) ఇప్పటికే ప్రయివేటీకరించారు. ఇప్పుడు అక్కడి డిస్కంలు అదానీ, టాటాల చేతుల్లో ఉన్నాయి. అర్థరాత్రి దాటినా పుదుచ్చేరి రాష్ట్రం అంధకారంలోనే ఉంది. ఈ డిస్కంను 2021 నవంబర్‌లోనే ప్రయివేటీకరించే ప్రయత్నాలు జరిగాయి. అయితే అప్పుడు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపారు. ఆ తర్వాతి ఎన్నికల్లో బీజేపీ సంకీర్ణప్రభుత్వం అధికారంలోకి రాగానే డిస్కంల ప్రయివేటీకరణను వేగవంతం చేసింది. పుదుచ్చేరికి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ సంస్కరణల బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. అదే సందర్భంలో ఇక్కడి గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలనూ వ్యతిరేకిస్తూ మీడియాలో వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇంచార్జి గవర్నర్‌గా తమిళిసై ఉన్న పుదుచ్చేరిలో పరిస్థితులు ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు బలమైన రాజకీయ ఆయుధంగా ఉపయోగపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం గవర్నర్‌ విదేశీపర్యటనలో ఉన్నారు.
సంఘీభావంగా...
           పుదుచ్చేరి విద్యుత్‌ ఉద్యోగుల సమ్మెకు సంఘీభావంగా నేషనల్‌ కోఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయాస్‌ అండ్‌ ఇంజినీర్స్‌ (ఎన్‌సీసీఓఈఈఈ) పిలుపు మేరకు తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీఎస్‌పీఈజేఏసీ) ఆధ్వర్యంలో శనివారం మింట్‌కాంపౌండ్‌లోని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రయివేటీకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దానిలో భాగంగానే విద్యుత్‌రంగాన్ని కూడా ప్రయివేటీకరిస్తున్నారని చెప్పారు. పుదుచ్చేరి విద్యుత్‌ ఉద్యోగులు ఒంటరి కాదనీ, వారివెంట దేశవ్యాప్తంగా 20 లక్షల మంది విద్యుత్‌ ఉద్యోగులు ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు పీ సదానందం, వెంకట నారాయణరెడ్డి, అంజయ్య, పీవీ రావు, పవన్‌కుమార్‌, ప్రశాంత్‌, వేణు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాష్ట్రాభివృద్ధి దేశానికి ఆదర్శం
6న రాష్ట్ర బడ్జెట్‌
గవర్నర్‌ ప్రసంగం ప్రశాంతం
ఇండ్లు, స్థలాలు దక్కే వరకు పోరాటం
పత్తి రైతుకు ప్రయివేటే దిక్కా..?
పాలసీదారుల సొమ్ము భద్రం
ముగిసిన కళాతపస్వి అంత్యక్రియలు
సినీ పరిశ్రమ ఉన్నంతకాలం గుర్తుండిపోతారు
పేదలను విస్మరించిన కేంద్రం
బీజేపీలోకి వద్దన్నా...
కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం
బిల్లులు రాక.. ఆర్థిక ఇబ్బందులతో..
న్యాయమూర్తికే నోటీసుపై హైకోర్టు ఆగ్రహం
ప్రయివేటు టీచర్ల కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి
జీతాలు రాలే!
కరెంట్‌.. ఐదారుగంటలే
ఇంటర్‌ బోర్డు కార్యదర్శిగా మిట్టల్‌ను కొనసాగించాలి
రైల్వే బడ్జెట్‌లో.. తెలుగు రాష్ట్రాలకు రూ.12,800 కోట్లు
మహావీర్‌ పరిశ్రమను మూసేయాలని ధర్నా
ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ కబ్జా చేయించిండు...
గవర్నర్‌ ప్రసంగాన్ని ఆహ్వానిస్తున్నాం
కంటివెలుగు డాక్టర్లు, సిబ్బందికి డీజీపీ అభినందనలు
ఒక్కో పోస్టుకు 116 మంది పోటీ
దేశవ్యాప్తంగా హగ్‌ హెర్‌ మోర్‌ ప్రచార కార్యక్రమం
ఎందుకు రావట్లేదు.. : కేటీఆర్‌
ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం ధర్నా : ఐద్వా
ఆడబిడ్డ ఉసురు ఊరికే పోదు : ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి
నాందేడ్‌లో సభకు భారీ ఏర్పాట్లు
అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లనివ్వరా..
అసెంబ్లీ సమావేశాలకు భారీ బందోబస్తు

తాజా వార్తలు

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

10:26 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

09:48 AM

ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం..

12:12 PM

హైదరాబాద్‌ లో మరో భారీ అగ్ని ప్రమాదం..

09:16 AM

మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్

09:03 AM

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

08:51 AM

బోల్తాపడిన డీసీఎం.. ఇద్దరు మృతి

08:50 AM

మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుంది : మంత్రి ఇంద్రకరణ్

08:27 AM

తిరుమలలో భక్తుల రద్దీ..

09:33 AM

మణిపూర్‌లో 4.0 తీవ్రతతో భూకంపం..

07:57 AM

‘గడపగడపకు’ కార్యక్రమంలో స్థానికుడిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే..!

07:50 AM

విజయ్, లోకేశ్‌ కనగరాజ్‌ 'లియో'.. టైటిల్‌ ప్రోమో అదిరింది

07:22 AM

అఫ్రిది కుమార్తెతో ఘనంగా షాహిన్ అఫ్రిది వివాహం..

07:14 AM

బస్సు దిగి పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్..

07:07 AM

మనం ఫ్రెండ్స్ కాదు..బ్రదర్స్ అంతకన్నా కాదు..'అమిగోస్' ట్రైలర్

07:04 AM

పాట్నా వెళ్లేందుకు ఫ్లైటెక్కి ఉదయ్‌పూర్‌లో దిగాడు..

06:58 AM

హైదరాబాద్‌ వాహనదారులకు అలర్ట్‌..

10:07 PM

ఐఆర్‌సీటీసీలో టికెట్ల జారీ మరింత వేగవంతం : అశ్వినీ వైష్ణవ్‌

09:45 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. 6న హైకోర్టు తీర్పు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.