Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Nov 29,2022

దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ

- వరిధాన్యాన్ని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ చేసి బియ్యంగా మారుస్తున్నాం
- ఎగుమతి చేసే రెండు శాతం సీఎస్టీ పన్ను బకాయిలు రద్దు : ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
          ధాన్యం ఉత్పత్తిలో నెంబర్‌వన్‌ స్థానానికి చేరుకుంటున్న తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా నిలిచిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు తెలిపారు. వరిధాన్యాన్ని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ చేసి బియ్యంగా మార్చి ఇతర రాష్ట్రాలకు చేసే ఎగుమతులను మరింతగా ప్రోత్సహిస్తామనీ, ఆ దిశగా చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేసే సందర్భంగా ఇచ్చే (2015 ఏప్రిల్‌ ఒకటి నుంచి 2017, జూన్‌ 30 వరకు) రెండు శాతం సీఎస్టీ పన్ను బకాయిని రద్దుచేస్తున్నట్టు ప్రకటించారు. తద్వారా బియ్యం ఎగుమతులను ప్రోత్సహించి తెలంగాణ రైసు మిల్లర్ల ప్రయోజనాలను, రైతుల ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతుందని సీఎం పునరుద్ఘాటించారు. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేస్తే గతంలో సి-ఫారం దాఖలు చేస్తే (సీఎస్టీ) పన్నులో రెండు శాతం రాయితీని కల్పించేలా విధానం ఉండేదని తెలిపారు. ఇది ఉమ్మడి రాష్ట్రంలో అమలైందని వివరించారు. తెలంగాణలో కూడా ప్రారంభంలో అమలైందని గుర్తు చేశారు. 2015, ఏప్రిల్‌ ఒకటి నుంచి 2017, జూన్‌ 30 వరకు రాష్ట్రం నుంచి చేసిన బియ్యం ఎగుమతులకు సీ-ఫారం దాఖలు చేయలేదనే కారణంతో ఎగుమతి దారులకు సీఎస్టీలో రెండు శాతం పన్ను రాయితీని నిలిపేశారని పేర్కొన్నారు. దీని వల్ల ఆర్థికంగా నష్టపోతున్నామంటూ రైస్‌ మిల్లర్ల అసోషియేషన్‌ ప్రతినిధులు గత కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారని తెలిపారు. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని రెండేండ్ల కాలానికి సంబంధించిన రెండు శాతం పన్నును రద్దు చేయాలంటూ వారు విజ్ఞప్తి చేశారని వివరించారు. ఇదే విషయాన్ని సోమవారం దామరచర్ల పర్యటన సందర్భంగా మిర్యాలగూడెం ఎమ్మెల్యే భాస్కర్‌రావు ఆధ్వర్యంలో మంత్రి జగదీశ్‌ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డితో కూడిన రైస్‌ మిల్లర్స్‌ అసోషియేషన్‌ ప్రతినిధులు సీఎం కేసీఆర్‌ను కలిసి మరోసారి విజ్జప్తి చేశారు. న్యాయం జరిగేలా చూడాలంటూ విన్నవించుకున్నారు. ఇందులో కేవలం తెలంగాణ రైస్‌ మిల్లర్ల ప్రయోజనమే లేదనీ, దాంతోపాటు తెలంగాణ రైతాంగ ప్రయోజనం కూడా ఇమిడి ఉందనే విషయాన్ని గ్రహించామని సీఎం వివరించారు. తెలంగాణ అద్భుతంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో బియ్యం ఎగుమతులను ప్రోత్సహించిడం ప్రభుత్వ కర్తవ్యంగా భావించామని తెలిపారు. తద్వారా తెలంగాణ రైతాంగానికి మేలు చేసేందుకు నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. రైస్‌ మిల్లర్ల అభ్యర్థనను పరిశీలించి, ఎటువంటి సాయం చేయవచ్చునో ఆలోచించాలనీ, తక్షణమే ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను కేసీఆర్‌ ఆదేశించారు. అటు రైస్‌ మిల్లర్లకు ఇటు తెలంగాణ రైతులకు ప్రయోజనం కలిగేలా సమాలోచన చేయాలని రైతుబంధు సమితి అధ్యక్షుడిని సీఎం కోరారు. సీఎం ఆదేశాల మేరకు రెండు శాతం పన్ను రద్దుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే జారీ చేసింది. జీవో జారీ చేసినందుకు తెలంగాణ రైస్‌ మిల్లర్లు, రైతాంగం తరఫున ఎమ్మెల్యే నలమోతు భాస్కర్‌ రావు, రైతు బంధు సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి తదితరులు సీఎం కేసీఆర్‌కు కలిసి ధన్యవాదాలు తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గ్రేగోల్డ్‌ పరిశ్రమలో ప్రమాదం
సీసీటీవీ ట్యాంపరింగ్‌పై కేసు నమోదు
అనాథలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారం
వికలాంగుల సంక్షేమానికి 5 శాతం నిధులు కేటాయించాలి
ఫిబ్రవరి 2 నుంచి 12వ వరకు సమతా కుంభ్‌- 2023
లేని ఆత్మహత్యలున్నట్టు చిత్రీకరణ
కంటి వెలుగు కార్యక్రమానికి విశేష స్పందన
రాజ్‌భవన్‌ రాజకీయాలు మానుకోవాలి
ప్రతి సబ్జెక్టుపైనా అవగాహన ఉండాలి
జగిత్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాజీనామా ఆమోదం
అప్పులకు మిత్తి కట్టలేకపోతున్నం
వేధిస్తున్న టీచర్‌ మాకొద్దు
కేబుల్‌ ఆపరేటర్ల సమస్యపై సీఎం దృష్టికి తీసుకెళ్తాం..
గజ్వేల్‌ అభివృద్ధి దేశానికే ఆదర్శం
మోల్డ్‌టెక్‌ టెక్నాలజీస్‌ ఆకర్షణీయ ఫలితాలు
క్రీడారంగానికి అధిక నిధులు కేటాయించాలి
ఇండ్ల స్థలాల సాధనకై..9న చలో హైదరాబాద్‌
మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యత ఏది?
వచ్చే నెల మొదటి వారంలో పోడు భూములకు పట్టాలు
బాపుఘాట్‌లో గవర్నర్‌ నివాళులు
గాంధీని హత్య చేయడం నీచమైన చర్య
సాగు ఖర్చులతో రైతులకు ఇబ్బందులు
బాల్యం ఒక ఎదురీత..
నవతెలంగాణ న్యూస్‌ ఎడిటర్‌గా రాంపల్లి రమేశ్‌
రైళ్ల వేగం పెంచండి
డైరీని ఆవిష్కరించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌
ప్రగతి భవన్‌ ముందు దంపతుల ఆత్మహత్యాయత్నం
ప్రజాపంథా నాయకున్ని పరామర్శించిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
6 నుంచి అటవీ కాలేజీ ప్రొఫెసర్ల ఇంటర్వ్యూ

