Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కార్పొరేట్‌ ఆస్పత్రులను నియంత్రించాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Nov 30,2022

కార్పొరేట్‌ ఆస్పత్రులను నియంత్రించాలి

- ప్రభుత్వరంగంలోనే విద్యావైద్యం ఉండాలి
- జర్నలిస్టుల అధ్యయన వేదిక రౌండ్‌టేబుల్‌లో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
దేశంలో ప్రయివేటీకరణ విధానాల అమలుతో విద్యావైద్య రంగాలు కార్పొరేట్‌పరయ్యాయని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సర్కారు ఆస్పత్రులు, విద్యాసంస్థలు నిర్వీర్యమయ్యాయని చెప్పారు. కార్పొరేట్‌ ఆస్పత్రులను నియంత్రించాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విద్యావైద్యం ప్రభుత్వరంగంలోనే ఉండాలని కోరారు. గతంలో యశోద ఆస్పత్రిలో మరణించిన రమ్య ఘటన పట్ల విచారణ చేపట్టాలనీ, ప్రాణహిత, యశోద ఆస్పత్రులకు హెచ్చరిక జారీ చేయాలని అన్నారు. దీనిపై బుధవారం డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించారు. ఆయన స్పందనను బట్టి ధర్నాకు చేసేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో 'తెలంగాణలో కార్పొరేట్‌ శక్తుల చేతిలో వైద్యం'అనే అంశంపై మంగళవారం రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీజేఎస్‌ అధినేత కోదండరామ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో 70 శాతం ప్రజలు ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్తున్నారని వివరించారు. గ్రామాల్లో రూ.24 వేలు, పట్టణాల్లో రూ.30 వేలు వైద్యం కోసం ప్రజలు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. వైద్యరంగానికి వివిధ రాష్ట్రాలు సగటున 5.3 శాతం నిధులు కేటాయిస్తే, తెలంగాణ ప్రభుత్వం 4.4 శాతం ప్రతిపాదించిందని గుర్తు చేశారు. ప్రజలు రోగాల బారిన పడుతున్నారనీ, ప్రభుత్వ ఆస్పత్రులు నిర్వీర్యమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పీహెచ్‌సీలు, ఏరియా, జిల్లా ఆస్పత్రులు, ఉస్మానియా, గాంధీ వంటి ఆస్పత్రుల్లో డాక్టర్లు, ఇతర సిబ్బంది కొరత ఉందన్నారు. మూడు వేల డాక్టర్లు అవసరమనీ, తక్షణమే ఆయా పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రయివేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల నియంత్రణకు రెగ్యులేటరీ కమిషన్‌ అవసరమని కోరారు. రిటైర్ట్‌ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ రమ్య మరణం ప్రభుత్వ హత్యేనని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును రోజూ పర్యవేక్షించే సీఎం కేసీఆర్‌కు ఉస్మానియా, గాంధీతోపాటు ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతానికి చర్యలు తీసుకునే సమయం లేదా?అని ప్రశ్నించారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల్లో వచ్చే కమీషన్లతో ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేయొచ్చని చెప్పారు. ప్రయివేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులను నియంత్రించేందుకు ఎథిక్స్‌ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ విద్యావైద్య రంగాలు ప్రభుత్వం చేతిలో ఉండేలా కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను రూపొందిస్తున్నదని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.వంద కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తామన్నారు. పేదోళ్లకు ఉచితంగా విద్యావైదం అందించడమే తమ లక్ష్యమని అన్నారు.
డాక్టర్‌ వసంత్‌కుమార్‌ మాట్లాడుతూ డెంగీ వ్యాధి వస్తే ఒక్కొక్కరికీ రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు మాత్రమే ఖర్చవుతాయని చెప్పారు. ప్లేట్‌లెట్లు పడిపోకుండా ఉండే మందులున్నా, వాటిని వినియోగించడం లేదని అన్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల లాభార్జనకు సామాన్యులు బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య మాట్లాడుతూ ప్రభుత్వం విద్యావైద్యరంగాలను ప్రజలకు అందించాలని కోరారు. ఆప్‌ చైర్‌పర్సన్‌ ఇందిరాశోభన్‌, బీఎస్పీ నాయకులు అరుణ, జర్నలిస్టులు విఠల్‌, జయసారథిరెడ్డి, పివి శ్రీనివాస్‌, సతీశ్‌ కమల్‌ మాట్లాడుతూ జర్నలిస్టు రవీందర్‌ మరణంపై ఈటల రాజేందర్‌ మౌనం వీడాలని కోరారు. రమ్య మరణంపై న్యాయవిచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. జర్నలిస్టు రఘుపై కేసులను ఎత్తేయాలని చెప్పారు. రమ్య తండ్రి సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ పొలం తాకట్టు పెట్టి ప్రాణిహిత ఆస్పత్రికి రూ.లక్ష, యశోద ఆస్పత్రికి రూ.ఆరు లక్షలు కట్టానని చెప్పారు. అయినా తన కూతురు చనిపోయిందన్నారు. ఆయా ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలనీ, తనకు న్యాయం జరగాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షులు వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎండీ సాధిక్‌, జర్నలిస్టు రఘు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మల్లారెడ్డి సారూ.. మోటారు సైకిళ్లు ఇప్పించండి
మే 7 నుంచి ఎంసెట్‌
అడవుల్లో వన్యప్రాణుల సంఖ్య పెంచేందుకు కృషి
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి
సంక్షేమ రాజ్యం కావాలంటే.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలే..
ఛత్తీస్‌గఢ్‌ ఆదివాసులపై దాడులు ఆపాలి
317 జీవో టీచర్లకే బదిలీ అవకాశం
సీఎం చిత్రపటానికి సెర్ప్‌ ఉద్యోగుల క్షీరాభిషేకం
ఒక శాతం చందాతో నగదు రహిత ఆరోగ్య పథకం
జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో శ్రీచైతన్య రికార్డు
హైదరాబాద్‌ రోడ్లపై ఎలక్ట్రిక్‌ డబుల్‌
పోడు రైతులకు అన్యాయం
మాన్సే డైనాస్టార్‌ -2023 పోటీ ప్రారంభం
15 రోజుల్లో 11వేల స్ట్రీట్‌కార్నర్‌ మీటింగ్‌లు
ఆర్టీసీకి 2శాతం నిధులు కేటాయించాలి
గిరిజనులకు కేంద్రం కన్నా ఎక్కువ నిధులు
ఢిల్లీ మేయర్‌ ఎన్నికపై సుప్రీం ముందుకు ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌్‌
గ్లోబరీనాకు టెండర్‌లో పాల్గొనే అర్హత లేదు
కంట్లో కారం నోట్లో బెల్లంలా బడ్జెట్‌
గ్రూప్‌-1 మెయిన్స్‌ అభ్యర్థులకు ఉచిత మెంటర్‌షిప్‌
రెండో రోజూ ప్రొఫెసర్‌ కాశీం దీక్ష
సీబీఐ దర్యాప్తును నిలిపేయండి
పాతబస్తీని మరింత అభివృద్ధి చేస్తాం
అద్భుతమైన రచన 'ఊరు గాని ఊరు'
బడ్జెట్‌లో మాకు అన్యాయం..
పట్టణ ప్రాంతాల్లో 'ఉపాధి' విస్తరణ ప్రస్తావనేదీ?
మహారాష్ట్రకు నీరివ్వడమంటే... రాష్ట్రానికి అన్యాయం చేయడమే
బీజేపీ కార్యకర్తపై బాబుమోహన్‌ దుర్భాషలు
టోఫెల్‌ పరీక్షలో మంచి స్కోర్‌ ఇప్పిస్తామంటూ మోసం
ఈ నెల 10న చెన్నైకి ఎమ్మెల్సీ కవిత

తాజా వార్తలు

09:42 PM

పోలీస్‌ కస్టడీలో గత ఐదేళ్లలో 669 మంది మృతి : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ

09:20 PM

అదానీని ప్రధానినే రక్షిస్తున్నాడు : రాహుల్‌ గాంధీ

08:56 PM

దేశంలో తొలిసారి తల్లిదండ్రులైన.. ట్రాన్స్‌జెండర్ జంట

08:24 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై సీఎస్‌కు లేఖ రాసిన సీబీఐ..

08:05 PM

జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీయాలి..

06:55 PM

తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం..

06:21 PM

బీజేపీ ప్ర‌భుత్వం ఎందులో సక్సెస్ అంటే : మంత్రి హ‌రీశ్‌రావు

06:06 PM

05:45 PM

ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయొద్దు : స్పీకర్‌ ఓం బిర్లా

05:33 PM

హైదరాబాద్‌ లో ట్రాపిక్ ఇబ్బందులు..

04:53 PM

కొండగట్టుకు నిధులు మంజూరు చేసిన సీఎంకి రుణపడి ఉంటాం..

04:19 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్.. లాభాల్లో సూచీలు

04:09 PM

తమ్ముడిని కాపాడుకున్న ఏడేళ్ల బాలిక..

03:35 PM

వరుస భూకంపాలతో తుర్కియే.. మరోసారి 4.3 తీవ్రతతో

03:20 PM

రాజధానిగా అమరావతిపై స్పందించిన కేంద్రం..

02:59 PM

ఇక క్యూఆర్ కోడ్ తో కాయిన్స్‌..!

02:35 PM

చిన్మయానందకు మధ్యంతర ముందస్తు బెయిలు..

01:58 PM

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటికి గుండెపోటు

01:35 PM

వన్ ప్లస్ 11ఆర్ విడుదల..

01:24 PM

ఫోన్ ట్యాపింగ్‌పై దర్యాప్తు కోసం కేంద్రానికి లేఖ రాశా: కోటంరెడ్డి

01:07 PM

బాస్కెట్‌బాల్‌ ఆడుతుండగానే గుండెపోటు.. విద్యార్థి మృతి

12:56 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌..మరొకరు అరెస్టు

12:44 PM

రెపో రేటు పెంచిన ఆర్బీఐ..ఈఎంఐ మరింత చెల్లించాల్సిందే

12:41 PM

ఒంటరి మహిళలకూ పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : మంత్రి ఎర్రబెల్లి

12:13 PM

జగన్‌ అధ్యక్షతన కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్‌ భేటీ

12:16 PM

హజ్ యాత్ర చేస్తూ పాకిస్థాన్ లో అడుగు పెట్టిన భారతీయుడికి అనూహ్య స్వాగతం

11:28 AM

సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం..

11:26 AM

దేశంలోనే గొప్పపథకం కంటివెలుగు: స్పీకర్

12:16 PM

ఆస్పత్రి గది నుంచి తొలిసారి బయటకొచ్చిన రిషబ్ పంత్..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.