తాజా వార్తలు

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

07:08 PM

కోర్టులో లొంగిపోయిన మోర్బీ వంతెన ఘటన నిందితుడు

06:07 PM

రైలు కింద‌ప‌డి చీఫ్ లోకో ఇన్‌స్పెక్ట‌ర్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం..

05:36 PM

కేటీఆర్ కరీంనగర్ పర్యటన ఉద్రిక్తత..

04:46 PM

ఆశారాం బాపూకి జీవితఖైదు విధించిన కోర్టు..

04:35 PM

టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ బాధ్యతల స్వీకరణ

04:23 PM

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

04:00 PM

షూటింగ్ లో గాయపడ్డ సన్నీలియోన్..

03:49 PM

ఆర్థిక సర్వేలో ముఖ్యాంశాలు..

03:26 PM

డెక్కన్‌ మాల్‌ కూల్చివేస్తుండగా ఒక్కసారిగా కూలీన 6 ఫ్లోర్లు..

03:13 PM

తిరుమల మాఢవీధుల్లోకి దూసుకొచ్చిన కారు..

03:12 PM

ఏసీబీకి చిక్కిన ఉపాధి క‌ల్ప‌నాశాఖ అధికారులు..

03:27 PM

ఫిబ్ర‌వ‌రి 3 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు..

02:33 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను చంపుతామంటూ బెదిరింపు కాల్..

02:18 PM

రిషికేశ్ ఆశ్రమంలో విరాట్, అనుష్క..

01:47 PM

ఆగ‌స్టులో జాతీయ ద‌ళిత బంధు స‌మ్మేళ‌నం..!

03:26 PM

టాప్ 10 బిలియనీర్ల జాబితాలో స్థానం కోల్పోయిన అదానీ..

03:27 PM

మన దేశ బడ్జెట్‌పై యావత్తు ప్రపంచం దృష్టి సారించింది : మోడీ

03:27 PM

వెంటిలేటర్ పై తారకరత్న..వైరల్ అవుతున్న ఫొటో

01:09 PM

లోక్‌సభ ముందుకు ఆర్థిక సర్వే..సభ రేపటికి వాయిదా

12:51 PM

కోడికత్తి కేసు..జగన్ విచారణకు హాజరుకావాలంటూ కోర్టు ఆదేశాలు

03:27 PM

అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్ పేలి ఒకరు మృతి..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.